18, అక్టోబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1037

కవిమిత్రులారా!
“ఔరా యెవ్విధి నమ్ముదు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

49 కామెంట్‌లు:

 1. ఔరా యెవ్విధి నమ్ముదు
  సారస్వత మునందు జనులు సమ్మతి లేకన్
  తారా పధమును తాకెడు
  భారత సంస్కృతిని వీడి భాగ్య మటంచున్
  ----------------------------------------
  ఔరా యెవ్విధి నమ్ముదు
  నారావణు లంకనున్న యవనిజ సీత
  న్నేరము లెంచగ నామది
  ఈరీతిగ కలత బడుచు నేలిక ననుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   కాని రెండింటిలోను అన్వయలోపం ఉన్నట్టుంది.

   తొలగించండి
  2. ఔరా యెవ్విధి నమ్ముదు
   తారా పధమందు వెలుగు దలపక తెలుగున్
   సారము తెలియని జనులట
   భారత సంస్కృతిని వీడి భాషను మరువన్
   ---------------------------
   ఔరా యెవ్విధి నమ్ముదు
   ఈరీతిగ కలత బడుచు నేలిక ననుచున్
   నేరము లెంచగ నామది
   నారావణు లంకనున్న యవనిజ సీతన్

   తొలగించండి
 2. 1)
  ఔరా యెవ్విధి నమ్ముదు
  నీ రాజ్యములోన మాంస, మెల్లరు శాకా
  హారులు సుజనులు హింసా
  దూరులు, పలలమ్ముఁ గొనెడి దొరలే లేరే!
  (ఎవ్విధిన్+అమ్ముదు)
  2)
  ఔరా యెవ్విధి నమ్ముదు
  నోరారఁగ నీవు సెప్పు నుడు లవి బొంకుల్,
  నే రాధఁ గాను, సత్యను,
  నీ రాసక్రీడలన్ని నే నెఱుఁగుదులే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారములు
   గురువు గారు మీపద్యములు బాగున్నాయి
   ఎవ్విధిన్+అమ్ముదు , అమ్ముట అన్న పదం నాకసలు స్పురించనేలేదు . నమ్మకము గురించే ఆలోచించాను . అదేతేడా .గురువుకీ , శిష్యునికీ . హస్తిమ శకాంతం.
   ధన్య వాదములు

   తొలగించండి
  2. అక్కయ్యా, నేనూ నమ్ముదు గురించే ఆలోచిస్తున్నా రాత్రి నుండి..

   తొలగించండి
  3. అదేమరి ఎంతైనా అక్క లక్షణాలు తగిలి ఉంటాయి . నాణానికి ఒకవైపె చూడటం .

   తొలగించండి
  4. భళా శంకరయ్యగారూ,

   అమ్ముదు, నమ్ముదు...నని... ద్వివిధ ప్రయోగములతో మీ రెండు పద్యము లలరించుచున్నవి. అభినందనలు!

   తొలగించండి
 3. ఒౌరా యెవ్విధి నమ్శుదు
  బేరమ్శులు రాకపోయెబీడులునగుటన్
  ఊరునబ్రదుకుట కష్టము
  రారాయికపోదముమరి రాచనగరికిన్

  రిప్లయితొలగించండి
 4. ఒౌరా! యెవ్విధి నమ్ముదు
  దారాసుతులనను చింతఁ దలపక మదిలో
  నా రాజు హరిశ్చంద్రుఁడు
  ధీరుండై సత్య వ్రతముఁ దిరముగ నమ్మెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘...దలపనివాడై| యారాజు...’ అనండి. అన్వయం కుదురుతుంది.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
   ఒౌరా! యెవ్విధి నమ్ముదు?
   దారాసుతులనను చింతఁ దలపని వాడై
   యా రాజు హరిశ్చంద్రుఁడు
   ధీరుండై సత్య వ్రతముఁ దిరముగ నమ్మెన్!

   తొలగించండి
 5. ఒౌరా! యెవ్విధి నమ్ముదు?
  నారాయణుననుచుఁ దిరుగు నారదుని, తులా
  భారమున రుక్మిణి తులసిఁ
  జేరిచి హరిఁ దూచి కొనుచు చింతను దీర్చెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ రెండవ పద్యం బాగున్నది. ఇక్కడ ‘అమ్ముదు, నమ్ముదు’ రెండూ అన్వయిస్తాయి. అభినందనలు.

   తొలగించండి
 6. మా అన్నయ్య చంద్రమౌళి రామారావు గారి పద్యము

  ఔరా యెవ్విధి నమ్ముదు
  దూరాలోచనములేని దుశ్చరితుల దు
  ర్వా రాక్రమ సంపద్వ్యా
  పారానీకమ్ము నసుర భంజని జననీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి రామారావు గారూ,
   మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 7. ఔరా యెవ్విధి నమ్ముదు
  పారావారమ్ము దాటి వ్రాలితి ననగా
  వీరాంజనేయు డంతట
  శ్రీరాముని వ్రేలితొడుగు సీతకు నొసగెన్!!!

  రిప్లయితొలగించండి
 8. పద్యరచన

  * గు రు మూ ర్తి ఆ చా రి *

  ఔరా యెవ్విధి నమ్ముదు

  నా రావణు చె౦త ను౦టి
  వన్ని దిన౦బుల్ కోరెద శీలపరీక్షను


  చేరకు మనె రాఘవు౦డు సీతా సాధ్విన్

  .....................

  రిప్లయితొలగించండి
 9. ఔరా యెవ్విధి నమ్ముదు
  వీర వరేణ్యులఖిలాస్త్రవిధ్యాధికులన్
  కౌరవులు పాండుతనయుల
  ఘోరారణ్యముల బంప కుటిలత్వమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఔరాయెవ్విది నమ్ముదు
  శ్రీరాముని చింతబెంచె –సీతమ్మ ననన్
  ఆరావణ చేష్టలకున్
  ప్రారబ్దంబనక నిందబరచుట తగునా?
  2.ఔరా యెవ్విది నమ్ముదు
  కారణ మేదైన మనకు కర్షకు డిలలో
  ఆరాధ్యుడు గాకున్నచొ?
  చేరవు సుఖ శాంతు లెపుడు-చింతయె మిగులున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపద్యంలో కొంత అన్వయలోపం.

   తొలగించండి
 11. హనుమ కృష్ణునితో...


  ఔరా !యెవ్విధి నమ్ముదు
  శ్రీరామునివైన కృష్ణ శీఘ్రమె నిచట
  న్నారీతిగ కనిపింపుమ
  చేరి భజింతు నినునమ్మి సీతాపతిగన్!!!  పుస్తకములు సంచీలో బెట్టుకుని అమ్మే పెద్దాయన స్వగతం....

  ఔరా! యెవ్విధి నమ్ముదు
  సారంబగు గ్రంధములను చదవరె నెవరున్
  వేరము నొకటమ్ముడయిన
  తీరుగ నాభార్యకింత దెచ్చెద కూడున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘శీఘ్రమె యిచట, చదువరె యెవరున్’ అనండి.

   తొలగించండి
 12. ఔరా యెవ్విధి నమ్ముదు
  యాసతి నాపై విజయము నందెను గాదే
  నారదముని మాటలు విని
  నారమణుని యమ్ముకొంటి నగుబాటైతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘నమ్ముదు నాసతి, రమణుని నమ్ముకొంటి’ అనండి.

   తొలగించండి
 13. ఔరా యెవ్విది నమ్ముదు
  కారాగారమ్మునందు గనుపించెడిసం
  సారి,గురువర్యు డయ్యు వి
  చారణలో కాముకు డన?సంస్కృతియేదీ?
  2.ఔరా యెవ్విది నమ్ముదు
  కారణములు కానరాని కలియుగ సైకొ
  చేరియు సూదులు వేయగ?
  ఈరోజుకు పట్టుబడడి నెంచగ వింతౌ|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘పట్టుబడ డిదెంతయొ వింతౌ’ అనండి.

   తొలగించండి
 14. ఔరా!ఎవ్విది నమ్ముదు
  తూరుపు దిశనందు గ్రుంకు తొగసూడుడనన్
  శ్రీరామ చంద్రు డిల బహు
  దారావ్రతుడను వదంతి తలిరు కొనంగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. మిత్రులందఱకు నమస్సులు!

  (చంద్రమతి నమ్మఁబూనిన హరిశ్చంద్రుని మనోవేదనము)

  ఔరా! యెవ్విధి నమ్ముదున్, స్వపరిగృహ్యన్, మన్మహారాజ్ఞినిన్,
  ధీరన్, గోమలదేహఁ జంద్రమతినిన్, దీనన్, దయారూపనున్?
  దూరీకృత్యనుఁ జేతునే? యిటుల నీ దుర్భాగ్యమందన్, దురా
  చారుం డెవ్వఁడు? వీఁడె కాఁడె? యకటా! స్థాతవ్యమాయెన్ గదా!
  వీరిం గానక యెట్టులుందు నిపుడున్ బ్రేమన్ బ్రతారించుచున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   వృత్తరచన మీకు కొట్టినపిండి. కందపాదాన్ని శార్దూలవృత్తంలో ఇమిడ్చిన మీ రచన అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 16. ఔరా!యెవ్విధి నమ్ముదు
  కూరిమితో మసలు నాదు కొమరుని పైనన్
  నేరముపడె నవనీతపు
  చోరుండని 'చెప్పు కృష్ణ సూనృత మిపుడున్."

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. ఔరా! ఎవ్విధి నమ్ముదు
  నీ రావణు దర్పము గన నిలలో నరుడౌ
  శ్రీరాముని వశమౌనే
  యా రక్కసు గూల్చయంచు హరితలపోసెన్

  రిప్లయితొలగించండి
 18. ఔరా ! యెవ్విధి నమ్ముదు
  చోరులవలె భూమినంత చేకొని ప్రజలన్
  ఘోరపు యిడుములనె ట్టుచు
  దారిద్ర్యమునను ముంచు దానవ జతిన

  రిప్లయితొలగించండి
 19. ఔరా యెవ్విధి నమ్ముదు
  నేరుగ నుడివిన పలుకులు నీరవ మోడీ!
  పేరును గానని నూరుకు
  పారుచు పోతివి డజనుల పాస్పోర్టులతో :)

  రిప్లయితొలగించండి


 20. ఔరా యెవ్విధి నమ్ముదు
  నేరాలంబగు పదముల నెమ్మి బడయ నా
  నా రీతుల కందమ్ముగ
  నే రాసులకొలది భేషు నింపెద ననుచున్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. ఔరా యెవ్విధి నమ్ముదు!
  గోరింకలు చిలుకలు తెగ గొప్పగు రీతిన్
  పోరాటమ్మును జేయక
  దారలు భర్తలను బోలి తగులుదురటనే!!!

  రిప్లయితొలగించండి


 22. సెల్ఫ్ డబ్బా :)


  ఔరా యెవ్విధి నమ్ముదు
  నౌరౌర! జిలేబి పద్య మంచు! పదునుగా
  తారాపథమును చేరెన్
  జీరాడు పదముల తోడు సెమ్మెపు కాంతుల్!  జిలేబి

  రిప్లయితొలగించండి