27, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్య - 1837 (కలఁడా విజ్ఞుండు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్.

37 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. శక+అరుడు (శకులకు శత్రువు) అనే అర్థంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘ఇలపై శకులను దరిమె, స...’ అనండి.

      తొలగించండి

    3. ఇలపై శకులన్ దరిమె స
      భలోన రత్నముల బ్రోచె పాండిత్యములో 
      నలువసతివోలె వెలిగెను
      కలడా విజ్ఞుండు గన శకారుని కంటెన్






      తొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    తులువయు, మూర్ఖుఁడు, కాముకుఁ,
    డిలలో నటువంటి వాని నింతింతని నే
    దెలుపఁగ లేనయ! కుజనులఁ
    గలఁడా విజ్ఞుండు, గన శకారుని కంటెన్?

    రిప్లయితొలగించండి
  3. ఇలలో పొంతన కుదరని
    పలుకు నాడుచు నితరుల బాధించు నఙ్ఞుం
    డలవోకగ వదరు జడుడు
    కలడా విఙ్ఞుండు గన శకారుని కంటెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘పలుకుల నాడుచు నితరుల బాధించెడి వా| డలవోకగ...’ అనండి.

      తొలగించండి
  4. ఇలలో ఫేస్ బుక్ గ్రూపున
    కలసిన నొకవందగలశకారుని ఫ్యాన్సే
    శెలవిచ్చిరిట్లు " కామెంట్"
    "కలడా విఙ్ఞుండు గన శకారుని కంటెన్".

    రిప్లయితొలగించండి
  5. ఇల మాశంకరు కంటెను
    కలడా విజ్ఞుం డు గన, శకారుని కంటె
    న్ద ల చ న్దు ష్టుడు నెచట ను
    కలనైనన్గా నరాడు కంటే సామీ !

    రిప్లయితొలగించండి
  6. అలనాడొక్కశకారుడు
    యిల నేడో కుటిలనీతి హెచ్చ శకారుల్
    పలువురు.వలదిక శంకను
    "కలడా విజ్ఞుండు గన శకారుని కంటెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శకారుడు+ఇల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘శకారుం| డిల...’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు
      సవరించిన పద్యము
      అలనాడొక్కశకారు౦
      డిల, నేడో కుటిలనీతి హెచ్చ శకారుల్
      పలువురు..వలదిక శంకను
      "కలడా విజ్ఞుండు గన శకారుని కంటెన్"

      ప్రత్యుత్తరంతొలగించు

      తొలగించండి
    3. గురుదేవులకు ప్రణామములు
      సవరించిన పద్యము
      అలనాడొక్కశకారు౦
      డిల, నేడో కుటిలనీతి హెచ్చ శకారుల్
      పలువురు..వలదిక శంకను
      "కలడా విజ్ఞుండు గన శకారుని కంటెన్"

      ప్రత్యుత్తరంతొలగించు

      తొలగించండి
  7. అలనాడు విక్రమాది
    త్య లాలితమును నవరత్నధామము హేమా
    మల భారతమన బరగన్
    కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్.
    [నవరత్నములు: విక్రమాదిత్యుని మంత్రి వర్గము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      కాని విక్రమాదిత్యుడు శకకారుడే కాని శకారుడు కాదు కదా!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విక్రమాదిత్యుడు శకారి. “శక” అను వంశస్తులను జయించి శకారి అని బిరుదు పొందాడు. శకకారుడు కూడ. అందుకే శకారుని కంటే గొప్ప వాడు లేడని వ్రాసాను.
      ఇది గాక “శకారుడు” పదానికి అర్ధము నాకు తెలియదు. తెలుప గోర్తాను.

      తొలగించండి
  8. ఇలలో మూర్ఖుఁడు మూఢుం
    డలసుఁడు వేరొక్కడుండు నని యెపుడైనన్
    బలుకునె యటులన్ జెప్పం
    గలఁడా విజ్ఞుండు గన శకారుని కంటెన్ ?

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి నమస్సుమాంజలులు

    నాకో చిన్న సందేహము ' ట ' 'డ' ' జ్ఞ' లకు యతి మైత్రులు తెలుపగలరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఙ కు ట డ లతో యతి మైత్రి కలదా? అని కాదండి నా సందేహము
      ఙ కు గల యతి మైత్రులు యేవి? అలాగే ట కు డకు యతి మైత్రి గల అక్షరాలేవని నా సందేహము గురువు గారు.

      తొలగించండి
  10. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    అలనాడు దిగ్గజముల స
    భలయందున నిల్పె కైత వర్ధిలజేయ
    న్నల కృష్ణారాయలొక్కడె
    గలఁడా విజ్ఞుండు గన శకారుని కంటెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శకారుడు’ ఏ అర్థంలో ప్రయోగించారు?

      తొలగించండి
  11. మానసికంగా దెబ్బతిన్న సాత్వికుని అంతరంగము:

    అలుసౌదు నేటి యుగమున
    తెలిసిన స్ఫటికమ్ముఁ బోలు తీరున నడువన్!
    తలపులకందని నడతను
    కలడా విజ్ఙుండు గన శకారుని కంటెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. శ్రీ కంది శంకరయ్య గారి కి నమస్కారములు

    శకము= 1) ఒక దేశము, 2) ఒక జాతి
    3) డు ఒక రాజు .మూడవ పదం ఆధారముగా రచించినది

    రిప్లయితొలగించండి
  13. ఇలలో వ్యాసుని కంటెను
    కలడా విజ్ఞుండు, గన శకారుని కంటెన్
    ములుచ యవకాశవాదిని
    తలంచలేమెప్పటికిని ధారుని లోనన్
    ములుచః మూర్ఖుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ఇలలో వ్యాసుని కంటెను
    కలడా విజ్ఞుండు, గన శకారుని కంటెన్
    ములుచ యవకాశవాదిని
    తలంచలేమెప్పటికిని ధారుణి లోనన్

    రిప్లయితొలగించండి
  15. 15ఇలలో గల విజ్ఞానము
    కలగా మార్పున సకాల కల్పితమతితో
    కలుషిత భావనలందే
    కలడా విజ్ఞుండు గన శకారునికంటెన్.

    రిప్లయితొలగించండి
  16. పలు యవధానుల హితవరి
    తలలో నాలుక తెరవున తారట లాడున్...
    తెలుపుము కవివర శంకర!
    కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్?

    రిప్లయితొలగించండి


  17. పలుమారులు కాపాడెను
    తళుక్కు మను పూరణలను తట్టనుచు జిలే
    బులవలె తెలుపుచు కవిరాట్ ,
    కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్


    జిందాబాద్ సఖా ! శకారుడా !


    జిలేబి

    రిప్లయితొలగించండి