2, ఏప్రిల్ 2014, బుధవారం

సమస్యాపూరణం - 1370 (నట్టింటఁ దళుక్కు మనెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే.

29 కామెంట్‌లు:

 1. పట్టికి బెండిలి నభ సం
  రాట్టు బొనర్చు నెడ విశ్వమంటపమున కన్
  పట్టు నలంకృతుల బళా!
  నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 2. కట్టిరట పెంకు టింటను
  గట్టిగ తానల్లె నులక కంకటి నిండా
  వట్టిగ నడుమును వాల్చగ
  నట్టింట దళుక్కు మనెను నక్షత్ర ములే

  అంటే....పెంకుటింటి పై కప్పు అంతా చిల్లులు అదన్న మాట అసల్ సంగతి

  రిప్లయితొలగించండి

 3. పెనిమిటి మిట్ట మధ్యాహ్నమున
  ప్రేమతో చేయి బట్టి సరసమాడిన
  ప్రియురాలి చెంపల కెంపు వెల్లి విరిసి
  నట్టింట దళుక్కు మనెను నక్షత్రములే !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. జిలేబీ గారి భావానికి పద్యరూపం......

  పట్టపగలె పెనిమిటి చే
  పట్టి సరసమాడ మానవతి చెక్కిలిపై
  బిట్టుగ కెంపులు మెరయఁగ
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే.

  రిప్లయితొలగించండి
 5. ప్రణామములు గురువుగారు...
  sky in your rooms అనే ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నారుగా ఆ బావంతో...

  చుట్టముల కొత్త యింటను
  పెట్టెిరి రేడియముశశిని ప్రీతిగ తారల్
  తట్టిన మేధకు జోతల్
  నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  భళా! ఆకాశరాజు కూతురు పెండ్లి విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. ధన్యవాదాలు.
  *
  శైలజ గారూ,
  రేడియం స్టిక్కర్ల గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. గట్టి సినీ ప్రొడ్యూసరు
  చిట్టిని పెండ్లాడుచుండ సినిమా తారల్
  చుట్టముల తోడు వచ్చెను
  నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 8. పట్టపుపట్టివివాహము
  నిట్టిట్టని చేప్పనేర్తునే? తలఁబ్రాల్ చే
  పట్టగ ముత్యపు కాంతులె!
  నట్టింటతళుక్కుమనెను నక్షత్రములే.

  రిప్లయితొలగించండి
 9. పుట్టిన సుతలను దక్షుడు
  మెట్టింటికి పంపనెంచి మేనానే యి
  ప్పట్టున పిలుమని చెప్పగ
  నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 10. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో దక్షుని కుమార్తెల ప్రస్తావన ఉచితంగా ఉంది.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. ఘట్టమనేని మహేశుడు
  గట్టిన నూతన గృహమును గాంచగ రాగా
  చట్టన సినిమా తారలు
  నట్టింట తళుక్కుమనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 12. పట్టికి పరిణయమందున
  మెట్టిన ఇంటికె యధిపతి మెడకురివేయన్
  కట్టలుగా కట్నమడుగ
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే.

  రిప్లయితొలగించండి
 13. పుట్టిన దిన సంబరమున
  పెట్టిన దీపముల వెలుగు వీక్షించిన యా
  చుట్టము లతిథులు పలికిరి
  నట్టింట తళుక్కుమనెను నక్షత్రములే!

  రిప్లయితొలగించండి


 14. రొట్టెల కఱ్ఱను పట్టుకు
  కొట్టగ సతి వెంట పడగ కోటేశ్వర్రావ్
  తట్టుకు తాఁ క్రింద బడెను
  నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే :-)

  (ఎవరికైనా తలకు దెబ్బతగిలితే నక్షత్రాలు కనబడ్డాయంటారు గదా , ఆ దృష్టితో పూరించాను :-)

  రిప్లయితొలగించండి
 15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘దిన సంబరము’ అని సమాసం చేయరాదు కదా.. ‘పుట్టిన దినోత్సవమ్మున’ అనండి.

  రిప్లయితొలగించండి
 16. పుష్యం గారూ,
  మీ హాస్యస్ఫోరక పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. నిట్టాల వారి యింటికి
  చుట్టాలుగ వచ్చి వారు చూసియు దేవిన్
  బెట్టగ వజ్రపు గాజులు
  నట్టింటను దళుక్కు మనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మెట్టినిల్లు సత్పథమట
  పట్టెను కల్హారభామ పక్షజు చేయిన్
  జట్టు కలియు నడిరేయిని
  నట్టింట దళుక్కు మనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి
 19. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ.. అభినందనలు.
  ‘మెట్టినిల్లు’ అన్నచోట గణభంగం. ‘మెట్టినయిలు సత్పథమట’ అనండి.

  రిప్లయితొలగించండి
 20. నట్టింట కప్పు లేకను
  కట్టిన నొక యింట రాత్రి గడుపుచు దివిపై
  పెట్టగ దృష్టి నతనికా
  నట్టింట దళుక్కు మనెను నక్షత్రములే!

  రిప్లయితొలగించండి
 21. నట్టింట కప్పు లేకను
  కట్టిన నొక యింట రాత్రి గడుపుచు దివిపై
  పెట్టగ దృష్టి నతనికా
  నట్టింట దళుక్కు మనెను నక్షత్రములే!

  రిప్లయితొలగించండి
 22. గురువుగారూ జిలేబీ గారి భావానికి అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మీసూచన, సవరణకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి

 24. పట్టు పరికిణీ కట్టిన
  పట్టి తనదు పాదములకు పారాణిడగన్
  పట్టుకు కుచ్చెళ్ళెత్తగ
  నట్టింట తళుక్కుమనెను నక్షత్రములే!

  (స్త్రీల నఖములను నక్షత్రాలతో పోలుస్తారుగదా?)

  రిప్లయితొలగించండి
 25. పుట్టెనొ పున్నమి చంద్రుడు
  గట్టిదయిన నాదు పుణ్యఘన ఫలితమ్మై
  చిట్టి సుపుత్రుడు నవ్వగ
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే.

  రిప్లయితొలగించండి
 26. పుట్టెనొ పున్నమి చంద్రుడు
  గట్టిదయిన నాదు పుణ్యఘన ఫలితమ్మై
  చిట్టి సుపుత్రుడు నవ్వగ
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే.

  రిప్లయితొలగించండి
 27. గుట్టుగ పెండ్లాడి ముసలి
  సెట్టిని వజ్రాలు కోరి చెంగల్ పట్టున్
  పుట్టింటిని మెట్టగనే
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే

  రిప్లయితొలగించండి


 28. కొట్టగ తలపై గట్టిగ
  చెట్టాపట్టాల్ వలదని చెలిమరులటనౌ
  పట్టమ్మ జిలేబికహో
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే :)

  జిలేబి

  రిప్లయితొలగించండి