నిన్న (3-10-2015) సాయంత్రం సికిందరాబాద్, సీతాఫల్‍మండిలోని వీరమాచనేని పడగయ్య హైస్కూల్‍లో శ్రీమతి యం.కె. ప్రభావతి గారి 103వ అష్టావధానం జరిగింది. ఆ విశేషాలు...
1. నిషిద్ధాక్షరి (ప్రజలకు వాక్శుద్ధి కలిగించమని భారతిని కోరుతూ కందపద్యం)
అవధాని పూరణ (కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. కొన్ని నాకు వినిపించలేదు).....
శ్రీ(వ)ర(మ)ంజి(త)ంపన్(భ)అ(?)ంబా
చేర(గ)న్నీ(క)వే(?)ప్ర(భ)కా(శ)ర సి(ర)ద్ధిన్(?)ని(ర)త్తే
భారతి వాగామృతమును
ధీరత నిమ్మా ప్రజలకు తెలివిన్ దయతో.
2. సమస్య (రంకువు జూచి ముద్దుగని రాక్షసుఁ డయ్యె నదేమి చిత్రమో)
అవధాని పూరణ....
శంకులు చక్రముల్ లతలు చక్కగ నేసెను నేతగాఁడు నా
వంకల వన్నెలన్ దెలుపు బంగరు చేతల హస్తకృత్యమున్
ఉంకువ గాగ నిచ్చెఁ దన యుర్వర నేలెడి రాజుకు న్నిసీ
రంకువుఁ జూచి ముద్దుగని రాక్షసుఁ డయ్యె నదేమి చిత్రమో.
3. దత్తపది (కలము, బలము, హలము, పొలము పదాలతో స్వేచ్ఛావృత్తంలో ఆత్మహత్యలు చేసుకొనవద్దని రైతులకు ధైర్యం చెప్తూ పద్యం)
అవధాని పూరణ....
కలమును నాయుధమ్ముగను గట్టిగ వాడుము సోదరా కవీ
బలమును నింపుఁడయ్య ప్రజబాధలఁ దీర్పఁగ రైతుసోదరుల్
హలములఁ జేగొనంగఁ గని హర్షముతోడుత మెచ్చు మాతనిన్
పొలములు నిండి పంటలను మోదము గూర్చును జాతి కంతకున్.
4. వర్ణన (స్వేచ్ఛాభారతంలో స్వచ్ఛభారతి)
అవధాని పూరణ....
స్వేచ్ఛాభారతభూమియే యయిన నీ విశ్వంబులో మచ్చయే
తుచ్ఛంబైన ననాగరీకములు పోద్రోలంగ కల్గుం గదా
అచ్ఛా భారతి స్వచ్ఛమయ్యె నని యాహా కీర్తి నందున్ గదా
స్వచ్ఛత్వంబును కోర మోడియును నాస్వాదించు మేళ్ళెన్నియో.
5. న్యస్తాక్షరి (మొదటిపాదం 10వ అక్షరం ‘ప’, రెండవపాదం 11వ అక్షరం ‘డ’, మూడవపాదం 15వ అక్షరం ‘గ’, నాల్గవపాదం 16వ అక్షరం ‘య’. ఆ పాఠశాల వ్యవస్థాపకుడు పడగయ్య గారిపై శార్దూలంలో పద్యం)
అవధాని పూరణ....
ఔరా యెంతటి పాఠశాల (ప)ని నా ధీరుండె నిల్పెం గదా (యతి?)
సారాచారవిచారదృష్టి న(డ)కల్ చక్కంగ నేర్పున్ గదా
పేరెన్నంగల మాచినేని ప్రభు విఖ్యాతుంగ నిల్పుం గదా (యతి?)
ఈరీతిన్ బహుకీర్తి ఛాత్రులకు నెన్నేనిన్ వరాలీయగన్
(ప్రక్కనున్ను కోడిహళ్ళి మురళీమోహన్ గారితో మాట్లాడుతూ పై రెండు పాదాల యతిదోషాలను గమనించలేదు. చివరిపాదంలో యతిదోషాన్ని నేను తెలియజేస్తే సవరించారు)
మిగిలిన పురాణ పఠనము, నామగణనములను నేను వ్రాసికొనలేదు.
మొత్తానికి అవధాన కార్యక్రమం బాగుగా జరిగింది. అవధానికి నా అభినందనలు.
అవధాన వివరములిచ్చిన మీకు ధన్యవాదములు...అవధాని గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!
రిప్లయితొలగించండిఈ యష్టావధానమునుం బ్రత్యక్షముగ వీక్షించిన మీరు ధన్యులు. మీకు నా యభినందనలు.
సమస్యలో...మూఁడవ పాదమందు...ప్రాసస్థానమందు ..."ఉంకువ..." యని యుండఁదగు ననిపించుచున్నది.
న్యస్తాక్షరిలో....రెండవపాదమందు..."సారాచార విచార..."యని యుండఁదగు ననిపించుచున్నది.
మీరు వ్రాసికొన్న ప్రతినొక్కమాఱు పరిశీలించఁగలరు.
అష్టావధానమును వీక్షించుటకు వచ్చిన మన సాహితీ మిత్రులకు నా యభినందనలు!
స్వస్తి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిస్పందించినందుకు ధన్యవాదాలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు.
టైప్ దోషాలను సవరించాను.
శరత్కాల వెన్నెల
రిప్లయితొలగించండిశరదృతువు రాక మునుపే వెల్లివిరిసినది కదా సితాఫలమండిలో....
చక్కని కార్యక్రమమునకు ఉపస్థితి కాలేకపోయినందుకు బాధ కలిగినప్పటికీ మిా వివరణ కాస్త ఉపశమింప జేసినది ....గురువుగారూ..మీకు ప్రత్యేక ధన్యవాదములు
నమస్కారములు
రిప్లయితొలగించండిఅవధాన విశేషములను అందించి నందులకు ధన్య వాదములు
అవధాన విశేషములందించినందుకు ధన్యవాదములండీ.
రిప్లయితొలగించండిఅవధాన విశేషములందించినందుకు ధన్యవాదములండీ.
రిప్లయితొలగించండిశ్రీమాన్ కంది శాఅంకరార్యా! నమస్సులు.
రిప్లయితొలగించండిఅవధానానికి నేనూ వద్దామని బయల్దేరినప్పటికీ వర్షం కారణంగా చేరుకోలేకపోయినప్పటికీ, మీశంకరాభరణం ద్వారా తెలుసుకొనే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. నీ కు నా ధన్యవాదాలు.
ఐతే నేను మిఖ్యంగా మీవంటి సహృదయ దఎశన భాగ్యాన్ని కోల్పోయాను.
అవధానానందాన్ని పొందినవారందరికి అభినందనలు.
నమస్తే.
నూటమూడవ నవధాన పోటియందు
రిప్లయితొలగించండిమహిళ అవధానిగా మీరు మైకుబట్ట
లేరు రాయల సీమలో లేరులేరు
కే.ప్రభావ తమ్మకుసరినింకెవరుగలరు