రాజేశ్వరి అక్కయ్యా, సవరించినందుకు సంతోషం! ***** గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కర్మ’ను ‘ఖర్మ’ అన్నారు. ‘సిరి’ని ‘శిరి’ అన్నారు. చివరిపాదంలో యతి తప్పింది. ‘సిరిమగఁడే నిజగురుండు క్షితి మనుజులకున్’ అందామా?
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం. సవరించండి. ***** మంద పీతాంబర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ధరణికి నాధార’ మనండి. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, సవరించిన మీ నిన్నటి పద్యం బాగుంది. అభినందనలు.
వరమనుచు కొలుచు వాడట
రిప్లయితొలగించండిపరివే దనజేయ కుండ పరమేశు డటన్
గురుశబ్ధ వాచ్యుఁ డెవ్వడు
పరుసమ్ముగ బలుకు వాడు పామరుడె కదా
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు.
ఇచ్చినది పద్యప్రారంభం అని స్పష్టంగా పేర్కొన్నా మీరు దానిని మూడవపాదం చేశారు.
క్షమించాలి
రిప్లయితొలగించండిగురుశబ్ధ వాచ్యుఁ డెవ్వడు
పరుసమ్ముగ బలుకువాడు పామరుడె కదా
వరమనుచు కొలుచు వాడట
పరివేదన జేయ కుండ పరమేశు డటన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిగురు శబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
నిరయముఁ దొలఁగించు విద్య నేర్పునెవండో
సుర సమ ఘన తేజుఁ డెవఁడు
పరమ సుకృతిఁ గనెడి యతని భక్తిఁ దలంతున్!
గురుశబ్ద వాచ్యు డెవ్వడు
రిప్లయితొలగించండిగురువన సకలము నొసగెడి కూరిమి తండ్రౌ
గురువన సఖుడును ,బంధువు
గురువన హితమును తెలిపెడి గోవర్ధనుడే
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిసవరించినందుకు సంతోషం!
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగురు శబ్ద వాచ్యు డెవ్వడు
మరి తెలియదె మీకు సామి !మాన్యుడు గురువే
గురువే జ్ఞానము నిచ్చును
గురువను శబ్దమ్ము భువిని గురుతర మయ్యెన్
గురు శబ్ద వాచ్యుడెవ్వడు
రిప్లయితొలగించండిపరమపదముగా తలంచి పరుల హితంబే
తరగని సంపదగానెం
చి రక్షగా నుండడా ఉచిత గుణశాలిన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సి. రామ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుశబ్ద వాచ్యుడెవ్వరు?
రిప్లయితొలగించండిహరియించుచు పాపఖర్మలనవరతమ్మున్
దరిచేర్చుపరమ పురుషుడు
శిరిమగడే నిజపుగురుడు హల మనుజులకున్
హలః భూమి
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కర్మ’ను ‘ఖర్మ’ అన్నారు. ‘సిరి’ని ‘శిరి’ అన్నారు. చివరిపాదంలో యతి తప్పింది. ‘సిరిమగఁడే నిజగురుండు క్షితి మనుజులకున్’ అందామా?
నాలుగవ పాదం హరితో మొదలుబెట్టి సిరిగా మార్చాను. యతి సవరించటం మరచాను. గురువుగారి సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికవిమిత్రులందరకు నమస్కారములు.
రిప్లయితొలగించండిగురుశబ్ధ వాచ్యమెవ్వరు?
గురువనగాతల్లి, తండ్రి,గుర్తించుమయా;
గురువన సాక్షాద్దైవము,
గురువే దైవమ్మునెరుగుగోప్యము దెలుపున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుశబ్ద వాచ్యుడెవ్వడు
తొలగించండిగురువే గద మాన్యుడలన గురుదైవముగా
గురునామము స్మరియించిన
పరమ పదముదక్కు పామురు కైనన్
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురుశబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
పరువును కాపాడువాడె, పరికింపంగన్
నిరతము జ్ఞానము నిచ్చును
ధరణీవలయమ్ములోన దర్మము నిలుపున్.
భూసారపు నర్సయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దైవమ్’ అని హలంతంగా ప్రయోగించారు. అక్కడ ‘గురుదైవముగా’ అనండి. ‘నామ స్మరణ’ అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం. ‘గురునామము స్మరియించిన’ అనండి.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురు శబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
రిప్లయితొలగించండిసురుచిర శబ్ద రుచి రార్థ సూక్తిని నెమ్మిన్
భరతా న్వయస త్కథాసమ
విరచితు నన్నయును మించి విబుధులు గలరే
గురుశబ్ద వాచ్యుడెవ్వడు
రిప్లయితొలగించండిహరిశబ్దమువీడబోడు నాత్మయు మరియున్
పరమాత్మయునొకటేనను
పరమార్థముజెప్పువాడె పరమగురుండౌ !!!
గురుమూర్తి ఆచారి గారి పద్యము....
రిప్లయితొలగించండిగురుశబ్ద వాచ్యు డెవ్వరు?
గురువన తన శిష్యపుత్రు కుశలము గోరున్
గురువన కుమతము బాపును
గురువన విజ్ఞాన దధికి కుటరమగు గదా !
( విజ్ఞాన దధికి కుటరము = జ్ఞాన మను పెరుగునకు కవ్వము )
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. సవరించండి.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం. ‘పరమపదము దక్కు నెట్టి పామరుకైనన్’ అనండి.
గురుశబ్ద వాచ్యుఁ డెవ్వడు
రిప్లయితొలగించండితిరమగు విజ్ఞానమొసగు తీరమె తానౌ
ధరణికి యాధారంబగు
గురువును మదిదలచి జేతు కూర్నినిషాతుల్!!!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. బేసి గణము జ గణము వచ్చిందని మార్చినప్పుడు పూర్వ గణము నగ అయ్యిందని గమనించ లేదు. ధన్యవాదములు. సవరించిన పద్యము తిలకించ గోర్తాను.
రిప్లయితొలగించండిగురు శబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
సురుచిర శబ్ద రుచి రార్థ సూక్తిని నెమ్మిన్
భరతాన్వయచరితాసమ
విరచితు నన్నయును మించి విబుధులు గలరే
గురుశబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
రిప్లయితొలగించండినిరతము తత్త్వప్రధాన నిర్గుణపరుఁడై
పరమేశ్వర గుణగణముల
నెఱిగించెడి వాఁడటంచు నెఱుఁగు సుబుద్ధీ
15శ్రీగురువర్యులైన కందిశంకరయ్యగారికివందనచందనాలు
రిప్లయితొలగించండినిన్నటి పద్యరచనలోమొదటిపాదాన్ని మూడవ పాదములోవేసి
పొరపాటుజేసినందుకుక్షమించండి.గుండా వేంకటసుబ్బారావుగారికితెలుపుకుంటున్నాను
గురుశబ్ద వాచ్యుడెవ్వడు?
వరములు గుప్పించగలుగు పరమేశునితో
కరుణయు బంచగ జేసెడి
మరువని మమతానురాగ మాధవుడేగా|
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ధరణికి నాధార’ మనండి.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ నిన్నటి పద్యం బాగుంది. అభినందనలు.
నా రెండవ పద్యము:
రిప్లయితొలగించండిగురు శబ్ద వాచ్యుఁ డెవ్వఁడు?
గురుఁడే తలి దండ్రి యన్న గురుఁడే సర్వుం
డిరవుగ మనుజుల కెల్లన్
గురుఁడు త్రిమూర్త్యాత్మకుండు గురుఁడు త్రిగుణుఁడే!!
గురుశబ్ద వాచ్యుఁడెవ్వడు
రిప్లయితొలగించండితరతమ భావము గణించఁ దలపడు నెపుడున్
పరమార్థముశిష్యులుఁ దా
మెఱుగంగన్ బోధఁ జేయు నిలనీశుండై!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురు శబ్ద వాచ్యు డెవ్వడు ?
రిప్లయితొలగించండిపరహితమును గోరు రీతి ప్రత్యాయనమున్
వరముగ నిచ్చుచు చాత్రుల
పరివర్తన జేసి దేశ ప్రగతి గణి౦చన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుశబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
రిప్లయితొలగించండిపరుగిడి నాయకుల వెంట బ్రహ్మాండమ్మౌ
వరముల కోరనె కోరడు;
సరియగు భత్యమ్మిడగనె సరసము లాడున్
గురుశబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
రిప్లయితొలగించండిబరువగు పద్యములనందు భారపు రీతిన్
బరబర నేర్పగ బోవడు
చిరు మార్గమ్మును మనకిట చేర్చెడి వోట్లన్