13, అక్టోబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1032

కవిమిత్రులారా, 
“ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

69 కామెంట్‌లు:

  1. ఎక్కడ దాగినాఁడొ కనుపించఁడు నాయకుడొక్కసారి యున్
    చక్కని రాజ్యపాలనము సాధ్యము చేసెదనంచు పల్కగా
    గ్రక్కున ముందువెన్కలను కానక నాతని నమ్మినాముగా
    మక్కువతోడనెన్నుకొన మమ్మతడెంతగ మోసగించెనో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      రాజకీయ నాయకుడు విషయంగా మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఎక్కడ దాగినాఁడొ కనుపించఁడు దాగుడుమూత లేలనో
    చక్క దనాల మోము విరజాజుల చందన చందమా మయౌ
    నిక్కము గాదెవీడు మన నెయ్యపు వన్నెల రాసలీ లలన్
    జిక్కి మనంబు దోచి మన చేలము లంగొని హాసమొం దెగా

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా !

    1)కనుపించు
    2)కనిపించు

    సంధికార్యము వివరించుడు
    ఈ సంధేదో గాని నాకు చాలా క్రొత్త !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      కొన్ని నిఘంటువులు ‘కనిపించు, కనుపించు’ రెండు రూపాలనూ చూపించాయి. కాని బాలవ్యాకర్త ‘కనిపించు’ శబ్దాన్నే చెప్పాడు.
      బాలవ్యా.క్రియా. 73. చుగాగమం బాచ్ఛికంబున కసంయుక్త న ల డ రాంతంబునకుం బ్రేరణంబున బహుళంబుగా నగు.
      వూను - వూనుచు - వూనించు.
      తేలు - తేలుచు - తేలించు.
      మగుడు - మగుడుచు - మగిడించు.
      కుదురు - కుదురుచు - కుదురించు.
      విను - వినుచు.

      వక్ష్యమాణంబు పుగాగమంబు.
      విను - వినిపించు, అను - అనిపించు, తిను - తినిపించు, కను - కనిపించు.

      తొలగించండి
    2. నా వద్ద బాల పౌఢ వ్యాకరణాలు వ్యాఖ్యానాలతో ఉండేవి. మా మేనకోడలు తీసుకెళ్ళింది. అవి ఉంటే వివరంగా తెలిపేవాణ్ణి. మిత్రు లెవరైనా ‘కనిపించు’ యొక్క వ్యాకరణ కార్యాన్ని వివరిస్తే సంతోషం.

      తొలగించండి
    3. శంకరార్యా ! ధన్యవాదములు !
      నా సందేహం మాత్రం పూర్తిగా తీరలేదు

      తొలగించండి
    4. నా సమాధానం నాకే తృప్తికరంగా లేదని చెప్పాను కదా! చూద్దాం... సాయంత్రం వరకు ఏదైనా వివరణ లభిస్తుందేమో!

      తొలగించండి
    5. కను+ఇంచు=కనిపించు. ఇంచుక్ వర్ణకము పాదేశము వస్తాయి.(ప్+ఆదేశము) - ఇది గురువర్యులు చింతా రామకృష్ణా రావుగారి వివరణ.

      తొలగించండి
  4. మిత్రులందరకు నవరాత్రి శుభాకాంక్షలండి.
    331.ఉ:ఎక్కడ దాగినాడొ కనిపించడు రుక్మణి వల్లభుండు తా
    నెక్కడ దాగెనో నెరుక లేదుకదా నవనీతచోరు డా
    చక్కని చుక్కల గనుచు సత్యను మోసము చేయనెంచెనో
    మిక్కుట మైన కోపభరమిప్పుడు జూపెద నందబాలుకున్.
    జాతులు,ఉపజాతులలో ఇదివరకూ
    పద్యాలెక్కువగా పూరించాను వృత్తపద్యములు
    తక్కువ.తప్పులను సూచించ గలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ వృత్తరచన సాఫీగా సాగింది. బాగుంది. అభినందనలు.
      ‘దాగెనో యెరుక...చుక్కలన్ గనుచు.... (బాలునకున్ అనాలి) ... నందసూతికిన్’ అనండి.

      తొలగించండి
  5. ఎక్కడ దాగినాఁడొ కనుపించఁడు నీ సుతుడమ్మ యుట్టిపై
    కెక్కుచు పాలుమీగడల క్రిందికి దోయును మ్రింగివెన్నలన్
    చిక్కులు దెచ్చు కోడలికి చెక్కిట మీగడ రాసి పోవుచున్
    పెక్కులు వానిలీలలని పేనిరి తల్లికి గోపకాంతలున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘పేనిరి...’?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      పేనుట = కయ్యమునకు నమోదు చేయుట

      తొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    దమయంతి మనోవ్యథ :


    ____________________________________________________

    01)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే
    బెక్కురు దేవతల్ మిగుల - ప్రేమను దెల్పిన కాదనంటి ! నిన్
    మక్కువ దీరగా వలచి - మల్లుడ వీవని యెంచు కొంటి ! నే
    జిక్కు లవెన్ని వచ్చినను - చెంగట నుంటిని నిన్ను వీడకన్ !
    02)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    రక్కెసమేళమా ? మదిని - రక్కసి తత్వ మదావహించెనా ?
    రెక్కలు లేని పక్షి నతి - రిక్తపు బాధల ముంచ వచ్చునా ?
    రుక్కు లవెన్ని వచ్చినను - రోయుట మేలదె భార్య నివ్విధిన్ ?
    03)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    నక్కట ? నివ్వనంబుననె - యాకుల నాకలి దీర్చు కొంటిమే
    పెక్కగు పండ్ల నెన్నొ తిని- ప్రేమగ కాలము వెళ్ళదీస్తిమే
    చక్కని నిర్దరంబులను - చల్లని నీటిని యారగిస్తిమే
    04)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు ? నా
    యుక్కడగించగా దలచి - యుందువె నన్నిట ? ప్రేమ మీరగన్ (కష్టపడడం చూడలేక)
    మక్కువ దీరెనా ప్రభువ - మానిని యందున ? దుర్భరార్తినిన్
    సొక్కిన బల్కకుండ మరి - చోద్యము జూతువె ? క్రూరదైవమా
    05)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    దిక్కదె లేని వారి కిల - దేవుడె దిక్కని యంద్రు గాదె , నా
    దిక్కగు దేవుడే యిటుల - దిగ్గున వీడిన నేమి సేయుదున్ ?
    దక్కునొ లేదొ నా ప్రభువు ? - ధైర్యము గా నెటు లుండ నోపుదున్ ?
    06)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    గ్రక్కున వీడి పోవు టతి - క్రౌర్యము గాదొకొ ? నిన్ను వీడి నే
    నెక్కువ కాలమే విధిని - నెగ్గుదు నంచనుకొంటివే మదిన్
    నక్కితి వేడనో ? మిగుల - నమ్మితి నిన్నదె ప్రాణనాథుగన్ !
    07)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    చిక్కితి నొంటిగా నిటను - చీకటి క్రమ్మెడు వేళ యయ్యె నే
    దిక్కుకు పోవు దాన మది - దృబ్ధము గల్గుచు నుండె, నేడు, న
    న్నక్కున జేర్చి ధైర్య మిడు - నాథుడె నన్విడి పోయె నేడకో
    08)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    యొక్కొక ప్రక్క నెక్కుడవ - యూళలు , నేడ్పులు ,నార్తరావముల్
    నిక్కము నా మదిన్ జెదరె - నిబ్బర మియ్యెడ ! క్రూర జంతువుల్
    యుక్కడగించు నన్నిటను ! - నో యని పిల్చిన బల్కరెవ్వరున్
    09)
    ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , నేమి సేతు , నే ?
    నిక్కుచు నుండె చంద్రు డదె - నీలపు జీకటి సుంత జీల్చుచున్
    చుక్కలు తోడ నాకసము - శోభిలు చున్నది వింత వింతగా
    నక్కెద నెక్కడైన మది - నా విధి దల్చుచు భర్తృ రాకకై
    ____________________________________________________
    రక్కెసమేళము = వేళాకోళము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పద్యప్రవాహంలో తలమున్కలయ్యాను. మన బ్లాగులో ఇంత వేగంగా ఇన్ని పద్యాలు వ్రాయడం మీకే చెల్లు. చాల బాగున్నవి. అభినందనలు.
      ‘నా దొర యేమిసేతు’ అనండి.
      రెండవ పద్యంలో ‘అది+ఆవహించె’ నన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘రక్కెస తత్వమె యావహించెనా’ అనండి. అలాగే ‘రోయుట మేలొకొ’ అనండి.
      మూడవ పద్యంలో ‘వెళ్ళదీస్తిమే, ఆరగిస్తిమే’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘కాలము వెళ్ళబుచ్చుచున్, నీటిని గ్రోలియుంటిమే’ అనండి.
      తొమ్మిదవ పద్యంలో ‘చుక్కలతోడ నాకసము...’ అనండి.

