గురువు గారికి ప్రణామములు సుకవిమిత్రులకు అభినందనలు ఔరా! కలయా నిజమా!పోరాటము జేసి యలసి పోయిన గజమున్ ఆరాటముతో బ్రోవగమారమణుండేగు దెంచి మకరిని కూల్చన్ మారమణుడు = లక్ష్మి భర్త విష్ణువు
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా మారాముడు గానబడెను నద్భుత ముం గాన్నీ రాతిరి కల యందున తారా ! మఱి నమ్ముమీ వు తధ్యం బిదియే
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కానీ కలలో అని స్పష్టంగా చెప్తూ కలయా నిజమా అని సందేహం వెలిబుచ్చడం వింతగా ఉంది.
ఘోషయాత్రలో ఔరా కలయా! నిజమా!పోరాటముచేయలేక భువుని సుతుండేపాఱెను రణభూమిని విడికౌరవనాథుండు చిక్కె గంధర్వులకున్భువుడుః సూర్యుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా! కలయా నిజమాధారుణిలో నేతలెల్ల ధర్మోన్నతులైనేరావి నీతులను విడియీ రాజ్యము నేలు చుండి రిది చిత్రంబే!
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమాయీ రోజున జరిగె వింత యీ శుని గుడిలో కారుల హారను చప్పుడు ఆ రాత్రియు జెవుల సోకె నార్యా !వినుమా
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమాశ్రీరాముడు చనుట నారచీరలను జటాధారి వనవాస మెనిమిదియారేండ్లు దశరధు పంపు నరయం గలమే
పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కవి పుంగవులందరికి వందనములు. ప్రస్తుతము నేను రచియించుచున్న “పోచిరాజ తనయా వినుమా” మకుటముతో పునరుక్త సూక్తులతో శతకము లోని రెండవపద్యము ( మొదటిది శ్రీకారము.) పరిశీలింప గోర్తాను. సురులే జననీజనకులుగురువులు వారిని విడువ నిగూఢ సురులకున్నరులందయజూడగ రాదరమగునే పోచిరాజ తనయా వినుమా
పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ శతక పద్యం బాగున్నది. 'సురుడు 'కు బహువచనం' సురలు'
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. గమనించలేదు. సవరించితిని.
రారాజు స్వగతం..మయసభలో.ఔరా కలయా నిజమా!యీ రచనా పటిమనుగన నిలనెవరయినన్తేరుకొనగలరె, మయసభచారిమము హరించె నాదు స్వాంతము నెల్లన్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా?ప్ర్రెరణచే ప్రేమబిరిగి పెద్దలయందున్ ధీరతగన బరచుచుమారెడి మమతానురాగ మాయనుగనుమా
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం.
శ్రీరామదాసును బంధించిన నవాబు వారికి సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులు మారువేషములో వచ్చి ధనము నీయగ వారి భావన:ఒౌరా! కలయా! నిజమా!కారాగారముననుండ కంచర్లాఖ్యుల్శ్రీరామలక్ష్మణులిటుల్వారంపిరని సిరులొసఁగ పరవశమాయెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమారారాయని చేయిజాపి రాణీనీవేనోరారా పిలచితివాయీరోజుకు కరుణకలిగెనిదియే చాలున్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమాచారెడు యటుకుల నొసంగ సంపద లా విప్రార్యున కొసంగెనట శ్రీనారాయణుడీ జగతిన నందరు గనరే.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'చారెడు + అటుకు' లన్నపుడు సంధి నిత్యం. "చారె డటుకు లొసగి నంత సంపద...." అనండి.
మూడవపాదంలో ప్రాస?
సహదేవుడు గారూ, ధన్యవాదాలు. నేను గమనించలేదు. "సంపద లెన్నో| పారున కొసంగెనట" అందాము.
మిత్రులందఱకు నమస్సులు!(శ్రీకృష్ణుని నోట బ్రహ్మాండమ్మునుం గనిన యశోద మనోగతము)"ఔరా! కలయా, నిజమా?శౌరి కలిత మాయొ? యేమొ? సంశోధింపన్దీరగు బాలుం డింతయె!నోరన్ బ్రహ్మాండ ముంటనో? యచ్చెరువౌ!"
గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమఃహనుమంతుడు లంకానగరమును తగులబెట్టిన తరువాత త్రిజట తన మనసున భావించినట్లుగాఔరా కలయా నిజమావీరాసురురెల్ల మిగుల విస్మయమందన్వారధి దాటుచు వచ్చెనుశ్రీరాముని దూత యొకొడు సీతను వెదుకన్
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
"Gandhi's statue installed in London Parliament Square" ఔరా కలయా నిజమా!పోరాటమ్మాడియాడి పోరున గెలిచెన్ భూరిగ లండను వాసుల కోరిక తీరంగ గాంధి గొప్పగ నిలిచెన్!
ఔరా కలయా నిజమా!ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్హేరాలమ్ముగ కందములే రభసగ సాగె లివ్వు లివ్వు జిలేబీ :)జిలేబి
ఔరా కలయా నిజమా!పోరగ నీ నెలవు కొరకు ప్రొద్దున రాత్రిన్ తీరుగ హైందవ వాదులకోరిక తీరెను ఘనముగ కోదండయ్యా!
గురువు గారికి ప్రణామములు సుకవిమిత్రులకు అభినందనలు
రిప్లయితొలగించండిఔరా! కలయా నిజమా!
