అజ్ఞాత గారూ, మంచి విషయాన్ని ‘అజ్జాత’గా చెప్పడం ఎందుకు? అయినా సమస్యా అంటేనే అసంబద్ధంగా, అసహజంగా, లోకరీతికి విరుద్ధంగా, కొండొకచో అశ్లీలంగా, జుగుప్సాకరంగా ఉండవచ్చు. పూరణతో సంస్కరించడం అవధాని పని. అప్పటికీ నేను సాధ్యమైనంత వరకు సంస్కారవంతంగా ఉండే సమస్యలనే ఇస్తున్నాను. గతంలో ప్రసిద్ధ అవధానాలలో ఇచ్చిన అశ్లీలమైన సమస్యలు నేను సేకరించినవాటిలో ఉన్నాయి. కాని ఇవ్వడం లేదు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
తమిళనాడు లోన తరచుగా శివరామ
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.
కపిలదేవు నాయకత్వమ్ము నందున
బంతి విసరు నట్టి బౌల రతడు.
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మ్యాచి జూడ వెడలె మాయింటి యభిమాని
రిప్లయితొలగించండికృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ
వెఱగు పడగ నతడు వేలుపు వరమంచు
తనకు రాదు గాన తనరు మదిని
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాలుడాడు కొరకు బాలు,బ్యాటునుదెచ్చి
రిప్లయితొలగించండిబహుమతీయగానె బర్తుడేకి
మురిసి తాతతోడ ముద్దుల మనుమడు
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆదుకొనగ వరద బాధిత ప్రజలను
రిప్లయితొలగించండిధనము ప్రోగు జేయ ఘనముగాను
నటుల తోడ కలసి నాణెమ్ముగా బాల
కృష్ణుఁ డాడె నట క్రికెట్టు క్రీడ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివెన్నదొంగ యెవఁడు? చిన్ని బాలకులతో
నేమి సేసెనంట? నియమమునను
సచినుఁ డేమి నెగ్గె? సరి యుత్తరా లివె
కృష్ణుఁ, డాడెనఁట, క్రికెట్టుక్రీడ!
నా రెండవ పూరణము:
తొలగించండిచిన్నపిల్లలాడు చిఱ్ఱగోనెయె నేఁడు
క్రికెటు పేరఁ బఱఁగె! గ్రీడ యదియె!
ద్వాపరమ్మునందుఁ బడుచు గోపకులతోఁ
గృష్ణుఁ డాడెనఁట క్రికెట్టుక్రీడ!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
కందుకముల నెన్నొ కంసుండు విసరగ
రిప్లయితొలగించండినప్పడైన తాను త్రిప్పి కొట్టె
మామ నోడ జేయు మహితాత్ముడై బాల
కృష్ణుఁడాడె నట క్రికెట్టు క్రీడ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాచ క్రీడ లెన్ని యోసత్య భామతో
రిప్లయితొలగించండికృష్ణు డా డె నట, క్రికెట్టు క్రీడ
యందు పేరు మోసె యాసచిను గదార్య !
యొక్క రొకొక యాట నొప్పుదు రిల
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో యతి తప్పింది. ‘రాసక్రీడ లెన్నొ రహి సత్యభామతో’ అనండి.
చిత్ర సీమ నటిలు చేరినారచ్చోట
రిప్లయితొలగించండిసేవచేయునట్టి చింతతో డ
ధనముకూడబెట్ట జనులనుండి సినిమా
కృ ష్ణు డాడె నట క్రికె ట్టు క్రీడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నటులు’ టైపాటుతో ‘నటిలు’ అయింది.
కపిలదేవు నాట కమనీయముగ జూచి
రిప్లయితొలగించండిబ్యాటు కృష్ణు డనెడి బాలు డడగ
తండ్రి ప్రేమ తోడ తనయున కొసగంస
కృష్ణు డాడె నట క్రికెట్టు క్రీడ.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భరత జట్టు లోన బౌలరై శివరామ
రిప్లయితొలగించండికృష్ణు డొకడు దేశ కీర్తి బెంచె
మేటిగాను బంతి మెలికలు ద్రిప్పుచున్
కృష్ణు డాడెనట క్రికెట్టు క్రీడ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య
రిప్లయితొలగించండి*గు రు మూ ర్తి ఆ చా రి *
కృష్ణు డాడెనట క్రికెట్టు క్రీడ నెలమి
యను సమస్య నిచ్చి తి శ౦కరార్య ! చక్రి
కెట్టు తెలియును నేటి క్రికెట్టు క్రీడ. !
పాలకడలిలో యాశేష. పాన్పు పైన
లక్ష్మి పాదము లొత్త విలాసముగను
సకల భువనము లాడి౦చు స్వామి యతడు
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కడలిలో నా శేష...’ అనండి.
గూటుబిళ్ళ యాట కాలక్రమమ్మున
రిప్లయితొలగించండిక్రికెటుగానుమారె సుకవి! వినుము
గోపకులను గూడి రేపల్లెలో బాల
కృష్ణుడాడెనఁట క్రికెట్టు క్రీడ.
(మేం చిన్నప్పుడు గోణేబిళ్ళ అనే ఆట ఆడుకొనే వాళ్ళం. దాన్నే కొందరు గూటేబిళ్ళ అంటారు)
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాళి చరణు పూర్వ కాలపు వాడట
రిప్లయితొలగించండిమేఘ శ్యాముడు గన మేటి యాట
గాడు పరుగు లందు కౌశల మధికంబు
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మేఘశ్యాము’ డన్నప్పుడు ‘ఘ’ గురువై గణదోషం. ‘మేఘ వర్ణుడు గన’ అనండి.
పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. మేఘశ్యాముడు గమనించ లేదు పొరపాటున. ధన్యవాదములు.
తొలగించండిగోపికాళియందు గోముగ సయ్యాట
రిప్లయితొలగించండికృష్ణు డాడెనట|”క్రికెట్టు క్రీడ
నెంచలేదునాడు”నేడిల నాడంగ
ఆటలందు గొప్పయాట జూడ|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిమామ బిలిచె ననుచు మాధవు డేగగా
కండ బలము జూప కంస భటులు
సిక్సులట్టు కొట్టి చెండాడ వారిని
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇటువంటి వికారం కలిగించే సమస్యలు ఇవ్వవద్దని మనవి.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారూ,
తొలగించండిమంచి విషయాన్ని ‘అజ్జాత’గా చెప్పడం ఎందుకు?
అయినా సమస్యా అంటేనే అసంబద్ధంగా, అసహజంగా, లోకరీతికి విరుద్ధంగా, కొండొకచో అశ్లీలంగా, జుగుప్సాకరంగా ఉండవచ్చు. పూరణతో సంస్కరించడం అవధాని పని. అప్పటికీ నేను సాధ్యమైనంత వరకు సంస్కారవంతంగా ఉండే సమస్యలనే ఇస్తున్నాను. గతంలో ప్రసిద్ధ అవధానాలలో ఇచ్చిన అశ్లీలమైన సమస్యలు నేను సేకరించినవాటిలో ఉన్నాయి. కాని ఇవ్వడం లేదు. ధన్యవాదాలు.