శ్రీగురుభ్యోనమఃకలయో వైష్ణవ మాయయో కరుణయో కాకున్న దాక్షిణ్యమో వెల లేనట్టి మదీయ జీవితమునన్ వెల్గుల్ ప్రసాదింపగానిలచెన్ తానొక దివ్వె వోలె సుదిశా నిర్ణేతగా మారుచున్మలినం బింతయు లేని మత్గురునకు మా యన్నకున్ మ్రొక్కెదను
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.చివరిపాదంలో గణదోషం. ‘మద్గురునకున్’ అనండి.
కలయో వైష్ణవ మాయయో శివుని సంకల్పా ర్ధమో నిత్యమో తెలియన్ జాలము నీశులీ లలను నాదివ్య సంధానం బదిన్ కలతల్ రేపుచు మోహ మందునను లోకాతీత సౌఖ్యం బులన్ మలచెన్ మెండుగ రూపముల్ మిగుల నీమాయా జగం బందునన్
అక్కయ్యా,వృత్తరచనలోనూ చేయితిరిగింది మీకు. చాల సంతోషం. పద్యం బాగున్నది. అభినందనలు.రెండవపాదంలో గణదోషం. ‘దివ్య సంధానమున్’ అనండి.
కలయో వైష్ణవ మాయయొఇలలో మార్పుల గనుగొన నేమని పొగడన్ నలరించిన విజ్ఞాన మ్మలవైకుంఠపురిఁ జేసె నవనిని జూడన్ !
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో! వైష్ణవ మాయయొతెలియదె యా తాజమహలు తిలకించంగాతెలివెన్నెల వెలుగులలోవిలువగు ప్రేమకు గురుతుగ వెలసెను భువిలో!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయొ,పులకో, చెమరింతలో , విపులమౌ ముదమో,తలపోయుచునుండ నిపుడెనిలలో దరిసెనమునిచ్చి తీవు! భవానీ!
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయొ తెలుపంగా నిక జాలనేను దెఱపై జూడన్దెల తెల్లటి తనభూ తిని కలలో మఱి యిచ్చె నాకు కాలుడు దయతోన్
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మా అన్నయ్య చంద్రమౌళి రామారావు గారి పద్యముకలయో వైష్ణవమాయయొపలురీతుల ప్రకృతిభామ పార్వతియై యీయిలలో గుడిలో నవరాత్రులలోన మనోజ్ఞ భంగిఁ దోచుట నజమే?
చంద్రమౌళి రామారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.‘...దోచుట నజమే’...?
కలయో వైష్ణవమాయయొపలురీతుల ప్రకృతిభామ పార్వతియై యీయిలలో గుడిలో నవరాత్రులలోన మనోజ్ఞ భంగిఁ దోచుట నిజమే?(టైపాటు సవరించాను మాష్టారు)
కలయో వైష్ణవ మాయయొ కిలకిలనవ్వుచు మిటారి కేలందించన్ మెలతుక రూపును కనుగొనితళుకుమనె ను కోర్కె లెన్నొ తద్దయ్యు దృతితో
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహన్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరాష్ట్రుల గాంగేయ సమేతులం పఱచె నుగ్రుండై రణోత్సాహి గాకిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునేకలయో వైష్ణవమాయయొలలనయశోదగనెనుబల రామానుజ లీలల నోట విశ్వమంతయుబలారిసన్నుతుగొలుతును పద్మదలాక్షున్
కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహన్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరాష్ట్రుల గాంగేయ సమేతులం బఱచె నుగ్రుండై రణోత్సాహి గాకిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునే
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘విద్దెబుద్దులను’ అనండి. ‘మన్నించేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
మిత్రులందఱకు నమస్సులు!(పౌండ్రకవాసుదేవుని చెఱలో మ్రగ్గెడి తనను విడిపించుటకై యేతెంచిన శ్రీకృష్ణునిం జూచిన కుచేలుని యానందాతిరేకత)"కలయో? వైష్ణవ మాయయో? పర మనః కాంక్షార్థమో? తథ్యమో?కలఁతం గుర్తిడ లేక యుంటినొ? శుభైకాత్ముండనో? సన్మహోజ్జ్వలుఁడై కృష్ణుఁడు స్నిగ్థ రూపసిగ, మత్సంకల్ప సంధాయియై,చలితోద్వర్తిత నర్తితుండు నగుచున్ సాక్షాత్కరించెన్, ఘనాకులితవ్యాపిత మానసుండనగు నాకున్ బంధముల్ ద్రెంపఁగన్!!"
గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.