పోరాటము జేసి యలసి పోయిన గజమున్
ఆరాటముతో బ్రోవగ
మారమణుండేగు దెంచి మకరిని కూల్చన్
మారమణుడు = లక్ష్మి భర్త విష్ణువు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా
రిప్లయితొలగించండిమారాముడు గానబడెను నద్భుత ముం గా
న్నీ రాతిరి కల యందున
తారా ! మఱి నమ్ముమీ వు తధ్యం బిదియే
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కానీ కలలో అని స్పష్టంగా చెప్తూ కలయా నిజమా అని సందేహం వెలిబుచ్చడం వింతగా ఉంది.
ఘోషయాత్రలో
రిప్లయితొలగించండిఔరా కలయా! నిజమా!
పోరాటముచేయలేక భువుని సుతుండే
పాఱెను రణభూమిని విడి
కౌరవనాథుండు చిక్కె గంధర్వులకున్
భువుడుః సూర్యుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా! కలయా నిజమా
రిప్లయితొలగించండిధారుణిలో నేతలెల్ల ధర్మోన్నతులై
నేరావి నీతులను విడి
యీ రాజ్యము నేలు చుండి రిది చిత్రంబే!
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా
రిప్లయితొలగించండియీ రోజున జరిగె వింత యీ శుని గుడిలో
కారుల హారను చప్పుడు
ఆ రాత్రియు జెవుల సోకె నార్యా !వినుమా
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా
రిప్లయితొలగించండిశ్రీరాముడు చనుట నారచీరలను జటా
ధారి వనవాస మెనిమిది
యారేండ్లు దశరధు పంపు నరయం గలమే
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కవి పుంగవులందరికి వందనములు. ప్రస్తుతము నేను రచియించుచున్న “పోచిరాజ తనయా వినుమా” మకుటముతో పునరుక్త సూక్తులతో శతకము లోని రెండవపద్యము ( మొదటిది శ్రీకారము.) పరిశీలింప గోర్తాను.
రిప్లయితొలగించండిసురులే జననీజనకులు
గురువులు వారిని విడువ నిగూఢ సురులకున్
నరులందయజూడగ రా
దరమగునే పోచిరాజ తనయా వినుమా
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ శతక పద్యం బాగున్నది.
'సురుడు 'కు బహువచనం' సురలు'
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. గమనించలేదు. సవరించితిని.
తొలగించండిరారాజు స్వగతం..మయసభలో.
రిప్లయితొలగించండిఔరా కలయా నిజమా!
యీ రచనా పటిమనుగన నిలనెవరయినన్
తేరుకొనగలరె, మయసభ
చారిమము హరించె నాదు స్వాంతము నెల్లన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా?
రిప్లయితొలగించండిప్ర్రెరణచే ప్రేమబిరిగి పెద్దలయందున్
ధీరతగన బరచుచు
మారెడి మమతానురాగ మాయనుగనుమా
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం.
శ్రీరామదాసును బంధించిన నవాబు వారికి సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులు మారువేషములో వచ్చి ధనము నీయగ వారి భావన:
రిప్లయితొలగించండిఒౌరా! కలయా! నిజమా!
కారాగారముననుండ కంచర్లాఖ్యుల్
శ్రీరామలక్ష్మణులిటుల్
వారంపిరని సిరులొసఁగ పరవశమాయెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఔరా కలయా నిజమా
రిప్లయితొలగించండిరారాయని చేయిజాపి రాణీనీవే
నోరారా పిలచితివా
యీరోజుకు కరుణకలిగెనిదియే చాలున్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఔరా కలయా నిజమా
రిప్లయితొలగించండిచారెడు యటుకుల నొసంగ సంపద లా వి
ప్రార్యున కొసంగెనట శ్రీ
నారాయణుడీ జగతిన నందరు గనరే.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు. 'చారెడు + అటుకు' లన్నపుడు సంధి నిత్యం. "చారె డటుకు లొసగి నంత సంపద...." అనండి.
మూడవపాదంలో ప్రాస?
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిధన్యవాదాలు. నేను గమనించలేదు.
"సంపద లెన్నో| పారున కొసంగెనట" అందాము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(శ్రీకృష్ణుని నోట బ్రహ్మాండమ్మునుం గనిన యశోద మనోగతము)
"ఔరా! కలయా, నిజమా?
శౌరి కలిత మాయొ? యేమొ? సంశోధింపన్
దీరగు బాలుం డింతయె!
నోరన్ బ్రహ్మాండ ముంటనో? యచ్చెరువౌ!"
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిహనుమంతుడు లంకానగరమును తగులబెట్టిన తరువాత త్రిజట తన మనసున భావించినట్లుగా
ఔరా కలయా నిజమా
వీరాసురురెల్ల మిగుల విస్మయమందన్
వారధి దాటుచు వచ్చెను
శ్రీరాముని దూత యొకొడు సీతను వెదుకన్
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
"Gandhi's statue installed in London Parliament Square"
రిప్లయితొలగించండిఔరా కలయా నిజమా!
పోరాటమ్మాడియాడి పోరున గెలిచెన్
భూరిగ లండను వాసుల
కోరిక తీరంగ గాంధి గొప్పగ నిలిచెన్!
రిప్లయితొలగించండిఔరా కలయా నిజమా!
ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్
హేరాలమ్ముగ కందము
లే రభసగ సాగె లివ్వు లివ్వు జిలేబీ :)
జిలేబి
ఔరా కలయా నిజమా!
రిప్లయితొలగించండిపోరగ నీ నెలవు కొరకు ప్రొద్దున రాత్రిన్
తీరుగ హైందవ వాదుల
కోరిక తీరెను ఘనముగ కోదండయ్యా!