కవిమిత్రులకు నమస్కృతులు!
నేను నా భార్యతో కాశీయాత్రకు వెళ్తున్నాను. ఎన్నోసార్లు దక్షిణ భారతదేశ యాత్ర చేశాను కాని ఇంత వరకు ఉత్తర భారతానికి ఎప్పుడూ వెళ్ళలేదు. కాశీ దర్శించాలని నా చిరకాల వాంఛ.
కవిమిత్రుడు చంద్రమౌళి సూర్యనారాయణ గారు కాశీకి రాను, పోను రైల్వే టికెట్లు రిజర్వ్ చేయించారు. వారికి ధన్యవాదాలు.
31-10-2015 వరంగల్ నుండి బయలుదేరి 1-11-2015 నాడు అలహాబాదు త్రివేణీసంగమం దర్శించి ఆరోజు రాత్రికాని, నవంబర్ రెండున కాని కాశీకి చేరుకుంటాను. 7-11-2015 నాడు తిరుగు ప్రయాణం.
పదిరోజుల కొరకు సమస్యలను, పద్యరచనలను షెడ్యూల్ చేస్తున్నాను. వెంట టాబ్‍లెట్ ఉంటుంది కనుక మీ పద్యాలను వీలైనప్పుడల్లా సమీక్షిస్తుంటాను.
కాశీలో ఉండడానికి చవకగా, సౌకర్యంగా ఉండే (అన్ని కులాల వారికి అవకాశం ఉండే) సత్రం గురించిన సమాచారాన్ని తెలిసిన మిత్రు లెవరైనా అందించవలసిందిగా మనవి.

మాస్టరుగారూ మీ ప్రయాణం సుఖంగా జరగాలని కోరుకొనుచున్నాను.విశ్వేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు... ..సూర్యనారాయణగారికి అభిననదనలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
శంక రార్యుల పయనము జక్కగాను
రిప్లయితొలగించండిసాగు గాకయ నుచునునే సాగిల బడి
కాశి విశ్వేశు బ్రా ర్ధిం తు కరము మోడ్చి
యార్య ! శంకర !యేగుమా యమ్మ తోడ
సకల శుభముల నిచ్చుత! శంకరుండు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
‘పయనము+చక్కగాను’ అన్నప్పుడు సరళాదేశం (పయనము జక్కగాను) లేదు. గసడదవాదేశం జరిగి పయనము సక్కగాను అనీ, జరుగక పయనము చక్కగాను అనీ ఉంటుంది.
తొలగించండిశుభప్రయాణ వాంఛ సుఖకరమగు గాక
రిప్లయితొలగించండికాశి విశ్వనాథు కరుణ నంది
అన్నపూర్ణ మాత యాశిస్సు లను పొంది
జాయతోడ యాత్ర జరిపి రండు.
యాత్ర సజావుగా సాగాలని కోరుకొంటున్నానండి.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాన్యులు శ్రీ కంది శంకరయ్య గారూ, సంతోషదాయకమైన వార్త తీసుకుని వచ్చారు. శీర్షికా నామధేయ ఖచిత కార్యక్రమములోనే ఏనుగుల వీరాస్వామి గారి కాశీ యాత్రా చరిత్రమును జ్ఞప్తికి తీసుకుని వచ్చారు, శుభమగు గాక !
రిప్లయితొలగించండి"యావద్భారత పుణ్య తీర్థ సముదాయంబందు సద్గణ్యమై
కైవల్యప్రదమై ధరాతలమునన్ గైలాస సారూప్యమై
శ్రీ విశ్వేశ్వర నిత్యవాసమయి సాక్షీభూత శర్వాణియై
యావృత్తోత్కట భక్త సంఘమయి విఖ్యాతిన్ గనున్ గాశియున్ !
సద్యోగ్యమగు విశ్వ విద్యాలయంబను
********పాండిత్య నిధిఁ గల్గు వారణాశి ;
బాటసారులకుఁ బర్యాటకులకు సత్ర
********వాసమ్ములను గల్గు వారణాశి ;
యన్నార్తులగు ప్రజ కన్నపూర్ణను బోలు
********వర గృహిణులఁ గల్గు వారణాశి ;
మహిత మంత్రమ్ము - ' ఓం నమశ్శివాయ 'ను బేర్మిఁ
********బల్కు భక్తులు గల్గు వారణాశి ;
కాలభైరవ ఢుంఠి విఘ్నగణ దేవ
భాసురాలయములు గల్గు వారణాశి ;
శరణు శరణన్న మాత్రాన సంతసించు
స్వామి విశ్వనాథుఁడు గల్గు వారణాశి !
విశ్వనాథుండు తన కృపా వీక్షణముల
భక్తులను దన్పుచుండఁగాఁ బ్రమదమంది
యతని పదముల దరి బారునట్టి గంగ
వారి దనుపును తన పుణ్య వారి మహిమ ! "
ఆ కాశీ క్షేత్ర సందర్శనం మీకైహికాముష్మిక ఫల ప్రాప్తి కలిగించవలెనని ఆకాంక్ష
డా. విష్ణునందన్ గారూ,
తొలగించండికాశీ ప్రాముఖ్యతను వివరించిన మీ పద్యాలు అద్బుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
గురువుగారూ పావనమైన కాశీయాత్రను పవిత్రంగా చేసుకొని రండి.
రిప్లయితొలగించండిఅక్కడ మానససరోవర్ లో ఉన్న శ్రీరామతారక ఆంధ్రాశ్రమము వసతికి, భోజనానికి కూడ అనువుగా ఉంటుంది. కేదార్ఘాట్ కు దగ్గరలో ఉంటుంది.
మిస్సన్న గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ కాశీ యాత్ర సుఖప్రదమూ ఫలప్రదమూ శుభప్రదమవ్వాలని కోరుకుంటున్నానండీ గురువు గారూ!
రిప్లయితొలగించండికవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారికీ మీ తరఫున కవిమిత్రులందరి తరపున ధన్యవాదములు తెలుపుతున్నాను.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
గురుదేవులకు ప్రణామములు. తమరి తీర్థయాత్ర సుఖప్రదంగా సాగాలని శ్రీకాశీవిశ్వేశ్వరునికి ప్రార్థనలు.
రిప్లయితొలగించండికవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారికి అభినందనలు.
మీరు కాశీలో ఉన్నన్ని రోజులూ బ్లాగు సంగతి మరచిపోయి విశ్వేశ్వరుని మీద దృష్టి పెట్టుకుంటే మంచిదేమో చూసుకోండి.
రిప్లయితొలగించండి