1, మే 2016, ఆదివారం

పద్యరచన - 1211

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

41 కామెంట్‌లు:

  1. మల్లెలు వెన్నెల నవ్వులు
    ఉల్లము రంజిల జేసెడి యూహా సుమముల్
    చల్లని తావులు వీచుచు
    నల్లరి జేసెడి పూలవి యగుపించె నహో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యంలో కొన్ని లోపాలున్నవి (2,4వ పాదాలలో మూడవ గణం భగణం వేశారు. అక్కడ తప్పక నలం కాని జగణం కాని ఉండాలి). సవరించిన పద్యం...
      మెల్లెలు వెన్నెల నవ్వులె
      యుల్లము రంజిల్ల జేయు నూహాసుమముల్
      చల్లని తావుల వీచుచు
      నల్లరి జేయంగ పువ్వు లగుపించె నహో!

      తొలగించండి
  2. చల్లని వెన్నెల రాత్రులు
    తెల్లని మల్లెల సొగసుల తెమ్మెర లందు
    న్నుల్లము రంజిలు రీతిగ
    పిల్లల నవ్వులు విరిసిన ప్రీతియ టంచున్

    రిప్లయితొలగించండి
  3. తల్లికి కనుపించు చల్లని పాపాయి
    .....నవ్వులు మల్లెలో నయము గాను
    భర్తకు నుదయించు భార్యతో ప్రణయంపు
    .....భావాలు మల్లెలో బాగు గాను
    ప్రియునికి చెలరేగు ప్రియురాలి లేలేత
    .....వలపులు మల్లెలో తలుప గాను
    భక్తుని మది దోచు పరమాత్మ భవ్య వి-
    .....భూతులు మల్లెలో పూర్ణము గను

    ఎవరి యెదలలో భావమ్ము లెట్టి రీతి
    నుండునో వాని దర్శింతు రుల్ల మలర
    మల్లె కీడగు దివ్యమౌ మరొక సుమము
    సృష్టిలో కాన రాదిల చిత్ర మేమొ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యద్భావం తద్భవిష్యతి... అన్నట్టు ఎవరెవరు మల్లెలను ఎలా భావిస్తారో చక్కగా వివరిస్తూ మంచి పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
    2. మిసన్న గారూ...తెల్లని మల్లెల గురించి పలు తెరంగులు వర్ణించారు. బాగుంది.

      తొలగించండి
    3. ధన్యవాదాలు గురువుగారూ.

      ధన్యవాదాలు హనుమచ్ఛాస్త్రి గారూ.

      తొలగించండి
    4. ధన్యవాదాలు గురువుగారూ.

      ధన్యవాదాలు హనుమచ్ఛాస్త్రి గారూ.

      తొలగించండి
    5. ఈ విధంగా కూడా మల్లెపూలను వర్ణించ వచ్చని తెలిసింది...అద్భుతంగా వ్రాసారు...

      తొలగించండి

  4. మల్లెగంపనుజూడగనుల్లమలరె పూలుదండగాగ్రుచ్చియుపూర్ణ!తెమ్ము శివునిమెడలోనవేతునుశివశివయనుచు నాయనేకదమనలనునాదుకొనును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘శివశివ యని’ అనండి.

      తొలగించండి

  5. 1ఆ.వె:వేసవందు పూయు విరజాజులన్నచో
    మమత హెచ్చుచుండు మగువలకును
    మరులు గొల్పుచుండు మగవారి కెల్లను
    మరుని తూపు లివియె మత్తు గొలుపు.

    2. ఆ.వె: కామ వాంఛతీర కాముకులెల్లరు
    కాలికింద వేసి కాలరాచి
    విరుల తోడ కన్నె విలువను చెరుపంగ
    గొల్లుమనుచు నుండు మల్లె పూలు

    3.తే.గీ:దేవదేవుని చరణాలు దీక్ష తోడ
    నర్చన లొనర్చు బతుకును నయముగాను
    సార్థకము చేసు కొనెడి యీ సన్న జాజు
    లన్న సంబరమ్ము కలుగు లలన లకును.

    4.ఆ.వె:మగువ మెచ్చు నట్టి మల్లెపూవులివియె
    మరులు గొల్పు గాదె మగనినంచు
    మురిపెమలర కట్టి ముడుచుకొని సిగలో
    మురిసి పోవు చుండు ముదిత తాను.

    5.ఆ.వె:పట్టు చీర గట్టి పసిడి నగలుదాల్చి
    మల్లెపూలు పెట్టి మగని కొరకు
    యెదురు చూడనట్టి యింతి యుండ దిలను
    యనెడి మాట కాదు నతిశయోక్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఐదు పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘వేసవి+అందు’ అన్నపుడు సంధి లేదు. ‘వేసవిని వికసించు...’ అనండి.
      ఐదవ పద్యంలో ‘కొరకు నెదురు... (ఇలను+అనెడి=ఇల ననెడి) ...యుండదు భువి| ననెడి మాట (కాదు+అతిశయోక్తి= కా దతిశయోక్తి)... మాట యగున నతిశయోక్తి’ అనండి.

      తొలగించండి
  6. ధవళ సుగంధ భరిత హృద
    య వినో దాహ్లాద కరము లా మల్లియలున్
    ఛవిమత్కాంచన సంకా
    శ వర్ణ కనకాంబరములు సనునే విడువన్

    రిప్లయితొలగించండి
  7. వైశాఖమాసాన వథువుల కొప్పులో
    నల్లన రంజిల్లు మల్లెపూలు
    భక్తి తత్త్వంబున పరమాత్ము పాదాల
    నల్లన రంజిల్లు మల్లెపూలు
    శృంగార రసమును నంగారముంజేసి
    యల్లన రాజేయు మల్లెపూలు.
    కవిలోక భావనల్ కమనీయతంజెంది
    మరపించి మురిపించు మల్లెపూలు.
    ఉల్లమంతయు మోదాన నురకలెత్తి
    సర్వజనులెల్ల కామితసౌఖ్యమంది
    మనుట కాధారమైనట్టి మల్లెగంప
    యెదురుచూచుచునుండెను బెదురులేక.


    రిప్లయితొలగించండి
  8. పువ్వులు నవ్వకున్నవిట|పూర్తిగ మొగ్గలు విచ్చిపోకనే
    రువ్వున గంధబంధమును?రూపము దగ్గగ అందచందమే
    సవ్వడి లేని సంస్కృతిని సాకెడి బాల్యవివాహ మైనచో?
    నివ్వెర బోయి జూచుటగు|నిత్య సుఖాలను బంచ గల్గునా

    రిప్లయితొలగించండి
  9. కట్టగ మాలను దెచ్చిన
    బుట్టెడు మల్లెల నడుమన పుట్టిన నొకటై
    చుట్టనె గళసీమన్ దగ
    చిట్ట చివర రాలిపోవ శ్రీహరి పదమున్!

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మ౦గళవతులైన మగువల సిగ ల౦దు
    . . మసలుచు మరు లిడు మల్లె పూవ. !

    కోవెల య౦దున దేవుని క౦ఠాన
    . . మాలిక యై యొప్పు మల్లె పూవ. !

    పరిణయ వేది ద౦పతుల గళము ల౦దు
    . . మాలలుగ వెలుగు మల్లె పూవ. !

    సత్కీర్తివ౦తులన్ సన్మాన మొనరి౦ప
    . . మ౦చి ద౦డ లగు నో మల్లె పూవ. !


    ధన్య మై పోయె నీ జన్మ తలప. | కాని

    స్వార్థపరులైన నీచనాయకుల యొక్క ,

    అలజడిన్ సృజి౦చుచు నిరాహార దీక్ష

    యని నటి౦చెడు నా ధూర్త జనుల యొక్క
    ి
    గొ౦తు ల౦దున మాత్రము కూరుచొనకు !

    నీవె కాపాడు కొనుమి౦క నీదు విలువ.

