17, మే 2016, మంగళవారం

సమస్య - 2036 (పూలను సిగలోన...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

97 కామెంట్‌లు:

  1. కాలము తెచ్చిన మార్పుల
    లీలలు జూడంగనిటుల లేమలు క్రాఫుల్
    వాలాయంబుగ వేయగ
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
  2. క్యాలీ ఫ్లవరులు కూడను
    పూలేకద వాడరేల పూజలకిలలో?
    యీలోకమందెచటనీ
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే!

    రిప్లయితొలగించండి
  3. వాలుజడ లందు నేడిల
    మాలతి మల్లెల సొగసులు మచ్చున కైనన్
    నీలపు కురులే కరువట
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే ?

    చంద్రమౌళి గారు ! హేట్సాఫ్

    రిప్లయితొలగించండి
  4. వాలు జడ లెచట యున్నవి ?
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే ?
    కాలపు పోకడ నిదియే
    వీలుగ బాబ్కట్ జిలేబి వీధిన పడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జడ లెచట నున్నవి, పోకడ యిదియే’ అనండి.

      తొలగించండి
  5. కాలుకు హైహీల్స్ చెప్పులు
    నీలము జీన్స్ పంటలూను నిత్యము దొడగన్
    కాలము మారగ గురుడా
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే ?

    రిప్లయితొలగించండి
  6. పూలే మగువల కందము
    పూలకు సరిసాటి శోభ భువిలో గలదే
    పూలే దొరకక కుంకుమ
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
  7. పూలను జూడ నతివలకు
    జాలను ప్రేమంబు గలుగు, జాజులు మల్లెల్
    మాలల ముడుతురు, మోదుగ
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే?!

    రిప్లయితొలగించండి
  8. వేలుపు వేంకటపతిదే
    వాలయమదితిరు పతినట వేడుక గాంచన్
    పూల వనములెకనబడా
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కనబడు+ఆ=కనబడు నా’ అవుతుంది. ‘పూలవనమ్ములె గలవా| పూలను...’ అనండి.

      తొలగించండి
  9. మేలగు సిరిమల్లెల సుమ
    మాలలు ధరియింత్రు గాని మగువలు కురులన్
    పేలవమగు కుత్రిమ మగు
    పూలను సిగలోను దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కృత్రికను... కుత్రిమ... అన్నారు.

      తొలగించండి
  10. వేలుపు వేంకటపతిదే
    వాలయమదితిరుపతినట వేడుక గాంచన్
    పూలవనములంగనబడు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
  11. పూలను గూరిచి సందియ
    మేలా సామీ ! పడతుల యేశిర సైనన్
    బూలకు ననువుగ గలచో
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    {గలరే అనగా ఉన్నారని నా భావము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ‘కలరే’ అన్నది ప్రశ్నార్థకమే. నిశ్చయార్థం కాదు.

      తొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { ఒక పొలతికి పూ లమ్ము వానికి స౦భాషణ. }

    " పూలె౦త ? "--- " మూర. డెబ్బది " ----

    " పూలన్నా! యిమ్ము రె౦డు మూరలు , కానీ

    లేలేత విమ్ము | వాడిన

    పూలను సిగ లోనదురుము పొలతులు గలరే "

    రిప్లయితొలగించండి
  13. [5/17, 9:26 AM] NVNChary: డాఎన్.వి.ఎన్.చారి 9866610429
    గాలికి రాలిన పూలను
    నేలను బడి తడిసినట్టి నేరెడు పూలన్
    మేలుగ నమ్మగ కొని యా
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే
    [5/17, 9:27 AM] NVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
    Sk2031 'అకస
    పూలతొ గట్టిన మాలలు
    మేలుగ మలయప్ప స్వామి మెడలో వేయన్
    జాలును యనగా తిరుమల
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణలో ‘..జాలును+అనగా=జాలు ననగా’ అవుతుంది. యడాగమం రాదు. ‘...జాలు ననంగన్ దిరుమల...’ అనండి.

      తొలగించండి
  14. అంబటి భానుప్రకాశ్ గారి పూరణ....

    పూలన మెచ్చెరు నతివలు,
    పూలను ముడుతురు తరువును పూచిన విధమున్ !
    తాపసి మతమున జేరియు,
    పూలను సిగలో దురుము పొలతులు గలరే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. కొన్ని లోపాలు... నా సవరణ...

      పూలనఁగ మెత్తు రతివలు
      పూలను ముడిచెదరు తరువు పూచిన రీతిన్
      తాపసులుగ మారి పిదప
      పూలను....

      తొలగించండి
  15. కాలము మారెం గలినిన్
    శీల వతులకు నలివేణి చిరుసిగ యాయెన్
    మాలలు కలలోన నలిగె
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాలాతీతాలోలా
      హేలావేశాతిరోష హేమాభాక్షుల్
      డోలాయమాన కాంతల్
      పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. రెండవది శబ్దసౌందర్యంతో అలరారుతూ ఆనందింపఁ జేసింది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. హైందవ సంస్కృతి ఆచరించే పురాతన స్త్రీల గురించిన సందర్భము


    తాళిని గట్టిన పెనిమిటి
    కాలము జేసిన తదుపరి కలలో నైనన్
    ఫాలము నందున బొట్టును
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే!

    రిప్లయితొలగించండి
  17. మేలగు మల్లెల,జాజుల
    మాలను సిగముడిని దాల్చు మగువలె గానీ
    ఆలోకించగ గోబీ
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
  18. ఫాలమున జుట్టు గల్గిన
    బేలలు యే కొప్పు నైన పెట్టగ వచ్చున్
    చాలీ చాలని జడతో
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్యసార్ మీ సమీక్ష కోసం వేచిచూస్తున్నాం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొద్దిగా అస్వస్థత కారణంగా మీ పూరణలను సమీక్షించడం ఆలస్యమయింది. అనారోగ్యం కారణంగానే ఈరోజు ‘పద్యరచన’ శీర్షిక ఇవ్వలేదు.

      తొలగించండి
  20. పూలే ప్రాణము మగువకు
    వారే వాననుచునుంద్రు వసుమతి లోనన్
    చాలక పోయిన వాడిన
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వారేవా యనుచునుంద్రు...’ అనండి.

      తొలగించండి
    2. శ్రీనివాసాచారి గారూ !
      రెండవ పాదంలో ప్రాస కుదరలేదు కదా !

      తొలగించండి
    3. శ్రీనివాసాచారి గారూ !
      రెండవ పాదంలో ప్రాస కుదరలేదు కదా !

      తొలగించండి


  21. స్త్రీలంతయు నాగరిక మ
    నే లోయను బడియు జడలనేయక హాయిన్
    గాలి కొదల దలిచె కురులు
    పూలను సిగలోన దురుము పొలతలు గలరే
    🙏చెన్నకేశవ‌, రాయచోటి🙏

    రిప్లయితొలగించండి
  22. 1.
    పూలను గోసుక వచ్చియు
    మాలలు జీతాన నల్లు మహిళల చోటన్
    పూలను జేతిన జూతుము
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే
    2.
    పూలతొ గట్టిన యందపు
    మాలలు ధరియి౦తు రంత మహిళామణులే
    చాలని యితరుల జేరియు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే.
    3.
    వాలు జడలుండె గతమున
    వ్రేలెడు గురులాయె నేడు వింతయె జూడన్
    వాలము వలె జడవిడుతురు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే.
    4.
    మేలును గలిగించునట్టి
    వేలుపు కలియుగమందున వేoకటపతి; యా
    వేలుపు జూడగ బోవుచు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణలో ‘పూలతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘పూలను గట్టిన...’ అనవచ్చు.

      తొలగించండి
  23. ఫాలము నిండుగ కుంకుమ,
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే?
    పాలను నిండుగ కుంకుమ
    పూలను చేర్చు తెలివర్ణ భోగము కొరకే॥

    రిప్లయితొలగించండి
  24. మేలగు సుగంధ భరిత సు
    మాలను తలదాల్తురిలను మగువలు ప్రీతి
    న్నేలన్నీకాగితంపు
    బూలను సిగలోనదురుము పొలతులు గలరే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ రావు గారూ నమస్కారం.....క్షమించాలి మీ పద్యంలో మూడవ పాదంలో గణదోశముందేమో చూడండి

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...న్నేలన్నీ కాగితముల’ అనండి.

      తొలగించండి
  25. నీలి కురులలోన సదా
    స్త్రీలెంతయొ మోజుగాను శ్రీకర మని పూ
    మాలలు ధరింత్రు,తంగెడు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే?

    తాళిని గట్టిన పెనిమిటి
    కాలుని జేరిన పిదపను కాంతయె విధవౌ
    తాళిని ధరించి మెడలో
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    వాలుజడలోన మల్లెల
    మాలలు చేమంతి వకుళ మరువపు దండల్
    స్త్రీలు ధరింతురు గోబీ
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
  26. శంకరాభరణం వారి సమస్యా పూరణం
    sk 194
    సమస్య: పూలను సిగలోన దురుము పొలతులు గలరే
    కం . ఉల్లము నవ్యత కోరెన్
    బాలకమున్విప్పుకొనిరి భామిను లెల్లన్
    కాలిక పూనిన చందము
    పూలను సిగలోనదురుము పొలతులు గలరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో ప్రాస తప్పింది. వాట్సప్‍లో మిత్రుడు సూచించినట్లు ‘కాలము నవ్యత కోరెన్’ అనండి.

      తొలగించండి
  27. చాలును, జానెడు కురులే
    మేలని జడకత్తిరించి; మిగిలిన కురులన్
    కేలను చెవిపై చుట్టగ,
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
  28. అవును విరింంచి గారు," కాగితపుంం,బూలను", బదులు పొరబాటున---జగణము గా పడినది.క్షంంతవ్యుడను.సూచింంచిన మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. మరొక పూరణ

    రాలగ మిగిలిన కురులన్
    జూలుగ తలనుంచి సొగసు జూపగ నదియున్
    చాలక తికమక పడగా
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మేలు+అనక’ అన్నపుడు యడాగమం రాదు. ‘మే లనకను నేటి...’ అనండి.

      తొలగించండి
  31. పూలను సిగలోనదురుము పొలతులు గల రేలనో?
    మేలు గూర్చు ప్రేమ బేర్చి మేటి సుఖము బంచగా
    నీలి కురుల నీడ యందు నిర్మలత్వ ముంచగా
    ఆలుమగల నంతరాత్మ హాయినింపు టందుకే|

    రిప్లయితొలగించండి
  32. పూలతొ పరిమళము లిడెడు

    మాలలు ధరియింత్రు గాని మగువలు జడలోన్

    గాలికి,ఎండకు వాడిన

    పూలను సిగలోన దురుము పొలతులు గలరే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తొ’ అని హ్రస్వంగా ప్రయోగింపరాదు. ‘పూల పరిమళమ్ము లిడెడు...’ అనండి.

      తొలగించండి
    2. మీ సూచనకు ధన్యవాదాలు శంకరయ్య గారూ !
      పూల పరిమళమ్ము లిడెడు
      మాలలు ధరియింత్రు గాని మగువలు జడలోన్
      గాలికి , ఎండకు వాడిన
      పూలను సిగలోన దురుము పొలతులు గలరే ?

      తొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    వ్రేలియు నాకాశమ్మునఁ
    దేలియు గాలికిని రాలి దిగ్గున నేలన్
    గూలియు బురదం దడిసిన

    పూలను సిగలోనఁ దురుము పొలఁతులు గలరే?

    రిప్లయితొలగించండి
  34. సొబగు లీనెడు విరులనే సుదతులెల్ల
    కురుల లోనను ముడుతురే గొప్పగాను
    గోబి యుమ్మెత్త తంగేడు కుంకుమనెడు
    పూలను సిగలోన దురుము పొలతులుగల
    రే యిలన గాంచ లేరు లేరీ జగతిన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా! కందపాదాన్ని తేటగీతిలో ఎంత చక్కగా ఇమిడ్చారు! బాగుంది మీ తాజా పూరణ. అభినందనలు.

      తొలగించండి
  35. నా రెండవ పూరణం:

    గాలించి తెచ్చి, దేవుని
    మ్రోలం దగనుంచి, పూజ ముగియక మునుపే,
    తాళఁగ లేకయు, వేగమె

    పూలను సిగలోనఁ దురుము, పొలఁతులు గలరే?

    రిప్లయితొలగించండి
  36. పిన్నాక నాగేశ్వరావు గారికి నమస్కారములు మీ సూచనకు ధన్యవాదములు
    కాని ర-ల కు భేదములేదు అన్న పెద్దల మాటను ఆదారంగా రసాను
    సిరితా వచ్చిన వచ్చును అన్న పద్యము ఆదారము తప్పైనచో తెలుపగలరు
    సవరించుకొందునుౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ చారి గారూ! చాల మంచి సందేహం వెలిబుచ్చినారు. నాకు తెలిసిన వివరములిచ్చుచున్నాను.

      పొత్తపి వెమ్కటరమణ కవి “అభేదప్రాస” గా .. రల; రళ; లళ; లడ; దడ;వప లకు ప్రాస, వడి చెల్లునని పేర్కొనెను.
      అభేదయతి లక్షణముః
      సీ. రలయోరభేదంబు రళయోరభేదంబు
      ……….. లళయోరభేదంబు లడలభేద
      వర్ణములన జెల్లు వపయోరభేదాఖ్య
      …………దనరు నిందులకు నుదాహరణలు
      రల రళ (లళ) లడల్ వపలు నొండొంటికి
      ……….. జనునిడ వడులు ప్రాసములు గృతుల
      రాజిల్లు సప్త తాళములు ద్రెవ్వగనేసి
      ……….. లలితమౌ లవణ వారాశి గట్టి
      లంక శోధించి వైళమె రావణుని జంపి
      ……….. లక్ష్మణార్కజ కపుల్ డాసి కొలువ
      తే.గీ. వనితతో జేరె సాకేత పట్టణంబు
      ప్రేమ రఘువీరుడనగ నభేదయతులు
      దళము దడమన జలధినా జడధినాగ
      జరుగు నిటులె నన్ని ప్రాసములు కృష్ణ!
      ఉదాహరణముగాః

      తిక్కన సోమయాజిగారి భారతమందలి శల్య పర్వమునందు

      “ వారి యెలుంగు చూచి కృత వర్ముడు సైన్యమి నిల్వరించి యు
      న్మీలిత విక్రముండగుచు మేమెయి నాతని దాకె నస్త్ర వి
      ద్యాలపితుండు సాత్యకి యుదగ్రత వారలు వావారి దో
      ర్లీలలు చూచి రోటు పడిరెండు బలంబుల యొద్ద (యోధ) వీరులున్.

      కాని సంశోధిత భారతము నందు “వారి బదులు వాలి” అనియుండె. ఈ పాఠమున ర-ల ప్రాసకు ప్రసక్తి యుండదు.

      అప్పకవి “ర-ల” ప్రాస అంగీకరించలేదు.
      కాని మీరు ఉదాహరించిన సుమతీ శతక పద్యము మిక్కిలి ప్రాచుర్యము గల్గినది. “ప్రమాదో ధీమతామపి” అన్నట్లు శతక కర్త పొరబాటు పడి యుండుటగాని, వేరే మతప్రకారం అంగీకృతము గాని అయిఉండవలెను. ఈ విషయము సులక్షణ సారమునందు చెప్పబడలేదు.
      నాకు తెలిసిన విషయములు ప్రస్తావించితిని. ఇక దీనిపై పెద్దలు చర్చించవలసి యున్నది. శ్రీ పిన్నాక నాగేశ్వర రావు గారు కూడ స్పందించ వలసిందిగా మనవి.

      తొలగించండి
    2. బాలసుబ్రమణ్యశర్మ గారికి మీరిచ్చినసూచనలకు మరియు ఉదారణనలకు
      థన్యవాదములు అనుమానము తొలగినది సూచన పాటించెదను
      కృతఙతలుమరియు శతసహస్రనమస్సుమాంజలి

      తొలగించండి
  37. నా మూడవ పూరణం:

    క్రాలుచు నంద మిడెడు, నవ
    లీలగ విద్యార్థు లెపుడు శ్రేష్ఠపుఁ బాఠాల్
    గ్రోలెడు, నున్మత్తాభిధ

    పూలను సిగలోనఁ దురుము పొలఁతులు గలరే?

    రిప్లయితొలగించండి
  38. కాలము మారెను గాంచుడు
    కాలముతో బాటు మార్పు గ్రక్కున వచ్చెన్
    వ్రేలెడు కురులను చూపుచు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే.

    2మేలగు నుంచుము తలలో
    పూలను పడతీ యనంగ పోరియు పలికెన్
    కాలము మారెను చూడుము
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే.

    3.కాలము మారెను గాంచుడు
    కాలముతో పాటు మార్పు గ్రక్కున వచ్చెన్
    చాలిక మాట లనుచడిగె
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      చివరిపద్యంలో ‘అనుచు+అడిగె = అనుచు నడిగె’ అవుతుంది. అక్కడ ‘చాలిక మాటలని యడిగె’ అనండి.

      తొలగించండి
  39. శ్రీగురువర్యులకువందనములతో సవరణ
    17.5.16. పాలు,మురిపాలు,పడతికి
    మేల నకను నేటి మార్పు మిక్కిలి దరుగన్
    నీలి కురులేవి? కొప్పున
    పూలను సిగలోనదురుము పొలతులు గలరే?

    రిప్లయితొలగించండి
  40. మధ్యాక్కర పూలనుసిగలోన దురుముపొలతులు గలరేలనోయి?
    పాలపొంగువయసురాగ పడతు లెంచు కురుల సిరులు
    నీలి మేఘ నిధులయందు నిల్వలున్న మెరుపులాగ|
    తేలిపోవు మధుర మైనదిగులుమాన్పు దీప్తిగాన|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన దానిత్ మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  41. ఏలిక సతినని ప్రేమను
    వేళకు తగుసేవ సేయు వెలదులు గలిగీ
    వేళన కురులను దువ్వుచు
    పూలను సిగలోన దురుము పొలతులు గలరే
    అరాశ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘గలిగీ’ అన్నదాన్ని ‘గల్గన్’ అనండి.

      తొలగించండి
  42. అద్భుతమైన పూరణలతో ఎందఱో కవిమిత్రులు మహదానందాన్ని కల్గించారు.

    రిప్లయితొలగించండి
  43. నాలో సగమ్ము నీవని
    వాలిన ప్రేమఁ గురిపించు పతికై సాయం
    కాలపు వేళల వాడిన
    పూలను జడలోన దురుము పొలతులు గలరే?
    (ఉదయం 8 , 9 గంటల నడుము పోస్ట్ చేసిన నా పూరణ కనిపించట్లేదు గురువుగారూ! సమీక్షకై ఇపుడు బ్లాగు తెరిచి మరలా ఇపుడు పోస్ట్ చేయడమైనది.పరిశీలించ ప్రార్థన)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈమధ్య మిత్రులు ఒక పూరణనే రెండు మూడు సార్లు ప్రకటిస్తున్నారు. అలా అదనంగా ఉన్న పూరణలను తొలగిస్తూ ఉంటాను. అప్పుడు పొరపాటున మీ పూరణపై కూడా క్లిక్ చేశానేమో?

      తొలగించండి
  44. మాలలు వేయంగ గలరు
    మేలైనవి నోట్ల గూర్చి మెడలో భక్తుల్ ...
    గేలిగ మాయావతికహ!
    పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే?

    రిప్లయితొలగించండి