15, అక్టోబర్ 2015, గురువారం

దత్తపది - 84 (కారు-లారీ-జీపు-వ్యాను)

కవిమిత్రులారా,
కారు - లారీ - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ `రామాయణార్థం'లో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
(డా. విష్ణునందన్ గారి సూచనను గౌరవిస్తూ...)

44 కామెంట్‌లు:

  1. రావణవధానంతరం రాముని దగ్గరకు వస్తున్న సీతను చూచి హనుమంతుని స్వగతం...

    కారు సామాన్యమానవు లీరవికుల
    తిలకు, లారీతి దుష్టదైత్యులను దునిమి
    రామరాజీ పునీత సీతామహాప
    తివ్రతకును దివ్యానుభూతి నొసఁగు నిఁక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారూ,
      మీ పూరణము భక్తిభావస్ఫోరకముగనుండి యలరించుచున్నది. అభినందనలు!

      తొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    (పరనారినిం జెఱఁబెట్టుట లంకకుఁ జేటగుననిన విభీషణుని రావణుఁడు కుపితుఁడై వెడలఁగొట్టఁగా, శ్రీరాముని శరణుఁ జొచ్చి, జరిగిన దంతయును వివరించు సందర్భము)

    "ఓయి కారుణ్యమూర్తి! మహోగ్రులయ్యు
    నపుడె లంకేశు లారీతి నన్నుఁ గ్రూర
    దౌష్ట్యపుం జీపురులతోడఁ దఱుమ, నేను
    నీదు దివ్యానురాగ సంస్నిగ్ధు నైతి!!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      దత్తపదాలను సమర్థంగా ఇమిడ్చి చేసిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రవి+అనుగ్రహము=రవ్యనుగ్రహము’ అవుతుంది.

      తొలగించండి
    2. అశోకవనమున సీతతో హనుమంతుడు పలికిన మాటలుగా నూహించిన పద్యము

      కారు! మాహరుల్ భీరులు, కయ్యమాడు
      వేళ, వానరులా రిపు వీరుల దును
      మాడ రాజీపుడమి జేరు మర్క టముల
      గూడి, దివ్యాను భూతులు కూడునికను.

      రాజు=శ్రీరాముడు

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. చెప్ప రవ్యానుగ్రహ సూతి చేరబిల్చి
    విపినమున కపులారీతి వెదకుచుండె
    విడువకుండగ నీరోజీ పుడమి పుత్రి
    గాంచవలెనని తలచ బేకారు బొడమె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రవ్యనుగ్రహసూతి’ ఆనండి. మూదవపాదంలో ‘...నీరోజీ’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
  5. గు రు వు గారు !

    రాజి ి అనగా ప౦క్తి
    ి
    కా౦తిరేఖ

    కీర్తి రాజీ పునీతులు

    కీర్తి రేఖ చేత పునీతులు

    అని సమాస౦ చేశాను

    రాజీ అను పద౦తో

    సమాస౦ చేయడము

    నేనొక.చోట చూచి ఈ

    సాహస౦ చేశాను

    రిప్లయితొలగించండి
  6. కారు బలహీను లమిత విక్రములు కపులు
    వార లారీతి యుండుట కారణంబు
    రామ రాజీ పు డ మియందు రాజ్య మేలు
    కతన నాతని దివ్యాను గ్రహము నొంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొద్దిగా అన్వయలోపం ఉంది. ‘దివ్యానుగ్రహము’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
  7. హనుమ సుగ్రీవునితో పలికిన భావంలో..



    వాలి పంపగ వచ్చిన వారు కారు
    రూపు లారీతిగాలేవు, తాపసులుగ
    కనగ దివ్యానుభూతియే గలిగె మదిని
    జీపు చూపక సుగ్రీవ! చెంత నిలుమ!!!

