ఎంత సుదిన మిద్ది - యేమని వివరింతు నడవ లేని నేను - కడవ తోడ పరుగు పందె మందు - పాల్గొని గెలిచిన కలదె చెదరె ! చేతి - కడవ పగిలె ! ____________________________________
వి. యస్. ఆంజనేయులు శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'బహుమతి +అనుచు ' అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ' బహుమతి యని ' అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు ***** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు ' కల+ అదె' అన్నప్పుడు యడాగమం వస్తుంది. '"కలయె చెదిరె' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎంతసుదిన మిద్ది యేమని వివరింతు
తొలగించండిమనసు నిలువ కుండె మాటరాదు
లాటరీన నాకు కోటిరూ పాయల
బహుమతి యని తెలిసె పత్రి కందు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
రిప్లయితొలగించండిచెలియ నాదు ప్రేమ స్వీకరించె
చేయి చేయి కలిపి జీవితమ్ము గడుప
మేము నిశ్చయించినాము నేడు
ఎంత సుదిన మిద్ది ఏమని వివరింతు
రిప్లయితొలగించండివలచి వచ్చె నంత వారి జాక్షి
కలను గాంచి నటుల జలద రించెను మేను
కనులు తెరచె నేని కాన రాదు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
నీళ్ళ కడవ నెత్తుకొని పరుగెత్తే పందెం :
01)
____________________________________
ఎంత సుదిన మిద్ది - యేమని వివరింతు
నడవ లేని నేను - కడవ తోడ
పరుగు పందె మందు - పాల్గొని గెలిచిన
కలదె చెదరె ! చేతి - కడవ పగిలె !
____________________________________
వి. యస్. ఆంజనేయులు శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'బహుమతి +అనుచు ' అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ' బహుమతి యని ' అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు
*****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు
' కల+ అదె' అన్నప్పుడు యడాగమం వస్తుంది. '"కలయె చెదిరె' అనండి.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
ఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
నిడుము లెల్ల తొలగి పుడమి పండె
హర్ష మొందినారు కర్షకు లెల్లరున్
రాజు కన్న గొప్ప రైతు నేడు
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరావణ సంహారమైన తర్వాత శ్రీరామ పట్టాభిషేక సమయమున
రిప్లయితొలగించండిముని వశిష్టుల వారి స్పందన:
ఎంత సుదినమిద్ది! యేమని వివరింతు!
ధర్మమూర్తియనుచు ధరణి బొగడ
దుష్ట శిక్షణమ్ము శిష్టరక్షణమెంచు
రామ మూర్తి నేడు రాజు కాగ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎంత సుదినమిద్ది యేమని వివరింతు
రిప్లయితొలగించండినాదు కొడుకు నేడు నార్తు అమెరి
కాన బయలు దేరి కన్నుల పండువ
జేయ వచ్చు చుండె శీఘ్ర ముగను
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'నార్తు అమెరికా ' అని విసంధిగా వ్రాసారు. అన్య దృశ్యం కనుక ఫరవాలేదు.
1.ఎంత సుదినమిద్ది యేమని వివరింతు
రిప్లయితొలగించండిబామ్మ నైతి నన్న వార్త వింటి
అసలు కంటె వడ్డి యానంద మొసగుగా
అనుభవమ్ము గాదె నందరకును.
2.ఎంత సుదినమిద్దియేమని వివరింతు
సుతుడు కట్టు కొనియె సొంత యిల్లు
చిన్న యిల్లె యైన చింతలు లేకుండ
చేరి సుఖము గనుడు శీఘ్రగతిని.
3.ఎంత సుదినమిద్దియేమని వర్ణింతు
వరుణు కరుణ చేత వాన కురిసె
అన్నదాత తాను హర్షంబు తో మురిసె
పుడమి తల్లి తడిసి పులకరించె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో 'గాదె యందరకును' అనండి.
Sankarayya gaaru, ivalti poorana mariyu padya rachana oke bhavamu vachu vidhamuga raasanu..
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
------------------------------
ఎ౦త సుదిన మిద్ది యేమని వర్ణి౦తు
బాగుపడు నిక మన ప్రా౦త మెల్ల
ఓడె మహిళ చేత. రౌ డి , యెన్నిక ల౦దు
చీమ కుట్టె --చచ్చె సి౦హమయ్యొ
...............................
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిసమస్యా పూరణకు, పద్యరచనకు ఉభయ తారకమైన చక్కని పద్యం చెప్పారు. బాగున్నది. అభినందనలు.
ఎంతసుదినమిద్ది యేమని వివరింతు
రిప్లయితొలగించండిముద్దులొలుకుభామ ముందునిలచి
ప్రే మపాఠములను ప్రీతితో వల్లించ
దివికిచేరె మనసు తృప్తి తోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ముని భార్యలు శ్రీకృష్ణునకు నన్నము తీసుకొని వచ్చు సమయములో వారి మదిలోని మాటలు :
రిప్లయితొలగించండిఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
మేమిట బొడగంటిమి వసుదేవ
నందను పరితోషనందు సహిష్ణు రో
చిష్ణు విష్ణు కృష్ణు జిష్ణు నలర
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
1.పద్యరచన:ఎంత సుదిన మిద్ది యేమని వివరి౦తు
రిప్లయితొలగించండిభరతమాత స్వేచ్చ బడసె గాదె
స్వపరిపాలనమ్ము ప్రజలకు ఘటియించె
జాతి వర్గరహిత సంఘ మొదవె
2.ఎంతసుదినమిద్ది యేమని వివరింతు
సామరస్య సరస సహృదయమ్ము
లెల్ల నొకరి నొకరి హితవును గోరుచు
శాంతి యుతము గాను సంప్రతి౦ప
3.ఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
దూరదర్శనమ్ము దొరకొనంగ
వివిధసీమ లందు భేద భావము పోయి
విశ్వమంత ఐక్య వెదికయ్యె
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మాష్టారూ...నా పద్యం చూడలేదు మీరు
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినిజమే సుమా..... ఎందుకో తప్పిపోయింది. మన్నించండి.
మీ పద్యం మీ ప్రణయకవిత్వపు ధారలో ఒకటిగా మనోరంజకంగా ఉంది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(తననుఁ జేపట్టుటకు వచ్చు శ్రీకృష్ణునిం గని రుక్మిణి యానంద వాహినిలో మునిఁగితేలుచుఁ దనలో ననుకొనిన సందర్భము)
సీ.
ఎంత సుదిన మిద్ది! యేమని వివరింతు!
.....నిట్టి ఘడియ మఱి యెపుడు వచ్చు!
మదిని దోచియు నేఁడు మనువాడఁ గోరియు
.....నీలమేఘ నిభుండు, శైల ధరుఁడు,
నవనీత చోరుండు, నళినదళాక్షుండు,
.....ముర మర్దనుఁడు, వ్రజ మోహనుండు
శతపత్ర నేత్రనుం జారు సుగాత్ర నా
.....శిశుపాలు పాలనుఁ జేరకుండఁ
గీ.
గావఁ బురుష సింహుం డయ్యుఁ గన్యనైన
నన్ను నర్ధాంగిగాఁ గొని, ననుఁ దరింప
మన్మనోహరాకారుండు, మన్మనోజ్ఞుఁ
డాదరమ్మున నిటకుఁ బెండ్లాడ వచ్చె!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
రిప్లయితొలగించండిచింతలన్ని తీరె చెప్పనేల!
ముంత నిండ కల్లు మూడు రూపాయలె!
చంద్రశేఖరుండి చలువ వలన