మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు మా మనవి విని "శంకరాభరణమ్ము"ను మఱల ప్రారంభించినందులకుఁ గృతజ్ఞుఁడను! తమ మనవిని తమ తమ వ్యాఖ్యల ద్వారమునఁ దెలిపి, బ్లాగు పునఃప్రారంభమునకు సహకరించిన మిత్రులందఱకు నమస్సులు!!
శంకరార్యా ! వందనములు ! మిత్రులందరి కోరికపై మీరు మీ నిర్ణయమును సమీక్షించుకొని బ్లాగును కొనసాగించుట ఎంతయో ముదావహము ! మిత్రులందరి తరఫున మీకు ధన్యవాద శతములు
వసంత కిశోర్ గారూ- గురువుగారిని గూర్చి చక్కని పద్యములు వ్రాశారు.రెండు చోట్ల గణములు తప్పాయి. సంత సింప(గ) చేయు సాధు మూర్తి - అనవరమును/ అనవరతమ్ము తుష్టి నడుపు మేటి -అంటే బగుంటుందేమో.
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది.అభినందనలు. ***** వసంత కిశోర్ గారూ, ధన్యవాదాలు. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, ధన్యవాదాలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులారా! ఈ జరిగిన ఉదంతమెల్ల ఆలశ్యంగా గమనించినాను. శ్రీ కంది శంకరయ్య గారి అజాతశత్రుత్వానికి , వారి సౌజన్యానికి ఎదురైన పరీభావము బాధాకరం. శ్రీ కామేశ్వర శర్మ గారిచ్చట రచన సేయు కవుల గురించి 'మూకుమ్మడిగా' అన్న మాటలు అస్మదాదులకు కూడా ములుకుల వలె తాకునవే ! ఇది ఆవేదన కారకం. వారీ మాటలు అని ఉండకూడనివి. అయితే ఆ తరువాత దానికి ప్రతిస్పందన వెలిబుచ్చుతూ ఇటువైపు నుండి కొందరు కవి మిత్రుల మాటలు కూడా అదే ధోరణిలో ఉంటున్నాయి. ఇంకొందరి మాటల్లో ' నిందా ధోరణి ' మోతాదు కొంచెం ఎక్కువగనే ఉంది. ఇది సరస్వతీ నిలయం. ఇచ్చట పరస్పర నిందారోపణలు శ్రుతి మించుట మంచిది కాదు. శ్రేయోదాయకమూ కాదు. శాంతి వహించిన మేలు !
వారూ వీరూ ఇకనైనా- ' మాట జారితే వెనక్కి తీసుకోలేమని ' గ్రహింపగలరు.
శాంతి వహింపఁగా వలయు స్వస్తి వచించుచు వారు వీరు - దు ర్దాంత వచః ప్రకంపనము రాణకునెక్కదు మిత్రులార! ని శ్చింతఁ గవిత్వ తత్వ పద సేవఁ జరించెడు చోట గర్వ వి క్రాంతము మేలు గాదిది , సరస్వతి మెచ్చదు నిశ్చయంబుగాన్ !"
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, సంతోషం! ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, వసంత కిశోర్ గారి పద్యంలో గణదోషం లేదు. అవి సీసపాదాలు. మీరు ఆలటవెలది పాదలనుకొని పొరబడ్డారు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు. మీ సూచనను బ్లాగు మిత్రులకు తెలియ జేస్తాను.
గురువుగారు, ఇప్పుడే బ్లాగు చూసి విషయమంతా తెలిసి ఎంతో బాధ కలిగినది. మంచి పండితులంతా మంచి గురువులు కాలేరు. కానీ ఒక మంచి గురువు ఎందరో పండితులను తయారుచేయగలరు. పండితులతో పాటు (తడబడుతూ వ్రాయడం నేర్చుకుంటున్న) మా వంటివారికి మీరు గురువులనడంలో మాకెంత మాత్రమూ సందేహము లేదు. శ్రేయోభిలాషులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్న ప్రస్తావన కూడా సంతోషకరమైనది.
తెలివి గలిగె నేని తీయతేనియ మాట
రిప్లయితొలగించండిపలికి జనుల నెత్తి పగుల గొట్టు
తెలిసి చదివి నంత తేటతెల్లము జేయు
తెలివి లేని వాఁడె దేశి కుండు
సెలవును పునస్సమీక్షించినందులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండికూరుచుండినట్టి కొమ్మను నరుకుగా!
