18, ఏప్రిల్ 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1386 (కుటిలత్వముఁ జూపఁగా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా!

20 కామెంట్‌లు:

  1. నటనమ్మె తక్క విద్యల
    పటుత్త్వమేమియును లేక వాదించెడు దు
    ర్ఘటముల యెడ జంకక దగు
    కుటిలత్వము జూపగాదగున్ కవులారా!

    రిప్లయితొలగించండి
  2. కౌటిల్యుని యర్ధ శాస్త్రము
    పటుతర ముగదాచి నంత ప్రగతికి దక్కెన్
    నటనలు నిండిన జగతిని
    కుటిలత్వము జూపగా దగున్ గవు లారా

    రిప్లయితొలగించండి
  3. కుటిలము గనర్ధ శాస్త్రము
    కటకట భువిలోన దాచె కౌటిల్యు డనన్
    కటువగు పనులను జేయగ
    కుటిలత్వ ముజూప గాదగున్ గవు లారా

    మొదటి పద్యం " కౌటిల్యుడు " కౌ " గురువను కుంటాను .అందుకె ఇంకో ప్రయత్నం

    రిప్లయితొలగించండి
  4. చిటికెన వ్రేలిని పట్టుకు
    నటునిటు నడిపించినట్టి నాత్మీయులనే
    కటకట బెట్టెడు తనయుల
    కుటిలత్వము జూపగాదగున్ కవులారా!

    రిప్లయితొలగించండి
  5. ఎటువంటి కార్య మైనన్
    కుటిలమ్మునజేయతగదు కువలయమందున్
    జటిలములగు తగు చేతల
    కుటిలత్వము జూపగాదగున్ కవులారా!

    రిప్లయితొలగించండి
  6. పటుతరమగు పాత్ర రచన
    మెటులది చేయగవలెనని యిప్పట్టున నీ
    తటపటపడుటే? శకునికి
    కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా!

    రిప్లయితొలగించండి
  7. పటుతరమగు పాత్ర రచన
    మెటులది చేయగవలెనని యిప్పట్టుననా
    తటపటపడుటల్? శకునికి
    కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కటువగు బాధలు బాపగ
    కుటిలత్వము జూపగా దగున్. కవులారా!
    కటి బిగియింపుడు వ్రాయగ
    పటిష్టమౌ కావ్యములను ప్రజ మేల్కొనగాన్

    రిప్లయితొలగించండి
  9. కటకట! విమర్శకాళిని
    యెటు లోర్చుటొ నేర్వబోక యెల్లరు దెగడన్
    చిటపట లాడుచు నెట్టులు
    కుటిలత్వము జూపఁగాఁ దగున్? కవులారా!

    రిప్లయితొలగించండి
  10. కిటుకులతో స్వార్ధమెరిగి
    నటనను నిజములను దాచు నైపుణ్యముతో
    కపటులు బలుకగ, కవితను
    కుటిలత్వము జూపగా దగున్ గవులారా

    రిప్లయితొలగించండి
  11. నటనమ్ముల కుటిలమ్ముల
    పటుతరమగు కృష్ణలీల పాండవ పరమై
    యిట ధర్మమ్ము నిలుప నట
    కుటిలత్వము జూపగా తగున్ కవులారా!

    రిప్లయితొలగించండి
  12. కుటిలులు నిరతము జేసే
    కుటిలత్వము జూపగా దగున్ గవులారా!
    నిటలాక్షుడు మిము మెచ్చును
    పటుతర ధీ శక్తి యుండి ఫలమేమిలలో.

    రిప్లయితొలగించండి
  13. భటులే పాలకులైనన్
    కుటిలత్వము జూపఁగాఁ దగున్, గవులారా!
    పటువగు జన పాలనలో
    కుటిలత్వము గూడ దనుచు గూర్చుడు కవితల్

    రిప్లయితొలగించండి
  14. చండి! చాముండి! చాలించు భయపు రూపు
    కోళ్ళు మేకలు తెగటార్చి కోరిన నటుల
    పెట్టుటకు సిద్ధమైనారు పట్టు కొనుము
    నేతలిది యెన్నికల వేళ నిజము తల్లి !

    రిప్లయితొలగించండి
  15. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    విమర్శకాళిని అను ద్వితీయాంతము తరువాత ద్రుతముతో గలిపి నెటుల అనాలి. యడాగమము రాదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    సరిదిద్దిన పద్యం:

    కటకట! విమర్శకాళిని
    నెటు లోర్చుటొ నేర్వబోక యెల్లరు దెగడన్
    చిటపట లాడుచు నెట్టులు
    కుటిలత్వము జూపఁగాఁ దగున్? కవులారా!

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రోజంతా మా మిత్రుని కుమార్తె పెళ్ళి పనులలో తిరగడంతో బ్లాగును సమీక్షించే అవకాశం లభించలేదు. మన్నించండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మిత్రుల పూరణలను సమీక్షించి, తగు సూచనలు చేసినందుకు ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కౌ’ గురువే.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. జటిలపు సమస్య నీయగ
    నటునిటు పదముల ఘటించి నందము నొసగే
    పటుతరమగు పూరణకై
    కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా!

    రిప్లయితొలగించండి


  19. మెటికల విరచుచు పదముల
    కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా,
    పటిమన్ గనుచున్ కైపద
    మెటులై నన్ దీర్చగాను మెచ్చుదురెల్లన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. నటనల రమణుల పొగడగ
    చిటపట మాటలను వీడి చిక్కని రీతిన్
    జటిలపు పద్యము లందున
    కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా!

    రిప్లయితొలగించండి