8, అక్టోబర్ 2015, గురువారం

పద్యరచన - 1027

కవిమిత్రులారా, 
"ఇద్దరు భార్యలు గలిగిన..."
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి. 

69 కామెంట్‌లు:

 1. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దులు వర్షించుననుచు మురియకు రేపా
  యిద్దరు కలహించినచో
  నిద్దుర లేకుండ పోయి నిస్పృహ మిగులున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. ఇద్దరు భార్యలు కలిగిన
  నిద్దుర కరువంచు చెప్పు నీతిని గనరా!
  పెద్దలు చెప్పిన సుద్దుల
  నొద్దిక గావిన్న వాడు నుర్విన ఘనుడౌ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘ఉర్విని ఘనుడౌ’ అనండి.

   తొలగించండి
 3. ఇద్దరు భార్యలు కలిగిన
  నొద్దికగా సుఖము లందు నూహలు కల్లే!
  యుద్ధము సేయగ సవతులు
  నిద్దుర లేకుండ పోవు నిజమిది వినరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
   మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘కల్ల+ఏ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘ఊహలు బొంకే’ అనండి.

   తొలగించండి
 4. ఇద్దరు భార్యలు గలిగిన
  చద్దన్నము కూడ కరువె చాపే గతియౌ
  నిద్దరి కోర్కెలు దీర్చగ
  మద్దెల దరువౌను తుదకు మాటే కరువౌ

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  రుక్మిణి, జాంబవతులతో పాటు సత్యభామా మొదలగు
  మరియొక ఆరుగురిని పెళ్ళాడిన శ్రీకృష్ణా ! మమ్ము రక్షించు :

  01)
  ______________________________________

  ఇదరు భార్యలు గలిగిన
  హద్దును సంతృప్తి లేక - నార్గురి నింక
  న్నొద్దిక వివాహ మాడిన
  సిద్ధుడ, శ్రీకృష్ణ మాకు - శ్రేయమ్మిడుమా !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 6. సిరిగిరి వాసా - శ్రీనివాసా - రక్షించు :

  02)
  ______________________________________

  ఇదరు భార్యలు గలిగిన
  మొద్దుగ మారిన సిరిగిరి - మోహన రూపా
  నిద్దుర పోయెడి మమ్ముల
  కొద్దిగ కరుణించి మేము - కోరినవిమ్మా !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 7. ఓ కైలాస వాసా కాపాడు :

  03)
  ______________________________________

  ఇదరు భార్యలు గలిగిన
  సిద్ధుడవై తపము జేయు - శ్రీ కంఠేశా
  వద్దనక మాదు జోతల
  నొద్దిక మాపైన జూపు - మో పరమేశా
  ______________________________________
  ఒద్దిక =చెలిమి

  రిప్లయితొలగించండి
 8. ఓ విఘ్న నాయకా , వినాయకా - సిద్దినీ బుద్దినీ మా కిమ్ము :

  04)
  ______________________________________

  ఇదరు భార్యలు గలిగిన
  సిద్దిని బుద్ది న్నిడుమయ - శ్రీ విఘ్నేశా
  శుద్ధపు గరికయు పత్రియు
  ముద్దగు నుండ్రాళ్ళ తోడ - పూజింతుము నిన్
  ______________________________________

  రిప్లయితొలగించండి
 9. ఇద్దరుభార్యలు కలిగిన
  తద్దయు యుడుములు కలుగుట తధ్యము జగతిన్
  గద్దియపైనున్నపతికి
  నిద్దురకరవౌను సుమ్మ నిత్యకలతలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘తద్దయు నిడుములు...’ అనండి. నిత్యకలత అని సమాసం చేయరాదు. ‘నిత్యక్షోభన్’ అనండి.

   తొలగించండి
  2. గురువర్యుల సవరణలకు ధన్యవాదములు.

   తొలగించండి
 10. ఇద్దరుభార్యలుకలిగిన
  నొద్దికగాపెద్దది తన యొడిలో నుంచన్
  ముద్దులుగాఱెడి చిన్నది
  పద్ధతగుపదములసేవ వైవశ్యమిడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘పద్ధతి+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పద్ధతియగు పాదసేవ...’ అనండి.

   తొలగించండి
  2. గురువర్యుల సవరణలకు ధన్యవాదములు.

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 11. శంతనుని పురోహితుడు - దేవవ్రతునితో :

  05)
  ______________________________________

  ఇదరు భార్యలు గలిగిన
  గద్దెకు కీడగు, సుతునకు - ఘాతక మిదియౌ
  వద్దనె రెండవ పెండ్లిని
  బ్రద్దలయిన హృదయమునను - బాధ లెగసినన్ !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 12. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దౌ దేవతలకెల్ల మురిపెము తోడన్
  హద్దులు మరచుచు నిలలో
  నిద్దరి నుద్వాహ మైన నిత్యము రణమే.

  రిప్లయితొలగించండి
 13. ఇద్దరు భార్యలు గలిగిన
  గద్దింపులు దప్పవెపుడు కాపురమందున్
  వద్దుసుమా చెడును బ్రతుకు
  సిద్ధాన్నము కరువుగాదె శివశివ శంభో!!!

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు మనవి...
  వ్యాఖ్యను చేర్చే పద్ధతిలో చిన్న మార్పు చేశాను. మీ పద్యం క్రిందనే నా వ్యాఖ్య ఉంటుంది. ఆ వ్యాఖ్యపై మీరేమైనా చెప్పాలన్నా, సవరించిన పద్యాన్ని పెట్టాలన్నా నా వ్యాఖ్య క్రింద ‘ప్రత్యుత్తరం’ అన్నదాన్ని క్లిక్ చేసి అక్కడ మీ వ్యాఖ్యను నమోదు చేయండి. ఒక పద్యాన్ని గురించి అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఒకేచోట ఉంటాయి.

  రిప్లయితొలగించండి
 15. ఇద్దరు భార్యలు గలిగిన ,
  పెద్దది పాదముల నొత్తు..ప్రీతిని గూర్చున్
  ముద్దులిడుచు యాచిన్నది.
  అద్దిర నీ వె౦త సరసుడ వ౦బుజ నాభా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘...ఇడుచు నా చిన్నది...’ అనండి.
   నాల్గవపాదంలో గణదోషం. ‘అద్దిర యెంతయొ సరసుడ...’ అందామా?

   తొలగించండి
  2. గురుదేవులకు ప్రణామములు మీసూచన మేరకు సవరించిన పద్యము
   ఇద్దరు భార్యలు కలిగిన
   పెద్దది పాదముల నొత్తు .ప్రీతిని గూర్చున్
   ముద్దులిడుచు నాచిన్నది
   అద్దిర యెంతయొ సరసుడ వంబుజ నాభా

   తొలగించండి
  3. గురుదేవులకు ప్రణామములు మీసూచన మేరకు సవరించిన పద్యము
   ఇద్దరు భార్యలు కలిగిన
   పెద్దది పాదముల నొత్తు .ప్రీతిని గూర్చున్
   ముద్దులిడుచు నాచిన్నది
   అద్దిర యెంతయొ సరసుడ వంబుజ నాభా

   తొలగించండి
 16. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దులు మురిపెంబు లవియు మోదము గూర్చు
  న్నిద్దరు తగవులు బోయిన
  నద్దిర సంసార ముండు నధమ స్థి తికిన్

  రిప్లయితొలగించండి
 17. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘స్థితిలోన్’ అనండి ...అన్వయం చక్కగా కుదురుతుంది.

  రిప్లయితొలగించండి
 18. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దులు మురిపెంబు లవియు మోదము గూర్చు
  న్నిద్దరు తగవులు బోయిన
  నద్దిర సంసార ముండు నధమ స్థి తిలోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   దీనిని మళ్ళీ ప్రత్యేకంగా పోస్ట్ చేయవలసిన పని లేదు. పైన నా వ్యాఖ్య క్రింద ‘ప్రత్యుత్తరము’ అన్నదాన్ని క్లిక్ చేసి వచ్చిన బాక్సులో టైప్ చేసి పోస్ట్ చేయడమే.

   తొలగించండి
  2. ఇద్దరు భార్యలు గలిగిన
   మద్దెల దరువే ప్రబుద్దు మర్త్యుని కకటా
   బుద్దిగ నొక్కసుదతినిన్
   ముద్దు మురిపెములొలికించి మోదపడదగున్

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   మీరు సుబ్బారావు గారి పద్యానికి ‘ప్రత్యుత్తరం’లో పోస్ట్ చేశారు. అలా ప్రత్యుత్తరాన్ని క్లిక్ చేయకుండా పూర్తిగా క్రింద ఉన్న బాక్సులో టైప్ చేసి పంపండి.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పొరపాటున చేశాను. ధన్యవాదములు.

   తొలగించండి
 19. ఇద్దరు భార్యలు కలిగిన
  గద్దరివేంకట పతి సిరి కన్నులు మూయున్
  సుద్దులు పల్కు ను చెవిలో
  నుద్దవడిని పద్మసతికి నూరట గలగన్

  రిప్లయితొలగించండి
 20. ఇద్దరు భార్యలు గలిగిన
  నిద్దుర కరువౌను చింత నిజముగ పెరుగున్
  యుద్ధము జరుగును నిత్యము
  ఒద్దికగానుండు భార్య యొకతే చాలున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘నిత్యము+ఒద్దిక’ అని విసంధిగా వ్రాయరాదు. ‘నిత్య|మ్మొద్దికగా...’ అనండి.

   తొలగించండి
 21. కవిమిత్రులకు నమస్కారములతో
  గురుమూర్తి ఆచారి

  ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దుల మొనగాడ ! నేడు మొయిలలిగెను , నీ
  రెద్దడి యయె రైతులకున్ ;
  కొద్దిగ గంగమ ననుపుము కోల్కొనెదరయా

  (మొయిలు = మేఘము ; అనుపుము = పంపుము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   శ్రీనాథుని ‘సిరిగలవానికి చెల్లును...’ పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. దన్యవాదాలు

   తొలగించండి
 22. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి నమస్కారములు
  మీ సూచనకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 23. మిత్రులందఱకు నమస్సులు!

  (తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశుని కిద్దఱు భార్యలున్న విషయము మనందఱకు విదితమే గదా! ఆ యిర్వుఱు సపత్నుల వాగ్వివాదము వలననే వేంకటేశ్వరుండు ఱాయైనాఁడను సంగతి నిట ననుసంధానించుకొనునది)

  ఇద్దఱు భార్యలు గలిగిన
  ముద్దుల వెంకన్న వఱలె మొఱకుం గల్లై!
  దిద్దుకొనఁ గలిగెనే? కన,
  నిద్దఱు భార్యలును వద్ద దెవ్వరి కైనన్!

  రిప్లయితొలగించండి
 24. ఇద్దరు భార్యలు గల్గిన
  నొద్దుర యీ బాధలనుచు నొదుగడె శిలయై!
  కద్దని జతగట్టినచో
  గుద్దులతో వీపులదరి క్రుంగుట నిజమౌ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. ఇద్దరు భార్యలు గల్గిన
  నొద్దికగా నుందురనుచు నూహింపకయా
  మద్దెల దరుబుకు భయపడి
  వద్దిక నొకతైన నాకు వలదందువుగా !

  రిప్లయితొలగించండి
 26. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దుల ప్రాణేశునిచ్ఛ ముగిసిన తోడన్
  ఇద్దరి మద్దెల దరువుకు
  వద్దిక నాకీ గతియని వగచును నిత్యం.

  రిప్లయితొలగించండి
 27. ఇద్దరు భార్యలు గలిగిన
  కద్దిది సుఖమింట లేదు కలహములందున్
  తద్దిన మాసన్నవవగ
  పెద్దది చిన్నది కరచురు పింఛను కొరకై :)

  రిప్లయితొలగించండి


 28. ఇద్దరు భార్యలు గలిగిన
  ముద్దుల మానవుడి బతుకు మురిపెంబగునో?
  సుద్దుల నొక్కతె చెప్పగ
  వద్దను గాదె మరియొకతె పడతుల పోరై :)

  జిలేబి ~ బిలేజి

  రిప్లయితొలగించండి
 29. ఇద్దరు భార్యలు గలిగిన,
  ప్రొద్దున రాత్రులను మెండు పోరుల నడుమన్
  గుద్దులు వీపున సైచుచు
  కొద్దిగ శాంతియును లేక కుందును మగడే

  రిప్లయితొలగించండి