6, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్యాపూరణం - 1808 (రాముఁ డేలినాఁడు రోము ప్రజల)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డేలినాఁడు రోము ప్రజల.

29 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  రాముడు వేరు - రోములస్ వేరు
  వారి కాలములు వేరు - శక్తియుక్తులు వేరు :
  01)
  _______________________________________

  పదునొకండు వేల - వత్సరాల్ కోసలన్
  రాము డేలినాడు ! - రోము ప్రజల
  రోములస్సను దొర - ప్రేమగా పాలించె !
  వీరలిరువురి ప్రఙ్ఞ - వేరు వేరు !
  _______________________________________

  According to the Ramayana, Rama ruled the Kosala kingdom

  from his capital, Ayodhya.
  see more@
  https://en.wikipedia.org/wiki/Kosala

  Romulus founded the new city, named it Rome,
  seemore@
  https://en.wikipedia.org/wiki/Romulus_and_Remus


  రామాయణ ప్రబోధమొక్కటే! పరుడే నరుడు నరుడే పరుడు. ఈ భూమిపైకి మహా విష్ణువు

  రావణుని మానవ రూపములోనే వచ్చి వధించ వలయునని మునులు తెల్పగా తధాస్తు అంటూ

  ఆయనే “దశవర్శసహస్రాణి దశవర్ష శతానిచ వత్స్యామి మానుషే లోకే పాలయన్

  పృథివీమిమాం” అని పదకొండు వేల సంవత్సరములు భూమిపై మానవునిగ నిలిచి

  పాలించెదనని హామీ ఇస్తాడు. ఇక పుట్టినది మొదలు సరయూ నదిలో ఆత్మ త్యాగము చేసుకొను

  వరకు దేవునిగా తన విభూతులను ఎక్కడ ఏ పరిస్థితి లోను ప్రదర్శించడు.
  see more@
  http://cherukurammohan.blogspot.in/2014/04/blog-post.html

  రిప్లయితొలగించండి
 2. కవి గాయక నటనా చక్రవర్తి - చరిత్ర ఙ్ఞాన శూన్య - బిరుదాంకితుడు
  రామశాస్త్రి కొడుకు - భీమశాస్త్రి - స్వకపోల కల్పితం
  02)
  _______________________________________

  రామశాస్త్రి కొడుకు - భీమశాస్త్రి రచించె
  వింతయైన సుంత - స్వంత కవిత
  పాడుచుండె నతడు - పాదాది యిటులుండె
  " రాము డేలినాడు ! - రోము ప్రజల ! "
  _______________________________________

  రిప్లయితొలగించండి
 3. ఒకదానికి బదులు మరొకటి పెడితే జరిగే అనర్థము :

  03)
  _______________________________________

  దీర్ఘమొత్వ మిడక - దీర్ఘంబు నిడినచో
  రాముడేలినాడు - రోము ప్రజల
  యనెడు వక్ర రీతి - యగు రామ చరితము !
  విశ్వ సత్య మిదియె - విబుధులార!
  _______________________________________

  రిప్లయితొలగించండి
 4. రోమునగరము - పాఠములో - అచ్చుతప్పు - దిద్దుటకై :

  04)
  _______________________________________

  అచ్చు తప్పు జరుగ - నా పాఠ మందున
  " రాము డేలినాడు - రోము ప్రజల "
  వేల ప్రతులు మరలె - వెనుకకు దిద్దగా
  " రోము డేలినాడు - రోము ప్రజల "
  _______________________________________
  రోములస్ ను ప్రజలు" రోమన్ "అని ముద్దుగా పిలుచు కొనేవారట
  రోమన్ - అంటే రోముడే గదా మరి

  రిప్లయితొలగించండి
 5. భరతభూమి నెల్ల బహు పసందుగ
  రాము డేలి నాడు;రోము ప్రజల
  నాడిననుసరించి నడవడి నేర్పుచూ
  బోధ చేసినారు పుడమి యందు.

  రిప్లయితొలగించండి
 6. వసంత కిశోర్ గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మూడవపూరణలో ‘ప్రజల| ననెడు...’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నేర్పుచూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘నేర్పుచున్’ అనండి.

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. వినయ శీలుడైన వీరాధి వీరుడౌ
   ఇనకులోత్త ము కథ సినిమ గాంచ
   రాము డేలి నాడు రోము ప్రజల మదిన్
   సత్యవర్తనమున సద్గుణమున

   తొలగించండి
 8. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  రామకథ రోమనులకు నచ్చిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఇనకులొత్తము’ అని టైపాటు...

  రిప్లయితొలగించండి
 9. ప్రజకు కొరత లేక పాలించె దేవుడై
  రాముడేలినాడు; రోము ప్రజల
  కష్ట నష్టములను కనకుండ"నీరో"యె
  పీడనంబుజేసె వింతరీతి

  రోము నగరం తగలబడుతుంటే "నీరో"చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడని చరిత్ర కధనం

  రిప్లయితొలగించండి
 10. రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  సమస్య విరుపులో పాలించె, ఏలినాడు అని పునరుక్తి వచ్చింది. ‘పాలించె దేవుడై| రాముఁ; డేలినాఁడు రోము ప్రజల...’ అంటే సరి.

