4, మే 2016, బుధవారం

సమస్య - 2023 (ధాన్యముఁ గని రైతు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.

87 కామెంట్‌లు:

  1. పంట కాన రాక పరిపరి విధముల
    కలత పడగ క్షేత్రి కళ్ళ మందు
    చినుకు బడగ మదిని చింతతొలగ తాలు
    ధాన్యముఁ గనిరైతు తల్ల డిల్లె

    రిప్లయితొలగించండి
  2. వరుణ దేవు కతన వరగిపోవగ వరి
    పట్టకుండెపాలు పొట్టదశను
    సేద్యపు ఫలితమ్ము చేతి కందక, తప్ప
    ధాన్యము గని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఒరిగిపోవు’ ఉంది... ‘వరిగిపోవు’ లేదు. అక్కడ ‘కతన నొరిగిపోవగ’ అనండి.

      తొలగించండి
  3. ఊర నీరు లేక బోరులు పడబోక
    పైరు యెండ , తగిన నీరు లేక
    పొట్ట లోన పాలు పట్టని వరిమడి
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నీరు లేక’ పునరుక్త మయింది. ‘పైరు+ఎండ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పైరు లెండ తగిన వాన లేక’ అనండి.

      తొలగించండి
  4. తనదు కోర్కె మేర వానల నందక
    సాగు నిడ సరిపడు జలము లేక
    సోలిన వరి పంట తాలు దప్పలు నిండ
    ధాన్యము గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
  5. ఒక్క రాత్రి లోన 🔹కురిసిన వానకు
    పొట్ట విడిచి పైరు 🔹పూత రాల్చె
    పంట చేతికొచ్చి 🔹పొల్లులై పోయిన
    ధాన్యముఁ గని రైతు
    🔹 తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  6. వరిని కుప్పనూర్చి, బండిలోనింటికి
    రేపు తెద్దమనుచు రేయి గడుప
    పడిన వర్షమునకు పాడైన తడిసిన
    ధాన్యము గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
  7. అందమైన పంట యవనిలో పండించి
    పంట చూసి మదిని పరవశించ
    వర్షధార చేత బాగుగా తడిసిన
    ధాన్యము గని రైతు తల్లడిల్లె

    2అప్పు మిగిలి పోయె తిప్పలు మెండాయె
    నడలి పోయి చూచె నన్నదాత
    వరుణుని దయలేక పంటలెండగ తాలు
    ధాన్యము గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
  8. కరువు కాలమొచ్చి కబలించె పంటను
    మిగిలిన వరి పంట మిడిసి పడుచు
    వచ్చిన వడగళ్ల వానలో తడవగా
    ధాన్యము గని రైతు తల్లడిల్లె.


    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    హాలికుడు ముదమ్ము న౦దె ఫలము రాగ

    ధాన్యము గని | రైతు తల్లడిల్లె

    ధరలు కూల. | కాని ధాన్యము దాచుచు ,

    నమ్ము వర్తకు౦డె యవని ఘనుడు

    { ఫలము = పొలము లోని ప౦ట. }
    ……………………………………………………

    రిప్లయితొలగించండి
  10. నిండు వేసవి యెండ బండిన దాన్యమ్ము
    నారబోసె రైతు యంతలోనె
    వానగురియ పారు వరదలో దడిసిన
    ధాన్యము గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
  11. గాలి వాన వచ్చి గాలిలోకలిసిన
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె
    పంటనష్టపోగ గుండాగె రైతుది
    జ్యొతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘గుండె+ఆగి’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘గుండె గుభేలనె/ గుండె యాగియు జచ్చె’ అనండి.

      తొలగించండి
  12. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    ఆ**
    కష్ట మనగ బెంచి కాపుయె గాసెను,
    ఇష్ట పూర్తి గాను తిష్ట వేసె,!
    గాలి వాన రాగ తేలిన నీటిలో,
    ధాన్యముగని రైతు తల్లడిల్లె ..!!

    🌺🙏🌺

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కాపు+ఎ=కాపె’ అన్నపుడు యడాగమం రాదు. ‘కాపు గాసె నటంచు|నిష్ట...’ అనండి.

