28, అక్టోబర్ 2015, బుధవారం

పద్యరచన - 1047

కవిమిత్రులారా!
“ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ యాశ్రమమ్ములో
  ముదుసలి ప్రాయమందు తమ పుత్రులు గెంటగ వచ్చిచేరియున్
  చెదరిన గుండెతో కనుల చిందెడి యశ్రులతో వసించుచున్
  కదలగ లేని వృద్ధులను కంటికి రెప్పగ సేవచేయుటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ యాశ్రమమ్ములో
   ముదుసలి ప్రాయమందు తమ పుత్రులు గెంటగ వచ్చిచేరియున్
   చెదరిన గుండెతో కనుల చిందెడి యశ్రులతో వసించుచున్
   కదలగ లేని వృద్ధులను కంటికి రెప్పగ సేవచేయుమా

   తొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   కరుణ రసాత్మకమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'మెచ్చఁగ నాశ్రమమ్ములో' అనండి.

   తొలగించండి
 2. ఇదెకద పుణ్య కార్యమన నెల్లరు మెచ్చగ జాలదే యిలన్
  వదలక సేయు పూజలు భవంబును తీర్చగ లేవు విజ్ఞులై
  పదుగురు పేద వారికినుపాధిని చూపిన జాలు పేదలై
  చదువగ లేని వారికిల సాయము జేసినమేటి పుణ్యమే

  రిప్లయితొలగించండి
 3. ఇదెకద పుణ్యకార్యమన, నెల్లరుమెచ్చగ పేదపిల్లలన్
  చదువుల మూర్తి సన్నిధిన చక్కగఁజేర్చి కరమ్ము ప్రేమతో
  నిధులను గూర్చుచున్ సతము నీతినిజాయితితో చరించుచున్
  బ్రదుకుటసుమ్మ, వారికి మురారి మనస్సున స్థాన మబ్బెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'సన్నిధిని' అనండి.

   తొలగించండి
 4. ఇదెకద పుణ్య కార్య మన నెల్లరు మెచ్చగ దైవ సన్నిధి
  న్వదలక భక్తి తోడ బలు భావములా హృది రంగ రించగా
  నదుము గులాబి ,మల్లెలును నా శివు జూట ము నందు నొప్పగా
  ముదమున నామనంబు క డుమోదము నొందె నునార్య !యత్త ఱి న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'ఒందెను+ఆర్య' అన్నప్పుడు సంధి నిత్యం. 'ఒందెను చూడు డత్తరిన్' అనండి.

   తొలగించండి
 5. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ వైభవమ్ముగన్
  సదమల వృత్తి యాజయిత సద్విజ సంయమి శాస్త్ర వేద సం
  విద సుసమేత మైపరగ వీర వరేణ్యుడు రాఘవుండిలన్
  ముదమున వాజియాగము సమున్నత రీతి సమాచరించెనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. ఇది కద |పుణ్య కార్యమన నెల్లరు మెచ్చగ”నేత్రదానముల్
  పొదిగిన?గ్రుడ్డివారికవి పొందికచేతను చూపు నింపగా
  పదును గ్రహించి విత్తగనె?పండిన పంటయులాభమట్లుగా
  కదలిక కంటిచూపు తనకందగ సంబరమందు తేలుటే|

  రిప్లయితొలగించండి
 7. ఇదె కద పుణ్యకార్యమన నెల్లరు మెచ్చగ రాజధానికై
  పదుగురు చేతనైన తమ వంతగు సాయముఁ జేయనిల్చినన్
  బ్రదిమిని యెప్పుడైన 'యమరావతి ' వృద్ధిని గాంచినంతనే
  ముదమగు మేము సైతమ 'ని ముచ్చటఁ దీరగ పొంగిచెప్పగన్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. గురువుగారూ,
  కాశీచేరిన మీకు, పంపిన కవిమిత్రులుగారికీ శుభాభినందనలు.

  ఇదె కద పుణ్యకార్య మన, నెల్లరు మెచ్చఁగఁ గాశియాత్రకై,
  పదపద పోదమంచు, తమ భాగ్యముఁ బండగఁ బోవుచుందురే
  ముదిమిని లెక్కచేయక, తపోవనమౌ యల వారణాసినిన్,
  ముదమున గౌరినీశునట మోహముఁ ద్రుంచగ వేడనెంచుచున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మీదేవి గారూ,
   ధన్యవాదాలు. కాని నేనింకా కాశీ చేరలేదు. ఈ శనివారం బయలు దేరుతున్నాను.
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. ఇదె కద పుణ్యకార్య మన, నెల్లరు మెచ్చఁగఁ గాశియాత్రకై,
  కదలుచు నుండ "నాయనుగు కన్యను పెండిలి యాడు మంచు"నన్
  సదయను వేడ నియ్యకొని జాయగ గైకొని కాపురమ్మునే
  పదుగురు మెచ్చ జేసితిని భాగ్యము పుణ్యము పొందితిన్ ధరన్

  రిప్లయితొలగించండి
 10. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ సొక్క కుండ తా
  పదుగురి యందు సొంపుగ శుభమ్ములు గూర్చెడి మాట లాడుచున్
  చదువులు సంధ్యలన్నిటిని చాకలి రేవుల పారవేయుచున్
  కదలుచు రాజకీయమున కమ్మగ నిమ్ముగ "సేవ" జేయుటే!

  రిప్లయితొలగించండి


 11. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ పద్యమాలలన్
  సదనము నందు చేర్చి సయి చక్కగ దిద్దుచు నుంటి నేనిటన్
  కదనపు కైపు గాను మరి కందివ రుల్ వల దమ్మ రోజిలే
  బి!దరువు లీవి ధమ్ముగని భీతిని చెందిపలాయనంబవన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ కాంగ్రెసందునన్
  కదనము నందు నోడగను గాభర జెందుచు రాహులుండయో
  పదుగురు నవ్వి పోవగను పారగ నేరుగ థాయిలాండుకున్
  పదములు పట్టి సోనియను ప్రార్థన జేయుచు నెత్తికెత్తిరే!

  రిప్లయితొలగించండి