అడవిఅన్నలారా!ఎట్టిఫలితమొసగు పట్టి బడుగు గిరిజనులఁజంపఁగల్గు ఘనయశమ్మువారిని సతతమ్ము పండించు దుష్టులపేరడిచి సరియగు దారిఁజుపపండించుః మోసగించు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మారణాయుధముల మహిలోన సృష్టించివిశ్వ శాంతి కనుచు విన్న వించిప్రగతి కాముకులని వాసి గాంచినవారిజనుల జంప గల్గు ఘనయశమ్ము
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెడ్డ పనులు చేసి చిక్కులు కల్గించుఅల్ప బుద్ధివారి నణచి వేయకఠిన నిర్ణయాలు గట్టిగా గొని యా కుజనుల జంప గల్గు ఘనయశమ్ము
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాత కములు గలిగి పాపిగా బేరొం దు జనుల జంప, గల్గు ఘన యశమ్ము మంచి కార్య ములను మాత్రమే జేయంగ చేత లుండ వలయు శ్రీ క రముగ
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా (విక్రమాదిత్యుని గూర్చి యిచ్చిన) వివరణ తిలకించ గోర్తాను.
పోచిరాజు కామేశ్వరరావు గారూ, ప్రయాణంలో ఉన్నాను. రేపు వివరంగా సమాధానం ఇస్తాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సవ్య సాచి సకల శస్త్రాస్త్ర వేదుడుకాలకేయు లవని ఖండితులవ విజయు డాజిని ఘన విజయుడే శాత్రవజనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.
పోచిరాజు కామేశ్వరరావు గారూ మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మానవత్వమసలు మచ్చుకైననులేకపాపకార్యమన్న భయము వీడిపరుల మోసగించి బ్రతుకు గడుపుదుష్టజనుల జంప గల్గు ఘన యశమ్ము!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు
జనుల జంపగల్గు ఘన యశమ్మును సమవర్తి యైన జముడు పడయుచుండజనుల ప్రాణములను దనమును గొ౦పోవు ప్రథితి నొందె యముని భ్రాత వెజ్జు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణవిభజనమ్ము గూర్చె విషభోజనమ్మాంధ్రజనుల జంప;గల్గు ఘన యశమ్ము తెలుగు ఖ్యాతి వెలుగ కలహములను వీడిసఖ్య తనువహించి సాగునెడల
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీభవాని యొసఁగ సిసలైన ఖడ్గమ్ముశత్రువర్గసింహస్వప్నమైననా శివాజి పొందె నందరి తోడ దుర్జనులఁ జంపఁ గల్గు ఘన యశమ్ము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
.కలిమిబలిమినమ్మ?కర్కశత్వము రాగజనుల జంప గల్గు ఘనయశమ్ముకంసు డందుకొనిన? కారుణ్యమేలేకబ్రతుకు బ్రమల యందువెతలు ద్రుంచె|2చేయుపనుల యందు మాయనుజొప్పించిచెడునునింపి లాభ గడియలనుచుమోసబరుచు వారి మోహము మాన్పగజనుల జంపగల్గు ఘన యశమ్ము.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'లాభగడియలు' అని సమాసం చేయరాదు. 'లాభఘటికలు /లాభకాలము' అనండి.
కవిమిత్రులందరికినమస్కారములు.దండకాటవిగల ధర్మదూరులసురజనుల జంప గల్గు ఘనయశమ్ముననుచు మునులు దెల్ప నాలించిశ్రీరాముడసుర జాతి పైన నలిగెనాడు.
భూసారపు నర్సయ్య గారూ, బహుకాల దర్శనం! సంతోషం. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడవిఅన్నలారా!
రిప్లయితొలగించండిఎట్టిఫలితమొసగు పట్టి బడుగు గిరి
జనులఁజంపఁగల్గు ఘనయశమ్ము
వారిని సతతమ్ము పండించు దుష్టుల
పేరడిచి సరియగు దారిఁజుప
పండించుః మోసగించు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మారణాయుధముల మహిలోన సృష్టించి
రిప్లయితొలగించండివిశ్వ శాంతి కనుచు విన్న వించి
ప్రగతి కాముకులని వాసి గాంచినవారి
జనుల జంప గల్గు ఘనయశమ్ము
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెడ్డ పనులు చేసి చిక్కులు కల్గించు
రిప్లయితొలగించండిఅల్ప బుద్ధివారి నణచి వేయ
కఠిన నిర్ణయాలు గట్టిగా గొని యా కు
జనుల జంప గల్గు ఘనయశమ్ము
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాత కములు గలిగి పాపిగా బేరొం దు
రిప్లయితొలగించండిజనుల జంప, గల్గు ఘన యశమ్ము
మంచి కార్య ములను మాత్రమే జేయంగ
చేత లుండ వలయు శ్రీ క రముగ
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా (విక్రమాదిత్యుని గూర్చి యిచ్చిన) వివరణ తిలకించ గోర్తాను.
రిప్లయితొలగించండిపోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిప్రయాణంలో ఉన్నాను. రేపు వివరంగా సమాధానం ఇస్తాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవ్య సాచి సకల శస్త్రాస్త్ర వేదుడు
రిప్లయితొలగించండికాలకేయు లవని ఖండితులవ
విజయు డాజిని ఘన విజయుడే శాత్రవ
జనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.
పోచిరాజు కామేశ్వరరావు గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మానవత్వమసలు మచ్చుకైననులేక
రిప్లయితొలగించండిపాపకార్యమన్న భయము వీడి
పరుల మోసగించి బ్రతుకు గడుపుదుష్ట
జనుల జంప గల్గు ఘన యశమ్ము!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
జనుల జంపగల్గు ఘన యశమ్మును సమ
రిప్లయితొలగించండివర్తి యైన జముడు పడయుచుండ
జనుల ప్రాణములను దనమును గొ౦పోవు
ప్రథితి నొందె యముని భ్రాత వెజ్జు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండివిభజనమ్ము గూర్చె విషభోజనమ్మాంధ్ర
జనుల జంప;గల్గు ఘన యశమ్ము
తెలుగు ఖ్యాతి వెలుగ కలహములను వీడి
సఖ్య తనువహించి సాగునెడల
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీభవాని యొసఁగ సిసలైన ఖడ్గమ్ము
రిప్లయితొలగించండిశత్రువర్గసింహస్వప్నమైన
నా శివాజి పొందె నందరి తోడ దు
ర్జనులఁ జంపఁ గల్గు ఘన యశమ్ము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.కలిమిబలిమినమ్మ?కర్కశత్వము రాగ
రిప్లయితొలగించండిజనుల జంప గల్గు ఘనయశమ్ము
కంసు డందుకొనిన? కారుణ్యమేలేక
బ్రతుకు బ్రమల యందువెతలు ద్రుంచె|
2చేయుపనుల యందు మాయనుజొప్పించి
చెడునునింపి లాభ గడియలనుచు
మోసబరుచు వారి మోహము మాన్పగ
జనుల జంపగల్గు ఘన యశమ్ము.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'లాభగడియలు' అని సమాసం చేయరాదు. 'లాభఘటికలు /లాభకాలము' అనండి.
కవిమిత్రులందరికినమస్కారములు.
రిప్లయితొలగించండిదండకాటవిగల ధర్మదూరులసుర
జనుల జంప గల్గు ఘనయశమ్ము
ననుచు మునులు దెల్ప నాలించిశ్రీరాము
డసుర జాతి పైన నలిగెనాడు.
భూసారపు నర్సయ్య గారూ,
తొలగించండిబహుకాల దర్శనం! సంతోషం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.