7, అక్టోబర్ 2015, బుధవారం

సమస్యాపూరణం - 1809 (చీమ కుట్టెఁ జచ్చె సింహ మయ్యొ)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చీమ కుట్టెఁ జచ్చె సింహ మయ్యొ.

44 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఆరుసార్లు-అంటే దాదాపుగా ముప్పయు యేళ్ళుగా
  ఆ ఊరి కతడే ప్రెసిడెంటుకాని పాపం 7 వ సారి కొత్తగా
  పోటీ చేసిన ఓ యువకుని చేతిలో పరాజయం :

  01)
  _____________________________________________

  ఆరు సార్లు నేత - యా యూరు కతడేను
  తిరుగు లేని వాడు - దేశ మందు
  ఓడుపాటు నొందె - నో కొమరు వలన !
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________
  కొమరు = యువకుడు

  రిప్లయితొలగించండి
 2. భీష్ముని మరణానికి కారణం-అబల యైన అంబే గదా :

  02)
  _____________________________________________

  ఇచ్ఛతోడ జచ్చు - స్వచ్ఛంద మరణపు
  వరము గొనిన వాడు - మరణ మొంద
  నంబ గాదె నిలచె - నర్జునునకు ముందు
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 3. గురువు గారికీ ....సుకవి మిత్రులకు నమస్సుమాంజలులతో....

  కంస ఘస్మరుండు ఖలురాక్షసుల జంపి
  బోయవాడి శరపు పోటు తోడ
  పరమ పదము నొందె వాసుదే వుని గాంచ
  చీమ కుట్టె జచ్చె సింహ మయ్యొ.

  రిప్లయితొలగించండి
 4. వీరాధి వీరుడైన అభిమన్యుని చావుకు కారణం - సైంధవుడేగా !

  03)
  _____________________________________________

  వీరులందు మేటి - వీరాభిమన్యుడే
  వ్యూహ పద్మ బలుల - సంహరించి
  చావు నొందె గాదె - సైంధవు వలననే !
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 5. చెవులపిల్లి తెలివియే - సింహరాజు మరణం

  04)
  _____________________________________________

  చెవులపిల్లి జెప్ప - సింహంబు వేరని
  సింహరాజు దూకి - చెరువునందు
  శశపు తెలివి జేత - శవమైన గతి గన
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________
  చెరువు = బావి

  రిప్లయితొలగించండి
 6. కపటద్యూత విశారదుడు శకునే గదా - పాండవుల కష్టముల క్కారణం :

  05)
  _____________________________________________

  భీకర వన మేగి - భీమ సోదరుడైన
  నిత్య సత్య ధర్మ - నిర్మలుండు
  సంకటముల జిక్కె - శకుని వలన గాదె
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 7. పరిమాణంలో పూతనతో పోలిస్తే - చిన్ని కృష్ణుడు చీమే :

  06)
  _____________________________________________

  స్తనము బీల్చి ప్రాణ - మును గూడ హరియించె
  చేత వెన్న దినెడి - చిన్నవాడు
  పొలసు జేయ బూను - పూతన గతి గన
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 8. బ్రిటిషు వారితో పోరాటం మొదలు పెట్టినపుడు - గాంధీ - చీమకన్నా అల్పం :

  07)
  _____________________________________________

  రవియె యస్తగతుడు - రాజ్యమున్ గానట్టి
  బ్రిటిషు తోడ పోరి - విజయ మందు
  చీమ కన్న చిన్ని - యా మహాత్ముని గన
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 9. ఉభయభారతితో పోలిస్తే - శంకరుడు- కామశాస్త్రంలో - చీమకన్నా అల్పాతి అల్పం :

  08)
  _____________________________________________

  కామశాస్త్ర మందు - కాక్కాల నెరుగక
  పొంది శంకరుండు - స్కందు బొంది
  ఉభయ భారతి నట - నోడించు వగ గన
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  స్కందుడు = రాజు
  ఉభయ భారతి = మండనమిశ్రుని భార్య
  వగ = ఉపాయము
  *****

  మండన మిశ్రునితో తర్క గోష్ఠి[మార్చు]
  మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో

  వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు.

  శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన

  స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు.

  తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని

  లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ

  స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి

  మధ్యవర్తి గా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి,

  వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది.

  వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటి కి మండనమిశ్రుని మెడలోని మాల

  ఒడిలిపోయింది. కాని, భర్త శరీరం లో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త

  ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో

  చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు

  చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ

  పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరుడు వాటిని గురించి

  తెలుసుకొనే ఉద్దేశ్యంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగాడు.

  కామరూపవిద్య[మార్చు]
  శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో

  తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు

  భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద, ప్రీతి, రతి, దృతి, కీర్తి, మనోభవ, విమల,

  మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి

  తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన

  ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా

  స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.

  see more@
  https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF_

  %E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A

  %E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF

  %E0%B1%81%E0%B0%B2%E0%B1%81

  రిప్లయితొలగించండి
 10. విశ్వ మంత కొలిచె వేలుపు కలియుగ
  సాయి యంచు భక్తి సంత సమున
  ఉప్పు తిన్న జనులె తిప్పలెన్నొ బెట్టె
  చీమ కుట్టెఁ జచ్చె సింహ మయ్యొ

  రిప్లయితొలగించండి


 11. *****

  లవకుశుల చేతిలో లక్ష్మణుని ఓటమి :

  09)
  _____________________________________________

  ఇంద్రజిత్తు గడపె - నిక్ష్వాకు తిలకుండు
  చిన్న లవుడు, కుశుల - చేత నోడి
  యశ్వమేధ హయము - నర్పించుటను విన
  చీమ కుట్టి జచ్చె - సింహ మయ్యొ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  "మీ తొమ్మిది పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో 'ఒక' ను 'ఓ' అన్నారు. 'ఒక కొమరు వలన' అనండి.
  మూడవ పూరణ రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. 'వ్యూహ పద్మబలుల సంహరించి' అనండి.
  ఏడవ సమస్య మొదటి పాదాన్ని 'రవియె క్రుంగనట్టి రాజ్యమ్ము గలిగిన' అనండి.
  ఎనిమిదవ పూరణలో 'కాఖాల నెరుగక' అనండి.
  ******
  వి. యస్. ఆంజనేయులు శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని అన్వయలోపం ఉన్నట్టుంది.

  రిప్లయితొలగించండి
 13. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱకు నమస్సులు!

  శంకరయ్యగారూ,

  వసంతకిశోర్ గారి మూఁడవ పద్యమందలి రెండవపాదమునకై మీరు సూచించిన సవరణమునఁ బ్రాసయతికి భంగము తొలఁగలేదు. "ప్రమాదో ధీమతా మపి!". దానిని..."వ్యూహపద్మబలుల యుక్కడంచి/నుత్తరించి" యనిన నెట్లుండును?

  రిప్లయితొలగించండి
 14. సుకవి మిత్రులు శ్రీ వసంత కిశోర్ గారి పూరణము లన్నియును యుక్తి సహముగ నుండి యలరారుచున్నవి. వారికి నా యభినందనలు! స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. బలము గలిగి నట్టి బలిచక్రవర్తిని
  దానగుణమెరిగియు తంతు నడిపి
  పాదముంచి తలను వామన మూర్తియౌ
  చీమ కుట్టెఁ! జచ్చె సింహమయ్యొ!

  రిప్లయితొలగించండి
 16. కన్న మందు నేను కరమును బెట్టగ
  చీమ కుట్టె ,జచ్చెసింహ మయ్యొ
  రోగ బారి నబడి రోదుచు జంతు ప్ర
  దర్శన తల మందు దారు ణ ముగ

  రిప్లయితొలగించండి
 17. బబ్రువాహనుని చేతిలో అర్జునుడు పరాజితుడగునపుడు
  పార్థు డంత వాడె బవరాన పోరాడి
  నిలువ నీడ లేక నోటమి నట
  గాంచ వలసి వచ్చె కన్నకొడుకు చేత
  చీమ గుట్టి జచ్చె సింహమయ్యొ.

  రిప్లయితొలగించండి
 18. అద్భుతములఁ జూపునట్టి చలనచిత్ర
  మందు దృశ్య గ్రహణ యంత్రములు వి
  చిత్ర సంఘటనలఁ జిత్రించ రక్కసి
  చీమ కుట్టఁ జచ్చె సింహ మయ్యొ.

  రిప్లయితొలగించండి
 19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *******
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'రోగబారి' అనరాదు కదా. 'రోగపీడిత మయి' అనండి.
  ******
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది. 'యుద్ధతుడయి కూడ' అనండి.

  రిప్లయితొలగించండి
 20. Sankarayya gaaru, ivalti poorana mariyu padya rachana oke bhavamu vachu vidhamuga raasanu..

  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ------------------------------

  ఎ౦త సుదిన మిద్ది యేమని వర్ణి౦తు

  బాగుపడు నిక మన ప్రా౦త మెల్ల

  ఓడె మహిళ చేత. రౌ డి , యెన్నిక ల౦దు

  చీమ కుట్టె --చచ్చె సి౦హమయ్యొ
  ...............................

  రిప్లయితొలగించండి
 21. కారడవినతనికి కన్పట్టె సింహంబు
  వేసె భీతి వేగ విష భరితపు
  బాణ మంత, పదము పట్టి తను నకట
  చీమ కుట్టెఁ, జచ్చె సింహ మయ్యొ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 22. శ్రీగురుభ్యోనమః

  మర్త్య లోకమందు మరణము నొందగా
  కారణములు పెక్ము కలవు, కాన
  నాయువంత దీర యమపాశ రూపమై
  చీమ కుట్టెఁ జచ్చె సింహ మయ్యొ

  రిప్లయితొలగించండి
 23. కలసిరానివేళ గాడిద తోకయే
  యహిగమారి చంపు ననుటనిజము
  పెద్దనేత యోడె చిన్నవాని నెదిరి
  చీమకుట్టిచచ్చె సింహమయ్యొ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది అభినందనలు.

   తొలగించండి


 24. తాను కుట్ట గానె ప్రాణము పోవగ
  వరముపొంది త్వరగ హరిముఖమున
  చీమ కుట్టె.జచ్చె.సింహ మయ్యొ!యనుచు
  బాధపడెను చిన్నప్రాణి చావ

  రిప్లయితొలగించండి
 25. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. శ్రీమతి సువర్ణ ల క్ష్మి

  నా స౦దేహములు తీర్చగలరు

  " వాక్యా౦తమ౦దు మ. స౦ది చేయ కున్న దోషము లేదు "
  అని కొ౦దరి అభిప్రాయము ;
  పద్యము మధ్యలోవాక్యా౦తమున
  మన౦ అలా స౦ధి చేయకు౦డా కొనసాగి౦చ వచ్చా ?

  జీవము + లు -జీవాలు
  ప్రాణము +లు -ప్రాణాలు

  కదా ! కొ౦దురు జివాల్ అని ప్రాణాల్ అని ప్రయోగిస్తు౦టారు
  మరి ఇలా అన వచ్చా ?

  వచ్చినాడు , వెళ్ళినాడు చేసినాడు , చూసినాడు
  ఇలా౦టివి సాధుప్రయోగము లేనా ?  .

  రిప్లయితొలగించండి
 27. సువర్ణ లక్ష్మి గారూ,
  పద్యంలో పాదాంతంలో వాక్య మంతమైతే తరువాతి పాదాన్ని అచ్చుతో ప్రారంభిస్తే దోషం లేదు. కాని పాదం మధ్యలో వాక్యం పూర్తయినపుడు మరో వాక్యాన్ని అచ్చుతో ప్రారంభించ రాదు.
  జీవములు, జీవాలు; ప్రాణములు, ప్రాణాలు ఇలా రెండు రూపాలను ప్రయోగించవచ్చు.
  వచ్చినాడు సాధువే. కాని వెళ్ళినాడు అనేది వ్యావహారికం. దీనిని పద్యంలో ప్రయోగించరాదు. వెడలినాడు అనడం సరియైనది.

  రిప్లయితొలగించండి
 28. వమస్కారములండి."
  యుద్ధతుడయికూడ"అంటే ఓ గణం ఎక్కువవుతుందండి'.యుద్ధతుడయి'అంటే సరిపోతుందా తెలుసగలరు.ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  నరుని జన్మనెత్తి నారాయణుడు భువి
  దుష్ట రక్కసులను దునిమి పిదప
  చిన్నవేటగాని చేతజిక్కుచు గూలె
  చీమకుట్టె జచ్చె సింహమయ్యొ

  రిప్లయితొలగించండి
 30. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  నరుని జన్మనెత్తి నారాయణుడు భువి
  దుష్ట రక్కసులను దునిమి పిదప
  చిన్నవేటగాని చేతజిక్కుచు గూలె
  చీమకుట్టె జచ్చె సింహమయ్యొ

  రిప్లయితొలగించండి
 31. మిత్రులందఱకు నమస్సులు!

  "చీమ వీవు! నేను సింహమ్ము!" నంచును
  మహిషుఁ డపుడు పలికి, ’మహిత శక్తిఁ’
  దూలనాడ; శక్తి, దుర్జనుం జంపెను!
  చీమ కుట్టెఁ! జచ్చె సింహ మపుడు!!

  రిప్లయితొలగించండి
 32. వమస్కారములండి."
  యుద్ధతుడయికూడ"అంటే ఓ గణం ఎక్కువవుతుందండి'.యుద్ధతుడయి'అంటే సరిపోతుందా తెలుసగలరు.ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 33. వేనవేల జనుల భేదించు వీరుండు
  యువతి ప్రేమదగిలి యోడిపోవ
  సృష్టిసహజమైన చిత్రప్రేమ యనెడు
  చీమకుట్టె!జచ్చె సింహమయ్యొ!!

  రిప్లయితొలగించండి
 34. శంకరయ్యగారూ!

  తొందరపాటున నేను సమస్య పాదాంతమున "...సింహ మయ్యొ!" కు బదులుగ "...సింహ మపుడు!" నని టైపుచేసితిని. దానిని "చీమకుట్టెఁ! జచ్చె సింహ మయ్యొ!!" యని పఠించఁగలరని మనవి.

  -గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి
 35. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  ‘...యుద్ధతుడయి కూడ యోటమి నట’ ఇందులో గణదోషం ఎక్కడుంది?
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దుష్టరాక్షసులను’ అనండి.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 36. ఉత్తమమైన సవరణలు సూచించిన
  శంకరార్యులకు మరియు
  గుండు మధుసూదన్ గారికి
  ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి