12, అక్టోబర్ 2015, సోమవారం

పద్యరచన - 1031

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
‘మహాలయ అమావాస్య’

33 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ‘విరించి’ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మన విధి యగు’ అనండి.

      తొలగించండి
    2. తనువు వీడిన పూర్వుల దలచు కొనుచు
      ఋణము దీర్చుకొనుటె నేడు మనవిధియగు
      తప్ప బోకుము వదులుము తర్పణముల
      తీర్చుకొనుము పితౄణమ దియెఘనమ్ము

      తొలగించండి
  2. పెద్దల పండుగ యనుకొని
    నొద్దికగా నిత్తురంట నోగిర ములనే
    తద్దినమని పితరులకట
    శ్రద్ధగ పెట్టెడి దినమది శ్రార్ధం బనగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘శ్రార్ధం’ టైపాటు.

      తొలగించండి
    2. పెద్దల పండుగ యనుకొని
      నొద్దికగా నిత్తురంట నోగిర ములనే
      తద్దినమని పితరులకట
      శ్రద్దగ పెట్టెడి దినమది శ్రాద్ధం బనగా

      తొలగించండి
  3. వర్ష ఋతువు లోన భాద్రపదము నందు
    మరణ మొంది నట్టి మానవులకు
    శ్రద్ధ తోడ జనులు శ్రాద్ధంబు బెట్టుచు
    తర్పణంబు లిడిన దక్కు తృప్తి /ముక్తి.
    2.పెద్దల పండుగ యనుచును
    పెద్దలలోచేరి నట్టి పెద్దల కెల్లన్
    నొద్దికగా తర్పణములు
    బుద్ధిగ నిడుదురు జనములు పుడమిన గనుమా!.
    3పుత్రులైనవారు పుడమిన పితృదేవ
    తలకు తృప్తి కలుగ తద్దినంబు
    భాద్రపదము బహుళ పక్షమాసము నందు
    విడువ కుండ మీరు పిండ మిడుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘పుడమిని’ అనండి.

      తొలగించండి
  4. మిత్రులందఱకు పిత్రమావాస్య పర్వదిన శుభాకాంక్షలు!

    బ్రతికియున్ననాఁడు పలు బాధలం బెట్టి
    మరణ మంది నంత మదిని మురిసి
    విందు సేయ నగునె? పితలు మనియు నుండ
    శ్రద్ధ నిడెడి ప్రేమ శ్రాద్ధమగును!

    బ్రదుకు నిడిన పితలు బ్రతికి యున్నప్పుడే
    శ్రద్ధతోడ వారిఁ జక్కఁగాను
    పితృ సపర్య చేసి ప్రేమల నందించి
    వలయు భోగము లిడుట లగు శ్రద్ధ!

    మనిననాఁ డిడకయ మరణించి నంతన
    శ్రాద్ధకర్మ పేర సర్వులకునుఁ
    బెట్టి ఘనతఁ జాటఁ బితృసేవ యది కాదు!
    స్వీయతృప్తియె! యది విలువ కలదె?


    (కావున మన పితరులకు వారు బ్రతికియున్నపుడే వలయు కోరికలను దీర్చి వారి నానందింపఁ జేయుటయే నిజమైన శ్రాద్ధమని యెఱుంగునది. మరణించిన పిదప నెన్ని యొనర్చినను వ్యర్థములు గదా!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పద్యాలు, పద్యాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలు బాగున్నవి. అవశ్యం ఆచరింప దగినవి. అభినందనలు.

      తొలగించండి
  5. ఈమ హాలయ యమవస యెన్న భువిని
    అన్ని కులముల వారలు మిన్న గాను
    తర్ప ణ మ్ములు శ్రధ్ధగ దమతమ పిత
    రులకు నిత్తురట మఱి యా ర్యుల యె దుటన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మహాలయ యమవస’ అని సమాసం చేయరాదు కదా! ‘ఈ మహాలయ పితృదిన మెన్న...’ అనండి.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  6. ప్రతిమహాలయ పక్షము పావనమ్ము
    పితురులకు నది మిక్కిలి ప్రీతికరము
    తర్పణములిడ పూజించి తనివితోడ
    దొరకుదీవెనలు సదా పితురులనుండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  7. పితరులను దలంచి పిండప్రదానము
    చేయ వలెను నేడు శ్రేయముగను
    తర్పణములు వదలి దానమ్ము లిచ్చిన
    వెల్లివిరియు సుఖము నెల్లరకును!!!

    రిప్లయితొలగించండి
  8. మహాలయ అమావాస్య
    ===============

    అపవర్గతృషితుల కాహ్వానమును పల్కి
    ..........యర్చించి సద్గతు లందు వారు
    తాత ముత్తాతల తలచుక శ్రద్ధతో
    ..........పిండప్రదానముల్ బెట్టు వారు
    తిలతర్పణమ్ముల సలిపి పితౄణము
    .........తగ్గినదని మది దలచు వారు
    ఈ యేటి కీ తీరు, పై యేటికిని మాకు
    .........పిలుపు రాగలదను పెద్దవారు

    భారతీయార్ష సంస్కృతీ ప్రేరితులరు
    'పితరు లను మాట మరచిన బిడ్డలెల్ల'
    సిగ్గు జెంద పైవారి నర్చించి తనుపు
    భవ్యమౌ మహాలయపమావాస్య నేడు.l

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
  9. పితృ దేవతలు త్రితరముల
    పితృపతి లోకముననుండ ప్రేమ లొలుకగన్
    పితృ తర్పణంబు లీయన్
    పితృసురులు,మహాలయమున, ప్రీతింగనరే
    (మహాలయ అమావాస్యని మహాలయము అని కూడ అంటారని చదివాను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు

      తొలగించండి
  10. పద్యరచన

    * గు రు మూ ర్తి ఆ చా రి *

    పెడసరమగు పె౦డ్లామును + ఒప్పి౦చ లేక

    ముసలి వారికి నొక ముద్ద. బువ్వ నిడక

    చనిన పిదప వగచ c బ్రయోజనము సున్న.

    యేమొ గాని , పశ్చాత్తాపహృదయ మొ౦ది

    యేట పితృతర్పణము భక్తి నిడుట వలన.

    వారి యాత్మ క్షమి౦చి కాపాడు నేమొ ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం బాగున్నది
      అభినందనలు.
      మీరు పదాలను విడదీసి చూపనవసరం లేదు

      తొలగించండి
  11. పద్యరచన: మహాలయ అమావాస్య.
    భాద్ర పదపు బహుళ పక్షమ్ము బరగు మ
    హాలయమ్ము. నమవ శాహ్ణమందు
    శ్రద్ధ భక్తి మీర శ్రాద్ధ మిడగ దీరు
    మాత పితల ఋణము మనుజునకును

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పితృదేవుండ్లనుఁ బిల్చి తర్పణములన్ బెట్టంగ నేలేడ్చెదో?
    సుతులన్ బొందితిమంచు సంతసమునన్ సొక్కంగ తప్పైనదో
    రి! తిరంబౌనొకొ సత్తువల్ తనువులీ లీలన్ సదా నిల్చునో?
    ధృతి కాయంబున నుండగా విధులనున్ దీర్చంగ తాత్సారమో?

    రిప్లయితొలగించండి
  14. బహువిధముల బంధమ్మును
    మహాలయ అమవసి భక్తి మమతలు నింపే
    సహనపు పిండ ప్రధానమె
    ఇహపర సంబంధబంధ మీప్సితమిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మహాలయ అమవసి’ అని విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  15. పితరులఁ దల్చుచు తర్పణ
    మతివాసములేక నిడగ నాలోకములో
    వెతలున్ దొలంగ వార్కి సు
    గతుల మహాలయ మొసంగు గమనించుడయా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. శ్రీగురుభ్యోనమః

    దుర్భర పాపముల్తొలగి దోషములెల్ల సశించునట్లుగా
    గర్భగృహమ్ము నందు మడి గట్టుచు మంత్రము లుచ్చరించుచున్
    దర్భ పవిత్రముల్ తొడిగి తర్పణ లిచ్చుచు గల్గ జేసి రా
    నిర్భయులై చరింపదగు నిర్మల నిశ్చల పుణ్యలోకముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి