30, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్య - 1840 (జింక చంపి తినును...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జింక చంపి తినును చిఱుతపులిని.
ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు. 

80 కామెంట్‌లు:

 1. కవి మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి గారికి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారికి ధన్యవాదములు.

   తొలగించండి
 2. గురువు గారికి ప్రణామములు ..అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. పూప పల్లవముల పొట్టార భుజియించు
   జింక, చంపి తినును చిఱుత పులి, ని
   డుపడి పవనమున్ కుడుచునయ్యె, నేతయె
   ధనము మ్రింగి బ్రతుకు ధరణి యందు.

   నిడుపడి = పాము

   తొలగించండి
  2. ఆంజనేయ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. తీర్చు కొనగ వలెను తీరని నాదు మో
   జింక, చంపి తినెడు చిఱుత పులిని
   వేగ మందు మృగముఁ వేటాడు సమయాన
   కాంచ వలెననెడిది కాంక్ష నాదు.

   తొలగించండి
  2. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   సమస్యలోని ‘తినును’ను ‘తినెడు’ అని మార్చారు. అలా మార్చకూడదు కదా!

   తొలగించండి
  3. గురువు గారు క్షమించాలి. నేను తినెడు అనే అనుకున్నాను సమస్య ను రెండవ పూరణచేసేటపుడు గమనించలేదు

   తొలగించండి
 5. ఊరిపైనబడుచు నారగించుచునుండె
  చిఱుత యొకటి యనుచు చింతనొంద
  రాజు వచ్చె నటకు రాణువ తోడ రా
  జింక చంపి తినును చిఱుతపులిని!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   కాని... రాజు పులిని చంపి తినడం...?

   తొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  చిఱుత యాఁకఁటికినిఁ జిక్కి బాధనుఁ జెందు;
  నచటి నుండి యెటకొ యరుగుచుండు

  జింక; చంపి తినును చిఱుతపులి; నిజ జ
  ఠరము శాంతిఁ బొంద, సరగునఁ జను!

  రిప్లయితొలగించండి
 7. ..అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 8. సుకవి మిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! మీకు మీ కుటుంబమున కా భగవంతుఁ డాయురారోగ్యైశ్వర్య సుఖ సంతోష శాంతులను, శుభములను, సత్వరకార్యసాఫల్యతల నొసఁగు గాత! _/\_

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యులు గుండు మధు సూదన్ గారికి నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 9. కవి మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.


  మానవుండు జూడ మాయగాడేసుమా
  కడుపు కొరకు, లేద కాసు కొరకు
  ఎట్టిజంతువైన నెద్దు పందీ యావు
  జింక చంపి తినును చిఱుతపులిని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవిమిత్రులు గోలి హనుమ చ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

   తొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. జింక చంపి తినును చిరుత పులి ని నట
  తారు మారు గాను నార్యు లనిరి
  చిరుత పులియ తినును జింకను ,నరయగ
  పులిని జూడ పారి పోవు జింక

  రిప్లయితొలగించండి
 11. .అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 12. * గు రు మూ ర్తి ఆ చా రి *
  --------------------------

  క్రూర మృగముల దిను కోరికన్ రాక్షసు
  డొకడు లేడి రూప. మొ౦ది తిరుగు ;
  చిరుత యొకటి దుముక. చె౦గున , నా మాయ.
  జి౦క - చ౦పి తినును చిరుత పులిని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురు మూర్తి గారూ, సమస్యకు చక్కని పరిష్కారం సూచించారు. బాగుంది.

   తొలగించండి
  2. గురుమూర్తి ఆచారి గారూ,
   డా. విష్ణునందన్ గారు మెచ్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 13. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాణరెడ్డిగారికి జన్మదినశుభాకాంక్షలు....

  రిప్లయితొలగించండి
 14. చేరి వనము వేడ్కఁ జింకను జూచి రా
  జింక చంపి తినును చిఱుతపులిని
  జంపు చర్మ పాణి జాపహరణకునై
  వన్యమృగహననము బాడి కాదు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారూ, " చేరి వనము వేడ్కఁ జింకను జూచి రా " అన్న మొదటిపాదంలో వేడ్క తరువాత అరసున్న పని లేదు. ' వేడ్కఁ జింకను ' అంటే "వేడ్కన్ + చింకను" అని అర్థం .కనుక అనవసరమైన తావులలో అర్ధానుస్వారము వాడకపోవడమే మంచిది.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. డా. విష్ణు నందన్ గారు నమస్కారములు. ధన్యవాదములు. సవరించితిని.

   తొలగించండి
  4. డా. విష్ణు నందన్ గారు దృతము ప్రకృతికముల మీద పరుషములుంటే సరళములవుతాయి. సరళములున్న మార్పు జెందవు గద. దృతము మీద సరళములుండ గూడదని లేదు గద. జింకను వేడ్కతో జూచాడు రాజు. ఈ యర్ధము లో అనుస్వారమున్న తప్పు లేదేమో. ఆలోచించ గోర్తాను.

   తొలగించండి
  5. శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ సందేహం మెచ్చదగినదే కానీ - ముందుగా ' నకారంబు ద్రుతంబు ' ... అది దృతము కాదు. ద్రుతము. వడిగా జారిపోయే స్వభావము కలది కనుక . రెండవది వేడ్క అని ఆపితేనే వేడుక అనీ, వేడ్కన్ అని రెండర్థాలు. ఇక మధ్యలో అరసున్న వాడే అవసరమే లేదు.అందులో మరో మాటకు తావు లేదు. ఇంతకు మించి ఈ విషయంలో శ్రీ కంది శంకరయ్య గారే స్పందిస్తే మేలు.

   తొలగించండి
  6. కామేశ్వర రావు గారూ,
   సహజ సరళానికి ముందున్న ద్రుతం పూర్ణానుస్వారంగా మారిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అంటున్నారు గుండు మధుసూదన్ గారు. కొన్ని ఉదాహరణలు వెదకి చెప్తానన్నారు. కాని ఎట్టి పరిస్థితిలోను అక్కడ ద్రుతం అర్థానుస్వారంగా మారదు. బిందు సంశ్లేషలు విభాష నగు అన్నప్పుడు బిందువంటే పూర్ణబిందువు, అర్థబిందువు. అది కేవలం ఆదేశసరళానికి ముందున్నపుడే. ‘వేడ్కన్+జింకను’ అన్నప్పుడు పూర్ణబిందు సంశ్లేషలకు అవకాశం ఉంది (వేడ్క న్జింకను, వేడ్కం జింకను). కాని అక్కడ అర్ధబిందువుకు అవకాశం ఏమాత్రం లేదు. గమనించగలరు. పూర్ణబిందువు విషయంలోనూ నాకు సందేహమే. గుండు వారి కొన్ని ఉదాహరణలు చెప్తానన్నారు కదా... చూద్దాం...

   తొలగించండి
  7. డా. విష్ణు నందన్ గారు సహృదయముతో మీరిచ్చిన వివరణ పూర్తి సంతృప్తి కరముగా యున్నది. ధన్యవాదములు.

   తొలగించండి
  8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆసక్తి కరమైన యీ చర్చ వలన మంచి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధుసూదన్ గారి వివరణకు కూడ ఎదురు చూస్తాను.

   తొలగించండి
  9. మిత్రులు శంకరయ్యగారూ!

   సహజ సరళములకు ముందున్న ద్రుతము పూర్ణబిందువుగా మారిన సందర్భములున్నవి. చూడుఁడు సూత్రము: "వర్గయుక్సరళములు పరము లగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి" (బా.వ్యా.సంధి-19)
   ఉదా: వచ్చెను + ధాత్రీపతి = వచ్చెం ధాత్రీపతి; పాడెను + గంధర్యుఁడు = పాడెం గంధర్వుఁడు; కన్ + దోయి = కందోయి

   ఇంతియే కాక...
   ద్రుతమునకు సరళ స్థిరములు పరమగునపుడు లోప సంశ్లేషములు విభాషగ వచ్చును.
   చూడుఁడు: ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషంబులు విభాష నగు. (పై సంధి సూ.18)
   ఉదా: వచ్చెను + గోవులు = వచ్చె గోవులు, వచ్చె న్గోవులు, వచ్చెను గోవులు;
   మెఱసెను + ఖడ్గము = మెఱసె ఖడ్గము, మెఱసె న్ఖడ్గము, మెఱసెను ఖడ్గము

   వీనినిం బట్టి తేలిన దేమన...ద్రుతము తదుపరి యున్న సరళమునకు ముందు లోపము, సంశ్లేషము, పూర్ణ బిందువు, స్వత్వము...లు వచ్చుటకు నవకాశము కలదు కాని, యర్ధానుస్వారము వచ్చుట కవకాశ మెంతమాత్రమును లేదు.
   స్వస్తి.

   తొలగించండి
  10. సుకవి మిత్రులు పోచిరాజు కామేశ్వర రావుగారూ!

   మిత్రులు డా. విష్ణు నందన్ గారు మొదట సూచించిన యభిప్రాయమునే యనుసరించుట సముచితము. స్వస్తి.

   తొలగించండి
  11. గుండు మధుసూదన్ గారూ,
   సలక్షణంగా చక్కని సమధానం ఇచ్చారు. ధన్యవాదాలు.

   తొలగించండి
  12. కవి పుంగవులు గుండు మధుసూదన్ గారు నమస్కారములు. శ్రమ తీసుకొని పంపిన వివరణ కు ధన్యవాదములు. జిజ్నాసతో అడిగిన సందేహమే. డా. విష్ణు నందన్ గారి సూచన మేరకు మొదటి లోనే సవరించితిని.
   పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు.

   తొలగించండి
 15. 'ఈగ' తెచ్చి పెట్టె నిక్కట్ల నెన్నియో
  ముందు జన్మఁ బోటు పొడిచెననుచు!
  వైరి చిఱుతఁ గూర్చఁ బాటవమున నొక
  జింక, చంపి తినును చిఱుత పులిని!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. కవిమిత్రులు అన్నపరెడ్డి వారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవిమిత్రులు గుండా వేంకట సుబ్బ సహ దేవుడు గారికి ధన్యవాదములు.

   తొలగించండి
 17. గరిక, పండ్లు దినుచు గంతులేయును కృష్ణ
  జింక, చంపి దినును చిఱుత పులి, ని
  జముగ నడవి నగల జంతువులను,క్షీర
  దముల నుచవిగొనగ దారికాయు !!!

  రిప్లయితొలగించండి
 18. పాఱుమంద నుండి వేరుపడగఁజేసి
  జింక, చంపితినును చిఱుతపులి, ని
  రతము జరుగునిది యరణ్యములందున
  సకలజీవ రాసి సాగ ధృతిని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు! ఆయురారోగ్యైశ్వర్యాభి వృద్ధిరస్తు!!!

   తొలగించండి
  2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. ఆకు లారగించు నట్టి సాదువైన
  జింక జంపి ,తినును చిరుతపులి .ని
  సర్గజమ్ము తమకు సనతు డేర్పరచిన
  కబళ మనుచు హి౦స్రకమ్ము లని యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సాధువైన’ అన్నచోట గణదోషం... ‘సాధు వయిన’ అనండి.

   తొలగించండి
 20. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. "సమస్త సన్మంగలాని భవంతు"

  రిప్లయితొలగించండి
 21. ..అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 22. వడివడిగ చనియెడి పక్షుల గని రా
  జింక చంపితినును;చిఱుతపులిని
  వలను బంది చేయ పన్నాగమును పన్ని
  వేటగాడు వేచె విపిన మందు.

  రిప్లయితొలగించండి
 23. కాననమున పచ్చి గడ్డి తిని బ్రతుకు
  జింక, చంపి తినును చిఱుతపులి
  సానువందు సకల జంతువులను,
  ప్రకృతి నియమపు పరిపాటి యిదియె

  రిప్లయితొలగించండి
 24. కాననమున పచ్చి గడ్డి తిని బ్రతుకు
  జింక, చంపి తినును చిఱుతపులి
  సానువందు సకల జంతువులను,
  ప్రకృతి నియమపు పరిపాటి యిదియె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవపాదంలో గణదోషం.

   తొలగించండి
 25. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  క్షణము క్షణము నందు జంపాడి పంటల
  జింక చంపి తినును ; చిఱుతపులిని
  యెరిగి వెంటనంటి యేగును నక్కయే
  యెఱచి కొఱకు, కాన నెపుడు చూడ

  రిప్లయితొలగించండి


 26. *గు రు మూ ర్తి ఆ చా రి *
  ..............................

  ఈనాటి నా సమస్యాపూరణము బాగున్నది అని . ప్రత్యుత్తరము వ్రాసిన. గురువు గారగు
  శ్రీ క౦ది శ౦కరయ్యగారికి ,
  డా శ్రీ విష్ణున౦దన్ గారికి ,
  మరియు శ్రీ గు౦డా సుబ్బ సహదేవుడు గారికి
  నేను వినయపూర్వకముగా
  పాదాభివ౦దనము చేయు చున్నాను .
  మరియు కవిమిత్రులకు, కవయిత్రులకు అ౦దరికి శిరస్సు వ౦చి నమస్కరిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 27. జింకచంపితినునుచిరుత|పులిని
  బారిన బడక తప్పించు దారిలేక
  విధికి బలిగాగ జంతువుల్ పిరికితనము
  దానికాహార మవ్వుట మానలేదు.

  రిప్లయితొలగించండి
 28. జింకచంపితినునుచిరుత|పులిని
  బారిన బడక తప్పించు దారిలేక
  విధికి బలిగాగ జంతువుల్ పిరికితనము
  దానికాహార మవ్వుట మానలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   తేటగీతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
   మొదటిపాదంలో గణదోషం.

   తొలగించండి
 29. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  భూసారపు నర్సయ్య గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. (వారి కంప్యూటర్ సహకరించక ఫోన్ ద్వారా చెప్పారు)

  రిప్లయితొలగించండి
 30. భూసారపు నర్సయ్య గారు ఇలా తెలియజేశారు (ఫోన్ ద్వారా).....
  కవిమిత్రులకు నమస్సులు.
  ఈరోజు నేనిచ్చిన సమస్యకు చక్కని పూరణ లందించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 31. శ్రీ శంకరయ్య గురువరులకు దోష సూచనకు ధన్యవాదములు
  సవరించిన పద్యమిది
  కాననమున పచ్చి గడ్డి తిని బ్రతుకు
  జింక, చంపి తినును చిఱుతపులి
  సానువందు సకల సాదుజంతువులను,
  ప్రకృతి నియమపు పరిపాటి యిదియె

  రిప్లయితొలగించండి