23, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్య - 1833 (అమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్.

39 కామెంట్‌లు:

  1. గురువు గారికి ప్రణామములు
    కవిమిత్రులకు అభినందనలతో ,,,,,,

    కమనీయ పురము గట్టగ
    శ్రమనే లెక్కింపనట్టి సాహసి యతడై
    కుమతుల కన్నులు కుట్టగ
    నమరావతి రాజు చంద్రుడై శోభిల్లెన్

    రిప్లయితొలగించండి
  2. కమతములన్ దోచుకొనుచు
    తమితో తొత్తులనుగూర్చి తలచుచుమదిలో
    సుమధుర వాగ్ధానమ్ముల
    నమరావతిరాజు చంద్రుడై శోభిల్లెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు!
      "వాగ్దానము" అనవలెను. ఇది....మహాప్రాణయుతము కాదు.

      తొలగించండి
    3. గుండుమధు సూదన్ గారికి న మస్సులు.
      వాగ్దానములిడి
      యమరావతి రాజు చంద్రుడై శోభిల్లెన్

      తొలగించండి
  3. అమవాస లెన్ని వచ్చిన
    రమణీయపు రాచవీడు ప్రద్యోతించ
    న్నమరించుచు నాంధ్రులకు
    న్నమరావతి రాజు చంద్రుడై శోభిల్లెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అమవాస’ అన్న శబ్దం లేదు. ‘అమవస లెన్నియొ వచ్చిన’ అనండి.

      తొలగించండి
  4. ప్రముఖుల నాహ్వనించగ
    యమునకదిలి, పుట్టమట్టి యంకితమనగన్
    శ్రమ జన్మభూమి సిరియని
    యమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    రమణులు రంభోర్వశ్యా
    ద్యమర గణికలనెడు తార కావృత యుతుఁడై
    యమర సుఖమ్ములఁ దేలుౘు

    నమరావతిరాజు, "చంద్రుఁడై" శోభిల్లెన్!

    రిప్లయితొలగించండి
  6. సుమగాత్రి రంభ తోన
    య్యమరావతి రాజు యింద్రుడై శోభిల్లెన్
    విమలారంభము తోని
    య్యమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జధాని’ అని బేసిగణంగా జగణాన్ని వేశారు. రెండవపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  8. అమలిన జలములు మృత్తిక
    క్షమ పూజను రాజధాని కడగాలునకై
    ప్రముఖ ప్రథాని చేయగ
    అమరావతి రాజు చంద్రుడై శోభిల్లెన్

    రిప్లయితొలగించండి
  9. కమలాసనవంశజు డను
    పమ సంయమి కశ్యపఘనవంశాబుధికిన్
    విమలయశుడు వజ్రాయుధు
    డమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్.

    రిప్లయితొలగించండి
  10. విజయ దశమిరా తమ్ముఁడ! విజయ దశమిరా!
    జైశ్రీరామ్.
    ఆర్యులారా!
    ఈ క్రింది పాటను ఆలపించే ప్రయత్నం చెయ్యండి.
    అదే విధంగా ఆలోచించండి ఈ పాటలో ఏవైనా ఛందో భరిత పద్యాలున్నాయేమోనని.
    http://andhraamrutham.blogspot.in/2015/10/blog-post_32.html#.VinrmZJ95kg

    మీ అందరి పూరనలు చాలా చక్కగా ఉన్నవి. మీ అందరికీ మిమ్ములను తీర్చి దిద్దుచున్న శ్రీ శంకరార్యులకు నా అభినంనలు.
    నమస్తే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవిమిత్రులు చింతా రామకృష్ణారావు గారూ,
      ధన్యవాదాలు.
      మీ రిచ్చిన గేయాన్ని పరిశీలిస్తే అది నాకు రెండు కందపద్యాలుగా కనిపించింది.

      తొలగించండి

  11. అమరావతి యనుచోటన
    కమనీయపుపురముగట్టి కళకళలాడన్
    కుమతుల గర్వమునణచగ
    అమరావతిరాజుచంద్రు ఢైశోభిల్లెన్

    రిప్లయితొలగించండి
  12. చి.రామకృష్ణారావు గారికి మీపాట తేటగీతి చందములో ఉన్నది .శ్రీరామనామము మోక్షప్రదము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      ఎన్నివిధాలుగా చూసినా చింతా వారి గేయంలో తేటగీతి లక్షణాలు నాకు కనిపించలేదు. రెండు కందపద్యాలను గుర్తించగలిగాను.

      తొలగించండి
  13. 15అమరావతి రాజేంద్రుడు,
    అమరావతి రాజు చంద్రు డై శోబిల్లెన్
    అమరావతి నగరంబే
    అమరికనవ్యాంద్రప్రజకు నాకర్షితమౌ|

    రిప్లయితొలగించండి
  14. అమరాధిపుడగు నింద్రుడ
    హమున మునియొసంగి నట్టి హారము నవమా
    నమొనర్చ శపిం చె;పిదప
    నమరావతి రాజుచంద్రుడై శోభిల్లెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాకుంటే ఈ కథ నాకు క్రొత్త.

      తొలగించండి
    2. శంకరయ్యగారూ! ఈ కథను నేను గతమున "నీల ఐరావతము శ్వేత ఐరావతముగ మారిన కథ" గా ...మన బ్లాగులోనే ప్రకటించియుంటిని. దానిని (దివి:02-10-2012న) నా "మధుర కవనం" నందుఁ బ్రకటించితిని. ఆ లంకె నిచట నిచ్చుచుంటిని. పరిశీలించఁగలరు.
      http://madhurakavanam.blogspot.in/2013/10/blog-post_13.html

      స్వస్తి.

      తొలగించండి
  15. అమరాధిపుడగు నింద్రుడ
    హమున మునియొసంగి నట్టి హారము నవమా
    నమొనర్చ శపిం చె;పిదప
    నమరావతి రాజుచంద్రుడై శోభిల్లెన్

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    అమరులె యచ్చెరువొందుచు,
    డమరుక దుందుభులు విజయ దశమినిమ్రొగన్
    గమనించగ, నవ్యాంధ్ర
    న్నమరావతి రాజు చంద్రుడైశోభిల్లెన్

    రిప్లయితొలగించండి
  17. అన్నయ్యగారూ నమస్తే.మీకు తెలియదనికాదు.మరచిపోయి వుంటారు.ఒకసారి ఐరావతంమీద వస్తున్న ఇంద్రుని కెదురుపడ్డ దుర్వాసుడు ఇంద్రునకు పూలహారాన్నిస్తాడు.ఇంద్రుడు అహంకారంతో దాన్ని ఏనుగు తొండానికేస్తాడు .ఆ ఏనుగు కాలికిందికేసి తొక్కుతుంది ముని కోపంతో శపిస్తాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ వివరణ చూచాక ఈ కథ నాకు తెలిసినకథే అనిపిస్తున్నది. కాని పూర్వపరాలు గుర్తుకు రావడం లేదు. క్రమక్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్టున్నాను.

      తొలగించండి
  18. భ్రమతీరగ వడివడిగా
    తమ యిండ్లను కోలు పోవు దైన్యము నందున్
    కుములుచు నమవస రాత్రిని
    అమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్

    రిప్లయితొలగించండి