తెలివి లేనివాడె; దేశికుండు
ప్రజకు మంచిచెడ్డ పలికి,మేలొనగూర్చు
కోరు జనుల హితము కొల్లలుగను
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు మా మనవి విని "శంకరాభరణమ్ము"ను మఱల ప్రారంభించినందులకుఁ గృతజ్ఞుఁడను! తమ మనవిని తమ తమ వ్యాఖ్యల ద్వారమునఁ దెలిపి, బ్లాగు పునఃప్రారంభమునకు సహకరించిన మిత్రులందఱకు నమస్సులు!!
రిప్లయితొలగించండి(అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలోని యిందీవరాక్షుని వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)
వైద్య విద్యఁ గొనఁగ బ్రహ్మమిత్రునిఁ జేరి,
యడిగి, భంగపడియు, నటమటమున
విద్యఁగొని హసింప, విని, శపించెను ముని!
తెలివి లేనివాఁడె, దేశికుండు?
శంకరార్యా ! వందనములు !
రిప్లయితొలగించండిమిత్రులందరి కోరికపై
మీరు మీ నిర్ణయమును సమీక్షించుకొని
బ్లాగును కొనసాగించుట ఎంతయో ముదావహము !
మిత్రులందరి తరఫున మీకు ధన్యవాద శతములు
కవి మిత్రులకు నమస్కారములతో .....-
రిప్లయితొలగించండి----
జయమును బలుకగ వలయును
దయతో నిక శంకరార్యు దత్పురుషునకు
న్లయకారుని గృప వలనన
జయమున్సా ధించు కతన సాకాం క్షత తోన్
విద్యఁ గరిపెదనని విద్యార్థులను ముంచు
రిప్లయితొలగించండితెలివి లేని వాడె దేశికుండు
మంచిమనసు తోడ పంచుచు విద్యను
నిలుచు ప్రజల మదిని నిశ్చలముగ
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
చేయి పట్టి నడిపించే వాడే -మార్గదర్శకుడు-గురువు-దేశికుడు :
01)
________________________________________
కరము పట్టి నడుపు - కరదీపికై వెల్గు
దారి తప్పి నపుడు - దరికి జేర్చు !
పద్య రచన యన్న - ప్రాణంబు వెట్టుచు
పట్టువిడుపు నేర్పు - పండితుండు !
సొంత పనులు మాని - సొంపుగా శిష్యుల
సంతసింపగ జేయు - సాధు మూర్తి !
కష్టంబు లెదురైన - నిష్టంబుగా బ్లాగు
ననవరతంబును - నడుపు మేటి !
తెలుగు భాషకు నిల - వెలుగుల సమకూర్చ
తెల్లవారక ముందె - యుల్లసించి
శంకరాభరణపు - సంసేవ యే లోక
సేవగా దలచెడి - సేవ్యుడైన
సకల సద్గుణుండు - శంకరార్యుండు, తా
తెలివి లేని వాడె ???- "దేశికుండు"
________________________________________
కపట యతులు చెప్పు కల్లమాటలనమ్మి
రిప్లయితొలగించండిమోస పోవు నట్టి మూర్ఖుడిలన
తెలివి లేని వాడె, దేశికుండు పిలిచి
మంచి జెప్ప నేమి? మారబోడు
చేసి నట్టి పనిని స్థిర యశములనీయ
రిప్లయితొలగించండిపూర్తి చేయు వాఁడె స్ఫూర్తి దాత!
తెలివి లేని వాఁడె? దేశికండు
బాధ్యతెఱిగి నేడు బ్లాగునడిపె!
అందరి కోరికను మన్నించి బ్లాగును కొనసాగిస్తున్నందులకు గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ- గురువుగారిని గూర్చి చక్కని పద్యములు వ్రాశారు.రెండు చోట్ల గణములు తప్పాయి. సంత సింప(గ) చేయు సాధు మూర్తి - అనవరమును/ అనవరతమ్ము తుష్టి నడుపు మేటి -అంటే బగుంటుందేమో.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది.అభినందనలు.
*****
వసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముష్కరులను నమ్మి మోసపో యెడి వాడు
రిప్లయితొలగించండితెలివి లేని వాడె , దేశి కుండు
తనదు శిష్య గణము దనరారు నట్లుగ
బోధ జేయు నెపుడు భూరి గాను
వి. యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కళ్ల కపటి గాని కర్షకు డొక్కడు
రిప్లయితొలగించండిపంట నమ్మి వేడ్క పట్న మేగె
మ్రుచ్చు నోటఁ విత్తు బోయె నౌర బ్రదుకఁ
దెలివి లేనివాఁడె దేశికుండు.
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికి నమస్కారములు.
రిప్లయితొలగించండితెలియకున్నగాని తెగనీల్గుజీవుడు
తెలియదగినవాన్ని దెలిసికొనక;
తెలియదగినవాన్ని దెలిసికొన్నపిదప
తెలివిలేనివాడె దేశికుండు.
తెలివిలేని=సామాన్యఙ్ఞానమునువిడిచినవాడై.[అనగాప్రఙ్ఞానముతో]
అందరికి నమస్కారములు.
రిప్లయితొలగించండితెలియకున్నగాని తెగనీల్గుజీవుడు
తెలియదగినవాన్ని దెలిసికొనక;
తెలియదగినవాన్ని దెలిసికొన్నపిదప
తెలివిలేనివాడె దేశికుండు.
తెలివిలేని=సామాన్యఙ్ఞానమునువిడిచిన.[అనగాప్రఙ్ఞానముతో]
తిట్టువారినైన తిట్లతో నెదిరించి
రిప్లయితొలగించండినోరుమూయుమంచు నొవ్వజేసి
తోకముడిచిపోవ దుయ్యబట్టెడు నట్టి
తెలివిలేనివాడు (యీ) దేశికుండు.
మిత్రులారా! ఈ జరిగిన ఉదంతమెల్ల ఆలశ్యంగా గమనించినాను. శ్రీ కంది శంకరయ్య గారి అజాతశత్రుత్వానికి , వారి సౌజన్యానికి ఎదురైన పరీభావము బాధాకరం. శ్రీ కామేశ్వర శర్మ గారిచ్చట రచన సేయు కవుల గురించి 'మూకుమ్మడిగా' అన్న మాటలు అస్మదాదులకు కూడా ములుకుల వలె తాకునవే ! ఇది ఆవేదన కారకం. వారీ మాటలు అని ఉండకూడనివి. అయితే ఆ తరువాత దానికి ప్రతిస్పందన వెలిబుచ్చుతూ ఇటువైపు నుండి కొందరు కవి మిత్రుల మాటలు కూడా అదే ధోరణిలో ఉంటున్నాయి. ఇంకొందరి మాటల్లో ' నిందా ధోరణి ' మోతాదు కొంచెం ఎక్కువగనే ఉంది. ఇది సరస్వతీ నిలయం. ఇచ్చట పరస్పర నిందారోపణలు శ్రుతి మించుట మంచిది కాదు. శ్రేయోదాయకమూ కాదు. శాంతి వహించిన మేలు !
రిప్లయితొలగించండివారూ వీరూ ఇకనైనా- ' మాట జారితే వెనక్కి తీసుకోలేమని ' గ్రహింపగలరు.
"బాకీ కద్దని తారతమ్యముల సంభావింపకే వీపుపై
బాకున్ గ్రుచ్చిన రీతి నాడదగునే? భావ్యమ్మె? యీ వేదికన్
లోకాతీత కవిత్వమున్ నిలుప నాలోచించు నీ యొజ్జకున్
బాకీవడ్డదిపో తెలుంగు ధర , యబ్రంబేమి యోచింపగన్?
' ఇచటన్ వ్రాసెడు వారలందరును నిట్లే... ' యన్న వాక్యమ్ములో
బచరించున్ గద పెన్ దురర్థము - రసంబా ? శబ్దమా ? శయ్యయా ?
రచనా ప్రౌఢిమమా? కథా కథనమా ? ప్రత్యగ్ర భావోన్నత
ప్రచయంబా? ధ్వనియా ? యలంకృతియ? లోపంబేమి మా కైతలో?
విశ్వహితమ్ముఁ గోరుచుఁ - గవి వ్రజముల్ దలలూచి మెచ్చఁగా
నీశ్వర సత్కృపన్ కృతులనింతకు మున్నె రచించినారు కా
మేశ్వర శర్మ ! నేటికిది యేమిటి? యీ వచనంబులేలయా?
శాశ్వత కీర్తి కారణమె ? సంతసమౌనె బుధాళి కిద్ధరన్ ?
పన్నుగఁ దెల్గులో మధుర పద్యములెన్నొ రచించువాఁడ వో
యన్న! తిరస్కరించుటకునై యిటు పల్కుల రిత్తఁ బుచ్చగా
వన్నెకునెక్కునే? జగతి వాసి లభించునె? మాట మెత్తనై
మన్ననలందుకోవలయు! మాలిమిఁ దాలిమిఁ దాల్పఁగా వలెన్!
శాంతి వహింపఁగా వలయు స్వస్తి వచించుచు వారు వీరు - దు
ర్దాంత వచః ప్రకంపనము రాణకునెక్కదు మిత్రులార! ని
శ్చింతఁ గవిత్వ తత్వ పద సేవఁ జరించెడు చోట గర్వ వి
క్రాంతము మేలు గాదిది , సరస్వతి మెచ్చదు నిశ్చయంబుగాన్ !"
