క్రింది నన్నయ గారి పద్యం చూడండి... కాదన కిట్టిపాటి.... తక్షకాది కా *కోదర సంహతిన్ హుతవ*హోగ్ర మహోగ్ర శిఖాచయంబులన్. పై పాదంలో యతిస్థానంలో ‘కో-హో’లు కనిపిస్తున్నాయి. క-హ లకు యతి లేదుకదా! కాని అక్కడ ‘ కాక+ఉదర... హుతవహ+ఉగ్ర’ అని రెండు ఉకారాలకు యతిమైత్రి పాటించబడింది.
వేదుల సుభద్ర గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరి పాదంలో మూడవ గణం తప్పక నమో, జగణమో అయి ఉండాలి. మీరు భగణం వేశారు. "సతులకు నివ్వగ గోరిరి సతతము శుభ సంపదలను చల్లని తల్లిన్" అనండి.
గురువు గారికీ కవిమిత్రులకు ప్రణామములతో.....
రిప్లయితొలగించండిక్రతువని దలంచి పడతులు
బతుకమ్మలనాడిరి, మగవారలు వేడ్కన్
సతులాడెడాట గాంచగ
నతివలకా పూలు తెత్తు రార్భాటముతోన్
‘విరించి’ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ విరించి గారి పద్యం నాలుగవ పాదం యతి భంగం కాలేదా ? సెలవియ్యండి.
తొలగించండినార్భాటముతోన్ అంటే బాగుందేమో
తొలగించండిపిరాట్ల వారూ,
తొలగించండిఆ పాదంలో యతిభంగం లేదు.
“...గాంచగన్+*అతివల కా పూలు తెత్తురు+*ఆర్భాటముతోన్”
క్రింది నన్నయ గారి పద్యం చూడండి...
తొలగించండికాదన కిట్టిపాటి.... తక్షకాది కా
*కోదర సంహతిన్ హుతవ*హోగ్ర మహోగ్ర శిఖాచయంబులన్.
పై పాదంలో యతిస్థానంలో ‘కో-హో’లు కనిపిస్తున్నాయి. క-హ లకు యతి లేదుకదా! కాని అక్కడ ‘ కాక+ఉదర... హుతవహ+ఉగ్ర’ అని రెండు ఉకారాలకు యతిమైత్రి పాటించబడింది.
అతులితమగు పండుగ యటంచు
రిప్లయితొలగించండిబతుకమ్మల నాడిరి , మగవారలు వేడ్కన్
వెతలను మరువగ గాంచుచు
సతులకు దెచ్చిరి విరులను సారూప్య ముగన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘అతులితమగు పండుగ యని’ అనండి.
అతివలు పాటలు బాడుచు
రిప్లయితొలగించండిబతుకమ్మల నాడిరి, మగవారలు వేడ్కన్
వితముగ పూలను తెత్తురు
బతుకమ్మల నిలుపు కొరకు ప్రహ్లాదముగన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేటినుండి తొమ్మిది రోజులు తెలంగాణాలో బతుకమ్మల సందడి. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి శంకుస్థాపన హడావుడి....
రిప్లయితొలగించండిఅతివలు తెలఁగాణమ్మున
బతుకమ్మల నాడిరి; మగవారలు వేడ్కన్
నుతమగు నాంధ్రను నమరా
వతి శంకుస్థాపనమున వ్యస్తులు గాఁగన్.
అతివలు యతి సుందరముగ
రిప్లయితొలగించండిబతుకమ్మల నాడిరి,మగవారలు వేడ్కన్
నతిహరుషంబున దెచ్చిరి
సతులకుతెల్లని సుమములు సంబర పడుచున్.
2.పతులకు మేలును గోరుచు
బతుకమ్మలనాడిరి,మగవారలు వేడ్కన్
హితముగ ముదమును గూర్చగ
సతులకు నొసగిరి మరువక చక్కని విరులన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘అతివలు+అతి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వేడ్కన్ నతి’ అనరాదు. హరుషము కాదు... అది హరుసము.. ఐనా ‘అతి హరుసము’ అని సమాసం చేయరాదు. నా సవరణ...
అతివ లతి సుందరమ్ముగ
బతుకమ్మల.... వేడ్క
న్నతిహర్షంబున...’ అనండి.
