1, అక్టోబర్ 2015, గురువారం

సమస్యాపూరణం - 1804 (ద్రుపదరాజకన్య ద్రోణు వలచె)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ద్రుపదరాజకన్య ద్రోణు వలచె.
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

43 కామెంట్‌లు:

 1. పార్ధు గాంచి నంత భర్తగా పొందెను
  ద్రుపద రాజ కన్య , ద్రోణు వలచె
  కృపిని సతిగ పొందె కృపాచార్యు భగిని
  రాజ గురువు గాన భాజ నుండు

  రిప్లయితొలగించండి
 2. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కొంత అన్వయలోపం... మూడవపాదంలో గణభంగం... ‘కృపుని భగినియైన కృపి యనెడు తరుణి’ అందామా?

  రిప్లయితొలగించండి
 3. మిత్రులందఱకు నమస్సులు!

  (విద్యాభ్యాసము ముగిసినంతఁ దన రాజ్యమునకు వెడలిన ద్రుపదుఁడు, ద్రోణుని వృత్తాంతము నొక వేగు వలనఁ దెలిసికొను సందర్భము)

  గురువు నొద్ద విద్య గుఱు తెఱింగిన యంతఁ,
  గృపి యను నొక ఘన సుకృతి, కృపు స్వస,
  ద్రోణు ఘనత నెఱిఁగి, ద్రోణుఁ బెండ్లాడంగ
  ద్రుపదరాజ! కన్య ద్రోణు వలచె!!

  రిప్లయితొలగించండి
 4. గుండు మధుసూదన్ గారూ,
  ‘ద్రుపదరాజ’ శబ్దాన్ని సంబోధనగా చేసి చక్కని విఱుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. పార్థు పతిగ బొంది పరిణయమ్మాడె తా
  ద్రుపద రాజ కన్య; ద్రోణు వలచె
  కృపుని చెల్లెలైన కృపియు ముదముతోడ
  బాసె రణము నందు పతిని సుతుని.

  రిప్లయితొలగించండి
 6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. శతముఖసుతుని పెండ్లాడె సంతసముగ
  ద్రుపదరాజకన్య, ద్రోణువలచె
  కర్ణుడు తనకు విలువిద్యఁ గరుప మనుచు
  నొప్పుకొనక గురువు వానిఁ ద్రిప్పిపంపె

  రిప్లయితొలగించండి
 8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘శతమఖ’ టైపాటు వల్ల ‘శతముఖ’ అయినట్టుంది.

  రిప్లయితొలగించండి
 9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  నేను గమనించనే లేదు... సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు.
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ఇందులోనూ ‘శతమఖ’ను ‘శతముఖ’ అన్నారు.

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులకు నమస్సులు. పొరపాటుగా ఆటవెలదిని తేటగీతి అనుకొని వ్రాశాను. సవరించిన పద్యం.
  శతమఖసుతునిఁగొనె సంతసమడరగా
  ద్రుపదరాజకన్య, ద్రోణువలచె
  కరపగ విలువిద్య కర్ణుడు భక్తితో
  నొప్పుకొనక గురువు ద్రిప్పిపంపె

  రిప్లయితొలగించండి
 11. పంచ పాండవులకు పత్నిగా తానయ్యె
  ద్రుపద రాజ కన్య , ద్రోణు వలచె
  భార్య కృపిని,సుతుని,బలరిపుతనయుని
  కూర్మి తోడ జూచె కుంభజుండు !!!

  రిప్లయితొలగించండి
 12. గురుమూర్తి ఆచారి పూరణ....

  (అర్జునుడు ద్రౌపదితో)

  స౦గరమున నేడు స౦క్షోభ మయ్యెను
  ద్రుపదరాజకన్య! ద్రోణు వలచె
  విజయకా౦త యనుచు ప్రేలిరి కౌరవుల్
  దీని నెటుల. శౌరి తీర్చగలడొ!!

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ద్రోణు వలచె| కృపియె...’ అనండి.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా !
  వందనములు !

