చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, ప్రతిరోజూ ఫేస్‍బుక్కులో కనిపించే మీ మధుర ప్రేమ కవితల్లో ఒకటి దారి తప్పి శంకరాభరణంలో కనిపించినట్టుంది. చక్కని పద్యం. ఇలాంటి పద్యాలు వ్రాయడంలో చేయితిరిగిన వారు మీరు. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చిందిట్లు’...?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ మూడవ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘విశ్వరూపు రుచ్యము’ అంటే అన్వయం బాగుంటుంది. ‘వర్ణింతును’ లో ‘ను’ టైపు కాలేదు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ఇచ్చిన పద్య పాదంలో ‘నీ’ అక్షరాన్ని ‘హే’గా మార్చారు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీరు పద్యం పాదంలోని చివరి అక్షరాన్ని రెండు పద్యాలలో మార్చారు. అలా మార్చరాదని గమనించండి.
ధన్యవాదాలు అక్కయ్యా! ధన్యవాదాలు మాష్టారు! ఫేస్ బుక్ లో నా పద్యాలు చూసి చీవాట్లు పెడతారనుకున్నా నిజంగా.. మీ పద్యం యీరోజు బ్లాగుకే తలమానికంగా రంజిల్లుతున్నది మాష్టారు...
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిమోమును దర్శించి నేను పొందిన ముదమున్
ప్రేమ చిగురించె నీపై
కోమలి యీలోకమంత క్రొత్తగతోచెన్
హేట్సాఫ్ ! తమ్ముడూ
రిప్లయితొలగించండిఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిప్రేమకు దాసుడ నటంచు ప్రియముగ కోరన్
సోముని యందము నీదని
నామది చిందిల్లు రీతి నరకం బేలా ?
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిలామల ఘన వర్ణ రంజితాకారాంచ
చ్ఛ్రీమహిళాధిప సత్కరు
ణామృత సంప్రాప్త శుభ నయానుభవమ్మున్.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిప్రతిరోజూ ఫేస్‍బుక్కులో కనిపించే మీ మధుర ప్రేమ కవితల్లో ఒకటి దారి తప్పి శంకరాభరణంలో కనిపించినట్టుంది. చక్కని పద్యం. ఇలాంటి పద్యాలు వ్రాయడంలో చేయితిరిగిన వారు మీరు. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చిందిట్లు’...?
1.ఏమని వర్ణింతును యా
రిప్లయితొలగించండిసోముని వోలెన్ వెలుగెడి సుగుణోత్తమునిన్
నాముని వెంబడి నరిగెడి
రాముని రూపును దలవగ రాగము పెరుగున్.
2.ఏమని వర్ణింతును నీ
మోమును యది చంద్రబింబమో!కమలంబో!
నేమియు దోపన్ నేరని
యీ మానసిక స్థితినెటు నిర్ధారింతున్.
3.ఏమని వర్ణితును నా
యీమదినికలవర బరచి యేగిన యా రా
ధా మానస చోరుండిట
నిమ్ముగ బాధించు చుండె నీతీరుగనన్.
4.ఏమని వర్ణింతును యా
సామజమును బ్రోచినట్టి శ్యామల రూపున్
నామనమున దలచిన లీ
లా మానుషుని మహిమల నిలస్తుతి యింపన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ నాల్గు పద్యాలు చక్కని భావలతో అలరారుతున్నాయి. బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘వర్ణింతును+ఆ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఏమని వర్ణించెద నా...’ అనండి. ‘సుగుణోత్తముడై| యాముని వెంబడి...’ అనండి.
రెండవ పద్యంలో ‘మోమును+అది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మోమది గన చంద్ర...’ అనండి. ‘కమలంబో| యేమియు దోచగ నేరమి’ అని ఉండాలి.
నాల్గవ పద్యంలో ‘...వర్ణించెద నా...’ అనండి. నాల్గవపాదంలో గణదోషం. ‘లీ|మానుషరూపు మహిమ నిల...’ అనండి.
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిభీమపరాక్రమముఁగూర్చి ప్రియమగు సఖియా!
భూమిసుతుఁదునిమి కరమగు
సోమముతోనో లతాంగి చూపితి గెలుపున్
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండినామము నో శంకరార్య!నా మంబరయ
న్నా మా శంకరు నామము
మేముగ నర్చింతు మిమ్ము మీదయ కొఱ కున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండినామ మహిమ సకల పాప నాశనకరమై
క్షేమంబు గూర్చును పరం
ధామా! దైత్యాంతకా! విధాత నమస్తే.
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిరామాంకిత భాగవత పురాణాధికముల్
వేమారు చదువ తనియదు
నామది సతతమ్ము పోత నార్యా ప్రణతుల్
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ సంస్కృత సమాస విరాజితమై మనోరంజకముగా అలరారు చున్నది. అభినందనలు. మీ సహవాసమున మాకు గూడ అబ్బగలవని ఆకాంక్ష!
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి గారి పద్యము....
రిప్లయితొలగించండిఏమని వర్ణి౦తును ? నీ
మోమే యొక చ౦దమామ, ముసిముసి నగవే
ఆ మెరయు ప౦డు వెన్నల
నీ మాటయె తేనె జల్లు నిజముగ చెలియా!
( మెరయు : ప్రసరి౦చు )
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండినా పద్యం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమని వర్ణింతును నీ
తొలగించండినామమహాత్మ్యము ! పొగడగ నాకిక వశమే?
రామా! భవభయ హరమౌ
నామము నే దప్ప బోను నా మొర వినరా!!
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మహాత్మ్యము’ అనండి. బహుశా టైపాటు కావచ్చు.
సీతతో ఆమె చెలికత్తె చెప్పు మాటలుగా!
రిప్లయితొలగించండిఏమని వర్ణింతును నీ
రాముని యందమ్ము నేను రమణీ వినుమా!
భీముడు భండన మందున
సోముడు సుకుమారమందు సొగసరి వాడే!
ప్రియుడు ప్రియురాలితో
ఏమని వర్ణింతును నీ
కోమల రూపమ్ము వినుము కులుకుల రాణీ
మొమున శశిబింబము తను
వేమో! గన మల్లెతీవ వికచాబ్జాక్షీ
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కురుక్షేత్ర సంగ్రామమున, అర్జునుడు:
రిప్లయితొలగించండికృష్ణా!
ఏమని వర్ణింతు? నీ
రోమాంచపు విశ్వరూప రుచ్యము! దేవా!
నామది దిక్కులుఁ దెలియన్
ప్రేమాస్పద రూపుఁ జూపు భీతిని వీడన్!
రిప్లయితొలగించండిఏమని వర్ణింతును,హే
స్వామీ నీవైభవమ్ము వాహన సేవన్
ఆముగ పురవీధులలో
భూమీశులు దాసులగుచు పూజలు సేయన్
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండినామము మది దలచినంత ననవరతమ్మున్
సేమము గల్గును జనులకు
రామా !చేమోడ్పులివియె రవికుల తిలకా!!!
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిమోమును తిలకించినంత ముద్దుల కృష్ణా
సోముండసూయ చెందును
మైమరచును సకల జగము మధుసూధనుడా !!!
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడవ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విశ్వరూపు రుచ్యము’ అంటే అన్వయం బాగుంటుంది. ‘వర్ణింతును’ లో ‘ను’ టైపు కాలేదు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఇచ్చిన పద్య పాదంలో ‘నీ’ అక్షరాన్ని ‘హే’గా మార్చారు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీరు పద్యం పాదంలోని చివరి అక్షరాన్ని రెండు పద్యాలలో మార్చారు. అలా మార్చరాదని గమనించండి.
ధన్యవాదాలు అక్కయ్యా! ధన్యవాదాలు మాష్టారు! ఫేస్ బుక్ లో నా పద్యాలు చూసి చీవాట్లు పెడతారనుకున్నా నిజంగా..
రిప్లయితొలగించండిమీ పద్యం యీరోజు బ్లాగుకే తలమానికంగా రంజిల్లుతున్నది మాష్టారు...
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిఏమని వర్ణింతును? నీ
రోమాంచపు విశ్వరూపు రుచ్యము! దేవా!
నా మది దిక్కులుఁ దెలియన్
ప్రేమాస్పద రూపుఁ జూపు భీతిని వీడన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(ప్రియుఁడు ప్రియురాలి కనులను, కనుఱెప్పలను, కనుబొమలను వర్ణించు సందర్భము)>
ఏమని వర్ణింతును నీ
మోమున నేత్రములు మీనములు; నయ్యలులున్
దాము కనుఱెప్పలు; బొమలు
కమానుగను మాఱెఁ! గనఁగఁ గాంతులఁ జిమ్మెన్!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అయ్యలులున్’...?
ధన్యవాదములు శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిఆ + అళులున్... [టైపాటు .. అలులున్]
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండికోమల హృదయమ్ము నిండు కోరికతో నీ
శ్యామల వర్ణపు కరమును
నా ముఖమున నుంచ నీకు న్యాయమె దోమా!
కరము = తొండము
రిప్లయితొలగించండిఏమని వర్ణింతును, నీ
నామము మధురాతిమధుర నామంబయ్యా
రామా! రఘుకుల సోమా!
శ్రీమాలక్ష్మి పెనిమిటిగ సిరులొలికితివే!
జిలేబి
ఏమని వర్ణింతును నీ
రిప్లయితొలగించండిదోమను! ఏటికి విధాత త్రుళ్ళుచు నగుచున్
ప్రేమను సృష్టిని జేసెన్?
దామోదరు నిద్రను తెగ త్రాడును త్రెంచన్!