21, అక్టోబర్ 2015, బుధవారం

సమస్య - 1831 (రాక్షసుఁడు రచించె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాక్షసుఁడు రచించె రామకథను.

34 కామెంట్‌లు:

  1. ఆటవికము గాను బాటసారులఁదోచి
    పక్షి జంటఁ గొట్ట పాపమనుచు
    నారదుండు జేయ జ్ఙానబోధ, కరిగి
    రాక్షసుండు వ్రాసె రామకథను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. రామ చరిత నేను రమ్యంబుగా నొక్క
    కంద పద్యమునను కవిత వ్రాసి
    చూప స్నేహితులకు చూడగా నొక్కడు
    రాక్షసుఁడుర, చించె రామకథను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      కవిరాక్షసులై సమస్యను చించి, పూరించిన విధానం మనోరంజకంగా ఉంది. అభినందనలు.
      ‘చూప స్నేహితులకు చూచి యొక్క డనెను’ అంటే బాగుంటేదేమో?

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు..మీరు చెప్పిన మరో భావం మరింత అందముగానున్నది..
      నా స్నేహితూలో ఒక రాక్షసుడు రామచరిత వ్రాసిన కాగితాన్ని చింపాడని నాభావం..
      ఇరు భావాలతో సరిజేసిన పద్యములు..

      రామ చరిత నేను రమ్యంబుగా వ్రాసి
      కంద పద్యమందు కాగితమున
      చూప స్నేహితులకు, చూడక నొక్కడు
      రాక్షసుఁడుర, చించె రామకథను.


      రామ చరిత నేను రమ్యంబుగా నొక్క
      కంద పద్యమునను కవిత వ్రాసి
      చూప స్నేహితులకు చూచి మెచ్చి పలికె
      " రాక్షసుఁడుర, చించె రామకథను ".

      తొలగించండి
  3. కలహ భోజ నుండు గారవ మొప్పగ
    బోధ జేయు కతన బుద్ధి నెఱి గి
    రాక్షసుడు ర చించె రామ కధను మఱి
    కావ్య మనగ నదియ గణుతి కెక్కె

    రిప్లయితొలగించండి
  4. రమణి సీతను గొనె రావణాసురుడను
    రాక్షసుడు , రచించె రామ కధను
    వందనీయుడైన వాల్మీకి మౌనియే
    వరము గాను దీర్చి వాసిగాంచె!!!

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    (రాక్షస ప్రవృత్తిగల బోయయై, దారి దోపిడులతో జీవించు వాల్మీకి, క్రౌంచ మిథునైక పక్షినిం బరిమార్చి, పరివర్తిత మానసుఁడై, తాపసిగా మాఱి, రామాయణమును రచించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

    సరవిం దప్పక దోపిడిఁ
    బరుగునఁ జేయుచునుఁ, గొంచ పక్కినిఁ గొట్టన్,
    సురిగిన రాక్షసుఁడు, రచిం

    చె రామకథనుఁ, గమనీయ సీతాచరితన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరవిం దప్పక దోపిడిఁ
      బరుగునఁ జేయుచునుఁ, గొంచ పక్కినిఁ గొట్టన్,
      సురిగిన రాక్షసుఁడు, రచిం
      చె రామకథనుఁ,
      గమనీయ సీతాచరితన్!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మన్నించండి. నేను మీ పూరణను గురించి వ్యాఖ్యానించాననే అనుకున్నాను.
      ఆటవెలది పాదాన్ని కందంలో ఒదిగించిన మీ నైపుణ్యం బహుధా ప్రశంసనీయం. మంచి పూరణ. అభినందనలు.

      తొలగించండి
  6. ఆటవికుడు నైన యాబోయ వాల్మీకి
    ఋషుల మాట మేర రీతి మార్చి
    వ్రాయదొడగె తాను రామకథను,చచ్చె
    రాక్షసుండు,రచించె రామకథను

    రిప్లయితొలగించండి
  7. ఆటవికుడు నైన యాబోయ వాల్మీకి
    ఋషుల మాట మేర రీతి మార్చి
    వ్రాయదొడగె తాను రామకథను,చచ్చె
    రాక్షసుండు,రచించె రామకథను

    రిప్లయితొలగించండి
  8. పక్షు లను తునుముచు బ్రతుకీడ్చుచున్నట్టి
    రాక్షసుడు రచించె రామకథను
    నారదు డుసలుపగ నారాయణుని బోధ
    నాదికవిగ నతడె యమరుడయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. హేమ కశిప దనుజుడే లేక ప్రహ్లాద
    చరిత మి౦క లేదు ; మరియు నటులె
    రావణు౦డు లేక రామాయణము లేదు ,
    రాక్షసుడు రచి౦చె రామ కథను

    రిప్లయితొలగించండి
  10. ఆది కావ్యమనుచు నవనిలో నవెలసి
    పూజ లందుకొనెడు పుణ్య చరిత
    కఠిన హృదయు డైన ఖగముల వేటాడు
    రాక్షసుడు రచించె రామ కథను

    రిప్లయితొలగించండి
  11. రాక్షసుడు రచించెరామకధనునట
    యొప్పుకొనుదురెమరియొండు మాట
    పలుకకుండ యార్య! వాల్మీకి రచియించ
    కావ్యమనగ నదియ గణుతికెక్కె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రామకథ నటన్న |నొప్పుకొందురె.... " అనండి.

      తొలగించండి
  12. చుప్పనాతి పొగడె సుదతి సీత సొబగు
    నపహరణము జేసె కపటయతిగ
    రాక్షసుడు.రచించె రామ కథను శబర
    ఋషి వరుండు జనుల హితవు గోరి

    రిప్లయితొలగించండి
  13. రాముడు వధియించె రావణునని ఘోర
    రాక్షసుఁడు రచించె రామకథను
    జానకీసతికథ సంయమి వాల్మీకి
    పావన చరితంబు భవ్యముగను

    వాల్మీకి మహర్షి:
    కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్.
    పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రత:

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. Spiceandhra online న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    దారి కాచి దోచి తనవారి పోషించ
    పసిడి చాలు మాకు పాపమేల ?
    ననుచు బలుకు వారి మనసునెరిగి రోసి
    రాక్షసుఁడు రచించె రామకథను.

    రిప్లయితొలగించండి
  16. మాయలేడి రూపు మారీచు డెవ్వడు ?
    వ్యాసు డెటుల తెలియ జేసె గీత?
    శివు డెవని చరితము వివరించె గిరిజకు?
    రాక్షసుడు.రచించె .రామకథను.

    రిప్లయితొలగించండి
  17. రావణుండులేక రామాయణము లేదు
    దుష్ట చేష్ట మాన్పి నిష్ట బంచి
    వల్మి కాన తపసి వాల్మీకు డయ్యును
    రాక్షసుడు రచించె రామ కథను.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు శంకరయ్యగారూ! మీరు నా పూరణమునుం బరిశీలింపలేదు! ఏలనో?

    రిప్లయితొలగించండి