ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీగురుభ్యోనమఃకవి కలమున కున్న మహిమపవి కైనను లేకపోయె పరికింపంగాయవినీతుల ఖండిచునుకవనామృత ధార బంచి కాచును జగతిన్
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘పరికింపంగా| నవినీతుల...’ అనండి.
కవికల మునకున్న మహిమ రవికైనను లేదటంచు రాగము విరియన్ కవనము లల్లగ సుందర దివిజులు వరమిడగ జనుల దీవించంగా
అక్కయ్యా, మీ పద్యం బాగున్నవి. అభినందనలు.‘దీవించంగన్’ అనండి.
కవి కలమున కున్న మహిమరవికిరణము కన్న మిన్న లక్షించంగాదివిభువి మెప్పించు నదియెకవనమ్ములు వ్రాయు కవుల కరదీపముగన్ !!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవికలమున కున్న మహిమవివరింతునిట,దివి నారవి గనని దానిన్సవివరముగ వింత లెల్లపవమానుని కన్న ముందె ప్రజలందరికిన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.మూడవపాదంలో బేసిగణంగా జగణం వచ్చింది. ‘సవివరముగ వింతలనే’ అందామా?
కవికలమునకున్న మహిమ కాంచతరమెకవుల మంచి కవనముల కారణమునకుటిల మౌప్రభుత్వములు వే కూలిపోవుప్రజలుమెచ్చిన నేతకు పదవిదక్కు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, కందపాదాన్ని తేటగీతిలో అనువర్తించిన మీ పద్యం బాగున్నది అభినందనలు.
కవి కలమున కున్న మహిమ వివరింతును మీకు నిపుడు వివరము తోడన్ర వికా ననిచో టులయున్గ వికాంచును సత్య మిదియ కందివ రేణ్యా !
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘చోటులలో’ అనండి.
కవికల మునకున్న మహిమవివరింపగవశముగాదు విజ్ఞుల కైనన్ రవిగాంచని విష యమ్మునుకవికలమే గాంచునంట ఘనమది గాదే
విరించి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!("కావ్యం యశసే ఽర్థకృతే వ్యవహార విదే శివేతర క్షతయే సద్యఃపర నిర్వృతయే కాంతా సమ్మితత యోపదేశ యుజే" యను విషయ మెల్ల ఱెఱిఁగినదే కదా!)కవి కలమునకున్న మహిమ ఖరకరుఁ డీయంగ వెఱచుచెవికిడు నందమ్ము "కవిత" చెవిపోఁగు చెవికీయ డించునవ నవోన్మేష శాలియగు నదియ నవ్యార్థ మందించుసవన భాతిగఁ దత్కృతి నిల శాశ్వతమ్ముగ నిల్వ నుంచుశివ సత్య సుందరము లిడు శ్రీ శివేతర హృతిఁ బెంచువ్యవహార విదితంపు టెఱుక భవ్య కావ్యమ్మె యందించుకవికిఁ బరార్థ మందించి ఘనకీర్తి భువిలోనఁ బెంచుభవమందకుండంగ భువినిఁ బరము నందించి రహించుసువిదిత హిత సతి వలెను సూక్తులఁ బ్రేమ బోధించుకవికినిఁ బ్రియసుత యయ్యుఁ "గవిత" యీ జగము జయించు!
Sree Madhusuudhan gaariki namassulu.Padyam Ad bhutamgaa unnadi. Abhinandanalu.
గుండు మధుసూదన్ గారూ, ఆహా! కవిత్వ ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యాన్ని, ప్రయోజనాన్ని చక్కగా వివరిస్తూ మంచి పద్యాన్ని వ్రాశారు. కవితామాధుర్యాన్ని పంచారు. అభినందనలు.
ధన్యవాదములండీ శ్రీపతిశాస్త్రిగారూ!***ధన్యవాదములు శంకరయ్యగారూ!
