ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు మర్చిపోయిరో చీకుయు చింతలేవి దరిజేరని బాలుర మంచెరుంగకన్ భీకర రూపమెత్తి యరివీరులు పెద్దలు మాటిమాటికిన్ కేకలు వేసిమమ్ములను కిమ్మననీయరు పెక్కుయాంక్షలున్ మాకొరకై విధింతురు ప్రమాదమనంచును బంధిసేతురే
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తు వచ్చెనే యీ కబడిన్గ నంగ మఱి యీ యది సంతస మొప్పె యిప్పుడున్భీ కర మైన యాట యిది వేగమె రమ్మిక రామజోగి !నే వేకువ జామునే యిటకు వేగమె వచ్చితి దీని జూడగన్
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు పల్లెటూరులో నాకును గుర్తు కున్నవిక నా తలిదండ్రులు నాదు బాగుకై చీకటి రోజులన్ గడిపి చింతలు నాదరి చేరకుండ నా వీకును గోరి వారు చదివించిరి యా ఋణ మెట్లు దీర్తునో !.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు సంతసంబుగన్ మ్రాకుల తోటలందిరిగి మక్కువ నూయలలూగి నంతపద్మాకర మందునీది విగతశ్రము లై ఘన మోదమొప్పగన్చీకటి క్రమ్మకుండనిలు చేరహముల్ మరు వంగ వచ్చునే
పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు, నాదు బాల్యమున్న్నా కనుమూసి గంత, లిక నత్తనకాయలు, నట్లతద్ది నా డా కికురింత యాటల విహారము లూయల లూపు నేస్తముల్ నాకిపు డిచ్చి, గైకొనుము నా సిరి సంపద సంప్రతిష్ఠలున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తురావె యాపేకలె లోకమంచు నదె వేడుక జేసెనె లాభమందినన్!పైకము పోయెనా వగచి వద్దని లేచెడుఁ జింతజేయవే?యేకడ పోయెనో నచటె యెంచెద నంచును నాశమైతివే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులున్ మఱచియాడిన రోజులు నేడురావుగా?సాకుల సంతసాన మనసందున జేరిన లక్ష్య సాధనాలోకము లాడురీతులు-తలోనొక మార్గములెంచి పంచగాదూకుడు నందు నాడుటన దోషముగాదది బాల్య బంధమే|
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'తలోనొక'.....?
ఆకలిదప్పులన్ మఱచి యాడిన రోజులు వచ్చిగుర్తుకున్నాకగుపించెసౌరికము నాటియమాయక బాల్యమందునన్శ్రీకరమైన పల్లెలను చేరెమనస్సు ముదమ్ముతోడుతన్సోకగ నేడు పట్టణపుసోకులు సంస్కృతి నాశమయ్యెగా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మరచి యాడిన రోజులు జేయునల్లరుల్కోకిల పాటతో సరిగ గొంతును గల్పిన తీపి సందడుల్చేకొని నాన్నవేలి కొస చింతనెరుంగని చిద్విలాసముల్శ్రీకర! వేడుకొందునిను చెన్నుగ నీయవె నాదు బాల్యమున్!!!
శైలజ గారూ, మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు తీపిగుర్తులై , తోకలు లేని కోతులయి తోటల గెంతిన యాటపాటలన్, నేకరు బెట్టుచున్ గడుపు నీనవ జీవపు పట్నవాసమున్,లోకము మారిబాల్యమది లోటుగ మారెను జీవనంబునన్
కవిశ్రీ సత్తిబాబు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మనలో మాట 🤫ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు పారిపోవగా నూకల కోసమే నమిలి నోట్సులు మింగగ యూనివర్స్టిలో ఆకలి తాళజాలకిక "అమ్మ"ను కొల్వగ ఖర్గపూరులో రూకలు చాలిచాలకయె రుక్మిణి వచ్చెను హాయిహాయిగా!!!
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు;...క్లబ్బునందునన్ మూకల జేరదీయుచును ముచ్చట లాడుచు ముద్దుముద్దుగా పేకలు కల్పి పంచుచును బీరును గ్రోలుచు బీడి పీల్చుచున్ పోకరు నాడు తోషమహ;...పోయెను పోయెను భార్య రాకతో
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు మర్చిపోయిరో
రిప్లయితొలగించండిచీకుయు చింతలేవి దరిజేరని బాలుర మంచెరుంగకన్
భీకర రూపమెత్తి యరివీరులు పెద్దలు మాటిమాటికిన్
కేకలు వేసిమమ్ములను కిమ్మననీయరు పెక్కుయాంక్షలున్
మాకొరకై విధింతురు ప్రమాదమనంచును బంధిసేతురే
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తు వచ్చెనే
రిప్లయితొలగించండియీ కబడిన్గ నంగ మఱి యీ యది సంతస మొప్పె యిప్పుడు
న్భీ కర మైన యాట యిది వేగమె రమ్మిక రామజోగి !నే
వేకువ జామునే యిటకు వేగమె వచ్చితి దీని జూడగన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు పల్లెటూరులో
రిప్లయితొలగించండినాకును గుర్తు కున్నవిక నా తలిదండ్రులు నాదు బాగుకై
చీకటి రోజులన్ గడిపి చింతలు నాదరి చేరకుండ నా
వీకును గోరి వారు చదివించిరి యా ఋణ మెట్లు దీర్తునో !.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు సంతసంబుగన్
రిప్లయితొలగించండిమ్రాకుల తోటలందిరిగి మక్కువ నూయలలూగి నంతప
ద్మాకర మందునీది విగతశ్రము లై ఘన మోదమొప్పగన్
చీకటి క్రమ్మకుండనిలు చేరహముల్ మరు వంగ వచ్చునే
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు, నాదు బాల్యమున్
రిప్లయితొలగించండిన్నా కనుమూసి గంత, లిక నత్తనకాయలు, నట్లతద్ది నా
డా కికురింత యాటల విహారము లూయల లూపు నేస్తముల్
నాకిపు డిచ్చి, గైకొనుము నా సిరి సంపద సంప్రతిష్ఠలున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తురావె యా
రిప్లయితొలగించండిపేకలె లోకమంచు నదె వేడుక జేసెనె లాభమందినన్!
పైకము పోయెనా వగచి వద్దని లేచెడుఁ జింతజేయవే?
యేకడ పోయెనో నచటె యెంచెద నంచును నాశమైతివే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులున్ మఱచియాడిన రోజులు నేడురావుగా?
రిప్లయితొలగించండిసాకుల సంతసాన మనసందున జేరిన లక్ష్య సాధనా
లోకము లాడురీతులు-తలోనొక మార్గములెంచి పంచగా
దూకుడు నందు నాడుటన దోషముగాదది బాల్య బంధమే|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'తలోనొక'.....?
ఆకలిదప్పులన్ మఱచి యాడిన రోజులు వచ్చిగుర్తుకున్
రిప్లయితొలగించండినాకగుపించెసౌరికము నాటియమాయక బాల్యమందునన్
శ్రీకరమైన పల్లెలను చేరెమనస్సు ముదమ్ముతోడుతన్
సోకగ నేడు పట్టణపుసోకులు సంస్కృతి నాశమయ్యెగా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆకలి దప్పులన్ మరచి యాడిన రోజులు జేయునల్లరుల్
రిప్లయితొలగించండికోకిల పాటతో సరిగ గొంతును గల్పిన తీపి సందడుల్
చేకొని నాన్నవేలి కొస చింతనెరుంగని చిద్విలాసముల్
శ్రీకర! వేడుకొందునిను చెన్నుగ నీయవె నాదు బాల్యమున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు తీపిగుర్తులై ,
రిప్లయితొలగించండితోకలు లేని కోతులయి తోటల గెంతిన యాటపాటలన్,
నేకరు బెట్టుచున్ గడుపు నీనవ జీవపు పట్నవాసమున్,
లోకము మారిబాల్యమది లోటుగ మారెను జీవనంబునన్
కవిశ్రీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మనలో మాట 🤫
రిప్లయితొలగించండిఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు పారిపోవగా
నూకల కోసమే నమిలి నోట్సులు మింగగ యూనివర్స్టిలో
ఆకలి తాళజాలకిక "అమ్మ"ను కొల్వగ ఖర్గపూరులో
రూకలు చాలిచాలకయె రుక్మిణి వచ్చెను హాయిహాయిగా!!!
ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు;...క్లబ్బునందునన్
రిప్లయితొలగించండిమూకల జేరదీయుచును ముచ్చట లాడుచు ముద్దుముద్దుగా
పేకలు కల్పి పంచుచును బీరును గ్రోలుచు బీడి పీల్చుచున్
పోకరు నాడు తోషమహ;...పోయెను పోయెను భార్య రాకతో