    రిప్లయితొలగించండి
  8. సీతా దేవి రామునికి మాయ లేడిని చూపుతున్న సందర్భము:
    మృగ వికారుడుమారీచు మృగమనుకొని
    విహ్వలారీ మృగము మణి వెలుగులన్న
    డరెను గద నభరాజీ పుడమి తెరగున
    రమణి భవ్యానుకంఠీధర గనుమనియె
    [ వికారము=మారురూపు; అనుకంఠి = ముత్యాల హారము; నభ రాజు + ఈపుడమి;
    విహ్వలారి = భయభ్రాంతులైన శత్రువులు గలవాడు, రాముడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      కానీ విహ్వలారీ, నభరాజీ అన్నచోట్ల అర్థం కాలేదు.నాల్గవపాదంలో ‘కంఠీధర’ అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. విహ్వల = భయాదులచేత అవయవముల స్వాధీనత తప్పినవాఁడు.
      విహ్వలు లైన శత్రువులు గలవాడు; నభ రాజు = ఆకాశానికి రాజు చంద్రుడు; క్రింద వ్రాసాను.
      గణదోషము లేదే “రమణి భవ్యాను కంఠీధ రగను మనియె” .

      తొలగించండి
    3. మీ వివరణతో ‘విహ్వలారీ’ వద్ద సందేహం తొలగిపోయింది. ధన్యవాదాలు.
      ‘నభోరాజు’ సరియైన రూపం.నభరాజు అనరాదు.

      తొలగించండి
    4. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. గణదోషము లేదు కద.
      నభ ను మార్చి వ్రాసిన పద్యము తిలకించ గోర్తాను.
      మృగ వికారుడుమారీచు మృగమనుకొని
      విహ్వలారీ మృగము మణి వెలుగులన్న
      డరెను గద నెల రాజీ పుడమి తెరగున
      రమణి భవ్యానుకంఠీధర గనుమనియె

      తొలగించండి
  9. గు రు మూ ర్తి ఆ చా రి *
    ..............................

    వి భీ ష ణు డు శ్రీ రాముని తో

    వినుమో రాఘవ. నాదు నగ్రజుని విద్వేషి౦చుచున్ వచ్చి నా

    డను ; క్రూరాత్ములు కారు దైత్యవరు లెల్లన్ ; నన్ను దివ్యాను క౦

    పనమున్ దాలిచి , చేరదీయుము ; కటా పాపాత్ము లారీతి సీ

    తను వేది౦ప ననార్యమౌ ; బల లస ద్రాజీ పురోగామివై

    చనుమా భ౦డనమ౦దు ; రాక్షస రహస్య౦ బుల్ వివక్షి౦చెదన్;


    ( రె౦డవపాద౦లో అభేద యతి ల -- డ. లకు )

    దివ్యానుక౦పనము : దివ్యానుగ్రహము.
    అనార్యము :పెద్దలు అ౦ గీకరి౦చని పని
    బల లసత్ రాజీ పురోగామి :
    బల మను కా౦తి రేఖ తో
    ము౦దుకు సాగు వాడు
    వివక్షి౦చు :వెల్లడి౦చు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    కారు చీకట్లు లంకను క్రమ్మ , హరియె
    పురిని గాల్చుచు దివ్యానుభూతి నొంద
    నసురు లారీతి మంటల నుసురులిడగ
    నంత రాజీపురియె దగ్ధ మగుట జూచె

    రిప్లయితొలగించండి
  11. కారుచీకటి సీత లంకందు జూడ
    హనుమ రాముని భక్తి నవ్యాను భూతి
    ధైర్యమొసగెడిలా రీతిదరికిజేరి
    దెలుప ?రాజీ పురల రక్ష గలసి నట్లె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
      ‘లంక+అందు=లంకయందు’ అవుతుంది. ‘ధైర్య మొసగెడిలా, రాజీ పురల’...?