మిత్రులందఱకు బతుకమ్మ పండుగ ప్రారంభ మఱియు పిత్రమావాస్య శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిసతులానందముగా నట
బతుకమ్మలనాడిరి; మగవారలు వేడ్కన్
మతి సంతసించి తమ స్వర
గతుల లయల నుడుల సడుల గమనింపంగన్!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఋతువున బూసెడు పూవల
రిప్లయితొలగించండినతిశయమొప్పంగఁ బేర్చి యానందముతో
క్రతువును గాంచగ, మమహిళలు
బ్రతుకమ్మలనాడిరి, మగవారలు వేడ్కన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మగవారలు వేడ్కన్ క్రతువును గాంచగ..’ అన్న అన్వయం కొంచెం ఇబ్బందిగానే ఉంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగురుదేవులకు ప్రణామములు. మార్చి వ్రాసిన పద్యం పరిశీలించ మనవి.
తొలగించండిఋతువున బూసెడు పూవుల
నతిశయమొప్పంగఁ బేర్చి యానందముతో
క్రతువుగ ముందుంచి సతుల
బ్రతుకమ్మలనాడిరి మగవారలు వేడ్కన్!
సహదేవుడు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
సతుల౦దరు భక్తి మెయిన్
బతుకమ్మల నాడిరి ; మగవారలు వేడ్కన్
శ్రుతి - గతి వాద్య౦బులతో
బ్రతికి౦చిరి వారు పాడు పాటల నెల్లన్
( శ్రుతి - గతి వాద్యములు : హార్మోనియ౦. తబలా మొదలగునవి )
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగురువు గారు ! నేను
6-10-2015 నాడు
పద్యరచన (1025 )
క్రి౦ద ప౦పి౦చిన.
స్ర గ్ధ ర. సమీక్షి౦చవలసినదని
ప్రా ర్థ న
దాని సంగతే మరిచిపోయాను. మన్నించండి. వీలైతే ఈరోజు చూసి సమీక్షిస్తాను.
తొలగించండిసతతము బిల్లా పాపల
రిప్లయితొలగించండియుతముగ సంతోష ముండ యువతులు నచట
న్గతలను బాడగ ముదమున
బతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతులితమౌ భక్తి సతులు
రిప్లయితొలగించండిబతుకమ్మలనాడిరి, మగవారలు వేడ్కన్
గతిపడు పువ్వులఁదెచ్చిరి
యతిముదమున నాడుచున్న హరిమధ్యలకై
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతివలు సంతోషముతో
రిప్లయితొలగించండిబతుకమ్మల నాడిరి, మగవారలు వేడ్కన్
సతులకు ముదమును గూర్చగ
పతులే తెచ్చిరి సుమముల పడతుల కొరకై .
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సతత మ్మోటుల పైననె వి
రిప్లయితొలగించండిదితమిది నేతలకు గురి ముదితల గెలువగా
సతి చూడుమచట వారిని
బతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బతుకమ్మ యనగ హిమగిరి
రిప్లయితొలగించండిసుత, గొలిచిరి పసుపు గౌరి సుమములఁ శంఖా
కృతి పైనిడి రమణు లచట
బతుకమ్మల, నాడిరి మగవారలు వేడ్కన్.
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారం. పతుల శ్రీయస్సుకొరకు సతులు బతుకమ్మలను ఆడితే, మగవారు తమ సతులకు సకల శుభములను ప్రసాదించమని గౌరీదేవిని కోరారు అన్న భావనలో రాశాను. తప్ప్లుంటే మన్నించి తెలియచేయగలను.
రిప్లయితొలగించండికం: పతుల హితవునకు నింతులు
బతుకమ్మల నాడిరి,మగవారలు వేడ్కన్
సతులకు నివమని కోరిరి
సతతము సిరులిడునమ్మను, సకలశుభములన్
వేదుల సుభద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో మూడవ గణం తప్పక నమో, జగణమో అయి ఉండాలి. మీరు భగణం వేశారు.
"సతులకు నివ్వగ గోరిరి
సతతము శుభ సంపదలను చల్లని తల్లిన్" అనండి.
సవరించాను గురువుగారు. ధన్యవాదాలు.
తొలగించండిచతురిమ పూలను పేర్చుచు
రిప్లయితొలగించండిప్రతిమను కలశాన నుంచి బాటల సందిన్
నృతి జేసిన పడతులతో
బ్రతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండిరచయితలకు నమస్కారాలు
రిప్లయితొలగించండివెతలనుమాన్పెడిపండుగ
రిప్లయితొలగించండిబతుకమ్మలనాడిరి |మగవారలవేడ్కన్
జతగాభక్తిని నింపగ
క్రతువులుగా సాగుటాయెకనువిందులచే
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.