9, మే 2016, సోమవారం

పద్యరచన - 1219

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

50 కామెంట్‌లు:

  1. మాతృ దినోత్సవ సందర్భముగా అందరినీ దీవించి .అమ్మ
    --------------------------------------
    వాన నీటి లోన వయ్యారమొ లికించు
    కాగి తంపు సొగసు కత్తి పడవ
    చిన్న నాటి యాట చిందులేయగ మది .
    మిన్న జ్ఞాప కాలు వెన్ను నిమిరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అక్కయ్య గారు మీపద్యము పద లాలిత్యముతో నలరారు చున్నది. సాధారణముగా నుపశమనానికి వెన్ను నిమురుతారు. ఇది సంతోష సందర్భము గాబట్టి "వెన్ను ద్దట్టె" అంటే బాగుంటుందేమో!

      తొలగించండి
    3. నమస్కారములు
      గురువులకు శ్రీ కామేశ్వర రావుగారికి ధన్య వాదములు." సాధారణంగా జ్ఞాపకాలు [మంచివైనా చెడ్డవైనా ,తల్చుకున్నప్పుడు అయ్యో ఆరోజులు అలా ఉండేవి కదా !]అని అలోచిస్తాం కదా .అప్పుడు ఉపశమనానికి వెన్ను నిమురుతారు " అనేభావంతో రాసాను .మీ సూచనకు ధన్య వాదములు

      తొలగించండి
  2. కురిసెడి వర్షపు వాహిని
    దిరుగిడి కాగితపు పడవ ద్రిప్పెడి మనసం
    దరుసము నొందెడి బాల్యము
    మరల దిరిగి రాదిచటను మధురము దలచన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మనస్సునందు’ అనడం సాధువు. అక్కడ ‘ద్రిప్పు మనసులో’ అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు, సవరించిన పద్యం

      కురిసెడి వర్షపు వాహిని
      దిరుగిడి కాగితపు పడవ ద్రిప్పు మనసులో
      నరుసము నొందెడి బాల్యము
      మరల దిరిగి రాదిచటను మధురము దలచన్!

      తొలగించండి
  3. కాగితమ్ము తోడ కత్తి పడవజేసి
    వాన నీటిలోన వదలి మురిసి
    గొడుగు చేత బట్టి వడగళ్ల నేరెడు
    బాల్యమింక రాదె వాసుదేవ!!!

    రిప్లయితొలగించండి
  4. పడవలెనని జడివానలు
    పడలనే కాగితముల బట్టుచు చేయన్
    బడిమానుచు మిత్రుల వెం
    బడితిరిగెడు జ్ఞాపకములు పైపై దిరిగెన్.

    రిప్లయితొలగించండి
  5. చిన్న దనమున వరదన జిందు లాడి
    కాగితము తోడ పడవలు కత్తి రిగను
    జేసి నీటి యందున నవివేసి యాడు
    కొనెడి వారము బాల్యపు గుర్తు లవియ

    రిప్లయితొలగించండి
  6. నీలాకాశము లీల దోచు విలసన్నీరాశయం బందునన్
    బాలానందము కల్గజేయు నవ నౌపర్వమ్ము లందించినన్
    హేలా కేళి వినోద విభ్రమ విలో లేక్షా కలాపమ్ములన్
    వేలాక్రాంత హృదంబుధిన్మెరయు నావేశాది భావావళుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
      ‘నౌపర్వమ్ము’...? ‘నవమౌ పర్వమ్ము’కు టైపాటా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. నౌపర్వమ్ము = నౌకా సమూహములు. “నౌ= నావ” ఔ కారాంత స్త్రీ లింగము. సాధువేనా తెలుప గోర్తాను.
      లేక “నావఃపర్వమందించినన్” నావ బహువచనములోవాడవలెననన్న. బా కి వః కి యతి చెల్లుతుంది కదా?

      తొలగించండి
    3. నీలాకాశము లీల దోచు విలసన్నీరాశయం బందునన్
      బాలానందము కల్గజేయు నవ నావఃపర్వమందించినన్
      హేలా కేళి వినోద విభ్రమ విలో లేక్షా కలాపమ్ములన్
      వేలాక్రాంత హృదంబుధిన్మెరయు నావేశాది భావావళుల్

      తొలగించండి
    4. క్షమించండి... నాకు సంస్కృత భాషా పరిజ్ఞానం స్వల్పం. ‘నౌపర్వంబు’ సాధురూపమే అయి ఉంటుంది. మీరు సవరించినది కూడా బాగున్నది.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    6. నమస్కారము!
      నేను బుద్ధిలో చాల చిన్నదాన్ని, ఇప్పుడు సంస్కృతము నేర్చుకుంటున్నాను. పెద్దగా తెలియదు.

      నౌ అనేది ఔ కారంత స్త్రీ లింగ ప్రాతిపదికము. నౌపర్వము అయినప్పుడు విగ్రహ వాక్యము నౌషు ( షష్ఠీ బహువచనము) పర్వః అవుతుందా? నౌకల యొక్క సమూహము?
      నావః ప్రథమా బహువచనము, నావః పర్వమందించినన్ అంటే సమాసము రావాలా? తెలుసుకుందామని అడుగుతున్నాను.

      తొలగించండి
    7. సుమలతగారు నమస్కారములు. మంచి ప్రశ్న వేశారు. పర్వము అంటే ఇక్కడ సమూహము అని అర్థము. ఇది తత్సమము. “నౌపర్వము” సమాసమే సాధువు.
      “ నావః పర్వము” సరిగాదనుకుంటాను. ఎందుకంటే సమాసము చేయునపుడు పదమూల రూపమునే తీసుకుంటాము. విగ్రహ వాక్యములో విభక్తిని గ్రహిస్తాము. ఉదాహరణకు “కుసుమావళి” పువ్వుల సమూహము. ఇక్కడ “అ” కారంత కుసుమ పదమునే తీసుకున్నాము. “కుసుమాని” బహువచనము తీసుకోలేదు. అట్లే “నౌ” ఔకారాంత పదమునే తీసుకొని సమాసము చేయవలసి యుంటుంది. “నావః” బహువచన పదము రాదు సమాసము లో.
      అందుకే నా సవరణ నుపహరించుకొని మొదటి పద్యమునే గ్రహించ గోర్తాను. ఇది నాకు తెలిసిన విషయము. మీకు ధన్యవాదములు.

      తొలగించండి
    8. ధన్యవాదములు పోచిరాజు కామేశ్వర రావు గారు. నేను కూడ నాకు తెలిసినంతవరకు మీతో ఏకీభవిస్తున్నాను.

      తొలగించండి
  7. . పడవల నడవడి కట్లుగ
    నడయాడుచు బాల్యమందు నడతను నేర్పే
    చడిలేని నీటి యందున
    బుడతల హృదయాలవోలె-పోలిక లాటే|
    2.చేరిన నీటి బింధువుల చింతను మాన్పగ రంగు రూపునన్
    దారియు జూపు బాలురకు దగ్గర జేరియు మానసంబుకున్
    కోరిన కోర్కె దీర్చగల కొంటె తనంబును సాకు నౌకలే
    ప్రేరణ బాల్య బంధమిది|పెద్దగ మారిన నిల్చు నూహలో|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘నేర్పే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  8. ఆ*
    వాన జల్లు కురిసి వరదలై పారగా,
    ఇంటి ముందు జేరె జంట బాల!
    కాగితంబు పడవ కాల్వనే దోలించె,
    నాటలాడె తాను నంద ముగను !!

    రిప్లయితొలగించండి
  9. వాన!వాన!వరద!వల్లప్ప యని వెడ్క
    నాటలాడి మురిసినట్టి బాల్య
    మదిగొ!కాగితపు వహనములు నీటిలో
    వదలి సంతసించు హృదయ మమర

    రిప్లయితొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    దయ చేసి నిన్నటి పద్యరచన. స్వీకరి౦చ౦డి
    …………………………………………………


    హాలికు డైన త౦డ్రి ప్రియమౌ తన పట్టిని
    కాడిమ్రానుకున్ ,

    దోలిక గట్టి , య౦దిడెను | తొ౦గి
    పరు౦డక > వాడు సేద్యపున్


    జాలును చూడ కూర్చొనె | హుషారుగ సాగె
    రుమాలు - నెత్తతో |

    గాలికి నె౦డవేడికిని గట్టి పడన్ " జిన రైతు " ఢీకొనన్

    [ దోలిక = డోలిక. ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆచారి గారూ,
      నిన్న ప్రయాణంలో ఉండి మీ పద్యాన్ని పరిశీలించలేదు. మన్నించండి.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  11. ఉ. పిల్లలు కాగితంబులను వేడుక నావలు చేసి నీటిలో
    నల్లన నుంచి యాడుకొను నప్పుడు నేకత మేగుఁ గొన్ని తా
    మల్లన జట్లుగా నడచు నట్టివి కొన్ని రవంత సేపు గాఁ
    మెల్లగ మారు బంధములు మేదిని జీవుల తీరు లిట్లనన్

    మ. ఒకచో నొక్కట చేరు చేరి పదినాళ్ళుత్సాహ మొప్పారగాఁ
    నొకటై సఖ్యత నంటియుండి సుఖదుఃఖోద్విగ్నతల్ చక్కగన్
    ప్రకటించున్ మరి యంతలోనె తమ త్రోవల్ వేరు గావచ్చుచోఁ
    నకటా కాలనదీప్రవాహమున జీవాత్మల్ వీడు బంధమ్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్నించాలి.రెండవపద్యం చివరిపాదంలో గణభంగం! కాబట్టి, సరిచేసిన పద్యం పూర్తి పాఠం:
      మ. ఒకచో నొక్కట చేరు చేరి పదినాళ్ళుత్సాహ మొప్పారగాఁ
      నొకటై సఖ్యత నంటియుండి సుఖదుఃఖోద్విగ్నతల్ చక్కగన్
      ప్రకటించున్ మరి యంతలోనె తమ త్రోవల్ వేరుగా దోచునే
      యకటా కాలనదీప్రవాహమున జీవానీక మిట్లేగెడున్

      తొలగించండి
    2. మీ రెండు పద్యాలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. పద్య రచన
    ...............
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ( పిల్లల కాగితపు పడవలు నీటిలో నడవక
    ముడుతవారి ఒరిగి పోవును . దురాశా జీవితములు కూడా ప్రయాణము చేయక భవాబ్ధిలో మునిగి పోవును. )


    బాల్య౦ బ౦దున వర్ణ కాకలపు నావల్ జేసి
    య౦దమ్ముగా ,

    బల్యాసమ్మున కోర్చి బాలు రిడ. నా
    వార్యాశయ౦ బ౦దు , చా౦

    చల్య౦ బి౦తయు లేక స్రుక్కును | దురాశా
    యుక్త దుర్జీవన౦

    బుల్యానమ్మొనరి౦ప బోవక భవా౦భోధిన్
    మును౦గున్ గదా ! !

    { వర్ణ కాకలము = ర౦గు కాగితము ; యాసము = ప్రయాసము ; బల్ యాసమ్మున కోర్చి =
    కడు ప్రయాస కోర్చి ; వారి +ఆశయము =
    జలాశయము ; చా౦చల్యము = చలనము ;
    దుర్జీవన౦బుల్ + యాన౦బొనరి౦పబోవక =
    దుర్జీవన౦బులు ప్రయాణమొనరి౦పబోక. )

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. తెల్ల పడవలఁ జేయుచు నుల్లమలర
      నాదు స్నేహితులిద్దరు నన్ను బిలువ
      నెర్ర దానిని దీర్చితి మిఱ్ఱు గాను!
      రంగు మహిమేమొ యవిరెండు ప్రక్కఁ దొలగె!

      తొలగించండి
  14. వర్ష కాల మన్న బాలబాలికలకు
    కాగితపు పడవల కాలమేను
    నీరు నిలిచి నంతకేరింతలను వేసి
    పడవ లాట తోడ పరవ సింత్రు

    కత్తి పడవ జేసి కాలువ యందున
    వదిలి సంత సింత్రు బాలురంత
    పడవ జేయు వారి పనితనమే మిన్న
    భావి శాస్త్ర జ్ఞాన పండితుండ్రు

    రిప్లయితొలగించండి
  15. కాగితంపు పడవ కమనీయమౌనంంచు
    చిన్స పిల్ల లెల్ల చేయ చుండ
    వానధారలోన వాసిగా విడిచిరి
    కన్నులార గాంచ కదలి రండు.

    రిప్లయితొలగించండి
  16. వానకాలమందు బాలబాలికలెల్ల
    కాగితంపు పడవ కత్తిపడవ
    రామణీయకముగ రకరకముల చేసి
    మురిసి పోవు చుంద్రు మోజు తోడ

    రిప్లయితొలగించండి
  17. పడవజేసి యొక్క పన్నిదమిడెనుగా
    మిడిసిపాటుగల్గు మిత్రుడొండు
    పందెమందు గెలువ పరమౌత్సుక్యమున్
    బాలలచట జేరె హేలగాను.

    రిప్లయితొలగించండి
  18. దగ్గర దగ్గరగా నే
    ముగ్గురు పిల్లలను గంటి ముచ్చట మీరన్
    ముగ్గురును వాన నీటను
    సిగ్గును వీడుచు విడిచిరి చీనీ బోటుల్
    😢

    రిప్లయితొలగించండి