శ్రీ ఆంజనేయ శర్మ గారూ , మరాళము సంస్కృత సమము , తత్సమము - దానిని నడక అన్న దేశ్యముతో సమసింపజేయడం వ్యాకరణ విరుద్ధం. " నవలకు నడుమయ్యె నంచ నడకల కులుకుల్ " అంటే వ్యాకరణ ప్రమాదం తప్పిపోతుంది కానీ , పువ్వుతో నడుమును పోల్చడమనే కవి సమయ వ్యతిరేకత ఉపశమింపదు.
శ్రీ ఆంజనేయశర్మ గారూ, సవరణ బాగుంది కానీ మోము + అంచ అని విడదీయకూడదు, అక్కడ సంధి నిత్యము . కనుక ' వదనము+ అంచ = వదనమంచ ' అని ప్రయోగించండి, సరిపోతుంది. స్వస్తి.
మీ రెండు పద్యాలు బాగున్నవి. మొదటి పద్యంలో నడక తడబడింది (ఆ పద్యంలో ఆమె నడకల ప్రస్తావన లేదు కనుక). ఇక రెండవపద్యం చక్కని ధారతో పరుగులు పెట్టింది. అభినందనలు. కాని నడుమును సరసిరుహంతో పోల్చడం వింత. మొదటిపద్యంలో ‘...యెదను’ అనండి. అలాగే ‘పెదిమ’ గ్రామ్యం. ‘పెదవులు’ అనండి.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, బహుళము అంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అని నాలుగు రకాలు. ‘ఉపమ+అగు’ అన్నది నిషేధం క్రింద వస్తుంది. అంటే అక్కడ సంధి లేదు. సంధి లేనిచోట యడాగమం వస్తుంది. ఇక ‘కవనార్హత’ ప్రయోగంలో దోషం లేదు. సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, తవ,భవత్ , మమ అనే సంస్కృత పదాలను తెలుగులో యథాతథంగా వాడుకునే వెసులుబాటు లేదు. తవ , మమ శబ్దాలకు తావక/ త్వదీయ , మామక/ మదీయ - భవత్ శబ్దానికి భవదీయ ఇత్యాదులుగా ప్రయోగించుకోవచ్చు , ఈరోజే ఇంకో చోట కూడా ఇదే విధమైన ప్రయోగాన్ని చూచిన జ్ఞాపకం కనుక ఈ సూచన అందరికీ వర్తిస్తుంది .
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘వికచ’ శబ్దాన్ని ‘వికసిత’ అని గణదోషానికి కారకులయ్యారు. డా. విష్ణునందన్ గారి వ్యాఖ్యను గమనించారు కదా!
డా. విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు. అటువంటి ప్రయోగాలు వచ్చినప్పుడు ఏదో అసహజత్వం కనిపిస్తుంది. కాని అది దోషం అని చెప్పగలిగే సంస్కృత పాండిత్యం, అధికారం నాకు లేవు. పోచిరాజు సుబ్బారావు గారు కూడ ‘తవశిరమున’ అన్న ప్రయోగాన్ని చేశారు.
అవును శంకరయ్య గారూ ,భవచ్ఛబ్దాన్ని యథాతథంగానూ , మమ , తవ శబ్దాల రూపాంతరంగా మామకీన, తావకీనేత్యాదులనూ కూడా వాడుకోవచ్చును. అలాగే పైన సహదేవుడి గారి పద్యంలో - ' భవత్ + అంఘ్రి ' = భవదంఘ్రి మాత్రమే అవుతుంది, భవదాంఘ్రి అని దీర్ఘం కాదు.
నాదెంత భాగ్యము! వాగ్దేవిని వేడిన వెంటనే సరస్వతీపుత్రులైన డా.విష్ణునందన్ గారు నాకు సాయంగరావడం! ఆ తల్లి ఆదేశమే కాబోలు వారల ఆశీస్సులు. వారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు తెలుపుకొంటూ, సవరించిన పద్యమును పరిశీలించ మనవి:
నవ వికచ సరసిరుహమున్ ప్రవాళమున్ బోలు నీదు పదముల నుంతున్! కవనమ్మీయవె భారతి! యవనిన్ నా జన్మ ధన్యమౌ భావమునన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ ఆంజనేయ శర్మ గారూ , మరాళము సంస్కృత సమము , తత్సమము - దానిని నడక అన్న దేశ్యముతో సమసింపజేయడం వ్యాకరణ విరుద్ధం. " నవలకు నడుమయ్యె నంచ నడకల కులుకుల్ " అంటే వ్యాకరణ ప్రమాదం తప్పిపోతుంది కానీ , పువ్వుతో నడుమును పోల్చడమనే కవి సమయ వ్యతిరేకత ఉపశమింపదు.
తొలగించండిడా. విష్ణు నందన్ గారికీ నమస్కారములు మీ సూచనలకు ధన్యవాదములు ....
తొలగించండిసరిచేసి మళ్ళీ పోస్టుచేస్తానండీ......మీ సూచనలు శిరోధార్యములు ధన్యవాదములు.....
నవవికచ సరసి రుహము నవలకు తను
తొలగించండివై యెదను జత లకుచముల్ , వదనమె శశి
బింబము సుధలు గురిసెడు పెదవులు మరి
వెన్నెలవిరియు కన్నులు కన్నెకమరె.
నవవికచ సరసి రుహమే
నవనాయిక మోము యంచ నడకల కులుకుల్
నవనవలాడెడు పరువము
కవివర్ణన కందనట్టి కలికియె ఘనమౌ
శ్రీ ఆంజనేయశర్మ గారూ, సవరణ బాగుంది కానీ మోము + అంచ అని విడదీయకూడదు, అక్కడ సంధి నిత్యము . కనుక ' వదనము+ అంచ = వదనమంచ ' అని ప్రయోగించండి, సరిపోతుంది. స్వస్తి.
తొలగించండిడా. విష్ణునందన్ గారూ,
తొలగించండిఆ దోషాన్ని నేను గమనించలేదు. దోషాన్ని తెలియజేసి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.
మీ రెండు పద్యాలు బాగున్నవి. మొదటి పద్యంలో నడక తడబడింది (ఆ పద్యంలో ఆమె నడకల ప్రస్తావన లేదు కనుక). ఇక రెండవపద్యం చక్కని ధారతో పరుగులు పెట్టింది. అభినందనలు.
రిప్లయితొలగించండికాని నడుమును సరసిరుహంతో పోల్చడం వింత.
మొదటిపద్యంలో ‘...యెదను’ అనండి. అలాగే ‘పెదిమ’ గ్రామ్యం. ‘పెదవులు’ అనండి.
సరసిరుహము, సరసీరుహము రెండూ సాధువులే.
రిప్లయితొలగించండి1. కం:నవవికచ సరసి రుహమును
రిప్లయితొలగించండినవనవ లాడెడి సుమముల నన్నింటిన్ కూ
ర్చి వరము లొసంగు మని యా
శివానిని కొలిచిన మాత సిరుల నొసంగున్.
2.తే.గీ:నవవికచ సరసిరుహము నాశపడగ
నవల కోరిక దీర్చంగ నామె ప్రియుడు
చనగ మురిసిన మనమున చాన సంత
సించి యెదురు జూచుచు నుండె చెలుని కొరకు.
3.కం:నవవికచ సరసి రుహమట
నవనవలాడ కరి కరమున గొనుచు సిరికిన్
జవమున వేయగ ముదమం
ది,విలాసముతోడ మాత దీవెన లొసగెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
నవ వికచ సరసి రుహము ను
రిప్లయితొలగించండితవశిరమున బెట్టు కొనుము దామర సాక్షీ !
నవ వధువు వలెను నుందువు
సవరము నుం బెట్టు కొనుము చక్కగ నుండన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నవవికచ సరసిరుహము సు
రిప్లయితొలగించండికవివర కవనార్హతావికసితోల్లాసన్
జవరాండ్ర ముఖోపమగు న
రవిందమును గన మనోభి రామము గాదే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఉపమ+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అత్తునకుసంధి బహుళము కదా అని వ్రాసాను. “కవనార్హతా” ప్రయోగము సందేహమనిపించి సవరించాను. సవరించిన పద్యము తిలకించ గోర్తాను.
తొలగించండినవవికచ సరసిరుహము సు
కవివర రచనార్హతావికసితోల్లాసన్
జవరాండ్ర వదన సదృశమ
రవిందమును గన మనోభి రామము గాదే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిబహుళము అంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అని నాలుగు రకాలు. ‘ఉపమ+అగు’ అన్నది నిషేధం క్రింద వస్తుంది. అంటే అక్కడ సంధి లేదు. సంధి లేనిచోట యడాగమం వస్తుంది.
ఇక ‘కవనార్హత’ ప్రయోగంలో దోషం లేదు.
సవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
నవవికచసరసిరుహము నాతిరూపు
రిప్లయితొలగించండితడబడుమనస్సు కాంచిన నడుముసోకు
చిరునగవులను రువ్వుచు చెం తనిలచె
చిక్కునా చేతి కా బహు చక్కనమ్మ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నవవికచ సరసిరుహమును
రిప్లయితొలగించండికవు లనెదరు కలిమిచెలి మొగమునకు తులగా
రవికరహిత కమలము సిరి
రవినయనుని హృదయజిత నిరతవికచమున్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వికచమున్’ అన్నచోట గణదోషం. ‘వికచమ్మున్’ అనండి.
నవవికచ సరసిరుహము! వి
రిప్లయితొలగించండిభవమును గన జిలుగు వెలుగు వసనములు ధరి౦
ఛి వెడలెను గగన పథమున
రవి పరిమళ మలదు కొనుచు రసికత మెరయన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ సర్వలఘు కందం బాగున్నది. అభినందనలు.
గురువుగారూ దోష సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినవ వికసిత సరసిరుహమున్
రిప్లయితొలగించండిభవదాంఘ్రి యుగమ్ము నుంచి పలుకుల తల్లీ!
కవనమ్మీయగ వేడెద
తవ దాసుడ! కరుణఁ జూపు ధన్యుని జేయన్!
శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, తవ,భవత్ , మమ అనే సంస్కృత పదాలను తెలుగులో యథాతథంగా వాడుకునే వెసులుబాటు లేదు. తవ , మమ శబ్దాలకు తావక/ త్వదీయ , మామక/ మదీయ - భవత్ శబ్దానికి భవదీయ ఇత్యాదులుగా ప్రయోగించుకోవచ్చు , ఈరోజే ఇంకో చోట కూడా ఇదే విధమైన ప్రయోగాన్ని చూచిన జ్ఞాపకం కనుక ఈ సూచన అందరికీ వర్తిస్తుంది .
తొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వికచ’ శబ్దాన్ని ‘వికసిత’ అని గణదోషానికి కారకులయ్యారు.
డా. విష్ణునందన్ గారి వ్యాఖ్యను గమనించారు కదా!
డా. విష్ణునందన్ గారూ,
తొలగించండిధన్యవాదాలు. అటువంటి ప్రయోగాలు వచ్చినప్పుడు ఏదో అసహజత్వం కనిపిస్తుంది. కాని అది దోషం అని చెప్పగలిగే సంస్కృత పాండిత్యం, అధికారం నాకు లేవు. పోచిరాజు సుబ్బారావు గారు కూడ ‘తవశిరమున’ అన్న ప్రయోగాన్ని చేశారు.
అవును శంకరయ్య గారూ ,భవచ్ఛబ్దాన్ని యథాతథంగానూ , మమ , తవ శబ్దాల రూపాంతరంగా మామకీన, తావకీనేత్యాదులనూ కూడా వాడుకోవచ్చును. అలాగే పైన సహదేవుడి గారి పద్యంలో - ' భవత్ + అంఘ్రి ' = భవదంఘ్రి మాత్రమే అవుతుంది, భవదాంఘ్రి అని దీర్ఘం కాదు.
తొలగించండినాదెంత భాగ్యము! వాగ్దేవిని వేడిన వెంటనే సరస్వతీపుత్రులైన డా.విష్ణునందన్ గారు నాకు సాయంగరావడం! ఆ తల్లి ఆదేశమే కాబోలు వారల ఆశీస్సులు. వారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు తెలుపుకొంటూ, సవరించిన పద్యమును పరిశీలించ మనవి:
తొలగించండినవ వికచ సరసిరుహమున్
ప్రవాళమున్ బోలు నీదు పదముల నుంతున్!
కవనమ్మీయవె భారతి!
యవనిన్ నా జన్మ ధన్యమౌ భావమునన్!
గుండా వేంకట సుబ్బ్ సహదేవుడు గారూ,
తొలగించండిసవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఉంతున్’ సాధువు కాదు. ‘పదముల నిడుదున్’ అనండి.
గురుదేవులకు మరోమారు ధన్యవాదము తెలుపుకొంటూ సవరించిన పద్యం:
తొలగించండినవ వికచ సరసిరుహమున్
ప్రవాళమున్ బోలు నీదు పదముల నిడుదున్!
కవనమ్మీయవె భారతి!
యవనిన్ నా జన్మ ధన్యమౌ భావమునన్!
నవవికచ సరసిరుహము నవ్యానుభవముభువికి
రిప్లయితొలగించండిభవిత భాగ్యమ్ముగానెంచు |వాహిని కానంద బరచు
దవళ కాంతిని పురిగొల్ప-దళసరి దర్పము నింప
సవరింత వాణియే నిలువ? చలువ జేసినరీతి గలువ|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నవవికచ సరసిరుహమును
రిప్లయితొలగించండిపవమాన సుతున కొసగుచు పాడగ కృతులన్
నవ వధువు చెంత నిలుచుచు
కవివర! ఏమని నుడివెద! గాడిద కూసెన్ :)
రిప్లయితొలగించండినవవికచ సరసిరుహము మ
న వనమ్మున బూచె నమ్మ నవనవ లాడం
గ విదురులపల్కుగ జిలే
బి వడివడిగ రమ్మ చేర పిరియము గానన్ !
జిలేబి
నవవికచ సరసిరుహమును
రిప్లయితొలగించండినవలలు వ్రాసెడు పడతికి నవ్వుచు నిడగా
కవరును విప్పుచు తనదౌ
నవలను నాకిచ్చె వంద నాణెమ్ములకై
😢