    రిప్లయితొలగించండి
  12. దారపు ఆధారంబున
    పేరంటములందు తగిన పెత్తనములచే
    చేరెడి మల్లియల విలువ
    మారును వాసనలు తగ్గ మరుసటి రోజే|
    ౨శుభ మశుభ కార్యమందున
    సభలందున సద్గుణంబు సాకెడి పనిలో
    ప్రభలమగు మల్లెదండలె
    శుభదాయక మనుటకద్దు|శోధించంగా.

    రిప్లయితొలగించండి
  13. పూసీ పూయని మొగ్గల
    కోసిన పాపంబు కలుగు కోమలి సికకై
    వాసన పంచెడి మమ్ముల
    కాసులకై త్రెంపి నావు కఠినాత్ముదవై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పూసీ’ అనడం వ్యావహారికం. ‘పూసియు పూయని...’ అనండి. అలాగే ‘సిగకై’ అనండి.

      తొలగించండి
  14. చల్ల నైన రూప మున్న చక్కనైన మల్లికా
    వెల్లి విరియు నీదు తావి విశ్వమందుహాయిగా
    మల్లె పూల మాలలన్న మాత దుర్గ మెచ్చునే
    మల్లికేశు డాదరించు మల్లె జన్మ ధన్యమే!!!


    తెల్లని మల్లెల తావియె
    యుల్లము రంజింపజేయు నుర్వీతలమున్
    చల్లని వెన్నెల రేయిని
    మెల్లగ విడు మల్లెలన్న మెచ్చరె జనముల్!!!


    చక్కనైన సొగసు చల్లని హృదయమ్ము
    మత్తు గొలుపు తావి మల్లె సొత్తు
    మండు టెండలందు నిండుగా విరబూయు
    మల్లె వంటి సుమము మహిని గలదె!!!


    కవుల కలములందు కావ్యనాయకి మల్లె
    సరసుల మురిపించు సఖియ మల్లె
    మధుర ప్రేమ కొరకు మలిగి పోవును మల్లె
    స్వార్థపరత లేని సౌమ్య మల్లె!!!

    రిప్లయితొలగించండి
  15. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మ౦గళవతులైన మగువల సిగ ల౦దు
    . . మసలుచు మరు లిడు మల్లె పూవ. !

    కోవెల య౦దున దేవుని క౦ఠాన
    . . మాలిక యై యొప్పు మల్లె పూవ. !

    పరిణయ వేది ద౦పతుల గళము ల౦దు
    . . మాలలుగ వెలుగు మల్లె పూవ. !

    సత్కీర్తివ౦తులన్ సన్మాన మొనరి౦ప
    . . మ౦చి ద౦డ లగు నో మల్లె పూవ. !

    ధన్య మై పోయె నీ జన్మ తలప. | కాని

    స్వార్థపరులైన నీచనాయకుల యొక్క ,

    అలజడిని సృజి౦చుచు నిరాహార దీక్ష

    యనుచు నటియి౦చు నా ధూర్త జనుల యొక్క

    గొ౦తు ల౦దున మాత్రము కూరుచొనకు !

    నైన వారల గొ౦తుల „ న౦తె గాక

    నలజడిని సృజి౦చుచు నిరాహార దీక్ష

    చేయు దొ౦గల గొ౦తుల. చేరె దీవు | ి

    రిప్లయితొలగించండి
  16. మనసున రాజిలు మల్లెలు
    యిన తాపము మరచునట్లు నేమర పించే
    కనగను యెదురుగ నే మరి
    చని వేగముగా తలనిడ సంతసముననే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మల్లెలు+ఇనతాపము, కనగను +ఎదురుగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘ఏమరపించే’ అనడం వ్యావహారికం.
      మనమున మల్లెలు రాజిల
      నినతాపము మరచునట్టు లేమరపించున్
      కనగా నెదురుగ...’ అనండి.

      తొలగించండి
  17. మమతా బెనర్జీ ఉవాచ:👇

    ఘట్టిగ గబ్బును కొట్టెడి
    తట్టను వెనువెంట తీసి దాదా!పారెయ్!
    గుట్టుగ తెమ్ముర నాకిక
    చట్టున హిల్సాల బుట్ట స్వర్గమ్మదియే!

    రిప్లయితొలగించండి