కవి కలమున కున్నమహిమ ఖడ్గమునకుకలదె చూడగ దేశపు గతియు మారుపాలకుల తీరు మార్చును పదును కలము రవి గననిచోటు కవి గాంచు రయముగ నిల
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పద్యరచన:కవి కలమున కున్న మహిమ పద్య ప్రారంభముతో మీకునచ్చిన చందములో పద్యము వ్రాయండి.కవి కలమున కున్న మహిమ కత్తి యెరుగు కత్తి సాధించ లేనట్టి క్షమయు,కరుణ కలము సాధించ గలదను కతను వినరెహింస శమియించు గాదె నహింస వలనపద్యరచన:కవి కలమున కున్న మహిమ పద్య ప్రారంభముతో మీకునచ్చిన చందములో పద్యము వ్రాయండి.కవి కలమున కున్న మహిమ కత్తి యెరుగు కత్తి సాధించ లేనట్టి క్షమయు,కరుణ కలము సాధించ గలదను కతను వినరెహింస శమియించు గాదె నహింస వలన
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవి కలమునకున్న మహిమవివరించగ నేరి తరము విశ్వము నందున్కవనమున పొగడు దేవునియవనికి దించంగ నాగు నతడే వ్రాయన్!(శివ పినాకిని: పోతన భాగవతం...sivapinakini.blogspot.com › 2011/04 › b...)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘దేవుని |నవనికి...’ అనండి. ‘దించగ నాగు’...?
గురుదేవులకు ధన్యవాదములు.కవి కలమునకున్న మహిమవివరించగ నేరి తరము విశ్వము నందున్కవనమున పొగడు దేవునినవనికి దించంగ నాగు నతడే వ్రాయన్!సాక్షాత్తు దేవుని భూమి మీదకు దించగన్ ఆగున్ అతడే తనను చేత పట్టి వ్రాయుటకు. శ్రీరామచంద్రుడు పోతన భాగవతంలో 'అలవైకుంఠ పురిలో అనే పద్యం వ్రాశారు గదండీ.
కవికలమున కున్న మహిమ రవికిరణమునకును లేదు రవికరమెన్నన్పవలే శోభలనీనునుకవికలసందీప్తి రేబగళ్ళును మించున్.
మిస్సన్న గారూ, అద్బుతమైన పద్యం. అభినందనలు.
కవికలమున కున్నమహిమఅవిరళ సాహిత్య సేవ|నాలోచించన్వివరణ లొసగే విస్మయదివిటీగా జీవితాన దీప్తిని బంచున్|కవికలమున కున్న మహిమ కల్మషములదులుపుటే|భవిత కుంచ గలుగునట్టి భావ బంధ మందునన్దివిగ మార్చనెంచబూను దివ్యమైన శక్తిచేసవినయాన కవిత లల్లి సాగుజేయు ధర్మమే
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.‘ఒసగే’ అన్నచోట ‘ఒసగెడు’ అనండి.
కవికలమున కున్న మహిమకవిత్వమునకున్నశక్తి గట్టిగ చాటన్కవులందరుద్యమించుడు పవికన్న పదును కలిగిన పద్యములల్లన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవి కలముకున్న మహిమలురవి కాంచడు, కవికి దెలుసు రమ్యపుస్థలముల్రవి కవులిద్దరి లోనన్కవి గణపతి గొప్పకాడె కావ్యము రాసెన్
లక్ష్మణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘కలముకు’ అనరాదు.‘కలమునకు’ అనాలి.
కవికలమున కున్న మహిమపవమాన సుతునకు లేదు పరికింపంగా రివురివ్వని పరుగులిడుచు తవిలి గిరీశముని చుట్ట దహియించునుగా!
కవికలమున కున్న మహిమరవికిన్ లేదండ్రు కవులు రాసభ రీతిన్ కవులది జంబమ్మిదిరా! రవికిన్ గల ఘోటకములు కవులకు గలవే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
కవి కలమున కున్న మహిమ
పవి కైనను లేకపోయె పరికింపంగా
యవినీతుల ఖండిచును
కవనామృత ధార బంచి కాచును జగతిన్
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పరికింపంగా| నవినీతుల...’ అనండి.
రిప్లయితొలగించండికవికల మునకున్న మహిమ
రవికైనను లేదటంచు రాగము విరియన్
కవనము లల్లగ సుందర
దివిజులు వరమిడగ జనుల దీవించంగా
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నవి. అభినందనలు.
‘దీవించంగన్’ అనండి.
కవి కలమున కున్న మహిమ
రిప్లయితొలగించండిరవికిరణము కన్న మిన్న లక్షించంగా
దివిభువి మెప్పించు నదియె
కవనమ్ములు వ్రాయు కవుల కరదీపముగన్ !!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవికలమున కున్న మహిమ
రిప్లయితొలగించండివివరింతునిట,దివి నారవి గనని దానిన్
సవివరముగ వింత లెల్ల
పవమానుని కన్న ముందె ప్రజలందరికిన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో బేసిగణంగా జగణం వచ్చింది. ‘సవివరముగ వింతలనే’ అందామా?
కవికలమునకున్న మహిమ కాంచతరమె
రిప్లయితొలగించండికవుల మంచి కవనముల కారణమున
కుటిల మౌప్రభుత్వములు వే కూలిపోవు
ప్రజలుమెచ్చిన నేతకు పదవిదక్కు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండికందపాదాన్ని తేటగీతిలో అనువర్తించిన మీ పద్యం బాగున్నది అభినందనలు.
కవి కలమున కున్న మహిమ
రిప్లయితొలగించండివివరింతును మీకు నిపుడు వివరము తోడ
న్ర వికా ననిచో టులయు
న్గ వికాంచును సత్య మిదియ కందివ రేణ్యా !
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చోటులలో’ అనండి.
కవికల మునకున్న మహిమ
రిప్లయితొలగించండివివరింపగవశముగాదు విజ్ఞుల కైనన్
రవిగాంచని విష యమ్మును
కవికలమే గాంచునంట ఘనమది గాదే
విరించి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
తొలగించండి("కావ్యం యశసే ఽర్థకృతే వ్యవహార విదే శివేతర క్షతయే సద్యఃపర నిర్వృతయే కాంతా సమ్మితత యోపదేశ యుజే" యను విషయ మెల్ల ఱెఱిఁగినదే కదా!)
కవి కలమునకున్న మహిమ ఖరకరుఁ డీయంగ వెఱచు
చెవికిడు నందమ్ము "కవిత" చెవిపోఁగు చెవికీయ డించు
నవ నవోన్మేష శాలియగు నదియ నవ్యార్థ మందించు
సవన భాతిగఁ దత్కృతి నిల శాశ్వతమ్ముగ నిల్వ నుంచు
శివ సత్య సుందరము లిడు శ్రీ శివేతర హృతిఁ బెంచు
వ్యవహార విదితంపు టెఱుక భవ్య కావ్యమ్మె యందించు
కవికిఁ బరార్థ మందించి ఘనకీర్తి భువిలోనఁ బెంచు
భవమందకుండంగ భువినిఁ బరము నందించి రహించు
సువిదిత హిత సతి వలెను సూక్తులఁ బ్రేమ బోధించు
కవికినిఁ బ్రియసుత యయ్యుఁ "గవిత" యీ జగము జయించు!
Sree Madhusuudhan gaariki namassulu.
తొలగించండిPadyam Ad bhutamgaa unnadi. Abhinandanalu.
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిఆహా! కవిత్వ ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యాన్ని, ప్రయోజనాన్ని చక్కగా వివరిస్తూ మంచి పద్యాన్ని వ్రాశారు. కవితామాధుర్యాన్ని పంచారు. అభినందనలు.
ధన్యవాదములండీ శ్రీపతిశాస్త్రిగారూ!
తొలగించండి***
ధన్యవాదములు శంకరయ్యగారూ!
కవి కలమున కున్నమహిమ ఖడ్గమునకు
రిప్లయితొలగించండికలదె చూడగ దేశపు గతియు మారు
పాలకుల తీరు మార్చును పదును కలము
రవి గననిచోటు కవి గాంచు రయముగ నిల
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపద్యరచన:కవి కలమున కున్న మహిమ పద్య ప్రారంభముతో
మీకునచ్చిన చందములో పద్యము వ్రాయండి.
