10, అక్టోబర్ 2015, శనివారం

సమస్యా పూరణం - 1822 (పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.

58 కామెంట్‌లు:

 1. గురువుగారికీ నమస్సుమాంజలులతో....
  సరసము లాడగ పిలిచెను
  సరసాంగి యొకతి విటునకు స్వాగత మనుచున్
  తరుణిని గని మెచ్చెనె యా
  పురుషుడు! పసుపాడి ముడిచె బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి
 2. సరగున సంధ్యను వార్చగ
  పురుషుఁడు , పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్
  తరుణియె విరులను చేకొని
  పరమేశుని గొలువ నెంచి పతికై వేచెన్

  రిప్లయితొలగించండి
 3. విరిబోణి సుభద్ర పతియు
  అరివీర పరాక్రముండు అర్జునుడే తా
  విరటుని సేవించుచు నా
  పురుషుడు పసుపాడి ముడిచె బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  బాలచంద్రుని రాకతో మాంచాల :

  01)
  __________________________________

  పరిణయ మాడిన దాదిగ
  కరుణించక, వేశ్యల యెడ - కామాతురుడై
  సరగున నరుదెంచగ తన
  పురుషుఁడు ; పసుపాడి ముడిచెఁ - బూమాల నొగిన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 5. లక్ష్మణుని గాంచిన ఊర్మిళ ఉత్సాహముతో :

  02)
  __________________________________

  పురుషుని సేవించుటకై
  పురమును వీడెను స్థిరుడయి ! - పుణ్యవశమునన్
  పురమును జేరగ గని తన
  పురుషుఁడు ; పసుపాడి ముడిచెఁ - బూమాల నొగిన్ !
  __________________________________
  పురుషుఁడు =పరమాత్మ, భర్త

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   కర్తృపదం లోపించింది. ‘తరుణిని జేరగ గని తన| పురుషుడు...’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. పద్యం యొక్క నేపథ్యాన్ని తెలుపుతూ ‘ఊర్మిళ’ అన్నారు కదా! నేను గమనించలేదు. మన్నించండి. పద్యంలో ఏమార్పూ అవసరం లేదు.

   తొలగించండి
 6. నాల్గు నెలల పిదప తిరిగొచ్చిన పతిని గాంచిన పడతి :

  03)
  __________________________________

  పరదేశము వాణిజ్యము
  నెరపగ జని గడచె నాల్గు - నెలలే ! హరిపై
  పరుగున వచ్చిన గని తన
  పురుషుఁడు ; పసుపాడి ముడిచెఁ - బూమాల నొగిన్ !
  __________________________________
  హరి = గుఱ్ఱము

  రిప్లయితొలగించండి
 7. బృహన్నలగా మారిన అర్జునుడు :

  04)
  __________________________________

  నరుడే యూర్వశి వరమున
  నరిగెను విరటుని కొలువున - నాట్యము నేర్పన్ !
  సరభముగ ముగియ నాట్యము
  పురుషుఁడు పసుపాడి ముడిచెఁ - బూమాల నొగిన్ !
  __________________________________
  సరభము = తొందర

  రిప్లయితొలగించండి
 8. పట్నానికి వెళ్ళి - చికిత్స తో
  స్త్రీగా మారిన పురుషు డానందముగా :

  05)
  __________________________________

  పురుషత్వము లేక వగచి
  పురమునను చికిత్స తోడ - ముద్దులగుమ్మై
  సురతముతో నిలు చేరిన
  పురుషుఁడు పసుపాడి ముడిచెఁ - బూమాల నొగిన్ !
  __________________________________
  సురతము = సంతోషము

  రిప్లయితొలగించండి
 9. శ్రీగురుభ్యోనమః

  సరసిజ వలె నటియించుచు
  మురిపించెను ప్రేక్షకులను (రాఘవుండు) పులకించంగా
  నరయగ నాటకమందున
  పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.

  రిప్లయితొలగించండి
 10. సత్యభామగా నటించే ముందు తప్పదుగా మరి :

  06)
  __________________________________

  నరకాసుర నాటకమున
  నరుదుగ సత్యగ నటించు - నటుడే స్థానమ్
  నరసింహారా వనియెడు
  పురుషుఁడు పసుపాడి ముడిచెఁ - బూమాల నొగిన్ !
  __________________________________
  అరుదు = Surprise, wonder, marvel, rarity. వింత, అద్భుతము, ఆశ్చర్యము, అపురూపము

  రిప్లయితొలగించండి
 11. స్థానం నరసింహారావు :
  ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా
  రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.
  see more @
  https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   స్థానం వారిని గుర్తు చేసి, వివరా లందించినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
 12. మరిమరి దహించ తలపులు
  పరదేశమునందున తనపని ముగియంగన్
  విరహముతో చేరగ తన
  పురుషుడు పసుపాడి ముడిచెఁబూమాలనొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. మిత్రులందఱకు నమస్సులు!

  విరహాతిశయముతోడుత
  సురత విరతి తపన తనర సుదతి కెరలఁగన్;
  గరుణించి తననుఁ జేర స్వ

  పురుషుఁడు; పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!!

  రిప్లయితొలగించండి
 14. తరచుగఁ జింతామణిగా
  మురిసెడు నటచక్రవర్తి 'బుర్రా' వారల్!
  సరసమ్ముల జూపగ నా
  పురుషుడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. దొరకగ నేకాంతమ్మే
  దొరసానీ యనుచు రేయి దోబూచులకై
  దరిజేర వచ్చునని తన
  పురుషుడు, పసుపాడి ముడిచెఁబూమాలనొగిన్

  రిప్లయితొలగించండి
 16. అరయగ నమృతముఁ బంచఁగ
  మురిపెములొనరించి ముగ్ధ మోహన రూపాం
  తరుఁడై నిలబడె నుత్తమ
  పురుషుఁడు,పసుపాఁడి ముడిచెఁ బూమాల నొగిన్.

  ఉత్తమ పురుషుడు = పురుషోత్తముడు

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కారములతో
  గురుమూర్తి ఆచారి

  సరిక్రొత్త పెండ్లికొడుకున్
  వరుసైన మఱదలు లాట పట్టించుచు , గె
  ల్చిరి ; పందెము మేరకపుడు
  పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి
 18. విరజాజులతో రా,దన
  పురుషుడు పసుపాడి ముడిచె బూ మాల నొగి
  న్నరవింద ముఖము గలిగిన
  వర లక్ష్మీ శాస్త్రి యపుడు ప్రమదము తోడన్

  రిప్లయితొలగించండి
 19. వరసతి నాధుని రాకకె
  దరుచూడగ మగడువచ్చి తరుణిని జూచిన్
  మురిపెమ్ముగ తన్నుబొగడ
  పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తరుణిని గనగన్’ అనండి.

   తొలగించండి
 20. డా.బల్లూరి ఉమాదేవి.అక్టోబర్ 10, 2015 8:10 [AM]
  సరుగున నేగుచు తెమ్మనె
  తరుణీ మణితా మగనిని;తరిమిన యట్లున్
  మురుగులు తెచ్చెను వడిగా
  పురుషుడు;పసుపాడి ముడిచెను బూమాల యొగిన్.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అరుదెంచె విజయుడని తన
  పురుషుడు, పసుపాడి ముడిచె బూమాలనొగి
  న్నొరిగెను వేంగళ రాయుం
  డరి చేతనె యుద్ధమందు నన సతి గూలెన్

  రిప్లయితొలగించండి


 22. దురపిల్లెను కడు, చాన
  మ్మ, రణమునను నోడిపోయి మరలుట విని తా
  నరులకు, చనుదెంచగ తన
  పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   ఖడ్గ తిక్కన ప్రస్తావనతో మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. నా రెండవ పూరణము:

  చిర విరహిణి రూపరి దరి
  నరుదెంచిన వరునిఁ జేరి యర విరిసిన పూ
  సరుల సరవిఁ గోర, దొరపెఁ

  బురుషుఁడు; పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!

  రిప్లయితొలగించండి
 24. సరి వేదాంతము వారిల
  నరయంగా కూచిపూడి నాట్యము జేయన్
  గరితగ మెప్పించంగా
  పురుషుడు పసుపాడి ముడిచె బూమాల నొగిన్!!!


  పరిణయ వేడుక లందున
  మురిపెముగా జరుగుగాదె ముచ్చట లెన్నో
  వరుసగ జరిగెడు తంతుల
  పురుషుడు పసుపాడి ముడిచె బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులారా!
  మన మిత్రులు భూసారపు నర్సయ్య గారు ఇప్పుడే ఫోన్ చేశారు. తాము తమ స్వగ్రామానికి వెళ్ళారని, అక్కడ ఇంటర్‍నెట్ అందుబాటులో లేక బ్లాగుకు దూరమయ్యామని, దసరా తర్వాత మళ్ళీ హైదరాబాదుకు వచ్చిన తర్వాతే బ్లాగును చూచే అవకాశం లభిస్తుందని తెలిపారు. బ్లాగు మిత్రులందరికీ తమ నమస్కారాలు అందజేయమన్నారు.

  రిప్లయితొలగించండి
 26. చొరరాని కోట, అంతః
  పురమున ప్రియ సఖిని జేర ముదముగ తానే
  ధరియించె చీర, రైకను
  పురుషుడు, పసుపాడి ముడిచె బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి
 27. "Indira Gandhi...the only man in her cabinet"

  విరియుచు మంత్రుల మధ్యన
  కరచుచు ప్రతివాదులనట కన్నుల తోడన్
  మురియుచు నిందిర గాంధీ
  "పురుషుఁడు" పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి


 28. పరుగిడి యింటుని విడచుచు
  పరిణయ మాడెను జిలేబి, పండగ కలలున్
  వరముగ పూలముడుపుకై
  పురుషుఁడు, పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 29. తిరుమల కాటేజి నలరి
  పరుగులు పెట్టుచు లతాంగి బాత్రూమందున్;...
  పరుపున పడుకొని గుఱ్ఱన
  పురుషుఁడు;...పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్

  రిప్లయితొలగించండి
 30. హరి గంగిరెద్దు నాటల
  నెరపుచు రక్కసునిజీల్చి నిలిపెను హరునే!
  గిరిజయె నరుదెంచగ తన
  పురుషుడు; పసుపాడిముడిచె బూమాలనొగిన్

  రిప్లయితొలగించండి
 31. మెరసెడి యాభరణమ్ములు
  యరుణపు శోభిల్లు చీర, యందెల తోడన్
  గిరిజను సగ దేహమిడిన
  పురుషుడు పసుపాడిముడిచె బూమాలనొగిన్

  రిప్లయితొలగించండి