11, అక్టోబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1030

కవిమిత్రులారా, 
“నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

55 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మానవుండు+అర్థ’ అన్నచోట సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. ‘సాధన+ఎ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మానవాళి| యర్థసాధన పరమార్థ మనుచు దలచి| కుటిలురయ్యిరి...’ అనండి.

      తొలగించండి
    2. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
      మానవత్వము నశియించి మాన వాళి
      యర్థ సాధన పరమార్థ మనుచు దలచి
      కుటిలు రయ్యిరి గనర కువలయమున.

      తొలగించండి
    3. శ్రీ కంది శంకరయ్య గారి అనుమతితో ఒక్క మాట. వ్యావహారిక భాషలో తప్ప ' అయ్యిరి ' ' అయ్యింది ' శబ్దాలకు కావ్య గౌరవం కలదో లేదో విచారణీయం. పైపెచ్చు ఇక్కడ ' మానవాళి ' కర్త . "మానవుల సమూహం ----- అయింది" అన్న ఏక వచన క్రియతో ముగించడమే సబబు. "మానవుల సమూహం ------ అయ్యారు" అన్న బహువచన క్రియా ఇక్కడ ఉపయోగపడదు. కనుక ఏతావాతా - ఆ సవరణ ఇలా ఉంటే బాగుంటుంది.
      " మానవత్వము నశియించి మానవుడిపు
      డర్థ సాధన పరమార్థ మనుచు దలచి
      కుటిలుడాయెను గనగ నీ కువలయమున "

      తొలగించండి
  2. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    తల్లి దండ్రులె ప్రత్యక్ష దైవ మనుచు
    విశ్వసించి పూజించెడు విమల మతులు
    తరుగు చుండిరి అక్కటా! ధరణి యందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ ఆంజనేయ శర్మ గారూ , రెండవ పాదంలో " తల్లిదండ్రులె ప్రత్యక్ష దైవములని " అని సవరిస్తే " తల్లిదండ్రులు - దైవములు" రెండు పదములు ఒకే వచనంలోకి చేరుతాయి.

      తొలగించండి
    3. డా. విష్ణునందన్ గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  3. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    నీదు చీరలోనున్న పనిమనిషి గని
    భ్రాంతి తోడ నీవని చేయి పట్టు కొంటి
    నింతలో వచ్చి నావె యో యింతినీవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం హాస్యరసస్ఫోరకమై అలరించింది. అభినందనలు.

      తొలగించండి
  4. నమ్ము మీమాట నిజము మోసమ్ము గాదు
    కరువు నిండిన జగతిని బరువు గాను
    చాలి చాలని బ్రతుకుల స్వార్ధ మందు
    బ్రతుకు తెరువుకు నెంచగ బాట ఇదియె

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    వేరే అమ్మాయితో షికార్లు చెయ్యడం చూచిన ప్రేయసితో :

    01)
    __________________________________

    నమ్ము మీ మాట నిజము మో - సమ్ము గాదు
    నిన్నె వలచితి నిమ్ముగా - నన్ను నమ్ము

    నిన్న గన్నట్టి చిన్నది - నేస్తమేను
    మొన్ననే తన్ను గన్నాను - పెన్ను నడుగ
    నిన్న తిన్నాము నున్ననౌ - చిన్న లడ్లు
    వెన్న బిస్కట్లు , కారపు - సన్న పూస
    పిన్ని తానివ్వ బాబాయి - కొన్న బండి
    అన్నతో గూడి కన్నాము - చిన్నదయిన
    అన్నదమ్ములయనుబంధ - మన్న సినిమ
    కన్ను కుట్టెను నీమది - చిన్నదౌట
    పెన్ను నడుగుట తప్పు గా - దన్న వినవె

    నమ్ము మీ మాట నిజము మో - సమ్ము గాదు
    నిన్నె వలచితి నిమ్ముగా - నన్ను నమ్ము

    __________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      అపార్థం తొలగించుకొనడానికి ఎన్నెన్ని నిజాలు (అబద్ధాలు?)
      బాగుంది మీ పద్యం. అభినందనలు.

      తొలగించండి
  6. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    నన్ను నీ వాడ నించుక నమ్మవేల?
    కొమ్మ! సంశయమేలొకో? రమ్ము, చేర
    గా ,మదిని చల్లగా, ప్రియకాంత! చెంత.

    రిప్లయితొలగించండి
  7. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    వత్తు దప్పక దరికినీ వారిజాక్షి !
    యాలయంబుల దర్శన మవస రమ్ము
    మనకు మఱి యీవ యస్సున మాన్యము గను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘దరికి నీ’ అన్నదాన్ని ‘నీదరి’ అనండి.

      తొలగించండి
  8. నమ్ము మీ మాట, నిజము, మోసమ్ముగాదు
    నన్ను గెలిపింతురేని రానున్న యెన్ని
    కలను మీరెల్లఁ గనుచున్న కలల నన్ని
    తీర్తు నని చెప్పి గెల్చి యీ తెరువు గనఁడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శంకరయ్యగారూ,
      ఎన్నికల వాగ్దానములను నిలుపుకొనని రాజకీయనాయకుల ప్రవర్తనమునుం దెలుపు మీ పద్యము బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మాష్టారు... ఇదే భావంతో రెండవ పూరణ చేద్దాం అనుకొన్నా...అదే భావం మీరు వ్రాయడం సంతోషంగా ఉంది....

      తొలగించండి
  9. మిత్రులందఱకు నమస్సులు!

    (పారిజాతవృక్షముం గోరెడి సత్యభామ నూఱడించుచు శ్రీకృష్ణుండు పలికిన మాటలు)

    "నమ్ము మీ మాట నిజము! మోసమ్ము గాదు!
    స్వర్గముం జేరి యింద్రుని వలనఁ గొందు!
    శక్రుఁ డీఁకున్న, హరణమో, సమరమొ, చెలి!
    పారిజాతమ్ముఁ గొనుటయే వలయు మనకు!!"

    రిప్లయితొలగించండి
  10. నమ్ముమీమాట నిజము మోసమ్ముగాదు
    మరువలేను నీపైప్రేమ మచ్చెకంటి
    కలల లోనను సతము నీతలపులాయె
    నిలువలేను నిన్నరయక నిముషమైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    వమ్ము వల్కులు నాదు మతమ్ము గాదు
    సొమ్ము లిచ్చితివేగమ యిమ్ము నాకు
    రమ్ము తెమ్ము సొమ్ములనిమ్ము పొమ్ము సాలు

    రిప్లయితొలగించండి
  12. నమ్ము మీమాట నిజము మోసమ్ము గాదు
    నాయనా పులి వచ్చెను నన్ను జంప
    వచ్చి గాపాడు మోదండ్రి ఖచ్చితముగ
    బుద్ధి వచ్చెను నేనింక బొంకు లాడ
    ననుచు గీబెట్టి నరచెను నందనుండు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు శైలజగారూ,

      "నాయనా పులివచ్చె"నను నంశముం దెలుపు మీ పూరణము బాగున్నది. అభినందనలు.

      కాని, తృతీయపాదమున...
      "వచ్చి" క్త్వార్థకము. ద్రుతాంతము కాదు. కావున, పై పరుషము నట్లే యుంచి, "వచ్చి కాపాడు" మనవలెను.
      అదే విధముగ...నా పాదముననే..."ఓ" సంబోధనము. ద్రుతాంతము కాదు. కావున, పై పరుషము నట్లే యుంచి, "....మో తండ్రి" యనవలెను.
      మఱియొకటి...పంచమపాదమున..."గీబెట్టి" ప్రయోగమున (పడ్వాదులవలె) ..."గీఁక పెట్టు = ఘీంకరించు" ననునది..."గీ పెట్టి" యనియు...కూఁత పెట్టి...కూపెట్టి యని ప్రయోగించవలెను.
      అటులనే..."గీపెట్టి" క్త్వార్థకము. ద్రుతాంతము కాదు. కావున, "గీపెట్టి యరచె" నని యుండవలెను.

      స్వస్తి.

      తొలగించండి
    2. శైలజ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      పైన గుండు మధుసూదన్ గారి సూచనలను గమనించి సవరించండి.

      తొలగించండి
    3. పూజ్య గురుదేవులకు, వివరంగా తెలియజేసిన శ్రీ గుండు మధుసూధన్ గారికి, చాలా చాలా ధన్యవాదములు..సవరణతో..



      నమ్ము మీమాట నిజము మోసమ్ము గాదు
      నాయనా పులి వచ్చెను నన్ను జంప
      వచ్చి కాపాడు మోతండ్రి ఖచ్చితముగ
      బుద్ధి వచ్చెను నేనింక బొంకు లాడ
      ననుచు గీపెట్టి యరచెను నందనుండు!!!


      తొలగించండి
  13. ఓ రాజకీయనాయకుని అంతరంగము:

    "నమ్ము మీ మాట నిజము! మోసమ్ము గాదు
    కోటి రూప్యము లిచ్చిన నోటు మీకె
    ఖాయమ"ని 'అ.నీ.శా' వార్కి కబురు జేయ
    కటకటాల పాలైతినే గాచు నెవరు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  14. శ్రీగురుభ్యోనమః

    “నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    కుంటు పడినది చిక్కులు కొన్ని కలుగ
    మాట నిలబెట్టుకొందు ముమ్మాటి కైన
    చింత వీడుము దైవపు చింత జేసి".

    రిప్లయితొలగించండి
  15. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    సుమ్ము భర్తలేవురు నాకు చూడ నిన్ను
    సున్నమునకైన మిగలక దుమ్ములన్ని
    విరగజేతురు కీచకా వెడలిపొమ్ము.

    రిప్లయితొలగించండి
  16. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    యనుచు ప్రవచి౦చు రాజకీయమ్ము నేడు
    ‘ఆంద్ర’’ప్రత్యెక మగు హోద’ నందు కొనుట
    గగన మయ్యెను బాసలు కల్ల లాయె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మోసమ్ము గా ద|టంచును ప్రవచించు...’ అనండి.

      తొలగించండి
  17. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    యనుచు ప్రవచి౦చు రాజకీయమ్ము నేడు
    ‘ఆంద్ర’’ప్రత్యెక మగు హోద’ నందు కొనుట
    గగన మయ్యెను బాసలు కల్ల లాయె

    రిప్లయితొలగించండి
  18. పధ్యరచన
    * గు రు మూ ర్తి ఆ చారి *

    నమ్ము మీ మా ట.
    సత్యమ్ము సుమ్మ

    నిద్ర లో లేచి నడచు
    దరిద్రపు టల

    వాటు గల నేను ప్ర క్కి౦టి
    ప౦కజ. గది

    జొచ్చి చె౦ప దెబ్బ. తిని
    నే వచ్చు చు౦టి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      దత్త పాదాన్ని మార్చారు.

      తొలగించండి
  19. పద్యరచన.

    * గు రు మూ ర్తి ఆ చా రి *

    శ్రీకృష్ణుడు సత్యభామను
    అనునయి౦చుట

    నమ్ము మీ మాట నిజము
    మోసమ్ము గాదు

    ఆమె గృహమున నప్పు
    డున్నట్టి కతన

    నిచ్చితి లతా౦తమును
    స త్య ! యేల య లుక

    పోరి మఘవుని తో
    వాని పారద్రోలి

    సత్వరము పారిజాత.
    వృక్షమును దెచ్చి

    పెరటి చెట్టుగ. నాటి౦తు
    తరుల. నడుమ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ‘...గాదు| ఆమె’ అని విసంధిగా వ్రాశారు. వాక్యాంతంలో అచ్చు ఉండడం దోషం కాదన్నారు కాని సాధ్యమైనంత వరకు రాకుండా చూడడం మంచిది.

      తొలగించండి
  20. గురుదేవుల సూచన మేరకు సవరింఛిన పద్యము

    నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాద
    ట౦చు ప్రవచి౦చు రాజకీయమ్ము నేడు
    ‘ఆంద్ర’’ప్రత్యెక మగు హోద’ నందు కొనుట
    గగన మయ్యెను బాసలు కల్ల లాయె

    రిప్లయితొలగించండి
  21. నమ్ము మీమాట నిజము మోసమ్ము గాదు
    రాజకీయములందున రాటు దేలి
    పూట కొక తీరుగా నిట మాటలాడి
    పబ్బము గడుపుచు తిరుగు పాంథు డితడు.
    2.నమ్ము మీమాట నిజము మోసమ్ము గాదు
    కన్నవారని యెంచక కష్టములకు
    నొదలి స్వార్థపరత్వము నొంట బట్టి
    వారల వృద్ధాశ్రమములకు పంపు వారు.
    3.నమ్ము మీమాట నిజము మోసమ్ము గాదు
    తప్పులను జేయుచు పరుల తప్పు లెల్ల
    నెంచుచు తడవ కొకపరి నిష్టురముగ
    మాట లాడెడి వారు మహిని గలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో ‘వదలి’ని ‘ఒదలి’ అన్నారు. నాల్గవపాదంలో గణదోషం. ‘కష్టములకు| విడిచి స్వార్థపరత్వము పెరుగ వార| లడల వృద్ధాశ్రమంబుల కంపుచుంద్రు’ అందామా?

      తొలగించండి
  22. గురుదేవుల సూచన మేరకు సవరింఛిన పద్యము

    నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాద
    ట౦చు ప్రవచి౦చు రాజకీయమ్ము నేడు
    ‘ఆంద్ర’’ప్రత్యెక మగు హోద’ నందు కొనుట
    గగన మయ్యెను బాసలు కల్ల లాయె

    రిప్లయితొలగించండి
  23. నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు
    సొమ్మునిప్పుడె జమజేయుమమ్మ సుదతి!
    తొమ్మిదవ నెల గృహమిక దొరకు నమ్మ!
    రమ్ము హైదరబాదుకు రాణి వోలె!

    రిప్లయితొలగించండి