22, అక్టోబర్ 2015, గురువారం

సమస్య - 1832 (కరి మహిషాసురుని...)

విజయదశమి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.
(ఒంగోలులో 19-10-2015న జరిగిన అవధానంలో కప్పగంతు జయరామయ్య గారు ఇచ్చిన సమస్య)

43 కామెంట్‌లు:

  1. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు....






    సురలందరు వేడుకొనగ
    ధరణిని గావంగనెంచి తలపడి పోరున్
    సురుచిర గతితో శివశం
    కరి మహిషాసురుని జంపి కాచెన్ జగతిన్!!!

    రిప్లయితొలగించండి
  2. వరగర్వముతో నసురుడు
    సురలను హింసించి ధరకు క్షోభను గూర్పన్
    కరుణించుచు నిత్య శుభం
    కరి మహిషాసురునిజంపి కాచెన్ జగతిన్!!!

    రిప్లయితొలగించండి
  3. వరము బలము చేత నొక య
    సురవరుడు బలిసి దివిజుల చుల్లల వెట్టన్
    సురలను గావగ శివశం
    కరి మహిషాసురుని జంపి కాచెన్ జగతిన్..
    (చుల్లలు వెట్టన్=బాధించగా)

    రిప్లయితొలగించండి
  4. వరగర్వితుడౌ దనుజుని
    పరిమార్చ మనెడు సురగణ ప్రార్థన తో భీ
    కరరూ పమెత్తి శివశాం
    కరి మహిషాసురుని చంపి కాచెను జగతిన్

    రిప్లయితొలగించండి
  5. పరిపరివిధముల ప్రజలకు
    నరకమ్మునుచూపుచున్న నరభోజనునిన్
    స్థిరచిత్తముతోడుత శాం
    కరి మహిసాసురుని జంపి కాచెన్ జగతిన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. దరిజేరి రక్ష యనుచును
    సురలందరు మాత జేరి స్తోత్రముజేయన్
    కరుణను బ్రోవుదునని శాం
    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.

    రిప్లయితొలగించండి
  7. మిత్రులందఱకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

    దురమున దుర్గ శివ మహే
    శ్వరి కాత్యాయని మృడాని శర్వాణి భ్రా
    మరి సుర వితాన విజయం

    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్!

    రిప్లయితొలగించండి
  8. విజయ దశమి శుభాకాంక్షలతో .......
    -----
    వరగర్వా తిశ యంబున
    సురలను బంధించి యతడు చుల్లర వెట్ట
    న్సరగున దలబడి యాశాం
    కరి మహిషాసురుని జంపి కాచెన్ జ గతిన్

    రిప్లయితొలగించండి
  9. అయ్యా ! ఈ సమస్యకు అవధాని గారి పూరణ తెలియ జేయ గలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      ఫేస్‍బుక్కునుండి ఈ సమస్యను కాపీ చేసినప్పుడు అవధాని గారి పూరణను కాపీ చేసికొనడం మరచిపోయాను. ఇప్పుడు వెదికితే దొరకడం లేదు. మన్నించండి.

      తొలగించండి
  10. శరణాగతవత్సల యా
    సురవర వర్షిణి కరమున శూలము చేతన్
    గిరినందిని భగవతి శం
    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. సుగుణోద్భాసులైన మీ అందరికీ విజయ దశమి
    శుభాకాం‍క్షలు.
    ఓంకారాశ్రిత సృష్టినంతటను జ్ఞానోద్భాసయై యుండు నా
    ఐంకారోజ్వల శాంభవీ జనని మోహాంధంబు పొకార్పుతన్,
    హ్రీంకారాద్భుత మాతృ కృష్ణ ఛవి సంప్రీతిన్ మదిం గొల్పుతన్
    శ్రీంకారాక్షర ధామయౌచు సుగుణ శ్రీమంతులన్ గాచుతన్.

    మీ సమస్యకు నా పూరణము.
    కరుణాలయ, జగదీశ్వరి
    పరిపాలన చేయు సుగుణ భాగ్యులఁ గాచున్
    సుర సేవిత, దురిత భయం
    కరి, మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.
    జైహింద్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చింతా రామకృష్ణారావు గారూ,
      బీజాక్షర విన్యస్తమైన మీ శాంభవీ స్తుతి మనోహరంగా ఉంది. దురితభయంకరితో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. ధరలో రాక్షసు హింసలు
    కరమెదిగెను తాళలేక కడు దుఃఖముతో
    మొరపెట్ట జనులు కరుణా
    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.

    రిప్లయితొలగించండి
  13. పురుషులుఁ జంపఁగ లేరను
    వరగర్వితు నంతు జూడ పరమేశ్వరికిన్
    సురలు హనువులొసఁగ శుభ
    కరి మహిషాసురుని జంపి కాచెన్ జగతిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ్ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. ‘శుభం|కరి...’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
      పురుషులుఁ జంపఁగ లేరను
      వరగర్వితు నంతు జూడ పరమేశ్వరికిన్
      సురలు హనువులొసఁగ శుభం
      కరి మహిషాసురుని జంపి కాచెన్ జగతిన్!

      తొలగించండి
  14. చెరిగెను నిప్పుల కన్నుల
    నరికెను దనుజుని శిరము క్షణమునను శివ కే
    సరివాహన యసురభయం
    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.


    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    దురితుని దుష్కృతములు భువి
    నరులను భీతిలగ జేయ నద్భుత రూపున్
    ధరియించిన భక్త వశం
    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.

    రిప్లయితొలగించండి
  16. గు రు మూ ర్తి ఆ చా రి
    ------------------------

    సురగణము సన్నుతి౦ప. న
    సురతతి భ౦జి౦చు :- నిత్య శుభకరి విజయ౦
    కరి , శ౦కరి భక్తవశ౦
    కరి మహిషాసురుని జ౦పి కాచెను జగతిన్

    రిప్లయితొలగించండి
  17. వరగర్వంబున మెలిగెడి
    తరుణము గ్రహియించి కాళితరుముచు మహిషున్
    డురికినబట్టియు శివశం
    కరి మహిషాసురుని జంపి కాచెను జగతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మహిషుం| డురికిన...’ అనండి.

      తొలగించండి
  18. దురితుడు, దురహంకారుడు.
    సురలకు మనుజులకు వైరి, సుదతుల బలిమిన్
    చెరబట్ట, సమరమున శా౦
    కరి మహిషాసురుని జంపి కాచెను జగతిన్

    రిప్లయితొలగించండి
  19. సరదా వరదా పూరణ:

    తిరువేండ్రము వీధులలో
    కరచుచు కుమ్ముచు తునుమెడి ఘనమగు వాని
    న్నరయగ నాలయమునదౌ
    కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్ :)

    రిప్లయితొలగించండి
  20. అరెవో చూడర ఇందిర!
    బరువగు మిలిటరి మొగోణ్ణి బరబర నీడ్చెన్!
    సరిసరి చూడగ తోచెన్:
    "కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్"

    రిప్లయితొలగించండి