9, అక్టోబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1028

కవిమిత్రులారా, 
“అనిశము సర్వభూతములయందు....”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

60 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మంచిమాటలు :

    01)
    ________________________________________________

    అనిశము సర్వ భూతముల - యందిల ప్రేమను పంచగావలెన్
    వనితల నెల్ల వేళలను - పావన దృష్టిని జూడగా వలె
    న్ననదగు సర్వ కాలముల - నా హరి నామమె సేమ మిచ్చుటన్
    విననగు పెద్దలెవ్వరును - వేడుక సుద్దు లవెన్ని జెప్పినన్
    ________________________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      ఆ ప్రయోగంలో దోషం లేదు కాని, సర్వత్రా అనుసరణీయమైనది కాదు. ఏదో తప్పని పరిస్థితిలో తప్ప...

      తొలగించండి
  2. మంచిమాటలు :

    02)
    ________________________________________________

    అనిశము సర్వ భూతముల - యందును దైవము జూడగా వలె
    న్నెనరును జూపగా వలెను - నేస్తులుగా మది నెంచగా వలెన్
    పనిపడి హింసకున్ జెలగి - పాపపు కార్యము జేయ రాదయా
    సునిశిత బుద్ధితో మెలగ - శోభనమౌ యిల నెల్లకాలమున్ !
    ________________________________________________

    రిప్లయితొలగించండి
  3. అనిశము సర్వ భూతముల యందున దాఁ గలడంచుఁ బల్కినన్
    వినదగు వారలిచ్చట నవిజ్ఙులె? శ్రీపతి యిచ్చటి స్తంభమందునన్
    గనగలమే?యటంచు నట గర్వమదాంధుడు గొట్టినంతనెే
    వణకుచుఁ గర్వరుండుఁ గన వచ్చె నృసింహుడు మట్టుపెట్టగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘యిచ్చటి’ తొలగిస్తే సరి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      అనిశము సర్వ భూతముల యందున దాఁ గలడంచుఁ బల్కినన్
      వినదగు వారలిచ్చట నవిజ్ఙులె? శ్రీపతిఁ స్తంభమందునన్
      గనగలమే?యటంచు నట గర్వమదాంధుడు గొట్టినంతనెే
      వణకుచుఁ గర్వరుండుఁ గన వచ్చె నృసింహుడు మట్టుపెట్టగన్!

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    అనిశము సర్వ భూతముల యందుఁ గృపం గురిపింపఁగా వలెన్
    మనమున శాంతితోడ మన మందఱ మిత్తఱి స్నేహమొప్పఁగా
    ఘనతనుఁ జాటి హింస విడఁగా వలెఁ బెంచుచు సౌమనస్యమున్
    మన విధిఁ దప్పకుండఁ జను మార్గము నీతియె సత్యమే సఖా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీతి బోధకమై చక్కని ధారతో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

  5. శ్రీగురుభ్యోనమః

    అనిశము సర్వభూతములయందు వసింపగ నాత్మ రూపమున్
    గనుచు విశాలభావమున గర్వము వీడి చరించువాడవై వినయవిధేయతల్గలిగి పెద్దల నొజ్జల గౌరవించుచున్
    ఘనమగు కీర్తి నొందుము జగంబులు మెచ్చగ బుద్ధిమంతుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'జనంబులు మెచ్చెడి పద్యరాజమై' అలరారుతున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీపతి శాస్త్రి గారూ, చక్కని పద్యం. పద్యాంతంలో - బుద్ధిమంతుడై అని కాకుండా, బుద్ధిశాలివై అనండి.బుద్ధిమంతుడై అన్నప్పుడు - ప్రథమ పురుష - వాడు బుద్ధిమంతుడై , వీడు బుద్ధిమంతుడై అన్న అర్థం. బుద్ధిశాలివై అన్నప్పుడు, మధ్యమ పురుష - అంటే నీవు బుద్ధిశాలివై అన్న అర్థం. పద్యం 'ఎదుట నిలుచున్న వ్యక్తికి ' నిర్దేశం చేస్తున్నట్లుంది కనుక మధ్యమ పురుష లో ఉన్నట్టు లెక్క.

      తొలగించండి
    3. డా. విష్ణునందనుల వారికి ధన్యవాదాలు.

      తొలగించండి
    4. శ్రీ విష్ణునందన్ గారికి కృతజ్ఞతాభివందనములు.

