20, ఏప్రిల్ 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1388 (భగవంతుని పూజసేయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

 1. బిగువగు రావణ భక్తిని
  భగవంతుని పూజసేయ బాపము దగులున్
  యగణిత భక్తిని గొలిచిన
  నిగమములు తెలియ కున్న నీశుడు మెచ్చున్

  రిప్లయితొలగించండి
 2. పొగరును జూపించునటుల
  భగవంతుని పూజసేయ బాపము దగులున్
  యగణితముగు భక్తిగలిగి
  భగవానుని సేవజేయ బాపము దొలగున్

  రిప్లయితొలగించండి
 3. తగువిధమగు మంచి జరుగు
  భగవంతుని పూజ చేయఁ, బాపము తగులున్
  మగనాలి వెంట పడినను,
  వగలాడికిఁ జిక్కి సతిని బాధలు వెట్టన్

  రిప్లయితొలగించండి
 4. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదం ప్రారంభంలో యడాగమం దోషం. అక్కడ ‘దగులు/ న్నగణిత...’ అనండి. ఇలాంటి ప్రయోగాలు పోతన కవిత్వంలో ఎక్కువ.
  *
  శైలజ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవపాదం ప్రారంభంలో యడాగమాన్ని గురించి పై వ్యాఖ్యను చూడండి.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మీ రెండవ పూరణ కూడా బాగుంది.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ విరుపుతో బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. సుగమంబగు మఱి మోక్షము
  భగవంతుని సేవజేయ, బాపము దగులున్
  భగవంతుని నిందించిన
  భగవంతుడె మనకు దిక్కు భవమును దాటన్


  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  జగమున మతములు తమతమ
  భగవంతుడు సత్యమనుచు పగతో ద్వేషిం
  పగ నితర దైవముల నా
  భగవంతుని పూజ సేయ బాపము దగులున్

  రిప్లయితొలగించండి
 7. 'సుగుణ భగవంతు' నామము
  తగని పనుల నాశ్రమాన తానై జూచున్
  నిగమాగముడని భ్రమతో
  'భగవంతు'ని పూజసేయ పాపము దగులున్

  రిప్లయితొలగించండి
 8. తెగ దొంగలుండ జైలున
  జగదల్పూర్ నందు తిండి సరుకుల సప్లై
  కెగబడు వ్యాపారి బలికె
  భగవంతుని పూజసేయఁ బాపము దగులున్

  మరొక పూరణ

  జగదీశుడు దరిజేర్చును
  భగవంతుని పూజసేయఁ; బాపము దగులున్
  భగవానునికని దండుచు
  నగుమోమును జూపి కుటిల నటనలు జేయన్

  రిప్లయితొలగించండి
 9. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...

  తెగ మెచ్చుకొంఛు నుంటివి
  జగమంతయు హరియె ననుచు ప్రహ్లాదా ! నీ
  వగుపించని వాడగునా
  భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది.
  ‘హరియె యనుచు’ అనాలి కదా!

  రిప్లయితొలగించండి
 12. ప్రగతిని కాంక్షించు గురువు
  లగుపించెడు తల్లి దండ్రి లథితియు ప్రభువున్
  భగవంతుని రూపులె ,యే
  భగవంతుని పూజసేయ బాపము దగులున్?

  రిప్లయితొలగించండి
 13. మాస్టరుగారూ ! ధన్యవాదములు..
  యతి సవరణ తో...  హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...

  తెగ మెచ్చుకొంఛు నుంటివి
  జగమంతయు హరియె యనుచు సరె! ప్రహ్లాదా !
  అగుపించని వాడగునా
  భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.

  రిప్లయితొలగించండి
 14. భుగభుగమను ద్వేషమ్మున
  పగవాడు నశించ గోరి పరితాపముతో
  వగ దీరెడి వరములకై
  భగవంతుని పూజసేయఁ బాపము దగులున్

  రిప్లయితొలగించండి
 15. పగలును రాత్రిని పొగలిడు
  సిగరెట్టులు మెండు కాల్చి శృంగారమునన్
  వగలాడికి ముద్దులనిడి
  భగవంతుని పూజసేయఁ బాపము దగులున్

  రిప్లయితొలగించండి