24, అక్టోబర్ 2015, శనివారం

సమస్య - 1834 (వాలమ్ములు గలవు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.
(‘కవిజనోజ్జీవని’ గ్రంథంనుండి)

40 కామెంట్‌లు:

  1. గురువు గారికి ప్రణామముల తో.....

    కవిమిత్రులకు అభినందనలు

    ఏలిక నడుమందున కర
    వాలమ్ములు గలవు రెండు, - బంట్రోతునకున్
    శూలము, వీరిరు వురు నిశి
    వేళన తిరుగాడు చుంద్రు వేగుల భంగిన్

    రిప్లయితొలగించండి
  2. అలుపనునది లే కుండగ
    పలువిధములపనులు జేసి వాసరమందున్
    నిలుచును కార్యాలయమున
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ నమస్కారం మీ పూరణ బాగున్నది. సమస్య కందపద్య పాదము గురువు తో ప్రారంభించ బడినది .....కనుక ప్రతిపాదము లోని మొదటి అక్షరం గురువు కావాలని అనుకుంటాను.... మరి ఓసారి మీరూ గమనించండి. నేనే పొరబడ్డానేమో,,,,,,మరి
      అన్యధా భావించరని సాహసించాను,,,

      తొలగించండి
    2. I have noticed it in the morning itself. I am not getting signal in my way back to Hyderabad from Vijayawada. I will try to revise by evening. Thank you.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    పోలియొ వ్యాధికి మిగిలిన
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్
    మాలిమి తోడుత వాటినె
    "మే" లని దువ్వును పదుగురు మెచ్చుకొనంగన్!

    (వాలము=తల వెండ్రుక)

    రిప్లయితొలగించండి
  5. పాలకుల దూషణములకు
    చీలుచు జుట్టంత నూడి చేతికి రాగా
    లీలగ తలపై చివరకు
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్!!!

    రిప్లయితొలగించండి
  6. పోలికలే లేకుండగ
    వాలమ్ములు గలవు రెండు బంట్రో తునకు
    న్నీ లాగున మఱి యిచ్చిన
    చాలను నే వ్రాయ దీని శంకరు సామీ !

    రిప్లయితొలగించండి
  7. వాలంబొక్కటి నదికర
    వాలము ,పరికించి జూడ వసుధన్ గాంచన్
    గాలిపటంబున కింపుగ
    వాలమ్ములు గలవు రెండు;బంట్రోతునకున్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    చాలును చేతికి తగు తడి
    చేలము నందున ముడువగ చిరునగవులతో
    కాలుడె లేకున్ననతడు
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.

    కేలే వాలంబగు తడి
    చాలకయున్న ప్రభువు సన్నిధి నిలుపన్
    వాలమ్మగు కేలు ముడువ
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *

    వాలుగ నడుమునకున్ కర
    వాలము వ్రేల౦గ. // వెనుక వచ్చుచు ను౦డెన్
    వాలము మెల్లని నడకల //
    వాలమ్ములు రె౦డు గలవు బ౦ట్రోతునకున్ !

    " వాలము " : గుర్రపు పిల్ల

    -----—---------------

    రిప్లయితొలగించండి
  10. ఏలిక కులమే తనదని
    వాలును సిరులొసఁగు చోట వాటము తోడన్
    లీలగ బలమూ, కొలువను
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బలమూ" అన్నదాన్ని "బలమును" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
      ఏలిక కులమే తనదని
      వాలును సిరులొసఁగు చోట వాటము తోడన్
      లీలగ బలమును, కొలువను
      వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్!

      తొలగించండి
  11. పాలించెడి భూపతి కర
    వాలపు నాలుకకు నొక్క వాలు౦డ౦గన్
    బేలరి నాలుకనెడి కర
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాలుక+అనెడి అన్నప్పుడు యడాగమం వస్తుంది. "నాలుక యను కర|వాలమ్ములు" అనండి.

      తొలగించండి
  12. వేలాతిక్రాంతాతివి
    శాలదళాంబుధి విశేష సైన్యదళమునన్
    పాలితబృత్యుని కడ కర
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      "మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. నా మఱియొక పూరణము:

    తొలుకాడు యౌవనముతో
    నలరారెడి భార్య లిద్ద ఱతనిం గొలువన్
    లలనల గృహముల కట నా

    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్!
    (ఆవాలము = స్థానము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరయ్యగారూ,

      నా రెండవ పూరణము ప్రాసపూర్వ హ్రస్వాక్షర యుతమైనందున, దానిని సవరించి మఱలం బ్రకటించితిని. పరిశీలించఁగలరు.

      తూలు నవ యౌవనముతో
      లాలితముగ భార్య లిద్ద ఱతనిం గొలువన్
      బేలల గృహముల కటనా
      వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్!

      తొలగించండి
  14. కాలమ్ము కలసిరాకను
    పాలసుని కొలువున తాను పనివాడైనన్
    శాలపని కచేరిపనియు
    వాలమ్ములు కలవు రెండు బంట్రోతునకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. హాలును లోపలి గదులను
    వీలుగ నూడ్చుటకు నొకటి వీధిని జిమ్మన్
    మూలఁ గలది కాంతాకర
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      చీపుర్లు కాంతాకరవాలాలా? బాగుంది. మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. అవును శంకరయ్యగారూ! కందుకూరి వీరేశలింగము పంతులుగారు దయ్యముల గుఱించి వ్రాసిన నొక కథలోఁ గాంతా కరవాలములం బేర్కొనినారు.

      తొలగించండి
    3. ఆఁ జ్ఞప్తికి వచ్చినది...అది...భూతవైద్యమునకు సంబంధించిన వ్యాసము! దయ్యములను, భూతములను వదలించుట కా వైద్యు లుపయోగించు పరికరముల సాంకేతిక పదములలో నొకటి యీ కాంతా కరవాలము (చీపురు కట్ట)!

      తొలగించండి
  16. అవును గురువుగారూ పానుగంటి వారి సాక్షిలో కూడా కాంతాకరవాలాన్ని పేర్కొన్నారు. మధుసూదన మిత్రునికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. వేలాడించగ వెనుకది
    కాలానుగుణముగ తీయు కత్తి కరమునన్
    వీలుగ కలెక్టరొసగిన
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

    రిప్లయితొలగించండి


  18. కాలము మారగ మారని
    హాలతయ కలెక్టరయ్య యాఫీసునహో
    పాలకి లేకున్నను కర
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. వీలుగ రాహులు కొకటియు
    జూలును విప్పుచును రాణి సోనియ కొకటిన్
    మేలుగ దండము బెట్టగ
    వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

    రిప్లయితొలగించండి