      తొలగించండి
    5. అనిశము సర్వభూతములయందు వసింపగ నాత్మ రూపమున్
      గనుచు విశాలభావమున గర్వము వీడి చరించువాడవై
      వినయవిధేయతల్గలిగి పెద్దల నొజ్జల గౌరవించుచున్
      ఘనమగు కీర్తి నొందుము జగంబులు మెచ్చగ బుద్ధిశాలివై

      తొలగించండి
  6. అనిశము సర్వభూతములయందు కృపామతితో జరించు తా
    దినుచును త్రాగుచున్ వినుచు దిక్కుల జూచుచు నిద్రజెందుచున్
    మనమున శ్రీహరిన్ దలచు మాయని భక్తిని నెల్లవేళలన్
    దనుజసుతుండు చిక్కుముడి తండ్రికి గుర్వుల కెల్ల వారికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రహ్లాదుని వ్యక్తిత్వాన్ని వివరిస్తున్న మీ పద్యం ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మిస్సన్న గారి పద్యం మనసుకు హత్తుకునేలా ఆర్ద్రంగా ఉంది.వారికి అభినందనలు. ఒకట్రెండు చిన్న సవరణలు. ద్వితీయ పాదాంతంలో - ' నిద్రవోవుచున్ ' అనీ, చతుర్థ పాదంలో ' తండ్రికి నొజ్జలకెల్ల వారికిన్ ' అనీ మారిస్తే బాగుంటుంది. ' గురువులకు ' అన్న రూపం ఛందస్సుకోసం "గుర్వులు" కానేరదు కానీ గుర్వు అన్న పదానికి వేరే అర్థముంది. అందుకే యీ సవరణ.
      అలాగే సమయం సందర్భం కాబట్టి ఇక్కడే పఠితృ మహాశయులకు ఇంకో సూచన. గురువు అన్న పుంలింగ శబ్దాన్ని - స్త్రీ ఉపాధ్యాయినులను సూచించడం కోసం కొంతమంది ' గుర్విణి ' అని వాడుతూంటారు. అది మహా దోషం. గుర్విణి అంటే ఉపాధ్యాయిని కాదు, నిండు చూలాలు అన్న అర్థం. ప్రముఖ విద్వత్కవి మొవ్వ వృషాద్రిపతి గారి నోట ప్రసంగ వశాత్తు విన్న మాటల ప్రకారం ' వారి పాఠశాలలో ఒక ఉపాధ్యాయిని పదవీ విరమణ సందర్భంగా ' ఒకానొక ఔత్సాహిక ఉపాధ్యాయ కవి ' అమ్మ గుర్విణి వందనాలందుకొమ్మ ' అన్న మకుటం తో పద్యాలు వ్రాసుకొచ్చి చదువుతూంటే - విస్తుపోవడం , ఆ తరువాత నవ్వుకోవడం ' అభిజ్ఞుల ' వంతయ్యింది. స్వస్తి.

      తొలగించండి
    3. డా. విష్ణునందన్ గారూ,
      మిస్సన్న గారి పద్యంలో సవరణలు సూచించినందులకు, వానిని అనుసరిస్తూ మిత్రులకు ఉపయుక్త విషయాన్ని వివరంగా, హాస్యస్ఫోరకంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    4. నేను తరచు చేసే తప్పును సరిదిద్ది మంచి సూచనలను చేసిన డా. విష్ణునందనులకు ధన్యవాదములు.

      తొలగించండి
  7. అనిశము సర్వ భూతముల యందిల దైవము జూచు చుండియు
    న్దనరగ బ్రేమ భావము లు తప్ప క వర్తిలు చున్మ నం గగా
    న్న నయము శాంతి సౌఖ్యము లు యాయత రీతి నొప్పవే ?
    యనుపమ ! నీవె దెల్పు మది యాయువు గూడను వృధ్ధి చెంద దే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘సౌఖ్యములు+ఆయత’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మనంగగా| ననయము శాంతి సౌఖ్యములె యాయత రీతిని నొప్పుచుండవే...’ అందామా?

      తొలగించండి
  8. అనిశము సర్వ భూతముల యందును ప్రేమను జూపగా వలెన్
    ధనమును మాటు జేయక, నుదారము జూపుచు పేదవారలన్
    తనదగు రీతి వారి పరితాపము తీర్చుట మానుషంబగున్
    కనికరమున్న వారలను గాచును దైవము సర్వ కాలమున్.

    రిప్లయితొలగించండి
  9. అనిశము సర్వ భూతముల నాత్మగ నిల్చిన శ్రీహరిన్ సదా
    కని మది సంతసించుతఱి కక్షలు పోరులు నుండునే కదా!
    మనుజులు బుద్ధి గల్గినను మంగళమెల్లెడ నిల్పకుందురే?
    తనదగు లాభమెద్ది యని తప్పుడు లెక్కల నుందురే? కటా!

    రిప్లయితొలగించండి
  10. అనిశము సర్వభూతములయందు నుదార కృపాళుడై యిలన్
    వినయ విధేయ తన్గురుల వృద్దజనంబుల గారవించుచున్
    మనమున నిత్యతాపమదమత్సర మోహగుణాళి దూరుడై
    యనునయ వాక్యసంపదల నార్తుల గాచుచు నుండ ధన్యుడే

    రిప్లయితొలగించండి
  11. :అనిశము సర్వభూతముల యందు పరాత్పరు డాత్మరూపుడై
    మనుచును.బాల్య యౌవన సమస్త దశల్ పరిణామ మందుచున్
    తనువును వీడి పోవు నిది తథ్యము. నిత్యము జీవకోటికిన్
    అనయము యాత్మశోధనము అందు కొనంగను విష్ణు సన్నిధిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అనయము నాత్మ శోధనము నందుకొనంగను..’ అనండి.

      తొలగించండి
    2. లక్ష్మీదేవి గారూ,
      ‘కోటికిన్+అనయము=కోటికి ననయము’ కావాలి. కాని కొన్నిచోట్ల ఇటువంటి సంధర్భాల్లో ‘కోటికి న్ననయము’ అనే విధంగా ప్రయోగాలు కనిపిస్తున్నాయి. (ముఖ్యంగా పోతన కవిత్వంలో)

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  12. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘ఘనుడగు + అంబుజోదరుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఘనుడగు నంబుజోదరుడు కాంచ తరమ్మొకొ నా విలాసముల్’ అనండి.
    ‘సతమ్మును నార్తుల’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. రెండవ పాదాన్ని సవరించారు. బాగుంది. కాని సంధిదోషాలు అలాగే ఉన్నవి.

      తొలగించండి
    2. అనిశము సర్వభూతములయందు వసించును నిశ్చయమ్ముగా
      ఘనుడగు నంబుజోదరుడు, కాంచతరమ్మొకొనా విలాసముల్
      తనసుఖమేతలంచుచు సతమ్మును నార్తులనాదరించకన్
      మను గుణహీనులెప్పుడును మాధవలోకముఁబో నసాధ్యమౌ

      తొలగించండి
  14. అనిశము సర్వ భూతముల యందనురాగము గల్గి యుండుమీ
    వనచరు లైన నేమి? మృధు భావన గల్గి చరించుటే కదా!
    ఘనమగు మానవత్వమది! కల్పమునందున మేటిజన్మ యే
    మననర జన్మమంచు, తలమానిక మైన పథంబు నడ్వుడీ! (నెంచుడీ)

    రిప్లయితొలగించండి
  15. కవి మిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    అనిశము సర్వ భూతముల యందు వసింతు ; సమస్త జీవరా
    శిని సృజనమ్ము జేసి , మనజేసి , లయంబొనరింతు నేనె ; యో
    అనిమిషనాథ పుత్రక ! మహాహవ వీరులు నీవు చంపకు
    న్నను బ్రతుకన్ గలారలిట నాస్తి ; త్యజింపుము సంశయంబులన్
    కనుమిదె విశ్వరూపమును ; గాండివధారివి కమ్ము లెమ్మికన్ ;
    నను మది విశ్వసించుచు నొనర్పుము నీ విధి ; నిన్ను కాచెదన్ ;
    కనలకు , నీవు దేనికిని కర్తవు కావు ; క్రియాగతుండవే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గీతాసారాన్ని సంక్షిప్తంగా చెప్పిన మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. అనిశము సర్వభూతములయందు వసించెడు ప్రత్యగాత్మ తా
    మనుచు నెఱింగి ద్వంద్వములనందక నిత్యము శాంతచిత్తులై
    ఘన విషయాబ్ధిఁ లోఁబడక కౌతుకమొప్పుచు కర్మ సాక్షులై
    మనగలువారు మాన్యులు నమానుష తేజులు మోక్ష సాధకుల్.

    రిప్లయితొలగించండి
  17. అనిశము సర్వభూతములయందనురాగ దయార్థ చిత్తుడై
    మనుజుడు జీవితాంత మిల మత్సరమున్ విడనాడి ప్రీతితో
    మనవలె ధర్మమార్గమున మానవ జాతికి మార్గ దర్శుడై,
    వినవలె వేద వాక్కులను విజ్ఞులు మెచ్చగ చిత్త శుద్ధితో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'దయార్ద్రచిత్తుడై..... మార్గదర్శియై' అనండి.

      తొలగించండి
  18. అనిశము సర్వభూతములయందనురాగ దయార్థ చిత్తుడై
    మనుజుడు జీవితాంత మిల మత్సరమున్ విడనాడి ప్రీతితో
    వినవలె వేద వాక్కులను విజ్ఞులు మెచ్చగ చిత్త శుద్ధితో
    మనవలె ధర్మమార్గమున మానవ జాతికి మార్గ దర్శుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు మొదటగా పోస్ట్ చేసిన పద్యం క్రింద నా వ్యాఖ్య ఉంది కదా... దాని క్రింద ‘ప్రత్యుత్తరం’ అని ఉంటుంది. దానిని క్లిక్ చేసి వచ్చిన బాక్సులో టైప్ చేసి మీ సవరణను పోస్ట్ చేయాలి.
      ఈ సవరణ పద్యంలో ‘దయార్ద్ర’ను సరిచేయలేదు. లేక ‘దయా+అర్థ చిత్తుడై’ అని మీ భావమా/

      తొలగించండి
  19. గురుదేవులు సూచించిన విధముగా సవరించిన పద్యము

    అనిశము సర్వభూతముల యందు పరాత్పరు డాత్మరూపుడై
    మనుచును.బాల్య యౌవన సమస్త దశల్ పరిణామ మందుచున్
    తనువును వీడి పోవు నిది తథ్యము. నిత్యము జీవకోటికి
    న్ననయము నాత్మశోధనము నందుకొనంగను విష్ణు సన్నిధిన్

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులు సూచించిన విధముగా సవరించిన పద్యము

    అనిశము సర్వభూతముల యందు పరాత్పరు డాత్మరూపుడై
    మనుచును.బాల్య యౌవన సమస్త దశల్ పరిణామ మందుచున్
    తనువును వీడి పోవు నిది తథ్యము. నిత్యము జీవకోటికి
    న్ననయము నాత్మశోధనము నందుకొనంగను విష్ణు సన్నిధిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు మొదటగా పోస్ట్ చేసిన పద్యం క్రింద నా వ్యాఖ్య... దాని క్రింద ‘ప్రత్యుత్తరం’ అని ఉంటుంది. దానిని క్లిక్ చేసి వచ్చిన బాక్సులో టైప్ చేసి మీ సవరణను పోస్ట్ చేయాలి.

      తొలగించండి
  21. అనిసము సర్వ భూతములయందనురక్తిని గూడియుండుచున్
    మనమున మానవత్వమును మంచిని వీడక నెల్లవేళలన్
    వినయము తోడ పెద్దలను వేడ్కను జూచుచు సాదరమ్ముతో
    ఘనమగు దైవభక్తియును గల్గి చరించును సజ్జనుండిలన్!!!

    రిప్లయితొలగించండి
  22. అమిత్ షా ఉవాచ:

    "అనిశము సర్వభూతముల యందిట వోటరు రూపు గాంచుచున్
    కనుగొని వారి వారి విట కష్టము నష్టము లీతిబాధలన్
    పనుపుచు పార్టి వర్కరుల బంధుల రీతిని రమ్మువమ్ముతో
    చనుముర వెంబడించుచును శాలువ కప్పుచు వోట్ల బూత్లకున్!"

    రిప్లయితొలగించండి
  23. అనిశము సర్వభూతముల యందున గాంచగ నంతరాత్మనున్
    మునివరు లెల్లరిన్ పిలిచి పూజలు జేయుచు ముక్తికోసమై
    కనుగొని ధర్మ మార్గమును కాపుర మందున మున్గి తేలుచున్
    చనుచును హైద్రబాదునకు జల్దిని చూడుము చంద్రశేఖరున్

    రిప్లయితొలగించండి