13, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1825 (సజ్జనులు చేరుదురు యమసదనమునకు)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సజ్జనులు చేరుదురు యమసదనమునకు.

46 కామెంట్‌లు:

 1. చెరకు రనమున ముంచినన్ చేదు వేప!
  మారనొల్లని దురితుల చేరినట్టి
  వీరు వారలై నొప్పెడు విధము నడువ
  సజ్జనులు చేరుదురు యమ సదనమునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వారలై యొప్పెడు’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ప్రణామములు.సవరించిన పూరణ:

   చెరకు రనమున ముంచినన్ చేదు వేప!
   మారనొల్లని దురితుల చేరినట్టి
   వీరు వారలై యొప్పెడు విధము నడువ
   సజ్జనులు చేరుదురు యమ సదనమునకు

   తొలగించండి
 2. నీతి నియమము లేనట్టి నేటి యుగము
  జూద గృహముల యందున చోరు లందు
  నిలయ మైయుండి పయనించు కలియె గాన
  సజ్జనులు చేరుదురు యమసదన మునకు

  రిప్లయితొలగించండి
 3. మహిని మహనీయు లౌదురు మంచిఁజేసి
  సజ్జనులు;చేరుదురు యమ సదనమునకు
  పాపపు పనులు జేయుచు పతితు లెల్ల
  గనుడు నిదియె నేమో కలికాల మహిమ.

  రిప్లయితొలగించండి
 4. సత్యలోకమ్ము జేరును శాశ్వతముగ
  సజ్జనులు, చేరుదురు యమసదనమునకు
  పాప కార్యముల్ జేయుచు భయము లేక
  ధర్మమార్గము దప్పిన ధరణి జనులు!!!
  మానవత్వము మరచిన మాయగాళ్ళు
  మనుజ రూపాన నలరారు దనుజతతులు
  మేకవన్నెపులులవోలె మెయిని దిరుగు
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో సజ్జనులు చేరుదురు అని ఉండాలి. మీరు చేరును అన్నారు. అక్కడ ‘సత్యలోకమ్ము గందురు’ అనండి.
   రెండవ పూరణలో ‘మేకవన్నె పులులవోలె మెలగు కూట| సజ్జనులు...’ అనండి. అన్వయం కుదురుతుంది.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువుగారు...


   సత్యలోకమ్ము గందురు శాశ్వతముగ
   సజ్జనులు, చేరుదురు యమసదనమునకు
   పాప కార్యముల్ జేయుచు భయము లేక
   ధర్మమార్గము దప్పిన ధరణి జనులు!!!
   మానవత్వము మరచిన మాయగాళ్ళు
   మనుజ రూపాన నలరారు దనుజతతులు
   మేకవన్నెపులులవోలె మెలగు కూట
   సజ్జనులు చేరుదురు యమసదనమునకు!!!

   తొలగించండి
 5. మంచిపనులను చేసిన నంచితముగ
  పాపఫలమొందవలయును ప్రతిమనిషియు
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు
  పాపపరిహార మొనరించి పరమునొంద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. పుణ్య లోకాల కేసామి ! పొలుపు గాను
  సజ్జనులు చేరుదురు ,యమసదనమునకు
  పాపు లందఱు పోదురు పాపములను
  జేయు కతనన నిజమునే జెప్పు చుంటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కతన’ అంటే చాలు. ‘కతనన’ అనరాదు. అక్కడ ‘కతన నిజముగనే..’ అనండి.

   తొలగించండి

 7. గు రు మూ ర్తి ఆ చా రి
  ............................

  ' యమ' మన౦గ. ని౦ద్రియ నిగ్రహ౦బు ; మరియు

  ' యమ' మన౦గ శరీర యోగా౦గ. విద్య ;

  సజ్జనులు 'యమ'నియమ స౦చరులు ; కాన ,

  సజ్జనులు చేరుదురు యమసదనమునకు

  రిప్లయితొలగించండి

 8. గు రు మూ ర్తి ఆ చా రి
  ............................

  ' యమ' మన౦గ. ని౦ద్రియ నిగ్రహ౦బు ; మరియు

  ' యమ' మన౦గ శరీర యోగా౦గ. విద్య ;

  సజ్జనులు 'యమ'నియమ స౦చరులు ; కాన ,

  సజ్జనులు చేరుదురు యమసదనమునకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సంచారు లగుట’ అనండి.

   తొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  సత్య చింతన ధర్మ ప్రచారము మఱి
  పుణ్యవర్తన కారణమునను దివిని

  సజ్జనులు చేరుదురు యమసదనమునకుఁ
  బిల్చు యమభటులను వీడి వేగిరముగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   విరుపు లేకుండా వైవిద్యమైన మీ పూరణ ఔత్సాహిక కవులకు మార్గదర్శకం. చాల బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 10. నియమ నిష్ఠల్విడి యసత్య భయములేక
  శ్రియముకైపర్వులెత్తుచు చిక్కుకొనును
  పాపకూపంబునన్ పడి పతనమగు న
  సజ్జనులు చేరుదురు యమసదనమునకుఁ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
   బహుకాలానికి బ్లాగులో మీ దర్శన భాగ్యం లభించింది. సంతోషం!
   మీ ‘అసజ్జనుల’ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. మహిన జీవుల గమ్యమ్ము మరణ మొకటె
  చీమ యైనను కరియైన సింహమైన
  కువలయమున పేదలు ధనికులు కుజనులు
  సజ్జనులు చేరుదురు యమ సదనము నకు

  రిప్లయితొలగించండి
 12. జన్మజన్మల నంటివచ్చనగ పాప
  ఫలము, నేఁడెంత పుణ్యంబు ప్రాప్తమైన,
  పూర్వకర్మ కొలదియున్నఁ-- బోవు నట్లు
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు.

