9, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1821 (కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె.
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

59 కామెంట్‌లు:

 1. మధుర భావము లందున మనసు గలిపి
  వలపు వలవేసి బంధించు వారి జాక్షి
  చిలిపి చేష్టల గిలిగింత చిక్కు ముడిని
  కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె

  ఏకాంతుడు = అతిశయ వంతుడు

  రిప్లయితొలగించండి
 2. గురువు గారికి సుకవి మిత్రబృందానికి నమస్సుల తో.........

  మరణ శయ్యపై ముంతాజు మగని బిలిచి
  మారు మనువాడ బోనంచు మాట యున్ను
  నేల పయి తన జ్ఞాపిక న్నిలుప మనుచు
  కాంత గోరగ తానె యేకాంతు డయ్యె

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  ప్రవరుడు :

  01)
  ___________________________________

  పిలక, గుండును గలిగిన - విప్రుగాంచి
  వలచి మోహించి పైబడ్డ - వనిత విడచి
  అగ్నిదేవుని ప్రార్థించి - యరిగె మేటి !
  కాంతఁ గోరఁగ తానె యే - కాంతుఁ డయ్యె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 4. అర్జునుడు :

  02)
  ___________________________________

  వలచి వలపించు కొన జేరె - వారకాంత
  వరుస కాదని పార్థుడు - వాదులాడ
  కోప మది హెచ్చ , నూర్వశి - శాపమిడెను !
  కాంతఁ గోరఁగ తానె యే - కాంతుఁ డయ్యె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 5. నలమహారాజు :

  03)
  ___________________________________

  నిన్నె వలచితి నలరాజ - నీవు లేక
  నిముస మైనను మనజాల - నిలువు మనుచు
  రాయబారిగ వచ్చిన - రాజుతోడ
  యింతి దమయంతి వినుతించ - సుంత వినక

  దేవతలు మెచ్చె నిన్నెంతొ- దేవి వినవె
  వారలందొక్క వానిని - కోరుకొనిన
  నీకు శుభమగు నని చెప్పి - నిర్గమించి
  కాంతఁ గోరఁగ తానె యే - కాంతుఁ డయ్యె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దేవతల రాయబారిగా వచ్చిన నలుని గురించిన మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రాజుతోడ| నింతి...’ అనండి.

   తొలగించండి
  2. నలమహారాజు :

   03)
   ___________________________________

   నిన్నె వలచితి నలరాజ - నీవు లేక
   నిముస మైనను మనజాల - నిలువు మనుచు
   రాయబారిగ వచ్చిన - రాజుతోడ
   నింతి దమయంతి వినుతించ - సుంత వినక

   దేవతలు మెచ్చె నిన్నెంతొ- దేవి వినవె
   వారలందొక్క వానిని - కోరుకొనిన
   నీకు శుభమగు నని చెప్పి - నిర్గమించి
   కాంతఁ గోరఁగ తానె యే - కాంతుఁ డయ్యె !
   ___________________________________

   తొలగించండి
 6. భృగువు తన్నిన మన్నించి వినయమొప్ప
  మౌని పాదమ్ము బట్టుచు మర్మమెఱిగి
  శౌరి! చిరు దరహాసియై శాంతమనెడు
  కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁడయ్యె!
  కినుక వహియించి మాధవి తనను వీడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   విష్ణువు కలియుగదైవం వేంకటేశ్వరుడైన నేపథ్యాన్ని వివరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. పాద లేపనము గరుగ బాధ పడెడు
  ప్రవరునిగని వరూధిని వలపు దెలుప
  తూలగించుచు బోయెనా నేలవేల్పు
  కాంత గోరఁగ తానె యేకాంతుఁడయ్యె!!!

  నేలవేల్పు = బ్రాహ్మణుడు

  రిప్లయితొలగించండి
 8. తనదు ప్రేమను దెల్పుచు తపన తోడ
  వలచి వచ్చిన చిత్రాంగి వరుస జూచి
  తల్లి నీవని సారంగధరుడు తరలె
  కాంత గోరంఁగ తానె యేకాంతుఁడయ్యె!!!

  రిప్లయితొలగించండి
 9. గురుదేవులకు ప్రణామములు.
  కాంత కోరగ,
  కాంతఁ గోరగ
  పైరెండు ప్రయోగముల తేడా గతంలో తెలిపారు.నేడు
  పూరణలు చూసినపుడు సందేహము కలుగుతున్నది.పరిశీలించ పార్థన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అది ‘కాంతన్+కోరఁగ= కాంతఁ గోరఁగ’
   ఇంతకుముందే గుండు మధుసూదన్ గారు ఫోన్ లో ఈ విషయమై చర్చించారు.
   కొంతరు ‘కాంత కోరగ’ అనే అర్థంలో పూరించారు. నిజానికి అది దోషమే కాని అంత లోతుగా పరిశీలించి మిత్రుల ఉత్సాహాన్ని నీరుగార్చడం ఇష్టంలేక, ఆ వ్యత్యాసాన్ని ‘చూసీ చూడనట్టు’ ఊరుకుంటున్నానని గుండు వారితో చెప్పాను.

   తొలగించండి
 10. మిత్రులందఱకు నమస్సులు!

  (మేనకా విశ్వామిత్రుల ప్రణయ వృత్తాంత పూర్వక శకుంతలా జనన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

  గాధిజుఁడు మేనకనుఁ గూడి గాదిలి సుత
  పుట్టువునకుఁ గారణమయ్యుఁ, బోవ నెంచి,

  కాంతఁ గోరఁగఁ, దానె యేకాంతుఁ డయ్యె!
  మేనకయుఁ బుత్రికను వీడి తానుఁ బోయె!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విశ్వామిత్రుని ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   పై ‘గుండా’ వారికి నేనిచ్చిన సమాధానం ఒకసారి చూడండి.

   తొలగించండి
 11. 1.పాద లేపనమునతాను పరుగు దీసి
  పారమార్థిక మెసగెడు పర్వతాన
  లేపనమ్ము కరగి పోగ లేడి వంటి
  కాంత గోరగ తానె యేకాంతు డయ్యె.

  2పర్ణశాల యందు పతితోడ పడతి సీత
  గడుపు చుండె పరవశాన కాలమెల్ల
  పసిమికాంతుల మెరిసేటి పసిడి మృగముఁ
  కాంత గోరగ దానె యేకాంతు డయ్యె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘పర్ణశాలలో పతితోడ.../ పర్ణశాలయందు పతితో...’ అనండి.
   ఒక గమనిక... ‘కాంతన్+కోరగ=కాంతఁ గోరగ (ద్రుతసంధి)’ అని సమస్య. మీరు ‘కాంత+కోరగ(గసడదవాదేశ సంధి’ అనే అర్థంలో పూరించారు.

   తొలగించండి
 12. గురువుగారికి నమస్కారం. నిండు చూలాలైన భార్య సీతను మనసుకు నచ్చిన వరము కోరుకోమని రాముడు అడిగినప్పుడు ఆమె ఋషిపత్నుల చెంతన వనవాసమున గడపవలెనన్న కోరిక తెలిపినడు అతను ఏకాంతుడయ్యాడు అన్న భావనలో రాసిన పద్యం. తప్పులుంటే మన్నించి తెలుపగలరు.

  తే. గీ: నెలలు నిండిన వేళన నెలత కునతి
  మక్కు వనవర మీయగ మగడు దల్ప
  మునిస తులచెంత కేగగ మనస యెనని
  కాంతఁ గోరఁగ, తానె యేకాంతుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు గణాల వారీగా కాకుండా పదాల వారీగా టైప్ చేయండి. ఇలా...
   నెలలు నిండినవేళను నెలతకు నతి
   మక్కువను వర మీయగ మగడు దలప
   మునిసతులచెంత కేగగ మన సయెనని...

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు. అలాగే చేస్తాను.

   తొలగించండి
 13. కవిమిత్రులకు గమనిక...
  సమస్య ‘కాంతన్+కోరఁగ=కాంతఁ గోరఁగ’ (ద్రుతసంధి).
  కొందరు ‘కాంత+కోరగ=కాంత గోరఁగ’ (గసడదవాదేశ సంధి) అనే అర్థంలో పూరించారు. అలా పూరించిన వారిలో రాజేశ్వరి అక్కయ్య గారు, విరించి (వి.యస్. ఆంజనేయులు శర్మ) గారు, వసంత కిశోర్ గారు (వీరి మూడవ పూరణ మినహాయింపు), శైలజ గారు, డా. బల్లూరి ఉమాదేవి గారు ఉన్నారు.

  రిప్లయితొలగించండి
 14. 1.పాద లేపనమునతాను పరుగు దీసి
  పారమార్థిక మెసగెడు పర్వతాన
  లేపనమ్ము కరగి పోగ లేడి వంటి
  కాంత గోరగ తానె యేకాంతు డయ్యె.

  2పర్ణశాల యందు పతితోడ పడతి సీత
  గడుపు చుండె పరవశాన కాలమెల్ల
  పసిమికాంతుల మెరిసేటి పసిడి మృగముఁ
  కాంత గోరగ దానె యేకాంతు డయ్యె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు పూరణలను ఏ మార్పూ చేయకుండా మళ్ళీ ప్రకటించారు. పైన మీ పద్యాల తర్వాత నా వ్యాఖ్య క్రింద ‘ప్రత్యుత్తరం’ అన్నదానిని క్లిక్ చేసి అక్కడ మీరేం చెప్పాలన్నా చెప్పవచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా పోస్ట్ చేయ నక్కరలేదు.

   తొలగించండి
 15. పెండ్లి యాడెను గుడిలోన పేరి శాస్త్రి
  కాంత గోరగ తానె ,యేకాం తు డయ్యె
  కట్న మేదియు లేదను గార ణమున
  నియ్య గవిడాకు లామెకు నిష్ట మౌట

  రిప్లయితొలగించండి
 16. ప్రజల సేవల జేయుటే భాగ్యమనుచు
  తనకుటుంబపు బాధ్యత తలచనట్టి
  విభుని భార్యయు బిడ్డలు విడువ, కీర్తి
  కాంత( గోరగ తానె యేకాంతుడయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. వలలు జేరిన సైరంద్రి తెలిపె నిట్లు
  కోర రానట్టి కోరికన్ గోరినట్టి
  ఖలుడు కీచకున్ దునుమాడ వలయు ననుచు
  కాంత గోరగ తానెయే కాంతుడయ్యె

  రిప్లయితొలగించండి

 18. రమ్ము నర్తనశాలకు రాజ రాత్రి
  మున్ను కననట్టి సుఖముల ముంచివైతు
  నన్న మాలిని చనియె నిహతుడవంగ
  కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె.

  రిప్లయితొలగించండి
 19. జీవమున్నంత వరకు విశేషవిషయ
  వాంఛలనుదీర్చుకొని తృప్తిపడక దేహ
  దార్ఢ్యము సడల యవసాన దశనుమృత్యు
  కాంత గోరంగ తానె యేకాంతు డయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మృత్యుకాంత’ కంటే ‘మోక్షకాంత’ అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కారముతో
  గురుమూర్తి ఆచారి

  రూపరిన్ , ధనిన్ , సద్గుణ రుచిరమతిని ;
  పుంస్త్వ శోభితు విభునిగా పొందెనామె ;
  సతిని రమ్మనియెను విదేశముల కతడు ;
  రా తిరస్కరింప , విడకుల నొసగు మని
  కాంత(న్) గోరగ - తానె యేకాంతుడయ్యె !
  మిథున మిటు విడిపోవుట మేలు గాదు.

  (రూపరి = రూపవంతుడు
  ధని = ధనవంతుడు
  పుంస్త్వ శోభితు = మగసిరి కలవాడు
  మిథునము = దంపతుల జంట)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘విడాకుల’ టైపాటు వల్ల ‘విడకుల’ అయినట్టుంది.

   తొలగించండి
  2. ఔను గురువు గారు ! పొరపాటైంది..
   సవరించాను..

   రూపరిన్ , ధనిన్ , సద్గుణ రుచిరమతిని ;
   పుంస్త్వ శోభితు విభునిగా పొందెనామె ;
   సతిని రమ్మనియెను విదేశముల కతడు ;
   రా తిరస్కరింప , విడాకుల నొసగు మని
   కాంత(న్) గోరగ - తానె యేకాంతుడయ్యె !
   మిథున మిటు విడిపోవుట మేలు గాదు.

   (రూపరి = రూపవంతుడు
   ధని = ధనవంతుడు
   పుంస్త్వ శోభితు = మగసిరి కలవాడు
   మిథునము = దంపతుల జంట)

   ధన్యవాదములు

   తొలగించండి
 21. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణ చూసిన తర్వాత గమనించాను నేను దృతమును.

  జగతిఁ బేరుగన్నట్టి షడ్ఛ్చక్ర వర్తి
  నలుడు సురునొకరి వరుమన దమయింతి
  నరసి, కోరిక నొల్లదు, నల్వురొక్క
  కాంతఁ గోరఁగ, తానెయే కాంతుఁ డయ్యె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ప్రయత్నం ప్రశంసనీయం. పూరణలో కొంత గందరగోళ మున్నది. నలుడు షట్చక్రవర్తులలో ఒకడు కాని షట్చక్రవర్తి అనరాదు. ‘వరుము అన’..? ‘తానె, తానే’ అన్న రూపాలున్నవి కాని ‘తానెయే’ అన్న రూపం లేదు.

   తొలగించండి
  2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూరణ దోషాలు గ్రహించితిని.

   తొలగించండి
  3. గృహమున కలదు సుందర కీరవాణి
   భార్య మృదుభాషి చపలుడు వాడు కనగ
   నేమి వింత నిజసతి సనియె తను పర
   కాంతఁ గోరఁగ, తానె యేకాంతుఁ డయ్యె.

   తొలగించండి
 22. గురువుగారూ తేటగీతి ఆటవెలది వంటి పద్యాలను నాలుగుకన్న ఎక్కువ పాదాలతో వ్రాయవచ్చునా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సమపాదాలుండే వృత్తాలను నాలుగుకంటె ఎక్కువ (పరిమితి లేని) పాదాలతో వ్రాయవచ్చు. అలాగే సమపాద లక్షణాలు కలిగిన తేటగీతి, ద్విపద, మంజరీద్విపదలను ఎక్కువ పాదాలతో వ్రాయవచ్చు. సీసమును కూడ పెక్కు పాదాలతో వ్రాసి (సీసపాదాన్ని 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలుగా) తరువాత ఎత్తుగీతితో ముగించవచ్చు. కందం, ఆటవెలది విషమపాద లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఎక్కువ పాదాలు వ్రాయరాదు.

   తొలగించండి
 23. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  సుంతయౌ పాదలేపన మంతరించ
  గనుచు ప్రవరుని హిమగిరి కలియమనుచు
  కాంతగోరగ,తానె యేకాంతుడయ్యె
  వలదు వలదని పలుకుచు పాట్లు పడగ

  రిప్లయితొలగించండి

 24. శ్రీగురుభ్యోనమః

  సగము దేహము నందున సతిని జేర్చి
  ద్వైత భావము తొలగి యద్వైత సిద్ధి
  కలుగ జేయగ మదినెంచి గరళ కంఠు
  గాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె.

  రిప్లయితొలగించండి
 25. గురుదేవులు సూచన మేరకు సవరించిన పద్యము

  జీవమున్నంత వరకు విశేషవిషయ
  వాంఛలనుదీర్చుకొని తృప్తిపడక దేహ
  దార్ఢ్యము సడల యవసాన దశను మోక్ష
  కాంత గోరంగ తానె యేకాంతు డయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు మొదటగా పోస్ట్ చేసిన పూరణ క్రింద నా వ్యాఖ్య... దాని క్రింద ‘ప్రత్యుత్తరం’ అని ఉంటుంది. దానిని క్లిక్ చేసి వచ్చిన బాక్సులో టైప్ చేసి మీ సవరణను పోస్ట్ చేయాలి.

   తొలగించండి
 26. అందమొలికెడు పుత్తడి హరిణ మొకటి
  పంచవటి దరిదాపున సంచరించ
  పట్టితెమ్మని మురిపాన ప్రాణనాథు
  కాంత గోరగ తానె యేకాంతు డయ్యె

  రిప్లయితొలగించండి