కలయో! వైష్ణవ మాయయొ!తలుపులు విడిపోగ జైలు దాటించె, నదీజలములు దారినొసంగగతెలవారకముందరె వసుదేవుఁడు కొమరున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయొతెలియగ జాలనయితినిట తిప్పలు బడినన్నలవడని పద్య రచనంబలవోకగ గుదురు చుండె నబ్బుర మయ్యెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
కలయో వైష్ణవ మాయయొఅలుకను విడి కలసి కొనిరి యాత్మీయతతోఇల చంద్రులు సంతోషముకలుగును రాష్ట్రాల వృద్ధి కడు వేగమునన్.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులేకలువన్ సంతస మాయెగా ప్రజకు సంకల్పంబు లీరీతిగావిలువై విశ్వము మెచ్చు రీతిగను ప్రావీణ్యాన సాదింపుగానిలుపంగా అమరావతీ నగరమే నిల్పేటి సంధర్బమున్.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయో కలిమిసంకల్పాలసంతోషమోవిలువల్గూర్చెడి విద్దెబుద్దులను నిర్వీర్యాన బోధించుచున్మలినంబంటిన మానవత్వమును సన్మానించి పోషించుచున్నిలలో దానవ మార్గముల్ వెదుక ?సాన్నిధ్యాన సంస్కారమా?
కలయో వైష్ణవమాయయొతిలకించగ నెల క్రితమిది తెలియక నెచటో నిలలో కానగ రాకయె కిలకిల నవ్వుచును నేడు కేరింతలిడెన్
కలయో వైష్ణవమాయయొతెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్జల జల రాలెను కందంబులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)జిలేబి
కలయో వైష్ణవమాయయొగలభా జేయుచు నిటునటు కలబడు రాహుల్ ములుగక నసుగక గొణుగక తెలియని చోటున కరిగెను త్రిప్పట తీరన్
గాడిద మాలచ్చి :)కలయో వైష్ణవమాయయొములుగుని బంగారమెల్ల ముద్దుగ చేరెన్తలపండిన ఆసామియెతెలుపగ గర్దభపు పాల తెవ్వన బిజినెస్ :)జిలేబి
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
కలయో వైష్ణవ మాయయో కరుణయో కాకున్న దాక్షిణ్యమో
వెల లేనట్టి మదీయ జీవితమునన్ వెల్గుల్ ప్రసాదింపగా
నిలచెన్ తానొక దివ్వె వోలె సుదిశా నిర్ణేతగా మారుచున్
మలినం బింతయు లేని మత్గురునకు మా యన్నకున్ మ్రొక్కెదను
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం. ‘మద్గురునకున్’ అనండి.
కలయో వైష్ణవ మాయయో శివుని సంకల్పా ర్ధమో నిత్యమో
రిప్లయితొలగించండితెలియన్ జాలము నీశులీ లలను నాదివ్య సంధానం బదిన్
కలతల్ రేపుచు మోహ మందునను లోకాతీత సౌఖ్యం బులన్
మలచెన్ మెండుగ రూపముల్ మిగుల నీమాయా జగం బందునన్
అక్కయ్యా,
తొలగించండివృత్తరచనలోనూ చేయితిరిగింది మీకు. చాల సంతోషం. పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘దివ్య సంధానమున్’ అనండి.
కలయో వైష్ణవ మాయయొ
తొలగించండిఇలలో మార్పుల గనుగొన నేమని పొగడన్
నలరించిన విజ్ఞాన
మ్మలవైకుంఠపురిఁ జేసె నవనిని జూడన్ !
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో! వైష్ణవ మాయయొ
రిప్లయితొలగించండితెలియదె యా తాజమహలు తిలకించంగా
తెలివెన్నెల వెలుగులలో
విలువగు ప్రేమకు గురుతుగ వెలసెను భువిలో!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయొ,
రిప్లయితొలగించండిపులకో, చెమరింతలో , విపులమౌ ముదమో,
తలపోయుచునుండ నిపుడె
నిలలో దరిసెనమునిచ్చి తీవు! భవానీ!
లక్ష్మీదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయొ
రిప్లయితొలగించండితెలుపంగా నిక జాలనేను దెఱపై జూడ
న్దెల తెల్లటి తనభూ తిని
కలలో మఱి యిచ్చె నాకు కాలుడు దయతోన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మా అన్నయ్య చంద్రమౌళి రామారావు గారి పద్యము
రిప్లయితొలగించండికలయో వైష్ణవమాయయొ
పలురీతుల ప్రకృతిభామ పార్వతియై యీ
యిలలో గుడిలో నవరా
త్రులలోన మనోజ్ఞ భంగిఁ దోచుట నజమే?
చంద్రమౌళి రామారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘...దోచుట నజమే’...?
