ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదుశాస్త్ర విజ్ఞానము మరచు చవటలారమూఢనమ్మకములు కల్గు మూర్ఖులారమంచి చెడులవిచక్షణ మరువకండి
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘నమ్ముచూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘నమ్ముచున్’ అనండి. ‘శాస్త్రజ్ఞానమ్ము’ అన్నచోట ‘స్త్ర’ గురువై గణదోషం. ‘శాస్త్రవిజ్ఞానము మరచు చవట లంత’ అనండి. ‘గ్రహశాంతుల’ అన్నచోట గణదోషం. ‘గ్రహపు శాంతుల’ అనండి.
ఎన్ని చదువ ప్రయోజన మేమిగలదుఇంచుకైనను సంస్కార మెరుగ లేనిమూఢ విశ్వాస పీడితుల్ మూర్ఖజనులుకార్యకారణ బంధాల గనక వీరు తరతరాల యాచారబంధమున మునిగిమోసపోవుట గనుము దురాశ తోడఅడ్డదారుల నందల మందుకొనగదొంగ యతులను నమ్ముచున్ భంగ పడుచుశాస్త్రవిజ్ఞానము మరచు చవటలంతగ్రహపు శాంతుల జరిపించు ఖలురు వీరువిధిని దూషించు చుందురీ విదురమతులు గురువు గారికి నమస్కారములునా దోషాలను సవరించి సూచనలనంద జేసినందులకు ధన్యవాదములుమీ సూచనల ప్రకారము సవరించిన పద్యము
మిత్రులందఱకు నమస్సులు!ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు,హీనుఁ డవగుణమ్మును వీడు టెఱుఁగ కున్న?బొగ్గుఁ బాలను కడుగంగఁ బోవునె మలినమ్ము? ప్రకృతి సిద్ధావగుణమ్ము సనునె?
గుండు మధుసూదన్ గారూ, మంచి నీతిపద్యాన్ని అందించారు. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
శ్రీ గుండు మధుసూదన్ గారూ, మంచి పద్యం. ప్రసిద్ధమైన ప్రాక్తన పద్య భావమును ' కవి స్వీయ పదములలో ' మరొక అధునాతన పద్యములో తెలపడమొక కళ. దాన్ని సాధించారు. అభినందనలు.
అందరికి నమస్కారములు.ఎన్నిజదివిప్రయోజనమేమి గలదు,జనన మరణాలదొలగించు చదువుజదువు.గురుదయగలుగు.నీజన్మఘోరదుఃఖమిట్లుదీరును మేల్కొనుమిప్పుడైన.
భూసారపు నర్సయ్య గారూ, నీతిని బోధిస్తున్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎన్ని చదువ బ్రయోజన మేమి గలదు దొంగ బుధ్ధు లు గలుగుచు దోచు కొనగ చావ బాదిరి యిసుమంత జాలి లేక సార్ధ కంబును జేయుడు చదువు నిలను
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎన్ని"చదువ" అనిగమనించవలసినదిగాకోరుచున్నాను.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదుమంచి చెడుల విశ్లేషణ కొంచమైన చేయకను నమ్ము చుండిరి చేతబడులు మూఢ నమ్మకముల కడు ముదముతోడ
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదువిబుధ జనవిధేయ విహీన వినయగుణ రహితుడు సభ్యత సంస్కార హీను డైనవిద్య నేర్చినఁ వాడొక వింత పశువు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘సభ్యతా సంస్కార హీనుడైన...’ అనండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. సవరించితిని.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?కావ్యముల నెన్ని వ్రాసిన ఘనత యేమి?అర్థమునకే విలువనిచ్చి స్పర్థతోడసాటి మనిషిని దిట్ట సంస్కారమగునె?
మిస్సన్న గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ మిస్సన్న గారూ, మంచి పద్యం. అభినందనలు. ' మనిషి ' శబ్దం గ్రామ్యం కనుక - "సాటి మనుజునిఁ దిట్ట" అని అంటే చక్కగా సరిపోతుంది.
ఎన్ని చదువ ప్రయోజన మేమికలదువక్రబుద్ధితో పయనించు వానికిలనుసక్రమపు మార్గమును చేర్చ సాధ్య మగునె యెన్నియత్నముల్ సలిపిన నిచ్చ తోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘సల్పిన’ టైప్ చెయ్యడం ఇబ్బంది పెట్టినట్లుంది.
Yes sir. Tying in cell phone is causing problems some times.
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ఎన్నరెన్న డు నామాట విన్నదెవరుమిన్నకు౦దురు .నాసూక్తు లెన్నటికినిమన్ననల్ బొంద నేరవో యన్నలార
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘...గలదు| ఎన్న...’ అని విసంధిగా వ్రాశారు.
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు?సద్గుణమ్ములు లేకుండ చదువు లున్ననిష్పలంబగు నవియన్ని నిలను జూడవిద్య శోభిల్లు సతతము వినయమున్న!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘...యన్ని యిలను జూడ’ అనండి.
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు?ప్రగతి సాధించ నీనాడు భారతమున తగిన యవకాశములు లేక తరలు చుంద్రు పశ్చిమాంబుధి భానుని ప్రస్తుతింప
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు వందనములు రాజుగారికి రె౦దవ భార్య ప్రీతికరము సహజమే కదా
ఎన్నిచదువ బ్రయోజన మేమిగలదుఎన్నికందున నోట్లచే నెన్ని కైనలంచమందున లక్ష్యాలు వంచనలకుకత్తి నెదురించు వెంట్రుకల్ పెత్తనంబె|2.ఎన్నిచదువ బ్రయోజన మేమిగలదుచదువు,సంస్కారమన్నవే పదవిజేరరెండు కళ్ళుగ నిలచిన నిండుదనముమానవత్వము జూపును మౌనమందె|
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. 'ఎన్నిక +అందు ' అన్నప్పుడు సంధి లేదు.' ఎన్నికలలోన' అనండి.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?నేర్చుకొన్నది పాటించు నేర్పులేక!పుణ్య గంగా జలమ్ములు ముంచి పారశిలకు శిల్పమౌ పులకింత కలుగు నెట్లు?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ? మహిని స౦స్కృతీ హీనుడు మాన్యు డగునెఎన్ని భూష లల౦కృతు లున్న. గాని ఖరము జూచిన నెవ్వరుగౌరవి౦త్రు ?
గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుమూర్తి గారూ, సంస్కృతి, సంసృతి ఇత్యాదులు ఇకారాంతములే. కనుక పైపద్యములో ' సంస్కృతి హీనుండు ' అనే అనండి. గణములు కూడా సరిపోతాయి.
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ?గౌరవమ్ము జూపకున్న ఘనత కాదుపెద్దలందున జూపుము వినయ మెపుడుఖ్యాతి నందగలవెపుడు ఖచిత మిదియు/ధాత్రి యందు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'ధాత్రి యందు ' అంటే యతిదోషం.
నమస్సులండి.నేను " తి "కు "త్రి "కు ప్రాసయతి సరిపోతుందనుకొన్నానండి.
ఎన్ని చదువఁ బ్రయోజనమేమి గలదుగుణ రసజ్ఞత లేనిచోఁ గొంచెమైన?పాకమును వండి యొక యుప్పు పలుకు వేయకున్నచో రుచి పుట్టునే యుదహరింప!
డా. విష్ణునందన్ గారూ, మధుసూదన్ గారిని ప్రశంసిస్తూ మీరుకూడా అదే బాటలో భాస్కర శతక పద్యభావాన్ని చిన్న పద్యంలో సమర్థంగా ఇమిడ్చారు. అభినందనలు.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదువినయ మించుకైనను లేక విర్ర వీగదర్ప మొందగ నెవరు నీ దరికి రారు మంచి మనుగడ లేకున్న మనిషి గాడు.ఎల్ల లుండవు విద్యకు నేర్వ జూడ భుక్తి కొరకు గాక చదువు భక్తి తోడమెచ్చుదురు నిన్ను పెద్దలు మేటి యనుచుపిన్నలందరు గాంతురు పేర్మి తోడ.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు!...ఎచటి నుండి రాకయొ మరి యెందు పోక?ఎరుగ లేముర శాస్త్రము లెన్ని నరయ...లోన జూడుము వెదకుము జ్ఞాన మొదవు :)(పాదాంతమున ఉత్వ సంధి ఉల్లంఘనము)
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?కూడు విద్వత్తు బుద్ధియు కూడు నమ్మచేరుదురు మంచి వారలు చేద వచ్చువారి యండదండలనెల్ల వరము గాన !జిలేబి
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండిశాస్త్ర విజ్ఞానము మరచు చవటలార
మూఢనమ్మకములు కల్గు మూర్ఖులార
మంచి చెడులవిచక్షణ మరువకండి
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నమ్ముచూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘నమ్ముచున్’ అనండి. ‘శాస్త్రజ్ఞానమ్ము’ అన్నచోట ‘స్త్ర’ గురువై గణదోషం. ‘శాస్త్రవిజ్ఞానము మరచు చవట లంత’ అనండి. ‘గ్రహశాంతుల’ అన్నచోట గణదోషం. ‘గ్రహపు శాంతుల’ అనండి.
ఎన్ని చదువ ప్రయోజన మేమిగలదు
తొలగించండిఇంచుకైనను సంస్కార మెరుగ లేని
మూఢ విశ్వాస పీడితుల్ మూర్ఖజనులు
కార్యకారణ బంధాల గనక వీరు
తరతరాల యాచారబంధమున మునిగి
మోసపోవుట గనుము దురాశ తోడ
అడ్డదారుల నందల మందుకొనగ
దొంగ యతులను నమ్ముచున్
భంగ పడుచు
శాస్త్రవిజ్ఞానము మరచు చవటలంత
గ్రహపు శాంతుల జరిపించు ఖలురు వీరు
విధిని దూషించు చుందురీ విదురమతులు
గురువు గారికి నమస్కారములు
నా దోషాలను సవరించి సూచనలనంద జేసినందులకు ధన్యవాదములు
మీ సూచనల ప్రకారము సవరించిన పద్యము
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు,
హీనుఁ డవగుణమ్మును వీడు టెఱుఁగ కున్న?
బొగ్గుఁ బాలను కడుగంగఁ బోవునె మలి
నమ్ము? ప్రకృతి సిద్ధావగుణమ్ము సనునె?
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమంచి నీతిపద్యాన్ని అందించారు. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
తొలగించండిశ్రీ గుండు మధుసూదన్ గారూ, మంచి పద్యం. ప్రసిద్ధమైన ప్రాక్తన పద్య భావమును ' కవి స్వీయ పదములలో ' మరొక అధునాతన పద్యములో తెలపడమొక కళ. దాన్ని సాధించారు. అభినందనలు.
తొలగించండిఅందరికి నమస్కారములు.
రిప్లయితొలగించండిఎన్నిజదివిప్రయోజనమేమి గలదు,
జనన మరణాలదొలగించు చదువుజదువు.
గురుదయగలుగు.నీజన్మఘోరదుఃఖ
మిట్లుదీరును మేల్కొనుమిప్పుడైన.
భూసారపు నర్సయ్య గారూ,
తొలగించండినీతిని బోధిస్తున్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎన్ని చదువ బ్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండిదొంగ బుధ్ధు లు గలుగుచు దోచు కొనగ
చావ బాదిరి యిసుమంత జాలి లేక
సార్ధ కంబును జేయుడు చదువు నిలను
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎన్ని"చదువ" అనిగమనించవలసినదిగాకోరుచున్నాను.
రిప్లయితొలగించండిఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండిమంచి చెడుల విశ్లేషణ కొంచమైన
చేయకను నమ్ము చుండిరి చేతబడులు
మూఢ నమ్మకముల కడు ముదముతోడ
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండివిబుధ జనవిధేయ విహీన వినయగుణ ర
హితుడు సభ్యత సంస్కార హీను డైన
విద్య నేర్చినఁ వాడొక వింత పశువు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘సభ్యతా సంస్కార హీనుడైన...’ అనండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. సవరించితిని.
తొలగించండిఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
రిప్లయితొలగించండికావ్యముల నెన్ని వ్రాసిన ఘనత యేమి?
అర్థమునకే విలువనిచ్చి స్పర్థతోడ
సాటి మనిషిని దిట్ట సంస్కారమగునె?
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ మిస్సన్న గారూ, మంచి పద్యం. అభినందనలు. ' మనిషి ' శబ్దం గ్రామ్యం కనుక - "సాటి మనుజునిఁ దిట్ట" అని అంటే చక్కగా సరిపోతుంది.
తొలగించండిఎన్ని చదువ ప్రయోజన మేమికలదు
రిప్లయితొలగించండివక్రబుద్ధితో పయనించు వానికిలను
సక్రమపు మార్గమును చేర్చ సాధ్య మగునె
యెన్నియత్నముల్ సలిపిన నిచ్చ తోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘సల్పిన’ టైప్ చెయ్యడం ఇబ్బంది పెట్టినట్లుంది.
Yes sir. Tying in cell phone is causing problems some times.
తొలగించండిఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండిఎన్నరెన్న డు నామాట విన్నదెవరు
మిన్నకు౦దురు .నాసూక్తు లెన్నటికిని
మన్ననల్ బొంద నేరవో యన్నలార
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...గలదు| ఎన్న...’ అని విసంధిగా వ్రాశారు.
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు?
రిప్లయితొలగించండిసద్గుణమ్ములు లేకుండ చదువు లున్న
నిష్పలంబగు నవియన్ని నిలను జూడ
విద్య శోభిల్లు సతతము వినయమున్న!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...యన్ని యిలను జూడ’ అనండి.
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండిఎన్నరెన్న డు నామాట విన్నదెవరు
మిన్నకు౦దురు .నాసూక్తు లెన్నటికిని
మన్ననల్ బొంద నేరవో యన్నలార
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు?
రిప్లయితొలగించండిప్రగతి సాధించ నీనాడు భారతమున
తగిన యవకాశములు లేక తరలు చుంద్రు
పశ్చిమాంబుధి భానుని ప్రస్తుతింప
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు వందనములు రాజుగారికి రె౦దవ భార్య ప్రీతికరము
తొలగించండిసహజమే కదా
ఎన్నిచదువ బ్రయోజన మేమిగలదు
రిప్లయితొలగించండిఎన్నికందున నోట్లచే నెన్ని కైన
లంచమందున లక్ష్యాలు వంచనలకు
కత్తి నెదురించు వెంట్రుకల్ పెత్తనంబె|
2.ఎన్నిచదువ బ్రయోజన మేమిగలదు
చదువు,సంస్కారమన్నవే పదవిజేర
రెండు కళ్ళుగ నిలచిన నిండుదనము
మానవత్వము జూపును మౌనమందె|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
'ఎన్నిక +అందు ' అన్నప్పుడు సంధి లేదు.' ఎన్నికలలోన' అనండి.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
రిప్లయితొలగించండినేర్చుకొన్నది పాటించు నేర్పులేక!
పుణ్య గంగా జలమ్ములు ముంచి పార
శిలకు శిల్పమౌ పులకింత కలుగు నెట్లు?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ?
మహిని స౦స్కృతీ హీనుడు మాన్యు డగునె
ఎన్ని భూష లల౦కృతు లున్న. గాని
ఖరము జూచిన నెవ్వరుగౌరవి౦త్రు ?
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుమూర్తి గారూ, సంస్కృతి, సంసృతి ఇత్యాదులు ఇకారాంతములే. కనుక పైపద్యములో ' సంస్కృతి హీనుండు ' అనే అనండి. గణములు కూడా సరిపోతాయి.
తొలగించండిఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ?
రిప్లయితొలగించండిగౌరవమ్ము జూపకున్న ఘనత కాదు
పెద్దలందున జూపుము వినయ మెపుడు
ఖ్యాతి నందగలవెపుడు ఖచిత మిదియు/ధాత్రి యందు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'ధాత్రి యందు ' అంటే యతిదోషం.
నమస్సులండి.నేను " తి "కు "త్రి "కు ప్రాసయతి సరిపోతుందనుకొన్నానండి.
రిప్లయితొలగించండిఎన్ని చదువఁ బ్రయోజనమేమి గలదు
రిప్లయితొలగించండిగుణ రసజ్ఞత లేనిచోఁ గొంచెమైన?
పాకమును వండి యొక యుప్పు పలుకు వేయ
కున్నచో రుచి పుట్టునే యుదహరింప!
డా. విష్ణునందన్ గారూ,
తొలగించండిమధుసూదన్ గారిని ప్రశంసిస్తూ మీరుకూడా అదే బాటలో భాస్కర శతక పద్యభావాన్ని చిన్న పద్యంలో సమర్థంగా ఇమిడ్చారు. అభినందనలు.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
రిప్లయితొలగించండివినయ మించుకైనను లేక విర్ర వీగ
దర్ప మొందగ నెవరు నీ దరికి రారు
మంచి మనుగడ లేకున్న మనిషి గాడు.
ఎల్ల లుండవు విద్యకు నేర్వ జూడ
భుక్తి కొరకు గాక చదువు భక్తి తోడ
మెచ్చుదురు నిన్ను పెద్దలు మేటి యనుచు
పిన్నలందరు గాంతురు పేర్మి తోడ.
ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు!...
రిప్లయితొలగించండిఎచటి నుండి రాకయొ మరి యెందు పోక?
ఎరుగ లేముర శాస్త్రము లెన్ని నరయ...
లోన జూడుము వెదకుము జ్ఞాన మొదవు :)
(పాదాంతమున ఉత్వ సంధి ఉల్లంఘనము)
రిప్లయితొలగించండిఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
కూడు విద్వత్తు బుద్ధియు కూడు నమ్మ
చేరుదురు మంచి వారలు చేద వచ్చు
వారి యండదండలనెల్ల వరము గాన !
జిలేబి