15, ఏప్రిల్ 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1383 (పాపహేతు వగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాపహేతు వగును భాగవతము.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. కర్త భావనమ్ము గమనించి చదువంగ
    నర్థవంతమైన హాయి నొసగు
    వక్ర బుద్ధి తోడ వల్లించి నడువంగ
    పాపహేతువగును భారతమ్ము

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కృష్ణ లీలలన్న యికిలించు వారికి
    పాపహేతువగును భాగవతము
    భాగవతము వినిన ప్రభు పరీక్షితు
    ముక్తి నొందె దాని శక్తి వలన

    రిప్లయితొలగించండి
  3. భక్తిబూని యెవరు పరమభాగవతులై
    సతము వినుచునుంద్రు శ్రద్ధతోడ
    వారు మోక్షపదవి చేరుట కిహమందు
    పాప! హేతువగును భాగవతము.

    రిప్లయితొలగించండి

  4. పాప ! హేతు వగును భాగవతము భువిని
    పాప నిర్మూలనమునకు పరమ ధర్మ
    స్థాపనకు, నట్టి గ్రంధ రాజమ్ము తెలుగు
    వారలకు పోతనాఖ్యుని వరము వినుము.

    రిప్లయితొలగించండి
  5. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి జేయు నమస్కారములు.
    --
    భక్తిలేని బ్రతుకు పాపహేతువగును
    భాగవతము నేర్పు పాఠమిదియె.
    పుణ్యకర్మ తప్ప వుద్ధరించునదేది
    ఘడియ కాలమందు మడియు మనిషి.

    రిప్లయితొలగించండి
  6. కోప మూని పరుని కుపితుని జేయగ
    పాప హేతు వగును ,భాగవతము
    భక్తి తోడ జదువ పరమప దము గల్గు
    సంశయంబు లేదు సజ్జ నుండ !

    రిప్లయితొలగించండి
  7. వక్రమార్గ మందు పరుల సొమ్ముగొనుట
    పాప హేతువగును, భాగవతము
    ముక్తి గలుగఁ జేయు భక్తితో పఠియింప
    వినిన వారు దివికిఁ జనుట గలుగు


    రిప్లయితొలగించండి
  8. నీతి పధము విడచి నియమంబు దప్పిన
    పాప హేతు వగును, బాగవతము
    వినిన జదువ ముక్తి వేడుక గలిగించి
    బ్రతుకు విరియు గాదె బాధ దీరి

    రిప్లయితొలగించండి
  9. భాగవతము మెచ్చు భాగవతుల వారు
    పాపహేతు వగును భాగవతము
    యనుట కియ్య కొనరు యయ్యది పుణ్యమే
    చదువువారికొసగు నిది నజమ్ము

    రిప్లయితొలగించండి
  10. భాగవత పఠనము భక్తినే పెంచగా
    పుణ్య మొసగు ననిరి పూజ్యవరులు
    ధర్మపరులు యెటులతలచిరోయీనాడు
    పాపహేతు వగును భాగవతము !

    రిప్లయితొలగించండి
  11. బ్రతికి నంత మదిని భగవంతు గొలువక
    పాప హేతు వగును , భాగవ తము
    విష్ణు రాతున కట వినిపించె శుకముని
    నేడు దినము లందు నెమ్మి గాను

    రిప్లయితొలగించండి
  12. శ్రీ తిమ్మాజీ రావు గారికి నమస్కారం. మీకు వీలు చూసుకొని ఒకసారి ఫోన్ చేయగలరు.
    వామన కుమార్
    9818486076

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘లీలనన్న నికిలించు’ అనండి. ‘ప్రభు పరీక్షితు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘ప్రభువు పరీక్షిత్తు’ అంటే సరి!
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ధర్మ/స్థాపన’ అన్నప్పుడు ర్మ గురువై గణభంగం...
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    సమస్యను రెండు పాదాల్లో ఇమిడ్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వుద్ధరించు’ గ్రామ్యం. ‘పుణ్యకర్మ తప్ప ముక్తినొసఁగు నేది’ అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణల భావం బాగుంది. అభినందనలు.
    అవసరం లేనిచోటుల్లో మీరు యడాగమం చేస్తున్నారు.
    భాగవతము + అనుట = భాగవత మనుట; కొనరు + అయ్యది = కొర రయ్యది; పరులు + ఎటుల = పరులెటుల...
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మన్నించాలి. కొద్దిరోజులుగా బంధువుల ఇళ్ళల్లో కార్యక్రమాల వల్ల మీ పద్యాలను పరిశీలించలేదు. వీలైనంత తొందరలో చూసి నా అభిప్రాయం, సూచనలు అందజేస్తాను.

    రిప్లయితొలగించండి