రవి గారూ, మీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉండి సంతోషపెట్టింది. "సంస్యా" అన్న పొరపాటును సాయంత్రం గమనించాను. అంతే కాదు, లేబుళ్ళ దగ్గర కూడా "చమత్కార పాద్యాలు" అని ఉంది. వాటిని ఎలా సవరించాలో అర్థం కావడం లేదు. దయచేసి మార్గాన్ని చూపండి.
౧.www.blogger.com లో లాగిన్ అవండి. Edit Posts అన్న బొత్తం నొక్కండి.వరుసగా మీరు వ్రాసిన అన్ని టపాలు కనబడతాయి. అన్నిటికన్నా పైన టపా పక్కన Edit, View అని రెండు బొత్తాములుంటాయి. అందులో Edit నొక్కండి. అక్కడ "సంస్యా పూరణం" అన్న టైటిల్ సవరించి, తిరిగి Publish Post చేయండి. ౨. లేబుల్ ను ఎలా మార్చాలో తెలియట్లేదు. నా ఉద్దేశ్యం ప్రకారం కొత్త లేబుల్ సృష్టించి, ఇకపై దాన్ని వాడండి. ఇదివరకు ప్రచురించిన చమత్కార పాద్యాలు టపాలు తిరిగి Edit చేసి, కొత్త లేబుల్కు మార్చి, publish చేయండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితీవ్ర వాది యగుచు దేశ ద్రోహమునకు
రిప్లయితొలగించండిపాలు బడెడు వాడు పతియె నైన
కనికరమును వీడి కరవాలమును బట్టి
పతిని హత మొనర్చు సతియె సాధ్వి.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ నందించారు. ధన్యవాదాలు. మూడవ పాదంలో "స్రుక్కించు"కు బదులు "సృక్కించు" అని పొరపాటున టైప్ అయిందనుకుంటా.
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో పూరణ పంపించారు. బాగుంది. అయితే మొదటి పాదంలో "దేశద్రోహులు" అన్నప్పుడు "శ" గురువు అవుతుంది. గమనించండి.
కంది శంకరయ్య గారు,
రిప్లయితొలగించండిసూచనకు ధన్యవాదాలు. ఇలా సవరించాను చూడండి.
తీవ్ర వాది యగుచు దేశమ్ము వంచించ
పూనుకొనెడు వాడు మొగుడెయైన
కనికరమును వీడి కరవాలమును బట్టి
పతిని హత మొనర్చు సతియె సాధ్వి.
కంకణమ్ము దోచె కణ్ణఁగి మగడని
రిప్లయితొలగించండితలచి,మఱివిచారణలు జరుపక
తలను తఱుగఁ, శాపములుపెట్టి పాండ్య భూ
పతిని హతమొనర్చు సతియె సాధ్వి
కూలిపోయె రాజు కుటిల సేనానిచే
రిప్లయితొలగించండికలత చెంది రాణి తలచె నిట్లు
సహగమింతునేని ’సతి’యౌదు; ఈ చమూ
పతిని హత మొనర్చు సతియె సాధ్వి
అహా!
రిప్లయితొలగించండిఅద్భుతం గా వున్నాయి!
శంకరయ్యగారూ! హేట్సాఫ్!
సత్య భామ చరిత చక్కంగ చెప్పంగ
రిప్లయితొలగించండివృత్త మెన్న నేల? విశ్వమందు
సుజన పాళి నణచి స్రుక్కించు రాక్షస
పతిని హత మొనర్చు సతియె. సాధ్వి
గ్రామ మేలెడి భూపతి ప్రేమ యనుచు
రిప్లయితొలగించండివెధవ వేషాలు వేయగ వెరువ లేక;
అన్న సాయాన జంపించె; అట్టి, భూమి
పతిని హతమొనర్చు సతియె సాధ్వి.
ఒక్క ముద్ద తినక యుపవాస దీక్షని
రిప్లయితొలగించండికడుపు మాడ మగని కసర కుండ
గృహపు శాంతి నిలుప క్షుద్బాధనది నశిం
ప తిని హత మొనర్చు సతియె సాధ్వి
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిసవరించిన తర్వాత ఇప్పుడు బాగుంది.
గిరి గారూ,
కణ్ణగి వృత్తాంతాన్ని ప్రస్తావించి మంచి పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.
చదువరి గారూ,
మంచి పూరణ. ధన్యవాదాలు.
కృష్ణశ్రీ గారూ,
ధన్యవాదాలు.
చింతా రామకృష్ణారావు గారూ,
అది టైపు పొరపాటని తెలుస్తూనే ఉంది కదా. మళ్ళీ శ్రమ పడ్డారెందుకు?
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
పూరణ బాగుంది. ధన్యవాదాలు.
ఫణిప్రసన్న కుమార్ గారూ,
క్షుద్బాధను హతము చేసిందా? బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఖూని రాగములను గూర్చి పగలురాత్రి
రిప్లయితొలగించండిపతిని హతమొనర్చు సతియె; సాధ్వి.
సుత్తి వీర భద్రు చోద్యముఁ గనుడినీ
రీతి; సినిమ "రెండు రెళ్ళు ఆరు".
శీర్షిక "సంస్యా పూరణం - 28" అని తప్పుగా వచ్చింది. మార్చగలరు.
చెప్పినదియు వినక, చెడుదారి వీడక,
రిప్లయితొలగించండికామక్రోధములతొ గర్వమొంది
ఉర్వి భారమట్లు ఊరేగుఖలుడైన
పతిని హత మొనర్చు సతియె సాధ్వి.
రవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉండి సంతోషపెట్టింది. "సంస్యా" అన్న పొరపాటును సాయంత్రం గమనించాను. అంతే కాదు, లేబుళ్ళ దగ్గర కూడా "చమత్కార పాద్యాలు" అని ఉంది. వాటిని ఎలా సవరించాలో అర్థం కావడం లేదు. దయచేసి మార్గాన్ని చూపండి.
౧.www.blogger.com లో లాగిన్ అవండి.
రిప్లయితొలగించండిEdit Posts అన్న బొత్తం నొక్కండి.వరుసగా మీరు వ్రాసిన అన్ని టపాలు కనబడతాయి. అన్నిటికన్నా పైన టపా పక్కన Edit, View అని రెండు బొత్తాములుంటాయి. అందులో Edit నొక్కండి. అక్కడ "సంస్యా పూరణం" అన్న టైటిల్ సవరించి, తిరిగి Publish Post చేయండి.
౨. లేబుల్ ను ఎలా మార్చాలో తెలియట్లేదు. నా ఉద్దేశ్యం ప్రకారం కొత్త లేబుల్ సృష్టించి, ఇకపై దాన్ని వాడండి. ఇదివరకు ప్రచురించిన చమత్కార పాద్యాలు టపాలు తిరిగి Edit చేసి, కొత్త లేబుల్కు మార్చి, publish చేయండి.
శంకరయ్యగారు. edit posts లో మీరు మార్చవలసిన పోస్ట్ తెరిచా ఆ లేబిల్ పేరు సరిచేసి మళ్లీ పబ్లిష్ చేయండి . అంతే.
రిప్లయితొలగించండినా పూరణ -
రిప్లయితొలగించండినరక బాధలు పడు నానావిధంబుల
పతిని హత మొనర్చు సతియె; సాధ్వి
యైన సతిని సకల యాతనల్ పెట్టెడు
పతియు కూడ నరక బాధ లందు.
"సుమిత్ర" గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
రవి గారూ,
రిప్లయితొలగించండిజ్యోతి గారూ,
వెంటనే స్పందించి తగిన సూచన లిచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లే చేసి చూస్తాను.