  రిప్లయితొలగించండి
 13. పాండ వాగ్రజుడు ధరణీ వల్లభుండు
  పలికె “ద్రోణ తనయ హతః” పదము కుంజ
  రః వినగరాదు, దాన నరకము గనియె
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు.

  (“అశ్వద్ధామ” మూడు గురువులు వరుసగా తేటగీతి లో కుదరక “ద్రోణ తనయ” పదము వాడాను.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   తేటగీరిలో వరుసగా మూడు గురువులు వచ్చే అవకాశం ఉంది. చూడండి...
   పాండవాగ్రజుడు ధరణీవల్లభు డిటు
   లనుచు బలికె “నశ్వత్థామ హతః, కుంజ
   రః వినగరాదు...

   తొలగించండి
  2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. నగ, త గణాలు వాడితే సరిపోతోంది. అన్నీ చూశాను గాని ఈ క్రమము చూడ లేదు. ధన్య వాదములు. నేను చాలా సేపు ప్రయత్నించాను అశ్వత్థామ వ్రాద్దామని. ధన్య వాదములు.

   తొలగించండి
  3. రగణ, తగణాలు కలిసినా మూడు గురువు లొకచోట చేరే అవకాశం ఉంది.

   తొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  గుండు మధుసూదన్ గారి బాటలో :

  ప్రతీ జీవి కర్మానుగుణముగా
  పాప పుణ్యములు రెండూ అనుభవించాలి :
  01)
  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________

  ధర్మ వర్తన సత్యచిం-తనయు మరియు
  దాన ధర్మాది క్రతువులన్ - దనర, దివిని
  సజ్జనులు చేరుదురు యమ సదనమునకు
  పుణ్య లయమున పాపాను - గుణ్యముగను
  _______________________________________

  రిప్లయితొలగించండి
 15. మహాభారతములో కూడా మొదటగా పాండవులు నరకానికే పోతారుకదా.........

  పాపపుణ్యంబులకు లెక్క బడసి పిదప
  స్వర్గనరకములకుఁ జేర వలయునపుడు
  కొలఁది పాపమ్ము చేత తత్ఫలముగాగ
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు

  రిప్లయితొలగించండి
 16. .ధర్మ మార్గాన వెళ్ళెడి దాతలున్న
  సజ్జనులు చేరుదురు |యమసదనమునకు
  దుష్ట,దుర్మార్గతత్వాల నిష్ట లుండి
  పరుల నొప్పించ దలచెడి వారిదారి
  2.పరుల కష్టాలు మాన్పెడి ప్రతిఫలాన
  సజ్జనులు చేరుదురు|యమసదనమునకు
  స్వార్థ పరతత్వ మందున సాగువారె|
  స్వర్గనరకము మనసున్న సర్ది జెప్పు

  రిప్లయితొలగించండి
 17. స్వర్గ భోగము లన్నియు వసుధ యందు
  నమరు చుండంగ నద్దాని ననుభవింప
  ప్రాణముల్ పోవ దివికేగ వలదటంచు
  సజ్జనుల్ చేరుదురు యమ సదనమునకు

  రిప్లయితొలగించండి
 18. శ్రీ భాగవతుల కృష్ణా రావు గారి పూరణ

  పూర్వజన్మ సుకృతమున నుర్వి పైన
  మానవుల రూపు దాల్చియు మందుల వలె
  దుష్ట సహవాసమును పొంది దూర్తు లగుచు
  సజ్జనులు చేరుదురు యమ సదనమునకు

  రిప్లయితొలగించండి
 19. గురువుగారూ ర ల లకు యతి మైత్రి ఉందా? దయచేసి సందేహము తీర్చండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   అనంతుడు, చిత్రకవి పెద్దన, కూచిమంచి తిమ్మకవి ఈ ర-ల యతిని అంగీకరించలేదు. లింగమగుంట తిమ్మన, రమణ కవి, రంగకవి, వేంకటరాయకవి ‘అభేదయతి’ భేదాలలో దీనిని చెప్పినారు. పూర్వకవుల ప్రయోగాలను బట్టి ఈ యతి సమ్మతమే అనుకోవచ్చు.
   ౧) *లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రె.. (కాశీఖండము, ౬-౨౧౦)
   ౨) *రాజకుమారుఁ డే*లంగఁగలఁడు (శ్రీనాథుఁడు)
   ౩) *లక్ష్మేక్షు రసాబ్ధి సుట్టి*రా విలసిల్లున్ (భాగవ. ౫-౨-౬౧)
   ౪) వి|*లీనత నేపారు చంద్ర*రేఖయుఁ బోలెన్ (భాస్కర రామాయణము, యుద్ధ. ౨౩౨౩)
   ౫) *రభసంబున నతని శరము*లను గడు నొంచెన్ (భార.ద్రోణ. ౨-౭౩)

   తొలగించండి
  2. అప్పకవి కూడ ఈ ర-ల యతిని అంగీకరించలేదు.

   తొలగించండి
 20. చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
  మేక వన్నెపులులమోసముకనబడక
  నేరమును చేయకున్ననుశిక్షపడగ
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు

  రిప్లయితొలగించండి
 21. చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
  మేక వన్నెపులులమోసముకనబడక
  నేరమును చేయకున్ననుశిక్షపడగ
  సజ్జనులు చేరుదురు యమసదనమునకు

  రిప్లయితొలగించండి