కవి కలమున కున్న మహిమ కత్తి యెరుగు
కత్తి సాధించ లేనట్టి క్షమయు,కరుణ
కలము సాధించ గలదను కతను వినరె
హింస శమియించు గాదె నహింస వలన
పద్యరచన:కవి కలమున కున్న మహిమ పద్య ప్రారంభముతో
మీకునచ్చిన చందములో పద్యము వ్రాయండి.
కవి కలమున కున్న మహిమ కత్తి యెరుగు
కత్తి సాధించ లేనట్టి క్షమయు,కరుణ
కలము సాధించ గలదను కతను వినరె
హింస శమియించు గాదె నహింస వలన
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవి కలమునకున్న మహిమ
రిప్లయితొలగించండివివరించగ నేరి తరము విశ్వము నందున్
కవనమున పొగడు దేవుని
యవనికి దించంగ నాగు నతడే వ్రాయన్!
(శివ పినాకిని: పోతన భాగవతం...
sivapinakini.blogspot.com › 2011/04 › b...)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దేవుని |నవనికి...’ అనండి. ‘దించగ నాగు’...?
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండికవి కలమునకున్న మహిమ
వివరించగ నేరి తరము విశ్వము నందున్
కవనమున పొగడు దేవుని
నవనికి దించంగ నాగు నతడే వ్రాయన్!
సాక్షాత్తు దేవుని భూమి మీదకు దించగన్ ఆగున్ అతడే తనను చేత పట్టి వ్రాయుటకు. శ్రీరామచంద్రుడు పోతన భాగవతంలో 'అలవైకుంఠ పురిలో అనే పద్యం వ్రాశారు గదండీ.
కవికలమున కున్న మహిమ
రిప్లయితొలగించండిరవికిరణమునకును లేదు రవికరమెన్నన్
పవలే శోభలనీనును
కవికలసందీప్తి రేబగళ్ళును మించున్.
మిస్సన్న గారూ,
తొలగించండిఅద్బుతమైన పద్యం. అభినందనలు.
కవికలమున కున్నమహిమ
రిప్లయితొలగించండిఅవిరళ సాహిత్య సేవ|నాలోచించన్
వివరణ లొసగే విస్మయ
దివిటీగా జీవితాన దీప్తిని బంచున్|
కవికలమున కున్న మహిమ కల్మషములదులుపుటే|
భవిత కుంచ గలుగునట్టి భావ బంధ మందునన్
దివిగ మార్చనెంచబూను దివ్యమైన శక్తిచే
సవినయాన కవిత లల్లి సాగుజేయు ధర్మమే
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఒసగే’ అన్నచోట ‘ఒసగెడు’ అనండి.
కవికలమున కున్న మహిమ
రిప్లయితొలగించండికవిత్వమునకున్నశక్తి గట్టిగ చాటన్
కవులందరుద్యమించుడు
పవికన్న పదును కలిగిన పద్యములల్లన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవి కలముకున్న మహిమలు
రిప్లయితొలగించండిరవి కాంచడు, కవికి దెలుసు రమ్యపుస్థలముల్
రవి కవులిద్దరి లోనన్
కవి గణపతి గొప్పకాడె కావ్యము రాసెన్
లక్ష్మణ మూర్తి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కలముకు’ అనరాదు.‘కలమునకు’ అనాలి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికవికలమున కున్న మహిమ
తొలగించండిపవమాన సుతునకు లేదు పరికింపంగా
రివురివ్వని పరుగులిడుచు
తవిలి గిరీశముని చుట్ట దహియించునుగా!
కవికలమున కున్న మహిమ
రిప్లయితొలగించండిరవికిన్ లేదండ్రు కవులు రాసభ రీతిన్
కవులది జంబమ్మిదిరా!
రవికిన్ గల ఘోటకములు కవులకు గలవే?