      తొలగించండి
  13. ధాన్యము గని రైతు తల్ల డిల్లెను మఱి
    యందు పొల్లు దప్ప యసలు గింజ
    కాన బడక బోగ గంటినిండుగనీరు
    నేక ధార గాను నేరు కాగ

    రిప్లయితొలగించండి
  14. అన్య వృత్తు లన్నిసన్యసించెను మడి
    మాన్యము లవి యవ్వ శూన్యము లట
    పుణ్య పురుషు డత డపణ్యమ్ము దైన్యమ్ము
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
  15. 🙏🌺🙏

    ఆ**
    కన్న బిడ్డ విధము కనిపెంచె పంటను,
    కనుల జూడ గాను మనసు నిండె,!
    పక్షు లన్ని జేరి పాడుజే సెనుపంట,
    ధాన్యముగని రైతు తల్ల ఢిల్లె. !!


    అంబటి భానుప్రకాశ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కనిపించు పంటను’ అనండి. ‘పాడుజేసెను లుప్త|ధాన్యము గని...’ అంటే ఇంకా బాగుంటుందనుకుంటాను.

      తొలగించండి
  16. మంత్రి పర్యటనలొ మాగాణిలో నీటి
    పీడ తీర్చమన్న వినతి మరచి
    సొంత పనుల చూచు సోంబేరి చూపు ప్రా
    ధాన్యము గని రైతు తల్లడిల్లె॥

    రిప్లయితొలగించండి
  17. పంట యిల్లు జేర్చవలెనను సమయాన
    నప్పుఁ జెల్లఁజేయు మనుచు వచ్చి
    సానుభూతి లేని సాహుకారు గొనిన
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
  18. 2
    కష్టపడెడు రైతు కనులు వెలుగు నెప్డు?
    మార్కెటునను జరుగు మాయల గని
    తపన జెంది యెవరు తల్లడిల్లి రపుడు ?
    ధాన్యము గని, రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఎవరు తల్లడిల్లిరి?’ అన్న ప్రశ్నకు ‘రైతు’ అని సమాధానం. మళ్ళీ ‘తల్లడిల్లె’ అనడం పునరుక్తి అవుతుంది.

      తొలగించండి
  19. ఎండబోసి యున్న తండులీయమ్మును
    గాలివాన వచ్చి నేల గలుప
    చేతి కందు పంట చేజారిబోవగ
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె!!!

    రిప్లయితొలగించండి
  20. అంబటి భానుప్రకాశ్ .గద్వాల.
    **
    కన్న బిడ్డ విధము కనిపెంచు పంటను,
    కనుల జూడ గాను మనసు నిండె,!
    పక్షు లన్ని జేరి పాడుజే సెనులుప్త,
    ధాన్యముగని రైతు తల్ల ఢిల్లె. !!


    సవరించిన పద్యము.

    రిప్లయితొలగించండి
  21. కరువు వచ్చెనంచు కలతపడక తాను
    బావిద్రవ్వి యందు పంట వేసె
    ముంచు కొచ్చె వరద మునిగె పంటయు, ముక్కె
    ధాన్యము, గని రైతు తల్లడిల్లె

    విత్తె నంట రెండు క్వింటాళ్ళ విత్తులు
    సేద్యగాడు తనదు చేను యందు
    వర్ష లేమి తోడ ఫలియించె క్వింటాలు
    ధాన్యముగని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  22. కొందమన్ననెరువు కొరివిగా మారిన
    దమ్మబోవ పంట నడవి యాయె
    సంతలో దళారి సైయని పొందు ప్రా-
    ధాన్యము గని రైతు తల్లడిల్లె.

    (తంగిరాల రఘురాం గారి పూరణ స్ఫూర్తి తో..)