  ప్రతిభ ఎవరి సొత్తూ కాదు
  తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడూ ఉంటాడు
  తప్పులు చెయ్యని వారెవరైనా ఈ భూమి మీద ఉన్నారా
  ఆదికవి నన్నయ్య కన్నా ప్రతిభావంతుడు పుట్టాడే అనుకోండి
  నన్నయ్య కవిత్వంలో కూడా తప్పులు పట్టగలుగుతాడు

  మీరేమీ తెలు గు భాషను ఉద్ధరిస్తున్నానని కానీ
  పద్యరచన నేర్పిస్తానని గానీ
  ఎక్కడా ఎప్పుడూ ఎవరికీ ప్రకటించ లేదు

  మీ మానాన మీ బ్లాగులో మీకు నచ్చిదేదో మీరు ప్రకటించుకొంటున్నారు
  మా అంతట మేము కోరి మీ బ్లాగులో , వచ్చీరాని చెత్తేదో వ్రాస్తుంటే
  ఎంతో ఓపికగా ఆ చెత్తంతా అక్షరం అక్షరం మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి
  సరిదిద్దుతున్నారు - మీకు నచ్చిన - మీకు వచ్చిన పరిధిలో
  దాని వలన ఎంతోమంది నా వంటి వారికి పద్యరచన లోని మెలకువలు తెలుస్తున్నవి
  మమ్మల్ని మేము కొంతవరకైనా సరిదిద్దుకోగలుగుతున్నాము

  నా విషయం తీసుకుంటే నాకు నలభయ్యేళ్ళ క్రితము నుండీ పద్యాలు వ్రాసే అలవాటున్నది
  కానీ దాన్ని చూసి పరిశీలించి తప్పులు చెప్పేవాళ్ళు లేరు
  నేనెవరి దగ్గరకైనా వెళదామంటే ఉదయం 7 గంటలకు బయటకు వెళ్లి
  రాత్రి 12 గంటల తరువాత ఇంటికి జేరే తీరుబాటెరుగని ఉద్యోగం
  ఎవరికి చూపించుకోను ఆ టైములో వెళ్లి
  అందుకే బుద్ధి పుట్టినప్పుడు రాసుకోవడం - దాచుకోవడం - అంతే

  నా పద్యరచన కొక పరిశీలకుని అవసరం మీ బ్లాగు ద్వారా మీ ద్వారా తీరింది
  మీ ఋణమెన్నటికీ తీర్చుకోలేనిది - ఏమిచ్చినా తీరనిది
  ఒక కుసంస్కారి ఏదో అన్నాడని మీరు బ్లాగు మూసేస్తే
  నా లాంటి వాళ్ళ కెందరికో మీరన్యాయం చేసిన వారౌతారు
  ఆ పని ఎన్నటికీ చెయ్యరని ఆశిస్తున్నాను
  సెప్టెంబర్ 29, 2015 5:41 [PM]

  రిప్లయితొలగించండి
 15. గురువుగారికి ప్రణామములు సుకవి మిత్రులకు శుభాభినందనలతో ఈ నాటి పూరణ దోషములున్న మన్నించమని వేడుతూ

  వరము చేత బుట్టె వరపుత్రి యాయింతి
  ద్రుపద రాజ కన్య, ద్రోణు వలచె
  రుప పటిమ గలుగున రుని మనువాడె నా
  అగ్ని జాత కృష్ణ అనఘ చరిత.

  ద్రోణువలచెరుప= పద్మవ్యూహాన్ని ఛేదింపగల
  నరుడు=అర్జునుడు

  రిప్లయితొలగించండి
 16. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. సి. రామ మోహన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కృపియె’ అనండి.

  రిప్లయితొలగించండి
 18. పార్ధు వలచి యతని బరిణయ మాడెను
  ద్రుపద రాజ కన్య ,ద్రోణు వలచె
  గృపుని భగిని యైన గృపి యను నాయింతి
  సంత సమ్ము మదిని సంత రిల్ల

  రిప్లయితొలగించండి
 19. గురువుగారు !
  నా మొబైల్ ఫోన్ లో ఆ లైన్స్ ని సవరించటం ఇంకా తెలియలేదు అందుకే అలా పంపటం జరిగింది..
  పూరణను సవరించినందుకు ధన్యవాదములు..
  _/\_

  రిప్లయితొలగించండి
 20. పంచ పాండవులకు పండు వంటి రమణి
  ద్రుపద రాజ కన్య, ద్రోణు వలచె
  కృపియె, గొప్ప సాధ్వి, కృష్ణ సఖులయిన
  వా రయోనిజలకు వంద నమ్ము

  రిప్లయితొలగించండి
 21. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. పాండు నందనుండు పార్థుని వరియించె
  ద్రుపద రాజ కన్య , ద్రోణు వలచె
  కృపి కమల నయన ట కృపుని భ గిని తాను
  గురువు ఫల్గునునకు కుంభ భవుడు

  రిప్లయితొలగించండి
 23. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 24. శ్రీగురుభ్యోనమః

  పాండురాజు సుతుల బరిణయమాడెను
  ద్రుపదరాజకన్య, ద్రోణుఁ వలఁచె
  కృపుని భగిని తాను, కృష్ణుని ప్రేమిoచె
  సత్యభామ, వినుము సరసహృదయ

  రిప్లయితొలగించండి
 25. గురుశబ్ద వాచ్యుఁ డెవ్వడు
  తిరమగు విజ్ఞానమొసగు తీరమె తానౌ
  ధరణికి యాధారంబగు
  గురువును మదిదలచి జేతు కూర్నినిషాతుల్!!!

  రిప్లయితొలగించండి

 26. కవిమిత్రులందరకు నమస్కారములు.
  గురుమూర్తి ఆచారి గారిపూరణ "ద్రోణు వలచెవిజయకాంత" మంచి అన్వయము.
  అంజనేయశర్మగారిపూరణ"ద్రోణు వల చెరుప"చాలమంచివిరుపు.చక్కటి అన్వయము.

  అందరికి అభినందనలు.


  .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ.

   నృపులు జూచి వెరచి నింగిని పరికించి
   మత్స్యయంత్రము గని మరలి పోవ
   దోణము వలెగొట్టె బాణమున నరుడు
   ద్రుపద రాజ కన్య ద్రోణు వలచె

   తొలగించండి
 27. చపలచిత్తమందు చక్కటి చిన్నది
  నాటకాన మంచి నటనగలది
  యవ్వనాన ప్రేమ కవ్వింపు జాడలో
  ద్రుపద రాజకన్య ద్రోణు వలచె.{ఇది నాటకాల కంపెనీయందుఘటన
  పాత్రదారుల ప్రేమఅన్నభావన నాపురణ}

  రిప్లయితొలగించండి
 28. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  ధన్వవాదాలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని మీరు ‘ద్రోణుడు’ ఏ అర్థంలో ప్రయోగించారు?
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ వాసంత కిషోర్ గారూ. ఆ కుసంస్కారిని నేనే. వివరం తెలియచెప్పమన్నారా?

  రిప్లయితొలగించండి

 30. వలువ లూడ్చి సభను పరిభవింప బడెను
  లజ్జబాసె ద్రుపద రాజకన్య.
  ద్రోణు వలచె మిత్తి ద్రుపదసూనుని కత్తి
  శిరము నుత్తరింప దురితముగను

  రిప్లయితొలగించండి
 31. కామేశ్వర శర్మ గారూ,
  మన యిద్దరి లేఖలు, ప్రత్యుత్తరాలను మొన్ననే మిస్సన్న గారికి, వసంత కిశోర్ గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి మరి కొందరు బ్లాగు మిత్రులకు మెయిల్ చేశాను. ఈరోజు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఇప్పుడు పంపిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 32. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  సమస్యను స్థానభ్రంశం చేసి వైవిధ్యంగా పూరించి అలరించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. ద్రోణ పాత్ర ధారి రూపసి, యువకుండు
  ద్రౌపదిగ నటించు రమణి యొకతె
  మనసు పడితి ననుచు మాటాడ, నాటక
  ద్రుపద రాజ కన్య ద్రోణు వలచె!

  రిప్లయితొలగించండి
 34. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. ప్రణామములు గురువుగారు..ఈరోజు ఏమిచ్చారో ..అనుకుంటూ ..బ్లాగుకి వచ్చి చూడగానే...సెలవు ..అని కన్పించి ఒక్కసారి హతాశురాలయ్యాను..కవిమిత్రుల వ్యాఖ్యలు చదివాక తెలిసింది..నిన్న శ్రీ వసంత కిషోర్ గారి వ్యాఖ్య చదివాక మీ మనసు భాధపడే పరిస్ధితి ఎదురయ్యిందని అనిపించింది.....మీరు ఎంతగా కలత చెందారో ..బ్లాగుకు సెలవు ప్రకటించటం వలనే తెలుస్తోంది..వివరాలు నాకు తెలియకపోయినా..మిమ్మల్ని, బ్లాగునీ , ఎంతగానో అభిమానించే మా అందరి కోసం.. బ్లాగుని నిరాటంకంగా కొనసాగించ ప్రార్ధన..

  రిప్లయితొలగించండి