చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. పద్యంలో సమాపక క్రియ లోపించింది. ‘ప్రేమను పంచవె| యడుగులు...’ అనండి. ***** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. దన్యవాదాలు.
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు. మూడవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘...దాటు వారల’ అనండి. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ మూడవ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, పద్యం బాగున్నది. అభినందనలు. కాని పాదాన్ని స్థానభ్రంశం చేశారు. రెండవ పాదంలో గణదోషం. 'అనిలో ధృతితో /అనిలోన ధృతిన్' అనండి. ***** గురుమూర్తి ఆచారి గారూ, వృత్త్యనుప్రాసతో మీ సర్వలఘు కందం మనోహరంగా ఉంది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** పోచిరాజు కామేశ్వరరావు గురూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, చాలా సంతోషం... మీ పద్యాన్ని పైపైన చదివాను. ప్రయాణంలో ఉన్నాను. రాత్రికి ఇంటికి చేరుకున్నాక నిశితంగా పరిశీలించి నా అభిప్రాయం తెలుపుతాను. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. "సత్య నీమము" అన్నచోట "సత్య నియమము లలరన్" అనండి.
పుడమిఁ గల జనులు పొగడఁగ
రిప్లయితొలగించండివిడనాడక ధర్మమెపుడు వెతలెదురైనన్
తడబడక రామచంద్రుడు
కడవరకును రాజ్యమేలె కమనీయముగన్
పుడమిఁ గల జనులు పొగడఁగ
రిప్లయితొలగించండినడవడిక నుమార్చు కొనక నాణ్యత పెంచన్
పిడికెడు ప్రేమను పంచుతు
అడుగులు తడబడక నీవు నాదర మొప్పన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అవిశ్రాంత పద్యశాల నలుపెరుగని బాటసారి :
01)
_______________________________________
పుడమి గల జనులు పొగడగ
నెడతెగక దెలుంగు పద్య - మెచ్చిఱుటకునై
కడగండ్లవి యెటు లమరిన
కడగును మన(ఘన,) కవి, గురువగు - కందీశ్వరుడే !
_______________________________________
కడగు = దాటు , సాహసించు
ఎచ్చిఱు = వర్థిల్లు
కందీశ్వరుడు = కంది ఈశ్వరయ్య(శంకరయ్య)
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పద్యంలో సమాపక క్రియ లోపించింది. ‘ప్రేమను పంచవె| యడుగులు...’ అనండి.
*****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. దన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారికి నమస్కారములతో.
తొలగించండి1.
పుడమిఁ గల జనులు పొగడగ
ఇడుముల దీర్చెడు నెపమున నీశుని సుతుడే
వడిగల వాహన మెక్కియు
సడి సేయక తరలివచ్చు స్కంధాగ్రజుడే.
2.
పుడమిఁ గల జనులు పొగడగ
కడలిని పవనాంథసుపయి కమలన యనతోన్
పడగలనీడన పవళిం
చెడుహరి యేతెంచి భక్త శ్రేయము గూర్చున్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కడలిని’ అనండి.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
పుడమి గల జనులు పొగడగ
జడువక తొలగించె మూఢ జాడ్యము, జగతి
న్నడిపించె వివేకానం
దుడు భారత జాతి మెచ్చు ధ్రువతార యనన్
1.పుడమి గల జనులు పొగడగ
రిప్లయితొలగించండితడబాటేమియు నుపడక ధర్మజు డుర్విన్
కడవర కేలె సునడ
వడిగల రాజను సుకీర్తి బడయుచు మెరిసెన్.
2.పుడమి గల జనులు పొగడగ
వడిగా గాధేయు వెంట వాసిగ చనిన
మ్మడినట పెండ్లాడగ తడ
బడు నడుగుల తోడ సీత వలచుచు వచ్చెన్.
3.పుడమిగల జనులు పొగడగ
కడు ప్రావీణ్యమును బొంది కష్టము లెల్లన్
వడివడిగ దాటెడి వారల
నడవడి నవలోకనమ్మొనర్చగ రమ్మా!
పుడమిఁ గలజనులు పొగడగ
రిప్లయితొలగించండిజడలో శశిరేఖ యున్న జగదీశ్వరుడే
ఒడిలో గలగజ ముఖుతో
వడివడి విచ్చేయునంట వరముల నొసగన్
పుడమి గల జనులు పొగడగ
రిప్లయితొలగించండిగడగడ లాడించె రిపుల కఠినపు రీతి
న్నడవుల దిరుగుచు శ్రీ రా
ముడుదగు శౌర్యంబు తోడ మునులను గావన్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మూడవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘...దాటు వారల’ అనండి.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ మూడవ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కడలినిదాటి రయమ్మున
రిప్లయితొలగించండినడచి నిచాచరుల కోటి ననిలోన ధృతితో
పుడమిఁగలజనులు పొగడగ
వడి రాముడు చనె తనపురి పాలన సలుపన్
పద్యరచన
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
-------------------------
వృత్యను ప్రాసాల౦కృత
+ + + + + + + + + +
స ర్వ ల ఘు క ౦ ద ము
+ + + + + + + + + +
పుడమి గల జనులు పొగడగ
కుడుములను,వడల నిడగనె కుడిచి కరుణతో
పొడగను నొడయడు గణపతి .ి
ఇడుములగిరి పొడుము సలుపు నెడపక నతడే !
..............................
( కరుణతోపొడగను : దయతో
చూడు : ఒడయడు : దొర.
పొడుముసలుపు: పొడిచేయు
ఎడపక : నిరతము )
ే
పద్యరచన
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
-------------------------
వృత్యను ప్రాసాల౦కృత
+ + + + + + + + + +
స ర్వ ల ఘు క ౦ ద ము
+ + + + + + + + + +
పుడమి గల జనులు పొగడగ
కుడుములను,వడల నిడగనె కుడిచి కరుణతో
పొడగను నొడయడు గణపతి .ి
ఇడుములగిరి పొడుము సలుపు నెడపక నతడే !
..............................
( కరుణతోపొడగను : దయతో
చూడు : ఒడయడు : దొర.
పొడుముసలుపు: పొడిచేయు
ఎడపక : నిరతము )
ే
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగున్నది. అభినందనలు.
కాని పాదాన్ని స్థానభ్రంశం చేశారు. రెండవ పాదంలో గణదోషం. 'అనిలో ధృతితో /అనిలోన ధృతిన్' అనండి.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
వృత్త్యనుప్రాసతో మీ సర్వలఘు కందం మనోహరంగా ఉంది. అభినందనలు.
పుడమిఁ గల జనులు పొగడఁగ
రిప్లయితొలగించండివిడనాడక నీతి నియతి విజ్ఞత తోడన్
నుడివిన పనులను జేసిన
పడునోటులు మరల నీకె పన్నుగ నేతా!
పుడమిఁగల జనులు పొగడఁగ
రిప్లయితొలగించండినడిపించెను గాంధితాత నయముగ పోరున్
జడవక నాంగ్లేయులకు
న్నిడుములు తొలగించి దెచ్చె నింపుగ స్వేచ్చన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుడమిఁ గల జనులు పొగడఁగ
రిప్లయితొలగించండినడరిన ముఖకమలుడు గురునత శిరుడును రా
ముడట శివధనువు విరువగ
వడివడి ముదిత జనకసుత పరిణయ మయ్యెన్
( “ధనుసు” ను ధనువు గా సవరించాను.)
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పుడమిగల జనులు పొగడగ
రిప్లయితొలగించండిపడగొట్టేను మత్స్య యంత్ర పాంచాలిక నా
వెడ బాపడైన పార్థుడు
ఆడలె సభను నృపులు విప్రు లాన౦ది౦పన్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి-------------------------గురువుగారూ ము౦దు నన్ను
క్షమి౦చ౦డి.నాది కాస్త అధికప్రస౦గమే ఐన క్షమి౦చ౦డి
నేను రె౦డు రోజులు శ్రమపడి దీర్గ సమాస భూయిష్టమయిన. ఒక
స్రగ్ధరా వృత్తమును ఎలాగో వ్రాశాను.మీ దృష్టికి తేవాలని నా కోరిక.ఎలాగు దసరా వస్తు౦ది.
రాక్షస స౦హారిణి యగు
కా ళి కా స్తు తి
---------------- స్రగ్ధరా వృత్త నియమాలు
మరభనయయయ
యతులు రె౦డు 8. 15
----------------------
చ౦డీ హూ౦కార నిర్ఘోష తత గగన/ రోషజ్వలన్నేత్ర
/ జన్యో
------------------------
ఛ్చ౦డీ / ధ్వా౦తారి సాహస్ర నిభ నిలయినీ /
చక్ర శూల స్వరూ కో
------------------------
ద౦డాస్త్రాద్యాయుధాపీత దనుజ జన హృద్రక్త. /
హర్యక్ష యుగ్యా
-----------------------
ము౦డగ్రైవా౦చితా / శ౦భుసతి / విజయ /
చాము౦డి /
శ్రీ కాళికా౦బా !
-------------------------
హూ౦కార నిర్ఘోషతతగగన-
హు౦కార ద్వని వ్యాపిత మైన ఆకాశముగల దానా / రోష జ్వలన్నేత్ర. - రోష జ్వలిత నేత్రి /
జన్య + ఉఛ్చ౦ డీ - యుధ్దభయ౦కరీ /
ద్వా౦తారి సాహస్ర నిభ నిలయినీ - వేయి మ౦ది సూర్యుల కా౦తి గలదాన / చక్ర శూల స్వరూ కోద౦డ. + అస్త్ర. +ఆది + ఆయుధ + ఆపీత దనజ జన హృ త్ + రక్త. - పై ఆయుధముల.
చేత త్రాగ బడిన రాక్ష సు ల గు౦డెల లోని రక్తము గల దానా / హర్యక్ష యుగ్యా - సి౦హ వాహినీ
/ము౦డ గ్రైవా౦చితా రక్కసుల. తలల ు మాల. చే ఒప్పిన దా నా /ి
--------------------------
" గు రు మూ ర్తి ఆ చా రి "
........................
.
పుడమిఁ గల జనులు పొగఁడగ
రిప్లయితొలగించండినిడుములు నెదురైన సత్య నీమము తోడన్
కడవరకు హరిశ్చంద్రుఁడు
కొడుకును భార్యయు విడివడఁ గోరడు సుఖమున్!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
చాలా సంతోషం... మీ పద్యాన్ని పైపైన చదివాను. ప్రయాణంలో ఉన్నాను. రాత్రికి ఇంటికి చేరుకున్నాక నిశితంగా పరిశీలించి నా అభిప్రాయం తెలుపుతాను.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
"సత్య నీమము" అన్నచోట "సత్య నియమము లలరన్" అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిపుడమిఁ గల జనులు పొగడఁగఁ
నిడుములు నెదురైన సత్య నియమము లలరన్
కడవరకు హరిశ్చంద్రుఁడు
కొడుకును భార్యయు విడివడఁ గోరడు సుఖమున్!
పుడమి గల జనులు పొగడగ
రిప్లయితొలగించండివడివడిగ హనుమ నెగిరెను పరువున కటుగా
నడిమెను దిగి కలయదిరిగి
బుడిబుడి పొడ గలిగి వెదకి భువి సుతనుగనెన్!!!
పరువు = సముద్రం నడిమె = లంక పొడ = ఆకారం
పుడమిఁగలజనులు పొగడగ
రిప్లయితొలగించండికడతేర్చెనరకుని సత్య కదనమునందున్
కడిమిఁగని మురారి మురిసి
పడతుక మరిమరి నుతించె పరవశుడగుచున్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*******
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(కురు సభయందు ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుఁడు పలికిన మాటలు)
సీ.
పుడమిఁ గల జనులు పొగడఁగఁ బాండవ
.....స్వార్జితమ్మగు రాజ్య మూర్జితముగ
స్వచ్ఛ మానస బోధ సలిపినట్టుల నీవు
.....నాదరించియు నిడ, నవనతులయి,
పాండవుల్ నీ వంశ పారంపరాంచిత
.....ఖ్యాతి విశ్వవ్యాప్త గమకితముగఁ
జేతురు, కావునఁ జేతోద్భవమ్మైన
.....స్వార్థమ్ము విడనాఁడవయ్య యిపుడు!
గీ.
నాదు మాటలు మదిలోన నమ్ముమయ్య!
భావి విస్ఫోటనమ్మునుం బాపుమయ్య!
సుతుల నెల్లఱఁ జల్లంగఁ జూడుమయ్య!
భరతవంశోన్నతుఁడవు నీ వగుఁ గదయ్య!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండికందపద్య పాదాన్ని సీసంలో ఇమిడ్చి చెప్పిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుడమిఁ గల జనులు పొగడఁగ
రిప్లయితొలగించండిహడలెత్తగ రాహులుండు హైరాణాయెన్
వడివడిగా పరుగులిడుచు
కడకిక మోడిని బిగిసెను కౌగిలి లోనన్
రిప్లయితొలగించండిపుడమిఁ గల జనులు పొగడఁగ
నడచెను కాళీయుని యవ నారి జిలేబీ
బడగొండ భళ్ళన గిరిధ
రుడయ్యె నతడే మురారి ద్రుహినుడు సుమ్మీ
జిలేబి