      తొలగించండి
    2. చక్కని సవరణలను సూచించిన
      శంకరార్యులకు ధన్యవాదములతో :

      దమయంతి మనోవ్యథ :

      ____________________________________________________

      01)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే
      బెక్కురు దేవతల్ మిగుల - ప్రేమను దెల్పిన కాదనంటి ! నిన్
      మక్కువ దీరగా వలచి - మల్లుడ వీవని యెంచు కొంటి ! నే
      జిక్కు లవెన్ని వచ్చినను - చెంగట నుంటిని నిన్ను వీడకన్ !
      02)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      రక్కెసమేళమా ? మదిని - రాక్షస తత్వమె యావహించెనా ?
      రెక్కలు లేని పక్షి నతి - రిక్తపు బాధల ముంచ వచ్చునా ?
      రుక్కు లవెన్ని వచ్చినను - రోయుట మేలొకొ భార్య నివ్విధిన్ ?
      03)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      నక్కట ? నివ్వనంబుననె - యాకుల నాకలి దీర్చు కొంటిమే
      పెక్కగు పండ్ల నెన్నొ తిని- ప్రేమగ కాలము వెళ్ళబుచ్చుచున్
      చక్కని నిర్దరంబులను - చల్లని నీటిని గ్రోలియుంటిమే
      04)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు ? నా
      యుక్కడగించగా దలచి - యుందువె నన్నిట ? ప్రేమ మీరగన్ (కష్టపడడం చూడలేక)
      మక్కువ దీరెనా ప్రభువ - మానిని యందున ? దుర్భరార్తినిన్
      సొక్కిన బల్కకుండ మరి - చోద్యము జూతువె ? క్రూరదైవమా
      05)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      దిక్కదె లేని వారి కిల - దేవుడె దిక్కని యంద్రు గాదె , నా
      దిక్కగు దేవుడే యిటుల - దిగ్గున వీడిన నేమి సేయుదున్ ?
      దక్కునొ లేదొ నా ప్రభువు ? - ధైర్యము గా నెటు లుండ నోపుదున్ ?
      06)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      గ్రక్కున వీడి పోవు టతి - క్రౌర్యము గాదొకొ ? నిన్ను వీడి నే
      నెక్కువ కాలమే విధిని - నెగ్గుదు నంచనుకొంటివే మదిన్
      నక్కితి వేడనో ? మిగుల - నమ్మితి నిన్నదె ప్రాణనాథుగన్ !
      07)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      చిక్కితి నొంటిగా నిటను - చీకటి క్రమ్మెడు వేళ యయ్యె నే
      దిక్కుకు పోవు దాన మది - దృబ్ధము గల్గుచు నుండె, నేడు, న
      న్నక్కున జేర్చి ధైర్య మిడు - నాథుడె నన్విడి పోయె నేడకో
      08)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      యొక్కొక ప్రక్క నెక్కుడవ - యూళలు , నేడ్పులు ,నార్తరావముల్
      నిక్కము నా మదిన్ జెదరె - నిబ్బర మియ్యెడ ! క్రూర జంతువుల్
      యుక్కడగించు నన్నిటను ! - నో యని పిల్చిన బల్కరెవ్వరున్
      09)
      ఎక్కడ దాగినాడొ ? కను - పించడు నా దొర , యేమి సేతు , నే ?
      నిక్కుచు నుండె చంద్రు డదె - నీలపు జీకటి సుంత జీల్చుచున్
      చుక్కల తోడ నాకసము - శోభిలు చున్నది వింత వింతగా
      నక్కెద నెక్కడైన మది - నా విధి దల్చుచు భర్తృ రాకకై
      ____________________________________________________
      రక్కెసమేళము = వేళాకోళము

      తొలగించండి
  7. ఎక్కడ దాగినాడొ కనిపించడు నాకిల దేవదే వుడు
    న్మక్కువ తోడ నుంటి యిట మాన్యుడ ! చెప్పుము నిన్నునే మన
    న్దక్కువ జేసి , యా ప్రభువు దర్శన మిచ్చెనె ? చెప్పుమా మఱి
    న్నక్కున జేర్చు భక్తు డొకడ క్కడ యుండెను సామి నీ కనిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ఉంటి నిట, అక్కడ నుండెను, నీ కనన్’ అనండి.

      తొలగించండి
  8. వసంత కిశోరు గారు పద్యముల వెల్లువలో మమ్ముల నందరిని విహరింప జేశారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      వారి పద్యాలక్రింద, నా వ్యాఖ్య క్రింద ‘ప్రత్యుత్తరం’ అన్నదానిని క్లిక్ చేసి, అక్కడ వచ్చిన బాక్సులో మీ వ్యాఖ్యను నమోదు చేయవలసి ఉంటుంది.

      తొలగించండి
    2. సత్యనారాయణరెడ్డిగారూ ! ధన్యవాదములు !

      తొలగించండి
  9. ఎక్కడదాగినాడొ కనిపించడు నాహృది దోచినట్టి యా
    చక్కని చిన్నవాడు! తన సాకతమున్ గొన నూగుచుంటి నే
    నెక్కెదనేడుపర్వతములింపుగ, కైకొన వాని హస్తమున్
    చుక్కలవేడుచుంటి దిశ చూపమటంచు మనోజ్ఞుఁ గాంచగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
  10. కను మొదలగు వానికి ఇంచు ధాతువు పరంబగునపుడు పుగాగమంబును ,ఇత్వంబు నగు

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి కవిమిత్రులకు నమస్కారములతో....

    ఎక్కడ దాగినాడొ కనిపించడు చిక్కుల బాపువాడి ది
    క్కెక్కడ గోచరించదు, మహీతల మందున దాగెనెక్కడో?
    ఎక్కడ లేడు వాడు జగదీశుడు, భక్తుల గుండెలో గదా!
    చక్కగ నిల్చియుండునట సత్యము నిక్కము విశ్వసింపుడీ!!

    రిప్లయితొలగించండి
  12. ఎక్కడ దాగినాఁడొ కనుపించఁడు జీవుఁడు, దేవుఁడైన వా
    డెక్కడ గానరాఁడు, భువి నెందును నిండిన వాని నీ కనుల్
    చిక్కగ పట్టలేవనగ చెల్వము నాదనుటెట్లు ? దైవమా,
    చిక్కితి తల్లి కై తొలుత, చెల్లదె నాకది నీవు తల్చినన్.

    వసంత కిశోర్ గారు ఎన్ని పద్యాలు వ్రాసేశారు. _/\_

    రిప్లయితొలగించండి
  13. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడునిక్కడ నుండెనో సఖీ
    చక్కని రూపువాడు విలసన్ముఖపద్మువిరాజమానునిన్
    మక్కువదీర్చిమమ్మిటుల మైమరపించి వినోద కృష్ణుడున్
    టక్కున మాయమయ్యెనిక టక్కుల మారిని నిందు గంటివే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘కనిపించడు+ఇక్కడ’ అన్నచోట నుగాగమం రాదు. ‘కనిపించడు తా నెట నుండెనో...’ అనండి.

      తొలగించండి
    2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. కనిపించడున్ + ఇక్కడ అని వ్రాయ వచ్చని అనుకున్నాను. సవరణ చేసితిని. ధన్యవాదములు.

      తొలగించండి
    3. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు తానెట బోయెనో సఖీ
      చక్కని రూపువాడు విలసన్ముఖపద్మువిరాజమానునిన్
      మక్కువదీర్చిమమ్మిటుల మైమరపించి వినోద కృష్ణుడున్
      టక్కున మాయమయ్యెనిక టక్కుల మారిని నిందు గంటివే

      తొలగించండి
  14. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు కేశుడు పైరు లన్నియున్
    "అక్కట! ఎండిపోయె పడినట్టి శ్రమంబిల వట్టిదాయె మా
    దిక్కెవరంచు " నేడ్చుచును దెచ్చిన అప్పులు తీర్చలేక తా
    మిక్కిలి నిస్సహాయులయి మృత్యువు నొందిరి యన్నదాతలున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      ఫేసుబుక్కులోని మీ పద్య పరంపరలోని భావంతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  15. ఎక్కడ దాగినాడొ కనిపించడు వేచిన కన్నుదోయికిన్
    చక్కని సామి నీకొరకు చక్కెర మీగడ పాలు వెన్నతో
    మక్కువ మీరపళ్ళెమున మంచిగ నుంచితి జాగు సేయకున్
    గ్రక్కున కాలి యందియలు ఘల్లన మ్రోయగ రమ్ము మాధవా!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఆ పాదంలో యతిదోషం లేదు. కనిపించు లో ఆగమం వచ్చిన ఇంచు లోని ఇకారానికి యతి.
      మీరు పొరపాటున మీ పద్యాన్ని శైలజ గారి వ్యాఖ్యలలో ప్రకటించారు.

      తొలగించండి


  16. గు రు మూ ర్తి ఆ చా రి
    .............................

    " ఎక్కడ దాగి ినాడొ కనిపి౦చడు ! గల్లున కాలి గజ్జె లో !

    యిక్కడ మ్రోగుచు౦డె ! వినిపి౦చెను తియ్యని వేణు నిస్వన౦

    బక్కడ ! తోచకున్నది కదా " యని వేదన చె౦దు గోపికన్

    గ్రక్కున. డాసి మేను పులక౦బును చె౦దగ. కౌగిలి౦చుమా ! !

    ( పులకము : పులకరి౦త.) ్

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యం చివరిపాదంలో గణదోషం. ‘...బల్కె జవాబుగ బాలభక్తుడై’ అందామా?

      తొలగించండి
  18. శ్రీగురుభ్యోనమః

    ఎక్కడి కేగినాడొ కనిపించడు చంద్రు డిదేమి చిత్రమో
    చక్కని మేఘమాలికలు శారద వేళల నాక్రమింపగా
    స్రుక్కెనొ? జ్యోత్స్నకాంతులిల జూడగ తగ్గెనుశుద్ధ పూర్ణిమా!
    మక్కువ తోడ జెప్పెదము మా మొర లన్నియు నాలకింపుమా.

    రిప్లయితొలగించండి
  19. (వరూధిని స్వగతము...)

    ఎక్కడ దాగినాఁడొ? కనిపించఁడు బ్రహ్మణుఁ డిక్కడే యెదో
    దిక్కున దిక్కుతోచని విధిన్ దన యూరికి దారిఁ గానకన్
    బిక్కుమటంచు నిల్చెనొకొ? వీనిని నే విడువంగఁ బోను, నా
    మక్కువ తీరగా వెదకి మానక తేలుదు సౌఖ్యవార్ధిలోన్.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! మీ పద్యం బాగున్నది ! అభినందనలు !

    కాని చిన్న సందేహం !
    మీ వరూధిని అల్లసాని వారి వరూధినేనా కాదా యని
    నాకు తెలిసినంత వరకూ
    వీణానిక్వణము విన్న ప్రవరుడు తానే వెతుక్కుంటూ వరూధినిని చేరి దారడుగుతాడు
    ఆమె మోహించి మీదపడబోతే అగ్నిదేవుని సాయంతో ఆమె కళ్ళ ముందే అదృశ్యుడౌతాడు

    ప్రవరుణ్ణి వరూధినిని వెతికే సన్నివేశం మనుచరిత్ర లో గలదా యని
    పైగా మాయా ప్రవరుడు కూడా తానే వరూధినిని వెతుక్కుంటూ వస్తాడు గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      ప్రవరుడు వెళ్ళిపోయిన తర్వాత వరూధిని అతనికోసం వెదికింది. క్రింది మనుచరిత్ర (మూడవ ఆశ్వాసం, 3,4,5వ పద్యాలను చూడండి.

      శా.
      ఆ భూదేవకుమారుఁ డేఁగినఁ దదీయానూన రమ్యాకృతిన్‌
      దా భావంబున నిల్పి యంగభవ కోదండోగ్ర మౌర్వీరవ
      క్షోభాకంపిత ధైర్యయై, యలఁత నచ్చో నిల్వ కచ్చెల్వ త
      ద్భూభృన్మేఖల వెంటఁ గానలబడిన్‌ దుఃఖాబ్ధినిర్మగ్నయై.

      క.
      తిరుగుచు ధరణీసురవరుఁ
      డరిగిన చొప్పరసియరసి యటఁగానక యా
      హరిణాంకముఖి సఖీజన
      పరివృతయై మగిడి వచ్చి భావములోనన్‌.

      ఉ.
      అక్కట! వాఁడు నాతగుల మాఱడిసేసి దయావిహీనుఁడై
      చిక్కక త్రోచి పోయె దరిఁ జేరఁగరాని వియోగసాగరం
      బెక్కడ నీఁదుదాన? నిఁక నీకొఱనోములు నోఁచినట్టి నే
      నెక్కడ? వాని కౌఁగి లది యెక్కడ? హా విధి? యేమి సేయుదున్‌?

      తొలగించండి
    2. ప్రవరుడు తనకు దూరంగా వెళ్ళిపోవడమే చూసింది కాని, అతడు అగ్నిదేవుని సాయంతో వెళ్ళిపోవడం చూడలేదు. అక్కడే ఎక్కడో దారి తెలియక తిరుగుతూ ఉంటాడనే అనుకున్నది. మాయా ప్రవరుడు కూడా తనకు దారి దొరకక తిరిగి వచ్చానని అంటాడు.

      తొలగించండి
  21. 15ఎక్కడదాగినాడొ కనుపించడు కన్నులయంతట నిండియుండి యున్
    మక్కువమందిరాన మహిమాన్విత యూహలు దోచుకున్న ఓ
    చక్కటి సుందరాంగ మనసందున గుండెగనండనీవెగా
    ప్రక్కనజేరకున్న తనపాలిటశాపమెనుండిపోవురా
    2.ఎక్కడదాగి నాడొ కనుపించడు దైవము|భక్తి,రక్తికిన్
    నిక్కము నీతి,నిష్ట లనునిత్యమునిల్పు –ప్రయత్నమందునే
    చిక్కె నటంచు దెల్పుదురు| చింతల పంతమునందు గొల్వగా
    రక్కసి వేడినా బలుకు రాముని బంటగువాయుపుత్రుడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘కన్నులలోన నిండియున్’ అనండి. ‘మహిమాన్విత+ఊహలు= మహిమాన్వితోహలు’ అవుతుంది. యడాగమం రాదు. ‘చక్కని సుందరాంగ’ అనండి. ‘శాపమె యుండి’ అనండి.
      రెండవ పద్యంలో ‘రక్కసి వేడినన్’ అనండి.

      తొలగించండి
    2. ‘మహిమల్ గల యూహలు’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  22. ప్రహ్లాదునితండ్రి ప్రశ్నకుజవాబుగాపూరణ
    ఎక్కడ దాగినాడొ కనుపించడు నీహరి యన్న?”పుత్రుడే
    మక్కువ భక్తిచేబిలువ మాధవుడక్కడ కానుపించు|నీ
    వెక్కడ జూడ నక్కడనె వేధన మాన్పగవచ్చి జేరు|నీ
    ప్రక్కననుండు “తండ్రి యని బల్కె జవాబుగబాలభక్తుడై
    2.ఎక్కడదాగినాడొ కనుపించడు సూదుల గ్రుచ్చివెళ్ళె|నీ
    ప్రక్కన నుండి వెళ్ళినను పట్టుకొనంగను చిక్కడాయెగా
    చిక్కుల చింతబెంచుచు విచిత్రముగా తను మూర్ఖ చిత్తుడో
    టక్కరి వోలె జేయుపని టక్కున బట్టరె రక్ష కాళియున్.

    రిప్లయితొలగించండి
  23. పద్యము:భక్త కబీరుని దోహా ఆధారముగా
    ఎక్కడ దాగినాడొ కనిపించ డటంచు తలంచ బోకు డో
    వెక్కసులార,యీశుని గవేషణము న్నొనరింప, గాంచ లే
    రక్కడ నిక్కడన్ వెదుకగా పనియేలను మీ యెడ౦దలో
    జిక్కి వసించి నాడు గద చిత్తము నిర్మలమై భజింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  24. గు రు మూ ర్తి ఆ చా రి
    .............................

    " ఎక్కడ దాగి ినాడొ కనిపి౦చడు ! గల్లున కాలి గజ్జె లో !

    యిక్కడ మ్రోగుచు౦డె ! వినిపి౦చెను తియ్యని వేణు నిస్వన౦

    బక్కడ ! తోచకున్నది కదా " యని వేదన చె౦దు గోపికన్

    గ్రక్కున. డాసి మేను పులక౦బును చె౦దగ. కౌగిలి౦చుమా ! !

    ( పులకము : పులకరి౦త.) ్

    రిప్లయితొలగించండి
  25. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు శంకరు డేమిచేతురో
    చక్కని పూరణల్ విరివి జప్పున జేసిరి ఛాత్రులిచ్చటన్
    మిక్కిలి యాశతో ఘనపు మెప్పులు కోరుచు మానసంబునన్...
    గ్రక్కున రావయా! విడిచి కమ్మని వీధుల కాకినాడనున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఓ రోజు లేటు మీ పూరణ. నిన్న వచ్చి వుంటే సందర్భానికి తగ్గట్టుగా వుండేది :)


      తొలగించండి


    2. ఎక్కడ మీరెక్కడయని
      చక్కగ ప్రశ్నించినారు శంకరు లన్ నెం
      చక్కగ నొక్క ది నముముం
      దిక్కడ మీరడిగి యున్న దేవుడు మీరే :)


      జిలేబి

      తొలగించండి


  26. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు చెప్పెద రమ్మ పో కలం
    డిక్కడ యెక్క డైన నని డింగరు లెల్లరు కల్ల యో నిజం
    బెక్కడ యుండె నో తెలియ వేలకు వేలన‌ వత్స రమ్ములెం
    చక్కగ దాటి పోయె సఖి సాధ్యము కాలె జిలేబి గాన్పడన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు నీరవ మోడి భేషుగా
    నెక్కడ దాగినాఁడొ కనిపించఁడు మేహులు చోక్సి జోషుగా
    నెక్కడ దాగినాఁడొ కనిపించఁడు మల్లయ లండనున్ భళా
    మిక్కిలి వీరులెల్లరును మీసము త్రిప్పుచు పారిపోయిరే!!!

    రిప్లయితొలగించండి
  28. ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు ముద్దుల రాహులుండయో?
    చక్కగ నోడిపోవగను జన్యము నందున మోడి భాయికిన్
    గ్రక్కున వీడి రాజ్యమును కాంగ్రెసు నందున కిన్క జేయుచున్
    ముక్కును మూసి యోగమును బుద్ధిగ జేయగ థాయిల్యాండునన్!

    రిప్లయితొలగించండి