11, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1823 (శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్.

66 కామెంట్‌లు:

  1. పూరిత కరుణామృత రస
    ధారాధర! నీలకంఠ! త్ర్యంబక !శూలీ !
    గౌరీనాథా! ప్రణత
    శ్రీరామా! యని పిలిచిన శివుఁ డేతెంచెన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. విష్ణునందన్ గారూ,
      శివనామస్మరణాంచితమైన ప్రశస్త పూరణతో ఈనాటి సమస్యాపూరణాన్ని ప్రారంభించారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. సుకవి పండితులు డా.విష్ణు నందన్ గారూ!
      భక్తిభావభరితమైన శివనామామృతమును శ్రీరామనామ స్మరణ యుతముగ నందించి మమ్ము ధన్యులఁ జేసితిరి. అభినందనలు!

      తొలగించండి
    3. విద్వరిష్ఠులు శ్రీ మధుసూదన్ గారికి- కృతజ్ఞతా సాహస్రి.

      తొలగించండి
  2. నమస్కారములు
    అద్భుతమైన పద్యము నందించి నందులకు ధన్య వాదములు విష్ణు నందన్ గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ధన్యవాదాలు.
      పూరణ క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరం’ అన్నదానిని క్లిక్ చేసి అక్కడ వచ్చిన బాక్సులో మీ వ్యాఖ్యను నమోదు చేయవలసి ఉంటుంది.

      తొలగించండి
    2. రాజేశ్వరమ్మ గారూ, నమస్కారములు. ధన్యవాదములు.

      తొలగించండి
  3. ఏరాముని కొలిచిన మన
    మారాముని ప్రతిరూప మారా ధించన్
    కోరిన నామము ప్రియముగ
    శ్రీరామా యని పిలచిన శివుఁ డేతెంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘మన| మారామన్న ప్రతిరూప మారాధించన్’ అనండి.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ‘విరించి’ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణలో ‘రారమ్ము కాళికా మనో|శ్రీరామా...’ అనండి.
      రెండవపూరణలో ‘రాముడ వీవే’ అనండి.

      తొలగించండి


    2. 1.
      చేరితి నీపద సన్నిధి
      కోరితి నీ దివ్య పథము కోపము లేలన్
      రారమ్ము! కాళిక మనో
      శ్రీరామా! యని పిలిచిన శివుడే తెంచెన్

      2.
      ఔరా! శ్రీధరు లిరువురు
      రారా! శివుడైన నీవె రాముడ వీవే
      మీరొక రే యని నమ్మియె
      శ్రీరామా యని పిలిచిన శివుడేతెంచెన్

      తొలగించండి
    3. విరించి గారూ,
      మన్నించండి. నేను సూచించిన సవరణలో గణదోషం. ‘కాళిదాదు’ అన్నట్టుగా ‘కాళిక మనోశ్రీరామ’ అనడంలో దోషమున్నట్టు నాకు తోచడం లేదు.

      తొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    సుకవి-డాక్టరు విష్ణునందన్ గారి బాటలో :

    01)
    __________________________________

    శ్రీరంభాపతి ! గోపతి !
    శ్రీరాజధరా ! విభిన్న ! - శితికంఠేశా
    శ్రీరుద్ర ! సదా స్మారిత
    శ్రీరామా ! యని పిలిచిన - శివుఁ డేతెంచెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పార్వతికి రంభ అన్న పర్యాయపదమున్న మాట నిజమే. కాని సందిగ్ధత తొలగడానికి ‘గౌరీవల్లభ’ అంటే సరిపోదా?

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      చక్కగా సరిపోతుంది కాని
      మొదటి అక్షరం -శ్రీ - నుంచాలని తాపత్రయం

      తొలగించండి
  6. ప్రతీదానికీ పోట్లాడుకునే - శ్రీరామ్ మరియు శివరావ్ -
    లిద్దరూ సోదరులు - ఒకణ్ణి పిలిస్తే మరొకడు పలుకుతాడు :

    02)
    __________________________________

    వారా సోదరు లిద్దరు
    పోరాడుచు నున్న వారు - బుడగల కొరకై
    వారిని విడిపించగ, నే,
    శ్రీరామా యని పిలిచిన - శివుఁ డేతెంచెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  7. కోరిక లీడేర్చు నిలన్
    శ్రీరామా యని పిలచిన , శివుఁడేతెంచెన్
    చేరిన మార్కండేయుని
    తీరుగ రక్షింప, పాశి దీయగ నుసురున్!!!
    ఏరూపుగ కొలిచిన నే
    పేరున మది దలచు కున్న విశ్వపుడొకడే
    సారంగా! శ్రీకంఠా
    శ్రీరామా! యని పిలచిన శివుఁడేతెంచెన్!!!