    రిప్లయితొలగించండి
  23. అమరవాది రాజశేఖర శర్మ గారి పూరణము:

    ఆరు నెలలపంట నతి చౌకగా కొని
    ఈ సొసైటిలో ధనేశుడంచు
    కష్టజీవి గనని కైమోడ్పులిడెడి ప్రా
    ధాన్యము గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమరవాది రాజశేఖర శర్మ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. కొత్తపంట నంత కొట్టములోపోసి
    భక్తమునకు తెరచె పాతరలను
    మూషికములు తినగ పొల్లు వోయిన మైల
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
  25. కన్న బిడ్డ పెళ్ళి కంటను కదలాడ
    అప్పు చేసి వేయ పప్పు పంట
    కలిసి రాని దైన కాల మిచ్చిన తాలు
    ధాన్యము గని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  26. అప్పు సప్పు జేసి ఆశతో పండించ
    పగలు రేయి పడెను పాటులెన్నొ
    వరద లొచ్చె నంత పంట మునిగి పోయె
    ధాన్యము గని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  27. అప్పు సప్పు జేసి ఆశతో పండించి
    కోత గోసి యంత కుప్ప గూర్చ
    వాన వచ్చెనంత పంట తడిసిపోయె
    ధాన్యము గని రై తు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  28. పద్య కవి యొకండు పద్యాలు పండించి
    కావ్య కర్షకునిగ ఘనత కెక్కె
    పడని వాడు ప్రతిని పడవేయ నీటనా
    ధాన్యమును గని 'రైతు' తల్లడిల్లె
    డా.ఎన్.వి.ఎన్.చారి

    రిప్లయితొలగించండి
  29. కల్తి విత్తనాలు కల్మష భావాలు
    పంటబండలేక కంటబడగ?
    వర్ష మేమిలేక వరిపంట తాలగు
    ధాన్యము గని రైతు తల్లడిల్లె|
    2.కరుణ దరిగి వానదగ్గ? కర్షకాళి పంటలే
    వరములుంచ బోక భువికి వాగువంకలెండగా?
    మరల జీవితాలు మాడు| మంచిపంటపందకే
    తరుగు దాన్యముగని రైతు తల్లడిల్లె జూడగా|

    రిప్లయితొలగించండి
  30. నా రెండవ పూరణము:

    పంట ఋణముఁ గొనియు, వరిపంటఁ బండించి,
    కోసి, కుప్పవేసి, కొనెడి వారి
    కొఱకుఁ జూచుచుండఁ గొఱవిఁ గాలినయట్టి
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా మొదటి పూరణమున యతిభంగ మైనందున సరిచేసి మఱల బెట్టుచున్నాను:

      "కష్ట మెంతయొ పడి, కడకుఁ బండించితిఁ!
      గోరి విత్తనములఁ గొనఁగఁ గొఱవి;
      యమ్మఁ బోవ ధాన్య మడవి యాయె!" నటంచు
      ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె!!

      తొలగించండి
    2. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పూరణ యతిదోషాన్ని నేను గమనించలేదు.

      తొలగించండి
  31. 3

    కొనగ విత్తనములు గొరివాయె నిజముగ
    నమ్మబోవ బంట నడవి యయ్యె
    నప్పునెటుల దీర్తు ననుచు బండినయట్టి
    ధాన్యముఁ గని 'రైతు' తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
  32. రాజావాసిరెడ్డి. మల్లీశ్వరి గారి పూరణములు:

    (1)
    పంట మిగుల పండ పడిన పాటుమరచి
    పండుగ యని కాపు పరవశించె!
    ఫలమె యంత బోయె పన్నుకు నప్పుకు!
    ధాన్యముగని రైతు తల్లడిల్లె!!


    (2)
    సస్యము గని మురిసె సంపత్తి యనుచును
    కస్తిపోయె ననియు కమతకాడు!
    పందికొక్కుల గమి పంట దినంగను;
    ధాన్యము గని రైతు తల్లడిల్లె!!


    (3)
    వరద వచ్చి పోయె వరిఫలసాయము;
    కష్ట మొకటె మిగిలె .కర్షకులకు!
    నాదుకొనున దెవరు నండయెవరనుచు
    ధాన్యము గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. ఆలుబిడ్డ కలిసి ఆహారమునుమాని
    పసిడి పంట కొఱకు పాటు పడగ
    వానగాలిజేత వరదలో పారిన
    ధాన్యముగని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  34. ఆలుబిడ్డ కలిసి ఆహారమునుమాని
    పసిడి పంట కొఱకు పాటు పడగ
    వానగాలిజేత వరదలో పారిన
    ధాన్యముగని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  35. ఆలుబిడ్డ కలిసి ఆహారమునుమాని
    పసిడి పంట కొఱకు పాటు పడగ
    వానగాలిజేత వరదలో పారిన
    ధాన్యముగని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  36. అప్పు లెన్నొ చేసి అగచాట్ల బ్రతుకుతో
    సాగు చేయుచు కొన సాగినంత
    చేతికంద బోవ, చినుకుల తడిసిన
    ధాన్యము గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
  37. 4వ పూరణ

    ఆరుగాలమంత నతికష్టముం జేసి
    పండినట్టి పంట బండి కెత్త
    తూటు సంచి నుండి బాటలో బడునట్టి
    ధాన్యము గని, రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
  38. సమయమెరిగి కూర్మి సాగు చేసిన కూడ
    దెైవ క్రృప తోడు తనకు లేక
    దిగులు పుట్టె,పంట దిగుబడి తగ్గగా
    ధాన్యముఁ గని రెైతు తల్లడిల్లె


    టెైపులో క్రృ సరిగా రావటం లేదు.మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క టైప్ చేసి ఋ మీద కాసేపు నొక్కి యుంచండి...కృ వస్తుంది...అన్ని యక్షరములూ అంతే....

      తొలగించండి
    2. క టైప్ చేసి ఋ మీద కాసేపు నొక్కి యుంచండి...కృ వస్తుంది...అన్ని యక్షరములూ అంతే....

      తొలగించండి
    3. క టైప్ చేసి ఋ మీద కాసేపు నొక్కి యుంచండి...కృ వస్తుంది...అన్ని యక్షరములూ అంతే...

      తొలగించండి
    4. క టైప్ చేసి ఋ మీద కాసేపు నొక్కి యుంచండి...కృ వస్తుంది...అన్ని యక్షరములూ అంతే...

      తొలగించండి
    5. mine is english key board.ఋ సంయుక్తంలో ఇబ్బంది పెడ్తోంది శర్మగారు

      తొలగించండి
    6. K టైప్ చేసి ప్రక్కన capital R టైప్ చేయండి 'కృ' వస్తుంది.

      తొలగించండి
    7. హనుమంత రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కృప’ అన్నచోట గణదోషం. ‘దైవ కరుణ’ అనండి.

      తొలగించండి
    8. ఆర్యా ధన్యవాదములు.సవరించి వ్రాస్తున్నాను
      సమయమెరిగి కూర్మి సాగు చేసిన కూడ
      దైవ కరుణ తోడు తనకు లేక
      గుబులు పుట్టె,పంట దిగుబడి తగ్గగా
      ధాన్యముఁగని రైతు తల్లడిల్లె

      తొలగించండి
  39. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ:

    పంట చేను కోయ బ్రాలుమాలగ, నాటి
    రాత్రి కురిసె పెద్ద రాళ్ళవాన!
    నిండు పంట యంత నేలపై వ్రాల నా
    ధాన్యము గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
  40. ధరలు బాగ పలుకు ధాన్యమ్ము విత్తితి
    అప్పు దీరు ననుచు నాశపడగ
    కర్మమేమొ తగ్గె! గాజల నున్నట్టి
    ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బాగ’ అనరాదు. ‘బాగుగా’ సాధువు. ‘ధర లధికము పలుకు’ అనండి.

      తొలగించండి
  41. డా.ఎన్.వి.ఎన్.చారి.
    పంట పండె ననుచు పరవశించుచు నుండె
    ప్రక్క వాడి యీర్శ్య నెరుగ లేక
    వాడు నగ్గి పెట్ట, నాహుత య్యెడి తన
    ధావ్యము గని రైతు తల్లడిల్లె

    రిప్లయితొలగించండి
  42. తక్కువ ధర జేయు తనదైన నెర్రటి
    ధాన్యము గని కినియు దార క్రుళ్ళ...
    చుక్కలవలె మెరియు ప్రక్కింటి బసుమతి
    ధాన్యముఁ గని...రైతు తల్లడిల్లె :)

    రిప్లయితొలగించండి