  రిప్లయితొలగించండి
 11. సాల్వుల వధపిదప సాకేతపురమును
  రాముడేలినాడు, రోము ప్రజల
  బాధలనుగురించి పట్టించుకొననట్టి
  నాయకులను వారు రోయుచుండ్రి

  రిప్లయితొలగించండి
 12. కన్న బిడ్డ లవలె కాపాడి ప్రజలను
  రాము డేలి నాడు, రోము ప్రజల
  కనుల యందు సుఖము గనబడు నట్లుగ
  రోము ప్రభువు పాల నమొన రించె

  రిప్లయితొలగించండి
 13. లోటు లేక ప్రజకు మేటిగా రాజ్యమున్
  రాము డేలినాడు , రోము ప్రజల
  నెల్ల సంకటముల నెట్టి నీరో దొర
  చరిత లోన మిగిలె చవట వోలె!!!

  రిప్లయితొలగించండి
 14. అక్క శాంత తండ్రి అంగ దేశపు రాజు
  రోమపాదు డుండె రాము డేలు
  రాజ్యమందు యతని ప్రజల రోములనగ
  రాముదేలి నాడు రోము ప్రజల

  రిప్లయితొలగించండి
 15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరి పాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.
  ******
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని పూరణలోని 'లాజిక్' అర్థంకాలేదు.

  రిప్లయితొలగించండి
 17. గురుదేవులు శంకరయ్య గారికి నమస్కృతులు రోమపాదుని ప్రజను రోముప్రజలని వ్యవహరించాను
  లాజిక్కు కంటే మ్యాజిక్కు ఎక్కువ మన్నించవలెను
  తిమ్మాజీరావు

  రిప్లయితొలగించండి
 18. కన్న బిడ్డ లవలె కాపాడి ప్రజలను
  రాము డేలి నాడు, రోము ప్రజల
  కనుల యందు సుఖము గనబడు నట్లుగ
  పాల నమును జేసె ప్రభువు రోము

  రిప్లయితొలగించండి
 19. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. చూడ రోము చరిత జూలియస్ సీజరు
  రాజ వంశ జాత రమణుడతడు
  నట నలుబది యేండ్లు నాగస్థసుడనభి
  రాముఁ డేలినాఁడు రోము ప్రజల.
  (ఆగస్థస్ రాజు జూలియస్ సీజర్ బంధువు, దత్తుడు. 27 BC నుండి 14 AD వరకు పాలించాడు.)

  రిప్లయితొలగించండి
 21. తాను రాజునన్న ధర్మమ్ము వీడియు
  రోము కాలుచుండఁ బ్రోవ మఱచి
  యో ఫిడేలు పట్టి యొడబడు యింద్రియా
  రాముఁడేలి నాడు రోము ప్రజల!

  రిప్లయితొలగించండి
 22. శ్రీగురుభ్యోనమః

  జగతి క్షేమమెంచి జనరంజకమ్ముగా
  రాముఁ డేలినాఁడు, రోము ప్రజల
  గాథ గూర్చి చెప్ప ఘన చరిత్రయె నాకు
  తెలియ దనుచు నేను దెలుపుచుంటి

  రిప్లయితొలగించండి
 23. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  ఏలికగుచు భువికి వేవేల వత్సరాల్
  రాముడేలినాడు;రోముప్రజల
  నాడి నెరిగి జేసి నాయకుడొక్కడు
  చక్రవర్తి ఘనత చాటినాడు

  రిప్లయితొలగించండి
 25. మిత్రులందఱకు నమస్సులు!

  (బాల్యము నుండియు నాధ్యాత్మిక చింతన నలవరచుకొనిన యేసు క్రీస్తు, సమాజముచేఁ దీవ్రముగ నణఁగఁద్రొక్కఁబడినవారి నక్కునఁ జేర్చుకొని, సంఘ సంస్కర్తగ నప్పటి సమాజమందు మంచి మార్పునుం దీసికొనివచ్చుటకై ప్రయత్నించుచు, రాజ్యాంగము వంటి యూదుల పాత నిబంధనమను ధర్మశాస్త్రమును సవరించి క్రొత్త నిబంధనమును బోధించఁగా, నతని భోధనలకు పలువురు యూదులు, మరికొన్ని కులాలవారు ప్రభావితులు కాఁగా, రోమను సామ్రాజ్యపు రాజులకు, యూదులలోని మతఛాందసవారుల కేసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించఁగా, నతనిని దైవద్రోహిగను, దేశద్రోహిగనుఁ జిత్రీకరించి, చివరికి యూదుల కోరిక ప్రకారము రోమను లతని నత్యంత కిరాతకముగ శిలువ వేయఁగా, దైవమహిమచే నిర్యాణముఁ జెందిన యేసుక్రీస్తును దైవ కుమారుఁడని యూదులు మరియు రోమను లంగీకరించి, యతనినిం దమ మనస్సులలో నిలుపుకొని యారాధించిన వైనము నిట ననుసంధానించుకొనునది)

  బాల యేసు చిన్నవాఁడయ్యు నధ్యాత్మ
  చింతకుఁడయె! బడుగు మంతువులను
  నాదరించియు వెస నల రోము జనమనో
  రాముఁ డేలినాఁడు రోము ప్రజల"!!

  రిప్లయితొలగించండి
 26. వ్రాత తప్పుజరిగె బ్రాకెట్లనుంచితి
  " మూ "ను దీసి చదువ ముద్దుగుండు
  పుడమి జనులు మెచ్చ పుణ్యపురుషుడైన
  రాముఁడేలి నాడురో (ము) ప్రజల!

  రిప్లయితొలగించండి
 27. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'ఏలిక +అగుచు' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'ఏలిక యయి' అనండి.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి