18, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1828 (పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.

37 కామెంట్‌లు:

 1. రాజ కీయము లందున రమణు లుండె
  రాణి రుద్రమ్మ యలనాడు రాజ్య మేలె
  యసుర సంహార మొనరించె నాది శక్తి
  పురుష పుంగవు నోడించి పొలఁతి నెగడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రాజ్య మేలె| నసుర...’ అనండి.

   తొలగించండి
 2. దేవగిరి రాజు రుద్రమ్మ చేవ లేని
  స్త్రీ యటంచు భావించి యశేషసైన్య
  సహితుఁడై వచ్చి పోరాడ సాహసమున
  పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కంది శంకరయ్యగారూ,

   రుద్రమదేవి శౌర్యసాహసములతో దేవగిరిరాజు నోడించిన మీ పూరణము మనోజ్ఞముగనున్నది. అభినందనలు.
   చిన్న సందేహము...."...రుద్రమ్మఁ జేవ లేని..." యనవలె ననుకొనుచుంటిని. పరిశీలింపుఁడు. స్వస్తి.

   తొలగించండి
  2. మధుసూదన్ గారూ,
   ధన్యవాదాలు.
   ‘రుద్రమ్మ చేవలేని స్త్రీ అని’, ‘రుద్రమ్మను చేవలేని స్త్రీ అని’ రెండు ప్రయోగాలూ సాధువులే. రెండింట మీ సూచన మేలైనది.

   తొలగించండి
 3. మట్టు బెట్టెను మహిషుని మాతశక్తి
  నరకునోడించి గెలిచెను నాడు సత్య
  తరచి జూడగ చరితలో వరుసగాను
  పురుషపుంగవు నోడించి పొలతి నెగడె!!!

  రిప్లయితొలగించండి
 4. చిత్రసీమ నేలితిననె డాత్రమెగయ
  ప్రజల నుద్దరించగఁదీ ర్చి పక్ష మొకటి
  నిల్వ ఎన్నికలందున నేతననుచు
  పురుషపుంగవు నోడించి పొలతి నెగడె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
   ‘అనెడి+ఆత్ర’మన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘ఏలితి నను నాత్ర...’ మనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. మొదట మీరన్నట్లే వ్రాసుకుని, టైపు చేసే సమయంలో యిలా మార్చాను. మీరు సూచించిన సవరణతో:
   చిత్రసీమ నేలితినను నాత్రమెగయ
   ప్రజల నుద్దరించగఁదీర్చి పక్ష మొకటి
   నిల్వ ఎన్నికలందున నేతననుచు
   పురుషపుంగవు నోడించి పొలతి నెగడె!

   తొలగించండి
 5. యుధ్థమందున నాసత్య యోధురాలై
  రక్కసుండగు నరకుని రయముతోడ
  సంహరించెనుగావున సాహసాన
  పురుష పుంగవునోడించిపొలతినెగడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదం చివర గురువుంది. అక్కడ ‘యోధురాలె’ అనండి.

   తొలగించండి
  2. విష్ణు గొల్చు యాళ్వారును, వేశ్య దేవ
   దేవి వలపున గెల్చిన తీరు జూడ
   సరసశృంగార క్రీడల స్పర్ధ యందు
   పురుష పు౦గవు నోడించి పొలతి నెగడె

   తొలగించండి
  3. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. గురువుగారికి, పెద్దలకు నమస్కారం. శివధనుస్సును ఎత్తి, ఎక్కుపెట్టిన రామునికంటే ముందుగానే తాను అవలీలగా ఆ ధనువును ఎత్తినది తాను కనక రాముడిని ఓడించినట్టుగా సీత చెప్పినట్టుగా భావిస్తూ రాశాను. భావంలో తప్పున్నా, పద్యంలో తప్పులున్నా మన్నించి తెలియచేయగలరు.

  తే.గీ: విరిచినాడాశివధనువువీరుడు,రాఘ
  వుడనినలుగురుపొగడ, నవ్వెనటసీత
  ముందెధనువునెత్తినదినేననుచునుడివి
  పురుషపుంగవునోడించిపొలఁతినెగడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. అయ్యో! తప్పక సవరిస్తాను గురువుగారు. ఒక చిన్న సందేహము. వ కారానికీ వ్వా కీ యతి చెల్లదా? దయచేసి తెలుపగలరు. అలాగే ముందు లోని న కరానికి 'ననుచూ లోని న కారానికి యతి కుదురుతుందనుకుని అలా రాశాను. అదీ తప్పేనన్నమాట.

   తొలగించండి
  3. గురువుగారూ , సవరించిన పద్యాన్ని పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదములు.
   తే.గీ: విరిచినాడాశివధనువువీరుడు,రాము
   డనుచుపలువురుతెగపొగడగ,ధరణిజ
   మునుపెధనువుతానెత్తిన మాటనుడివి
   పురుషపుంగవునోడించిపొలఁతినెగడె

   తొలగించండి
  4. సుభద్ర గారూ,
   సవరణ కొంతవరకు బాగుంది. మూడవపాదంలో యతి తప్పింది.
   మీరొకసారి ఈబ్లాగులోనే కుడివైపు పైన ఉన్న ‘వర్గాలు’లోని ‘ఛందస్సు’ ను క్లిక్ చేసి అక్కడ ఇచ్చిన యతిభేదాలు పాఠాలను పరిశీలించండి.

   తొలగించండి
 7. అశ్వమేధ యాగాశ్వ రక్షణార్ధము అర్జునుడు ప్రమీలా దేవి రాజ్యములో అడుగు పెట్టిన సందర్భములో ప్రమీలకు
  క్రోధము ప్రేమ రెండు మిళిత మవుతాయి :
  తోయజాక్షి ప్రమీల యా తురగమును గ
  ని ఘన తరతీక్ష్ణ బాణాశని సదృశముల
  నసమ శరబాణ వీక్షణ నక్కిరీటి
  బురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.
  [అసమశరుడు= మన్మథుడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోయజాక్షి ప్రమీల యా తురగమును గ
   ని ఘన తరతీక్ష్ణ బాణాశని సదృశముల
   నసమ శరశర వీక్షణ నక్కిరీటి
   బురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. గురుమూర్తి ఆచారి
  ........................

  చివరి గడియ న౦దరికి నచ్చెరవు గలుగ.

  పురుషపు౦గవు నోడి౦చి పొలతి నెగిడె

  పరుగు ప౦దెము లో ఉష. మరియు బరువు

  లెత్తు ప౦దెము లోన మల్లేశ్వరక్క

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని వారిద్దరూ పురుషులతో పోటీ పడినట్లు నేను వినలేదు.

   తొలగించండి
 9. .నరక సంహార మొనరించె నారియయ్యు
  పురుష పుంగవు నోడించి పొలతి నెగడి
  సత్య భామకు సరితూగు సాధ్వి లేరు
  అన్న కృష్ణుని మాటలు విన్నవారు
  2.నాటి రుద్రమదేవి నీనాటివారు
  నెంచగల్గు పరాక్రమ నేర్పు గాంచ
  పురుష పుంగవు నోడించి పొలతి నెగడి
  అనెడి కీర్తియు నిలచెనుమనుషులందు

  రిప్లయితొలగించండి
 10. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో కొంత అన్వయలోపం. ‘సాధ్వి లే ద|టన్న కృష్ణుని మాటలు వినిరి ప్రజలు’ అనండి.
  రెండవపూరణలో ‘పరాక్రమ నేర్పు’ అనరాదు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అర్జునుని నాడు బంధించె నల ప్రమీల
  పరుగు లెత్తించె మ్లేఛ్చుల ప్రతిభ జూపి
  రాణి ఝాన్సియె గతమున రణము జేసి
  పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.

  రిప్లయితొలగించండి
 12. పోరుసలుపంగ మదినెంచి పుడమి యందు
  ఝాన్సి నేలెడి రాణితా జవము తోడ
  హయము నధిరోహణమొనర్చి జయము గోరి
  పురుషపుంగవు నోడించి పొలతి నెగడె

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్సులు!

  (మోహినీ భస్మాసుర వృత్తాంతము)

  వర విగర్వోన్నతుండయి భస్మదైత్యుఁ
  డా వర పరీక్షకై నిటలాక్షుఁ గోరి
  వెంటఁ బడె! వచ్చె మోహిని! ప్రేంఖణమునఁ

  బురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె!!

  రిప్లయితొలగించండి
 14. ఇందిరమ్మతో జయపాలు డెంతొ కసిగ
  కదన మొనరింప దలచెనో మెదకు యందు
  తలపడెన్ వీరుడై గెల్వ దలచి, తుదకు
  పురుషపుంగవు నోడించి పొలతి నెగడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మెదకునందు’ అనండి.

   తొలగించండి
 15. ప్రాతతరపు దాస్యమువీడి నా తు లంత
  సరియెవరు మాకనుచు దృతి సాగుచుండ్రి
  యన్నిరంగమ్ములందున నారితేరి
  పురుష పుంగవు నోడించి పొలతినెగడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి