5, జనవరి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1576 (తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.
ఈ సమస్యకు ప్రేరణ నిచ్చిన శైలజ గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

  1. గలగల బొంగెను సంద్రము
    తెలవా ఱ గ దూర్పు దెసను, దిమిరము గ్రమ్మె
    న్నల యా సూర్యుని గాంతులు
    మెలమెల్లగ దగ్గిపోవ మేదిని యందున్

    రిప్లయితొలగించండి
  2. ఇలలో సంపూర్ణంబుగ
    నలమెను గ్రహణంబు సూర్యుడగుపడడాయెన్
    వెలుగులు దూరంబాయెను
    తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్

    రిప్లయితొలగించండి
  3. ఇల రూపు జూడ గోళమె
    నిలువక తన చుట్టు తాను నేర్పున తిరుగున్
    ఫలముగ పశ్చిమ పక్షము
    తెలవాఱఁగఁ, దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్!!

    రిప్లయితొలగించండి
  4. కలకల కిలకిల రవముల
    కలహంసల జేతజిక్కి కలవర పడగ
    న్నిల నుదయించుట మరచిన
    తెలవాఱగ తూర్పు దెసను తిమిరము గ్రమ్మెన్

    రిప్లయితొలగించండి
  5. కిలకిల రవములు యలరెను
    పలు ప్రాంతము భరత ఖండ పశ్చిమ దిశలన్
    మెలకువతో యా ప్రజలకు
    తెలవాఱఁగ, దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.

    రిప్లయితొలగించండి
  6. పలు శాపమ్ముల ఫలిత-
    మ్మిల రాలెను సూనుడంచు నిను డటు గ్రుంకన్
    కలతపడి, కర్ణుని బ్రదుకు
    తెలవాఱఁగఁ, దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్

    రిప్లయితొలగించండి
  7. పులుగుల రవముల మనకిట
    తెలవాఱఁగదూర్పుదెసను, దిమిరము గమ్మెన్
    పలుపశ్చమదేశములన్
    వెలుగును చీకటి కనబడు వినునుండి కనన్
    విను: ఆకాశము

    రిప్లయితొలగించండి
  8. నిలలోస్వాతంత్ర్యపు"రవి"
    పలుకకచీకటులుమాన్ప?పక్కుననవ్వన్|
    కలుషితభావనగ్రహణము|
    తెలవారగతూర్పుదేసను?తిమిరముగ్రమ్మెన్|

    రిప్లయితొలగించండి
  9. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    సూర్యగ్రహణం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఉదయించుట మరచినవా డెవడో చెప్పలేదు. ‘కలగి దినవిభుం| డిల నుదయించుట...’ అనండి.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రవములు + అలరెను’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘కిలకిల రావము లలరెను’ అనండి.
    ****
    మిస్సన్న గారూ,
    కర్ణుని బ్రతుకు తెలవాఱజేసిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ ‘ఏరియల్ వ్యూ’ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఇలలో’ అన్నదాన్ని ‘నిలలో’ అన్నారు.

    రిప్లయితొలగించండి
  10. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యంలో మరొక సవరణ.. ‘మెలకువతో నా ప్రజలకు’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. బలిచక్రవర్తిబ్రతుకే
    తెలవారగ?తూర్పుదెసను-తిమిరముగ్రమ్మెన్
    నిలువెత్తుకాలునింగిన
    నిలబెట్టగవామనుండునిలచునవెలుగే?|
    2చలిమంచుబెరిగిబోవగ?
    తెలవారగతూర్పుదెసను,తిమిరముగ్రమ్మెన్
    వలవేసినచందమ్మున
    కలవరమందిచమంచు-కాంతినిదృంచన్|

    రిప్లయితొలగించండి
  12. నలినములు విచ్చె కొలనున
    తెలవాఱగ తూర్పు దెసను , దిమిరము గ్రమ్మెన్
    నల పశ్చిమ దేశములన్
    కలువలు కుసుమించు నపుడు కాసారమునన్ !!!


    కలనము వేళల విధిగా
    నెలమేపరి బట్టుగాదె నేర్పుగ పాథిన్
    తిలకించగ వసుధ నపుడు
    తెలవాఱగ తూర్పు దెసను దిమిరము గ్రమ్మెన్ !!!

    కలనము = గ్రహణము

    రిప్లయితొలగించండి


  13. ఖలుడగు రాహువు పట్టెను
    తెలవారగ, తూర్పు దెసను తిమిరము గ్రమ్మెన్
    కలవర పడ జగములు లో
    కులకు వెలుగు నీయ విడిచె కుతపుని మరలన్

    రిప్లయితొలగించండి
  14. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మల్లెల వారి పూరణలు
    1.నలుపైన మబ్బులయ్యవి
    యలమెను నాకస ముదయము నందున యపుడున్ వెలుగది లేకయ,యుండగ
    తెలవారగతూర్పుదెసను తిమిరముగ్రమ్మెన్
    2.పలు చెట్లు భవంతులవియు
    చెలగిన హుద్ హుద్ తుఫాను చెడగా జేసెన్
    విలవిల లాడె విశాఖయు
    తెలవారగతూర్పుదెసను తిమిరముగ్రమ్మెన్
    3.అల సాయంప్రార్ధన మున
    యలుకను గాల్చగనొకరుడు య౦తము నొ౦దెన్
    చెలువపు గాంధీ యంతట
    తెలవారగతూర్పుదెసను తిమిరముగ్రమ్మెన్
    4.సిలువను గొట్టిరి క్రీస్తును
    కలువరి కొండను పగ గొని గర్వము మీరన్
    అలమిన యజ్ఞానమ్మున
    తెలవారగతూర్పుదెసను తిమిరముగ్రమ్మెన్

    రిప్లయితొలగించండి
  16. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కలనిజమట్లుగసినిమా
    తిలకించెడుసమయమందు-దినకరుకిరణాల్
    తొలగగవిద్యుత్-హాలున
    తెలవారగతూర్పుదెసనుతిమిరముగ్రమ్మెన్
    2వలవంటిప్రేమనబడి
    కలగానూ హించనట్టికళ్యాణిజతన్
    నిలువగతలిదండ్రికనులు
    తెలవారగతూర్పుదెసనుతిమిరముగ్రమ్మెన్|

    రిప్లయితొలగించండి
  18. జలజాప్తు వెలుగు గంటిమి
    తెలవాఱఁగఁ దూర్పుదెసను, దిమిరము గ్రమ్మెన్
    వెలుగుల దొర పడమరదెస
    జలధరమునహస్తమించ జగపు తలముపై.

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘వలవంటి ప్రేమలో బడి’ అనండి.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. తెలవారు లోపు హుద్ హుద్
    మెలిద్రిప్పి విశాఖముంచి మీదన్ బడగా
    విలయమున కొన్ని బ్రతుకులు
    తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్.

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. పలురాత్రులు మేలుకొనుచు
    బిలబిల థీసిసును వ్రాసి భీష్ముని పైనన్
    కలవర మొందగ కన్నుల...
    తెలవాఱఁగఁ దూర్పుదెసను...దిమిరము గ్రమ్మెన్

    రిప్లయితొలగించండి
  23. అల శివరాత్రిని గాంచుచు
    పలువురతో చిత్రములను పక్కను జేరన్
    చలిలో దుప్పటి కప్పగ
    తెలవాఱఁగఁ దూర్పుదెసను దిమిరము గ్రమ్మెన్

    రిప్లయితొలగించండి