కలయో వైష్ణవమాయయొ
తొలగించండిపలురీతుల ప్రకృతిభామ పార్వతియై యీ
యిలలో గుడిలో నవరా
త్రులలోన మనోజ్ఞ భంగిఁ దోచుట నిజమే?(టైపాటు సవరించాను మాష్టారు)
కలయో వైష్ణవ మాయయొ
రిప్లయితొలగించండికిలకిలనవ్వుచు మిటారి కేలందించన్
మెలతుక రూపును కనుగొని
తళుకుమనె ను కోర్కె లెన్నొ తద్దయ్యు దృతితో
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహ
రిప్లయితొలగించండిన్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరా
ష్ట్రుల గాంగేయ సమేతులం పఱచె నుగ్రుండై రణోత్సాహి గా
కిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునే
కలయో వైష్ణవమాయయొ
లలనయశోదగనెనుబల రామానుజ లీ
లల నోట విశ్వమంతయు
బలారిసన్నుతుగొలుతును పద్మదలాక్షున్
కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహ
తొలగించండిన్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరా
ష్ట్రుల గాంగేయ సమేతులం బఱచె నుగ్రుండై రణోత్సాహి గా
కిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునే
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విద్దెబుద్దులను’ అనండి. ‘మన్నించేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(పౌండ్రకవాసుదేవుని చెఱలో మ్రగ్గెడి తనను విడిపించుటకై యేతెంచిన శ్రీకృష్ణునిం జూచిన కుచేలుని యానందాతిరేకత)
"కలయో? వైష్ణవ మాయయో? పర మనః కాంక్షార్థమో? తథ్యమో?
కలఁతం గుర్తిడ లేక యుంటినొ? శుభైకాత్ముండనో? సన్మహో
జ్జ్వలుఁడై కృష్ణుఁడు స్నిగ్థ రూపసిగ, మత్సంకల్ప సంధాయియై,
చలితోద్వర్తిత నర్తితుండు నగుచున్ సాక్షాత్కరించెన్, ఘనా
కులితవ్యాపిత మానసుండనగు నాకున్ బంధముల్ ద్రెంపఁగన్!!"
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యం అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.
కలయో! వైష్ణవ మాయయొ!
రిప్లయితొలగించండితలుపులు విడిపోగ జైలు దాటించె, నదీ
జలములు దారినొసంగగ
తెలవారకముందరె వసుదేవుఁడు కొమరున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయొ
రిప్లయితొలగించండితెలియగ జాలనయితినిట తిప్పలు బడినన్
నలవడని పద్య రచనం
బలవోకగ గుదురు చుండె నబ్బుర మయ్యెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
కలయో వైష్ణవ మాయయొ
రిప్లయితొలగించండిఅలుకను విడి కలసి కొనిరి యాత్మీయతతో
ఇల చంద్రులు సంతోషము
కలుగును రాష్ట్రాల వృద్ధి కడు వేగమునన్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులే
రిప్లయితొలగించండికలువన్ సంతస మాయెగా ప్రజకు సంకల్పంబు లీరీతిగా
విలువై విశ్వము మెచ్చు రీతిగను ప్రావీణ్యాన సాదింపుగా
నిలుపంగా అమరావతీ నగరమే నిల్పేటి సంధర్బమున్.
కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులే
రిప్లయితొలగించండికలువన్ సంతస మాయెగా ప్రజకు సంకల్పంబు లీరీతిగా
విలువై విశ్వము మెచ్చు రీతిగను ప్రావీణ్యాన సాదింపుగా
నిలుపంగా అమరావతీ నగరమే నిల్పేటి సంధర్బమున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కలయో వైష్ణవ మాయయో కలిమిసంకల్పాలసంతోషమో
రిప్లయితొలగించండివిలువల్గూర్చెడి విద్దెబుద్దులను నిర్వీర్యాన బోధించుచున్
మలినంబంటిన మానవత్వమును సన్మానించి పోషించుచున్
నిలలో దానవ మార్గముల్ వెదుక ?సాన్నిధ్యాన సంస్కారమా?
కలయో వైష్ణవమాయయొ
రిప్లయితొలగించండితిలకించగ నెల క్రితమిది తెలియక నెచటో
నిలలో కానగ రాకయె
కిలకిల నవ్వుచును నేడు కేరింతలిడెన్
రిప్లయితొలగించండికలయో వైష్ణవమాయయొ
తెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్
జల జల రాలెను కందం
బులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)
జిలేబి
కలయో వైష్ణవమాయయొ
రిప్లయితొలగించండిగలభా జేయుచు నిటునటు కలబడు రాహుల్
ములుగక నసుగక గొణుగక
తెలియని చోటున కరిగెను త్రిప్పట తీరన్
రిప్లయితొలగించండిగాడిద మాలచ్చి :)
కలయో వైష్ణవమాయయొ
ములుగుని బంగారమెల్ల ముద్దుగ చేరెన్
తలపండిన ఆసామియె
తెలుపగ గర్దభపు పాల తెవ్వన బిజినెస్ :)
జిలేబి