23, అక్టోబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1042

కవిమిత్రులారా!
“బలము గలదేని నాతో...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

28 కామెంట్‌లు:

 1. బలము గలదేని నాతోడ భండనమును
  సలుప రమ్మంటి జంకేల సత్వరమున
  కండబలము కన్నను మిన్న గుండె బలము
  కలిగి యుండిన విజయమ్ము తలుపు తట్టు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శాస్త్రి గారూ,
   ఇచ్చిన కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

   తొలగించండి
 2. భీముడు ధుర్యోధనునితో...


  బలము గలదేని నాతో
  తలపడు సమరమ్మునందు, దరితుని వోలెన్
  కొలనున దాకొనక, ననుజ!
  గెలువగ నను వేగరమ్ము గెంటరి వైనన్!!!


  దరితుడు = పిరికివాడు గెంటరి = శూరుడు  రిప్లయితొలగించండి
 3. మిత్రులందఱకు నమస్సులు!

  "బలము గలదేని నాతోఁ
  గలహింపుమ యబల!" యనుచు గర్విత యుతుఁడై
  పలికిన మహిషునిఁ గూల్చియు
  వెలిఁగెను హరివాహన, ఘన "విజయ" దశమినిన్!

  రిప్లయితొలగించండి
 4. బలముగలదేనినాతోడ బవరమందు
  తలపడి విజయమున్ గొని చె లగుమయ్య
  నక్కితివితటాకమునందు ది క్కు లేక
  కడు నబాసు పాలయ్యెనీ కడిమి నేడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. బలము గలదేని నాతో
  దలప డి నను గెలువు మయ్య ! తల్లా ప్రగడా !
  పలువిధపు కారు కూతలు
  కల నైన న్గూ యకెపుడు కాచును భవుడున్

  రిప్లయితొలగించండి
 6. బలము గలదేని నాతో
  గెలిచి సతిని బొందు మనుచు గెంటిన వాలిన్
  దెలిపిన సుగ్రీవు నిలుప
  సెలవైచి చిదిమె రఘుపతి శిఖి చాటుగనే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. బలము గలదేని నాతో
  బలీ దగు చలము వహించి, వజ్రాహతికిన్
  కలవర మొందియసుర మా
  యల గెల్చుట ఘనమె, పోరుమయ్య గనియెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దేవేంద్రుడు మహావిష్ణువనుగ్రహముతో బలసంపన్నుడై తిరిగి బలుని యుద్దము జేసి జయిస్తాడు.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘బలీ దగు’ అర్థం కాలేదు. ‘బలీ’ అనేది సంబోధన అయితే తరువాత ‘తగు’ అని ఉండాలి.

   తొలగించండి
  3. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. బలీ సంబోధనే. “త” అని సవరణ చేస్తున్నాను. ధన్యవాదములు.

   తొలగించండి
 8. బలము గలదేని నాతో
  గెలువుమనుచు పలుకరాదు గీర్వాణము నన్
  బలవంతమైన సర్పము
  చలి చీమల చేత చిక్కి చచ్చుట గనమే

  రిప్లయితొలగించండి
 9. బలము గలదేని నాతో
  తలపడి గెలిచిన కవులకు దాసుడ ననుచున్
  పలికిన డిండిమ భట్టున
  వలీల శృంగార కవియె పాటిగ గెల్చెన్

  బలము గలదేని నాతో
  తలపడి రణమున గెలిచెడు ధైర్యము గలవా
  డిలలో లేడనుచు బృహ
  న్నలతో నుత్తరుడు పలుక నగుబా టవదే

  రిప్లయితొలగించండి
 10. గు రు మూ ర్తి ఆ చా రి
  ------------------------

  హిరణ్య కశిపుడు హరిని దూషి౦చుట
  --------------------------
  * హ రి ణీ వృ త్త ము *
  ---------------------------
  న స మ ర స వ. గణములు యతి 11. వ అక్షరము
  ------------------------

  బలము గలదేనిన్ నాతో గెల్వ యత్నము జేయుమా
  జలనిధిని డాగన్ నీకున్ లజ్జ యి౦చుక లేదొకో !
  పలువ.తులువా.మాయావీ . ఆవహి౦చుచు నా సుతున్
  కలుష మగు నీ నామ౦బున్ పల్కజేసెడు దుర్మతీ

  ( ఆవహి౦చుచు నా సుతున్ :
  నా సుతుడైన ప్రహ్లాదుని ఆవహి౦చుచు )

  '''''''''''''''''''''''''''''''''''''''

  రిప్లయితొలగించండి
 11. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్ళు సందర్భములో
  బలము గలదేనినాతో
  కలనంబునపోరి గెల్చి గైకొని పొమ్మీ
  లలనామణినని శ్రీహరి
  బలుకుచు సాగెను రయమున భామిని తోడన్.

  రిప్లయితొలగించండి
 12. బలముగలదేని నాతో
  తలబడు ఓరాజరాజదాగకుమడుగ
  న్భీముడుకలయగ?నాయువు
  నిలబడునా నీ దేహమందు నిజమిదిరాజా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   నాల్గవ పాదంలో గణదోషం. నిలబడునా దేహమందు.... అనండి.

   తొలగించండి
 13. బలము గలదేని నాతో
  కలహము జేయుము ఘనముగ కలబడి మోడీ!
  స్థలముగ నెన్నెద రోమే
  పలువురు మెచ్చంగ నాకు వరమిడు పోపే!

  రిప్లయితొలగించండి
 14. బలము గలదేని నాతో
  కలముల యుద్ధమున పోరి ఘనముగ నీవే
  పలుకుచు కందము నందున
  తెలుపుము గబగబ ప్రియంక తెల్లని బొట్టున్

  రిప్లయితొలగించండి