    రిప్లయితొలగించండి
  8. రామా ! శ్రీరామా ! యనుచూ శివైక్యం పొందిన దశరథుడు :

    03)
    __________________________________

    కోరగ వరముల కైకయె
    నార వలువ నూని కాన - నములకు జనగన్
    నోరార దశరథుం డదె
    శ్రీరామా యని పిలిచిన - శివుఁ డేతెంచెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి నమస్కారం. శివకేశవులకి భేధము లేదన్న భావములో పూరణ కు ప్రయత్నించాను.తప్పులు తెలియచేయగలరు.

    కం: మాధవుడనో, శివుడనో
    పేరిడతరమా? పిలువగపరమాత్మునికిన్
    కేశవుడన్నను శివుడని
    శ్రీరామాయని పిలిచిన శివుఁ డేతెంచెన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      మొదటి, మూడవ పాదాలలో ప్రాసదోషం. రెండవపాదంలో యతిదోషం. నా సవరణ.....
      శ్రీరమణుఁడనొ శివుఁడనో
      పేరిడ తరమా పిలువగ విశ్వాత్మునకున్
      శౌరికి శివునకు భేదమ?
      శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్.

      తొలగించండి
    2. క్షమించాలి గురువుగారు. ప్రాస నియమము నాకు తెలియకుండానే విస్మరించాను. తిరిగి మరొక పూరణము రాసి పంపుతాను.

      తొలగించండి
  10. పారావారము లంఘన
    మౌరాయనుకొనగ సేయ నంజని సుతుఁడై
    నే రాజాలక నుందునె,
    శ్రీరామా! యని; పిలిచిన శివుఁ డేతెంచెన్.

    రిప్లయితొలగించండి
  11. ఆరయ నొకరే యగుటను
    శ్రీ రామాయని పిలిచిన శివు డే తెంచె
    న్నారాముడు నీ శివుడును
    బారంగతు జేయు నెపుడు భక్తుని దయతోన్

    రిప్లయితొలగించండి
  12. మారుతి జపించు సతతము
    శ్రీరామా యని; పిలిచిన శివుఁ డేతెంచెన్
    ధీరత మార్కండేయుని
    నా రవిజుని బారినుండి యాదుకొనంగన్.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    (నేనును డా.విష్ణునందన్ గారి దారినే యనుసరించితిని)

    "మారజిత! భర్గ! ధూర్జటి!
    మేరుగుణి! కృశానురేత! మృత్యుంజయ! గౌ
    రీ రంజక! ఘన వినుత

    శ్రీరామా!" యని పిలిచిన, "శివుఁ" డేతెంచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      సంబోధనాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. తెలియకుండానే ప్రాస విస్మరించి తప్పుగా పూరణ పంపినందుకు మరొక్కసారి నా క్షమాపణలు. ఈ క్రింది పద్యము పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.

    కం: శ్రీరాముడెరూపునిడగ
    శ్రీరామేశ్వరుడనబడెశ్రీశంకరుడే
    వేరా వారిరువురు? మరి
    శ్రీరామా!యనిపిలిచిన శివుఁ డేతెంచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      ఈ పూరణ సలక్షణంగా దోషరహితంగా ఉంది. చక్కని పద్యం. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు. నేనూ రాయగలనని కొద్దిగా ధైర్యం వస్తోంది. మీ ప్రొత్సాహానికి మరొక్కసారి కృతజ్ఞతలు.

      తొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కోరుచు హరి హరులొకరని
    నోరార భజించి ముక్తి నొందుట కొరకై
    చేరగ సాన్నిధ్యము నకు
    శ్రీ రామాయని పిలచిన శివుడే తెంచెన్

    రిప్లయితొలగించండి
  16. కోరితిఁ జెప్పుము నేమగు
    శ్రీరామా యని పిలిచిన? శివుఁడే తెంచెన్
    గౌరికి మహిమఁ దెలుప, ము
    మ్మారులు జపియింప వేయి మార్లవుననుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      ‘శ్రీరామ రామ రామేతి...’ శ్లోకాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘చెప్పుము+ఏమగు’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘చెప్పుమ యేమగు’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యము:
      కోరితిఁ జెప్పుమ యేమగు
      శ్రీరామా యని పిలిచిన? శివుఁడే తెంచెన్
      గౌరికి మహిమఁ దెలుప, ము
      మ్మారులు జపియింప వేయి మార్లవుననుచున్!

      తొలగించండి
  17. ఏరూపున నినుకొలిచిన
    నారాయణ! పలికెదవట! నటరాజ !శివా
    శౌరి! యని తలచి భక్తుడు
    శ్రీరామా యని పిలచిన శివుడేతెంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. ఆ రాముడు శబరిఁ గనడె
    శ్రీరామా యని పిలిచిన, శివుఁ డేతెంచెన్.
    కారడవి తిన్నడు ప్రతిమ
    నీరము గార్చ నయనముల నేత్రము లీయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. మారీచుడు మరణించుచు
    శ్రీరామా యని పిలిచిన, శివుడే తెంచెన్
    దారుణమెంచుచు ప్రాణము
    నారామజపమ్ముఁ జేయ ననిషిన్ జేర్చన్!
    (శివుడు లయకారకుడన్న భావంతో పూరణ జేయడమైనది.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  20. శ్రీగురుభ్యోనమః

    శ్రీరఘురాముని యాజ్ఞగ
    భారము తొలగంగ పోత్న భాగవతంబున్
    ధీరత దెనుగున వ్రాయుచు
    శ్రీరామా యని పిలచిన శివుడేతెంచెన్

    పోత్న (పోతన మహాకవి)


    మారుతి రూపము దాల్చుచు
    శ్రీరామా యని పిలచినంత శివుడేతెంచెన్
    తారకమంత్రము మనసున
    పారాయణ జేసినంత బ్రక్కన నిలచున్.

