నేనొక పూలతోట కడ నిల్చితి నొంటరినై నిశీథినిన్ మేనున సెంటు పూసుకొని మేనకయే దిగి వచ్చునంచు గా నీ నరవాసనల్ తెలిసి నేతపు నీడ శయించు వేగి నా ప్రాణము దీయ వెంట బడె గ్రక్కున భీతిని నిద్ర లేచితిన్
గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘...అప్పు డాతడే| యాననమందునన్ నగవు...’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** వి.యస్.ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘సౌకుమార్యవిరులు’ అని సమాసం చేయరాదు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చింతనారతిన్’ అనండి (టైపాటు కావచ్చు). ‘మానస సంతస’మని సమాసం చేయరాదు. అక్కడ ‘మానస మందె సంతసము’ అందామా? ‘మేనలరే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మేనలరన్’ అంటే సరి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ముందు “మేనలరన్” అనే వ్రాసాను. “మానస సంతశంబొదవె” అనుమానము తో నే వ్రాసాను. సవరణ చేసిన పద్యమును తిలకించ గోర్తాను.
నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై ఘనమ్ముగన్ కానగ రాక నా చెలియ గంటలు గంటలు వేచియుండగా మానస మందునన్ కుమిలి మల్లెల మాటున దాగుచుండి నే తూనగ నొక్కటే గడియ దోమలు పీల్చెను రక్తమంతయున్
నేనొక పూలతోటకడ నిల్చితి నొంటరినై మనంబునన్
రిప్లయితొలగించండికానగ దోచెనాకపుడు గాలికినూయల లూగుసౌరులన్
పానము జేయనెంచెనట బంభరమందలి తేనెసోనలన్
పూనిక తోడవచ్చెనొకొ పూలసరాగము ప్రీతిజెందగన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పద్యరచన
రిప్లయితొలగించండి-------------------------*
గు రు మూ ర్తి ఆ చా రి
--------------------------*
నేనొక పూలతోట కడ. నిల్చితి నొ౦టరినై ; ప్రశా౦తమౌ
మానసికస్ధితిన్ బడసి : మ౦జుల శబ్దసుమాల. జల్లుచున్ ,
తేనియలొల్కు భావముల. తేట పడ౦గ. , సమస్యపూరణన్
బూని రచి౦చుచున్ కడు వినోదము గూర్చెద
ప౦డితాళికిన్ !
్
నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై శుభం బు గా
రిప్లయితొలగించండిధ్యానము జేయుచుం శివుని మానస మందున నప్పు డా తడు
న్నా నన మందునన్నగవు నంచిత రీతిని గన్పడం గనా
మా నసమందునన్మి మిగుల మాన్యత నొప్పెను నా క్షణం బునన్
పద్యరచన
రిప్లయితొలగించండి-------------------------*
గు రు మూ ర్తి ఆ చా రి
--------------------------*
నేనొక పూలతోట కడ. నిల్చితి నొ౦టరినై ; ప్రశా౦తమౌ
మానసికస్ధితిన్ బడసి : మ౦జుల శబ్దసుమాల. జల్లుచున్ ,
తేనియలొల్కు భావముల. తేట పడ౦గ. , సమస్యపూరణన్
బూని రచి౦చుచున్ కడు వినోదము గూర్చెద
ప౦డితాళికిన్ !
రిప్లయితొలగించండినేనొక పూలతోట కడ నిల్చితి నొంటరినై నిశీథినిన్
మేనున సెంటు పూసుకొని మేనకయే దిగి వచ్చునంచు గా
నీ నరవాసనల్ తెలిసి నేతపు నీడ శయించు వేగి నా
ప్రాణము దీయ వెంట బడె గ్రక్కున భీతిని నిద్ర లేచితిన్
నేనొక పూలతోట కడ నిల్చితి, నొంటరి నైతినంచు బా
రిప్లయితొలగించండిధానల దగ్ధమూర్తినయి తాపము నొంది సుగంధ సౌరభా
లీనెడు సౌకుమార్యవిరు లెంతటి సోయగ మొప్పుచున్నవో
కానని వాడనైతి మమకారము వీడి విరాగి నైతినే.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండినేనొక పూలతోటకడ నిల్చితి నొంటరినై చరింప నా
మానస దృష్టికిన్ నిలచె మంద్ర మనోహర పుష్ప వేదనా
గానము కావ్యమై కుసుమ కాంతకు కంఠము ఘంటసాలదై
వీనుల విందుగా పలుక ప్రేమగ జూచితి నాదరించితిన్
నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
రిప్లయితొలగించండిత్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతన్
మానస సంతశంబొదవె మల్లెల మొల్లలగంధమత్తరిన్
మేనలరే సువాసన సమేతపు మారుత తాడితంబునన్
నేనిక పూలమొక్కకడ నిల్చితి నొంటరినై తలంచుచున్
రిప్లయితొలగించండిమానసమందుసంతతము మామకుమార్తె పసందురూపమున్
వీనుల విందుచేయుకడు బేషగు మెత్తని భాషణమ్ములన్
తేనెలుగారుచున్న తన తెల్లని వాతెర సౌకుమార్యమున్
దీనుడనైననాకువన దేవతపోలెడు ఆమె దక్కునా!
గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...అప్పు డాతడే| యాననమందునన్ నగవు...’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్.ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘సౌకుమార్యవిరులు’ అని సమాసం చేయరాదు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చింతనారతిన్’ అనండి (టైపాటు కావచ్చు). ‘మానస సంతస’మని సమాసం చేయరాదు. అక్కడ ‘మానస మందె సంతసము’ అందామా? ‘మేనలరే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మేనలరన్’ అంటే సరి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ముందు “మేనలరన్” అనే వ్రాసాను. “మానస సంతశంబొదవె” అనుమానము తో నే వ్రాసాను. సవరణ చేసిన పద్యమును తిలకించ గోర్తాను.
రిప్లయితొలగించండినే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
త్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతిన్
మానస మందె సంతసము మల్లెల మొల్లలగంధమత్తరిన్
మేనలరెన్ సువాసన సమేతపు మారుత తాడితంబునన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండినే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై ఘనమ్ముగన్
కానగ రాక నా చెలియ గంటలు గంటలు వేచియుండగా
మానస మందునన్ కుమిలి మల్లెల మాటున దాగుచుండి నే
తూనగ నొక్కటే గడియ దోమలు పీల్చెను రక్తమంతయున్
నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై పసందుగన్
రిప్లయితొలగించండిజానకి రాకకై మిగుల జంబము మీరుచు వేచియుండగా
తేనెను త్రాగగోరి యొక దెయ్యపు టీగయె దూరగా చెవిన్
జానకి గీనకిన్ మరచి జంబము వీడుచు పారిపోయితిన్