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఅంతరాత్మ నెరుగ నాధ్యాత్మ చింతతో
ధ్యాన చిత్తుడగుచు దపము జేయ
బాహ్య సృష్టి లోని భవ భందముల గూర్చి
తెలివి లేనివాఁడె దేశికుండు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిసంతోషం!
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
వసంత కిశోర్ గారి పద్యంలో గణదోషం లేదు. అవి సీసపాదాలు. మీరు ఆలటవెలది పాదలనుకొని పొరబడ్డారు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. మీ సూచనను బ్లాగు మిత్రులకు తెలియ జేస్తాను.
రిప్లయితొలగించండికొరవితోడ తలను గోకుకొనెడివాడు
తెలివి లేని వాడు.దేశికుండు
తనకు మాలినట్టి ధర్మము వలదని
గరపువాడు శిష్య గణము కొరకు
రిప్లయితొలగించండికొరవితోడ తలను గోకుకొనెడివాడు
తెలివి లేని వాడె.దేశికుండు
తనకు మాలినట్టి ధర్మము వలదని
గరపువాడు శిష్య గణము కొరకు
అక్టోబర్ 03, 2015 3:14 [PM
కెంబాయి తిమ్మాజీ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
తొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
సత్కవి విష్ణునందనుని సద్ధితమెంతయు మేలుగూర్చు శ్రీ
రిప్లయితొలగించండిసత్కృపగోరి యందరము చక్కగ పద్యసుమాల దేవికిన్
సత్కృతులన్ పొనర్చి మన జన్మలు సార్థకమై తితిక్షకున్
హృత్కమలమ్ము లిక్కువయి యింపొదవంగచరింత మెన్నడున్.
గురువుగారు,
రిప్లయితొలగించండిఇప్పుడే బ్లాగు చూసి విషయమంతా తెలిసి ఎంతో బాధ కలిగినది.
మంచి పండితులంతా మంచి గురువులు కాలేరు.
కానీ ఒక మంచి గురువు ఎందరో పండితులను తయారుచేయగలరు.
పండితులతో పాటు (తడబడుతూ వ్రాయడం నేర్చుకుంటున్న) మా వంటివారికి మీరు గురువులనడంలో మాకెంత మాత్రమూ సందేహము లేదు.
శ్రేయోభిలాషులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్న ప్రస్తావన కూడా సంతోషకరమైనది.
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
19:28
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
19:28
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
.తెలివియున్నవాడు విలువైన విద్యను
రిప్లయితొలగించండిఅమ్మజూచినపుడునధముడేగ
తెలివిలేనివాడి దేశికుండనదగు
నేటికాలమందు నెగడు విద్య.{గురువుగారికి వందనాలతోమీరుమరల
సమస్యాపూరణప్రారంబించి నందుకుచాలాసంతోషము}
.తెలివియున్నవాడు విలువైన విద్యను
రిప్లయితొలగించండిఅమ్మజూచినపుడునధముడేగ
తెలివిలేనివాడి దేశికుండనదగు
నేటికాలమందు నెగడు విద్య.{గురువుగారికి వందనాలతోమీరుమరల
సమస్యాపూరణప్రారంబించి నందుకుచాలాసంతోషము}
.తెలివియున్నవాడు విలువైన విద్యను
రిప్లయితొలగించండిఅమ్మజూచినపుడునధముడేగ
తెలివిలేనివాడి దేశికుండనదగు
నేటికాలమందు నెగడు విద్య.{గురువుగారికి వందనాలతోమీరుమరల
సమస్యాపూరణప్రారంబించి నందుకుచాలాసంతోషము}
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*****
లక్ష్మీదేవి గారూ,
ధన్యవాదాలు.
మీరు సీతాఫల్ మండి అవధానానికి వస్తారనుకున్నా. కోడిహళ్ళి మురళీమోహన్ గారు కలిశారు. మిగతా అందరూ కొత్త వల్లే.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండితెలియ జెప్పె దనుచు దిమ్మరి యైదిర్లు
తెలివిలేని వాడె ;దేశికుండు
భూరి దయను జూపి కూరిమి జ్నానమ్ము
పంచు శిశ్యతతికి కొంచ మైన
అంత తనకు తెలుసు ననుకొనుచు చెడును
రిప్లయితొలగించండితెలివి లేని వాడు;దేశికుండు
ఛాత్రులకు ప్రగతిని సమకూర్చు ధరలో
ఖ్యాతి నందు చుండు కల్ల కాదు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. 'ధరలోన' అంటే సరి.
టైపాటండి సవరిస్తాను.ధన్యవాదాలండీ .
రిప్లయితొలగించండి