    యత్రయత్ర రఘునాథ కీర్తనం
    యత్రయత్ర కృత మస్తకాంజలిం
    భాష్పవారి పరిపూర్ణ లోచనం
    మారుతీం నమత రాక్షసాంతకం.

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పోతన’ను ‘పోత్న’ అనడం నేనైతే ఎక్కడా వినలేదు. ‘భారము చన పోతన మఱి భాగవతంబున్’ అందామా?
    శ్లోకం రెండవ పాదంలో ‘తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్’ అని ఉండాలి.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారు ధన్యవాదములు

    శ్రీరఘురాముని యాజ్ఞగ
    భారము చన పోతన ఘన భాగవతంబున్
    ధీరత దెనుగున వ్రాయుచు
    శ్రీరామా యని పిలచిన శివుడేతెంచెన్

    రిప్లయితొలగించండి
  23. రారా గౌరీనాథా!
    రారా కామారి! రార రవిశశినేత్రా!
    రారా విశ్వేశ! నత
    శ్రీరామా! యని పిలిచిన శివుఁ డేతెంచెన్.

    రిప్లయితొలగించండి
  24. శ్రీరాముడు శివమయమవ
    గౌరీపతి నిలుపు హృదయ కంజము లోనన్
    శ్రీరామ నామజపమును
    శ్రీరాముని పిలిచి నంత శివుడే తె౦చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యను కొద్దిగా (అర్థం చెడకుండానే) మార్చారు.

      తొలగించండి

  25. * గు రు మూ ర్తి ఆ చా రి *

    మారుతి యెవరను కొ౦టివి ?

    ఆ రుద్రా౦శు౦ డె సుమ్మి!
    ఆయన వచ్చున్

    శ్రీరామనామమున్ విన. :

    శ్రీరామా యని పిలచిన
    శివు డేతె౦చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నూతన వాక్యప్రారంభంలో అచ్చు ఉండడం దోషం కాకున్నా ‘...యెవరని తలచితి| వా రుద్రాంశుండె...’ అంటే బాగుంటుందని నా సూచన.

      తొలగించండి
  26. గురుదేవులు క్షమి౦చాలి
    పొరపాటు దొరలినది సమస్యని సరిచేసిన పద్యము
    శ్రీరాముడు శివమయమవ
    గౌరీపతి నిలుపు హృదయ కంజము లోనన్
    శ్రీరామ నామజపమును
    శ్రీరామా యని పిలిచిన శివు డేతె౦చెన్

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులు క్షమి౦చాలి
    పొరపాటు దొరలినది సమస్యని సరిచేసిన పద్యము
    శ్రీరాముడు శివమయమవ
    గౌరీపతి నిలుపు హృదయ కంజము లోనన్
    శ్రీరామ నామజపమును
    శ్రీరామా యని పిలిచిన శివు డేతె౦చెన్

    రిప్లయితొలగించండి
  28. కూరిమి తోడను మ్రొక్కుచు
    యారఘు రాముని గొల్వగ హరిహరు లగువా
    రిర్వురు గారన్నట్లుగ
    శ్రీరామా యని పిలిచిన శివు డేతెంచెన్.

    ఏరూపముతో తలచిన
    నారూపముతోడ తాను నగుపించు నిలన్
    వేరను వాదము లెందుకు
    శ్రీరామా యనిపిలిచిన శివు డేతెంచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘మ్రొక్కుచు| నారామునితోడ...’ అనండి.

      తొలగించండి
  29. ఓరామా! చూపు శివుని!
    శ్రీరామా! వేడెద నిను! శివభక్తులకున్
    శ్రీరామా! చూపు శివుని!
    శ్రీరామా! యని పిలిచిన శివుఁ డేతెంచెన్ :)

    రిప్లయితొలగించండి


  30. ఏరాలమ్ముగ దేవు
    ళ్ళేరాలమ్ముగద బిల్వ లెస్సగ నెవరో
    రారా యొకరై న ! భళా
    శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్.


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. పోరాడుచు నత్తయ్యను
    వీరావేశమ్మునందు వేడుచు మదినిన్,...
    నా రాత గాంచుడయ్యొయొ!,...
    శ్రీరామాయని పిలిచిన శివుఁ డేతెంచెన్

    రిప్లయితొలగించండి