      తొలగించండి
  12. రామా!దనుజకులారీ!
    భూమిజ దివ్యానురాగముదితుడ! కారు
    ణ్యామర ఝరి! పుంజీపు
    ణ్యామృత వారాశి! రవి కులా౦బుది సోమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      ఇది దత్తపది పూరణలా లేదు. సహజసుందర ధారతో శోభిల్లుతున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా మీ ఆశీర్వాద ఫలితము

      తొలగించండి
    3. కవిమిత్రులు శ్రీ కెంబాయి తిమ్మాజీ రావుగారూ,

      మీ కందపద్యధార రమణీయముగ నుఱుకులు పెట్టుచు మనస్సు నానందతరంగిత మొనర్చుచున్నది. శంకరయ్యగారన్నట్లుగ నిది దత్తపది పూరణమువలె లేదు. సహజ సుందరముగ నున్నది. అభినందనలు. స్వస్తి.

      తొలగించండి
  13. కారుమబ్బులరంగు కమనీయగాత్రమ్ము
    ..........నీరామమూర్తిది నిజము తల్లి!
    లేరమ్మ గెల్వగలారీ పృథివిలోన
    ..........నీనాథు నాజిలో నిజము తల్లి!
    ధర్మాచరణమున తలపడు రాజీ పు
    ..........నీతుడు నీభర్త నిజము తల్లి!
    నవ్యానుభూతులౌ నగజధవునకైన
    ..........నీపతిస్మరణాన నిజము తల్లి!

    రాముడెన్న సాక్షాత్తు నారాయణుండు
    రావణుని జంపు తథ్యమ్ము రణమునందు
    శశిని జేరెడు రోహిణి చందమీవు
    చేరెదవు నీవిభు ననె సమీరసుతుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ సీసపద్య పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. మిస్సన్న గారి పద్యం సుందరకాండ

      తొలగించండి
    4. కవిమిత్రులు మిస్సన్నగారూ,

      మీ సీసపద్యము సుందరపదవిన్యాసముతో సుందరకాండలోని హనుమంతునిఁ గనులముందు సాక్షాత్కరింపఁజేయుచున్నది. నడక రమణీయముగ నున్నది. అభినందనలు. స్వస్తి.

      తొలగించండి
  14. గురువుగారికి వందనములు.

    శ్రీరాముఁడు రావణప్రముఖులతో యుద్ధము చేయు సంధర్భము ..............

    కారు మబ్బులను సంఘములై పెరజీల్చి
    .......... తమమును డించునస్త్రముల గములు
    దుర్భేద్య బాణ సందోహమ్ము జూపి సం
    .......... హారమ్ము గనె ప్రబలారి తతుల
    శివధనుర్భంగ తేజీ పునర్విభవంబు
    .......... లంకేశు శిరము వ్రాలంగఁ గలిఁగె
    దివ్యానుభవమునొందెను విభీషణుఁడు శ్రీ
    .......... రామబాణప్రభారాశి గనుచు

    రాక్షసాధమ నిర్వీర్య దీక్ష బూని
    ప్రబల తర తీక్ష్ణ భీకరాస్త్రముల వైచి
    చెలఁగె లంకాపురాంగణాశ్రితులనెల్ల
    రాముఁడాహవమందున రహి వహించె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు సంపత్ కుమార్ శాస్త్రిగారూ,
      మీ సీసపద్యము హృద్యముగ సుందరపదశోభితమై యలరారుచున్నది. పదవిన్యాస మమోఘము. అభినందనలు.

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మధుసూదన్ గారి ప్రశంసకు పాత్రమైన మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  15. మోహనాకారుఁ జూచిన ముదిత సీత
    హృదయరాజీ పురుషుఁడని యెదురు చూచి
    వింటి రావములా రీతి విందుఁ జేయ
    రాముఁ జేబట్టె దివ్యానురాగ మొదువ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      చక్కని పూరణ చేశారు. అభినందనలు.

      తొలగించండి
  16. గురువుగారికి, తిమ్మాజీరావు గారికి, మధుసూదను మిత్రులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి